![Intention was to create something unique in maha - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/17/Hansika-Motwani-.jpg.webp?itok=G8zI-sAV)
హన్సిక
హన్సిక లేటెస్ట్ చిత్రం ‘మహా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ల మీద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. హన్సిక కాషాయ వస్త్రాలు ధరించి ధూమపానం చేస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ పోస్టర్స్ మీద కొందరు అభ్యంతరాలు తెలిపారు. మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
ఈ విషయం గురించి చిత్రదర్శకుడు యుఆర్ జమీల్ స్పందిస్తూ – ‘‘మా ఫస్ట్ లుక్ గురించి అందరి కామెంట్స్ చూశాను. దర్శకుడిగా నా ఉద్దేశం ఎవరినీ హర్ట్ చేయాలని కాదు. కొత్తగా చూపించాలనుకున్నాను. కుల, మతాలకు సంబంధించిన సెంటిమెంట్స్‌ను దెబ్బతీసే ఉద్దేశం అయితే అస్సలు లేదు. హిందూ, ముస్లిం మతాలను కాదు, మానవత్వాన్ని నమ్ముతాను నేను. దయ చేసి ఇందులోకి కులాలు, మతాలకు సంబంధించిన యాంగిల్‌ను తీసుకురావద్దు’’ అని పేర్కొన్నారు. ‘మహా’ హన్సిక కెరీర్‌లో 50వ చిత్రం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment