ఆసియాలోని టాయిలెట్లపై ఓ అమెరికన్ టీవీ స్టార్ చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. కొందరు అది అతనిది అమాయకత్వం అంటుంటే, మరికొందరు మాత్రం అతనిపై మండిపడుతున్నారు. ఇటీవల ఆసియా పర్యటనకు వచ్చిన డీన్ మైఖేల్ వాష్ రూమ్‌లోని మరుగుదొడ్డి పక్కన ఉన్నటువంటి హ్యాండ్ స్ప్రెయర్ గురించి ఓ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు. మాములుగా కడుక్కోవడానికి వాడే హ్యాండ్ స్ప్రెయర్‌ను దప్పిక తీర్చుకోవడానికి వాడతారని పేర్కొన్నాడు. ‘నేను ఇక్కడి టాయిలెట్‌లను ఇష్టపడుతున్నానను ఎందుకంటే.. వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఒకవేళ దాహం వేస్తే తాగాడానికి వీలుగా వాటర్ పంప్(హ్యాండ్ స్ప్రెయర్‌ను ఉద్దేశించి) అందుబాటులో ఉంచార’ని ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది మైఖేల్ వ్యంగ్యంగానే ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌తో పాటు, పలు ఆసియా దేశాలకు చెందిన నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా అని నీకు ఎవరు చెప్పారు, రెస్ట్‌రూమ్‌లలో పేపర్స్ ఉండేది మీరు నవలలు రాసుకోవడానికా?, మేము నీకు వాటర్‌కు బదులు జూస్ పెడతాం.. అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
I love how bathrooms here have this water hose next to the toilet incase you get thirsty while in the restroom pic.twitter.com/xsfrFeYkzh
— Dean Michael Unglert (@deanie_babies) July 10, 2018
Comments
Please login to add a commentAdd a comment