
వైద్యశాలలో చికిత్స పొందుతున్న అనూరాధ
వరికుంటపాడు: ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో కోడలిపై మామ దాడి చేసి గాయపరిచాడు. మండలంలోని గొల్లపల్లిలోకి చెందిన బాధితురాలు గంగవరపు అనూరాధ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గంగవరపు వెంకటరత్నం కుమారుడు వెంకటరమేష్‌కు ఆరేళ్ల క్రితం గొల్లపల్లి అనూరాధతో వివాహమైంది. అనంతరం ఆస్తి పంపకాలు చేసుకున్నారు. ఆ ఆస్తిని తిరిగి దక్కించుకునేందుకు మామ వెంకటరత్నం తరచూ ఆమెను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లి గడ్డి కోస్తుండగా మామ వెంకటరత్నం దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment