రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి.

పీకే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అమీర్ ఖాన్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినా అమీర్ ఖాన్ అందరికి ధీటుగా జవాబిచ్చారు.
తాను పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్ విడుదల చేయలేదని.. సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్ధమవుతుందని సమాధానమిచ్చారు. ఆగస్టు 20 తేదిన విడుదల చేసే రెండవ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా అడ్డుగా ఉండదంటూ చమత్కరించిన అమీర్ ఖాన్.. అందర్ని ఆశ్చర్య పరిచారు.
బుధవారం విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో అమీర్ ఖాన్ పూర్తిగా, నిండుగా బట్టలేసుకుని బ్యాండ్ మేళం చేతిలో పట్టుకుని నిలుచున్నాడు. ఈ పోస్టర్ తో బట్టలేసుకోలేదని విమర్శల వర్షం కురిపించిన క్రిటిక్స్ నోళ్లకు తాళం వేశారు. ఈ పోస్టర్ పై క్రిటిక్స్ ఏమని విమర్శలు చేస్తారో వేచి చూడాల్సిందే.