పీకే 2వ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా ఉండదట!
ఆమీర్ ఖాన్ నటించిన 'పీ.కే' పోస్టర్ దేశవ్యాప్తంగా సంచలనాలకు, వివాదాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. పీ.కే పోస్టర్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. పీ.కే పోస్టర్ వివాదంపై మిస్టర్ కూల్ సానుకూలంగానే స్పందించారు.
పబ్లిసిటీ కోసం తాము ఈ పోస్టర్ విడుదల చేయలేదని.. ఈ చిత్రం చూసిన తర్వాత విమర్శకులు తమ వాదనల్ని మార్చుకుంటారని అమీర్ ఖాన్ ఘాటుగా స్పందించారు.
పీ.కే చిత్రానికి సంబంధించిన రెండవ పోస్టర్ ఆగస్టు 20 తేదిన విడుదల కానుంది. పీకే రెండవ పోస్టర్ లో ట్రానిస్టర్ కూడా అడ్డుగా ఉండదు. ఇక మీరే చెప్పండి అంటూ మీడియాకు ఓ ప్రశ్నను అమీర్ సంధించారు. ట్రాన్సిస్టర్ అడ్డుగా ఉంటేనే ఇన్ని వివాదాలు చెలరేగాయి. ఇక ట్రాన్సిస్టర్ అడ్డు లేకుంటే ఏమైంతుందో ఓసారి ఊహించుకోవాల్సిందే.