ఆమిర్‌పై పూజాభట్ చిర్రుబుర్రులు | Pooja Bhatt Aamir cirruburrulu | Sakshi
Sakshi News home page

ఆమిర్‌పై పూజాభట్ చిర్రుబుర్రులు

Published Tue, Feb 17 2015 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

ఆమిర్‌పై పూజాభట్ చిర్రుబుర్రులు

ఆమిర్‌పై పూజాభట్ చిర్రుబుర్రులు

వివాదాస్పదమైన ‘ఏఐబీ’ రోస్ట్ వీడియో బాలీవుడ్‌లో చీలికలను తెచ్చిపెట్టింది. ఆలియా భట్, సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ వంటి వాళ్లంతా ‘ఏఐబీ’ వీడియోకు అనుకూలంగా మాట్లాడుతుంటే, ‘పీకే’ కథానాయకుడు ఆమిర్ ఖాన్ వంటి వాళ్లు ‘ఏఐబీ’పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ‘ఏఐబీ’ వీడియో హింసాత్మకంగా ఉందని ఆమిర్ చేసిన వ్యాఖ్యలపై పూజాభట్ మీడియా వద్ద చిర్రుబుర్రులాడింది. ‘ఢిల్లీ బెల్లీ’లో ‘భాగ్ డీకే బోస్’ వంటి ద్వంద్వార్థ గీతానికి స్టెప్పులేసిన గతాన్ని, ‘పీకే’ పోస్టర్‌లో ఆచ్ఛాదన లేకుండా దర్శనమిచ్చిన వైనాన్ని మరచి, ‘ఏఐబీ’ వీడియోపై ఆమిర్ సుద్దులు వల్లించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసింది. ఆమిర్‌ఖాన్ వంటి స్వయంప్రకటిత కుహనా నైతికవాదులే దేశానికి ఎక్కువ ప్రమాదకరమంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement