లుక్‌ మ్యాచ్‌ అవుతుందా? | Aamir Khan begins look test for Rajneesh Osho? | Sakshi
Sakshi News home page

లుక్‌ మ్యాచ్‌ అవుతుందా?

Published Fri, Jul 13 2018 12:51 AM | Last Updated on Fri, Jul 13 2018 12:51 AM

Aamir Khan begins look test for Rajneesh Osho? - Sakshi

ఆమిర్‌ ఖాన్‌

లేటెస్ట్‌ మూవీ ‘థగ్స్‌ ఆఫ్‌ హిందోస్తాన్‌’ చిత్రం కంప్లీట్‌ అవ్వకముందే తన నెక్ట్స్‌ సినిమాపై దృష్టి పెట్టారు ఆమిర్‌ ఖాన్‌. ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీశ్‌ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో రజనీశ్‌ పాత్రలో ఆమిర్‌ ఖాన్‌ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్‌ నచ్చినప్పటికీ, ఓషోలా తన లుక్‌ మ్యాచ్‌ అవుతుందా? లేదా? అనే విషయంపై ఆమిర్‌ సందిగ్ధంలో పడ్డారట.

దీనికి సంబంధించి తన లుక్స్‌పై లుక్‌ టెస్ట్‌ చేయనున్నారని సమాచారం.  ఇందులో ఆయన నాలుగు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నారట. తన గెటెప్‌కు సంబంధించి ప్రొస్థెటిక్‌ మేకప్‌ ఆర్టిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. లుక్స్‌ పరంగా సంతృప్తి చెందాకే సినిమా స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారట ఈ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌. ఇందులో ఆలియా భట్‌ కీలక పాత్రలో కనిపిస్తారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement