Thugs of Hindustan
-
కంటెంట్ కింగ్.. ఆడియన్స్ కింగ్మేకర్స్!
ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా, ఎంత పెద్ద స్టార్లు ఉన్నా.. అందులోఉన్న చిన్న లాజిక్, జనాలు మెచ్చే కంటెంట్ లేకపోతే అది డిజాస్టర్‌గా మిగిలిపోవాల్సిందే. సినిమాను నిలబెట్టేది స్టార్లు కాదు.. స్టోరీ. కథ, కథనాలు లేని సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ లాంటి భారీ తారాగణంతో ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. బాహుబలి సినిమా రికార్డులను బద్దలు కొడుతుందని ఆశపడిన బాలీవుడ్ వర్గాలకు ఎదురుదెబ్బ తగిలింది. రికార్డుల మాట అటుంచితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు వంద కోట్ల మార్కును మాత్రమే దాటింది. అయితే ఈ చిత్రం విడుదలైన ఫస్ట్‌షో నుంచే నెగెటివ్ టాక్ మొదలై.. కలెక్షన్లకు గండికొట్టింది. ఎంత ఆమిర్, అమితాబ్‌లు ఉన్నా.. సినిమాలో అసలు విషయం లేకపోయే సరికి వసూళ్లపై ప్రభావం గట్టిగా చూపింది. అయితే ఇదే సమయంలో కుటుంబ కథానేపథ్యంలో లేటు వయసులో ప్రేమ, బిడ్డను కనడం, కుటుంబ ఘర్షణలు, ప్రేమానురాగాలతో కూడిన ‘బధాయీ హో’ విమర్శకుల ప్రశంసలనే కాదు, ప్రేక్షకుల మన్నలను కూడా దక్కించుకుంది. అయితే దివాళి కానుకగా అన్ని థియేటర్లలో ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ను ప్రదర్శించారు. దాని ఫలితం తేలిపోయేసరికి వీకెండ్లో ఎలాగోలా గట్టెక్కించారు. అయితే ఈ వీకెండ్లో ‘బదాయిహో’కు షోలు తగ్గించేశారు. కానీ ఈ సోమవారం నుంచి మళ్లీ బధాయీ హోకు షోలు పెరిగాయి. ఎప్పటికైనా కథే కింగ్, అని ఆడియెన్సే కింగ్ మేకర్స్ అంటూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. Boxoffice can be most unpredictable, but that’s the beauty of this business... #BadhaaiHo was down to 2/3 shows at several plexes during #Diwali weekend, but, today [Mon] onwards, the film is back in 4/5/6 shows... Content is King and the audiences are King Makers! — taran adarsh (@taran_adarsh) November 12, 2018 చదవండి : ‘బధాయీ హో’పై సమీక్ష -
మరోసారి రెచ్చిపోయిన కత్తి కత్రినా
సాక్షి, ముంబై: ‘మై నేమ్ ఈజ్ షీలా... షీలా కీ జవానీ...' అంటూ ఒకపుడు ఉర్రూతలూగించిన కత్తి లాంటి కత్రినా కైఫ్ మరోసారి రెచ్చిపోయింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ ఆమీర్‌ఖాన్ తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లోని ఒక సాంగ్‌లో ఈ బాలీవుడ్ హీరోయిన్ స్టెప్పులతో ఇరగదీసింది. ఒకప్పుడు గ్లామర్‌తో ఆకట్టుకున్న కత్రినా.. ఇపుడిక ట్రెండ్‌కి తగ్గట్టుగా డ్యాన్స్‌పై దృష్ టిపెట్టినట్టుంది. దీంతో ఈ సినిమాలో మరోసారి కత్రినా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవడం ఖాయమని సినీ విమర్శకులు చెబుతున్నారు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లో వేగం పెంచింది యూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ సురైయా ప్రొమోని రిలీజ్ చేసింది. లెహెంగాలో కత్రినా చేసిన డ్యాన్సు ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ కానుంది. అబితాబ్ భట్టాచార్య గీతానికి, అజయ్ అతుల్ సంగీతానికి పోటీగా కత్రినా స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది. మరోవైపు విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దంగల్ నటి ఫాతిమా సనా షేక్ , ఇంగ్లీషు నటి లలోయిడ్ ముఖ్యపాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌లను ఇప్పటికే విడుదల చేశారు. కాగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ?rel=0 -
లుక్ మ్యాచ్ అవుతుందా?
లేటెస్ట్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ చిత్రం కంప్లీట్ అవ్వకముందే తన నెక్ట్స్ సినిమాపై దృష్టి పెట్టారు ఆమిర్ ఖాన్. ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీశ్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో రజనీశ్ పాత్రలో ఆమిర్ ఖాన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చినప్పటికీ, ఓషోలా తన లుక్ మ్యాచ్ అవుతుందా? లేదా? అనే విషయంపై ఆమిర్ సందిగ్ధంలో పడ్డారట. దీనికి సంబంధించి తన లుక్స్‌పై లుక్ టెస్ట్ చేయనున్నారని సమాచారం. ఇందులో ఆయన నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారట. తన గెటెప్కు సంబంధించి ప్రొస్థెటిక్ మేకప్ ఆర్టిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. లుక్స్ పరంగా సంతృప్తి చెందాకే సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నారట ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఇందులో ఆలియా భట్ కీలక పాత్రలో కనిపిస్తారట. -
అదేంటి.. ఆ నటి కనుబొమ్మపై గాటు!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌తో వరుస సినిమాలు చేస్తున్న భామ సనా ఫాతిమా షైక్. ‘దంగల్’ లో రెజ్లర్ గీతా ఫొగట్‌గా నటించి మెప్పించిన ఈ అమ్మడు తాజాగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ సినిమాలో నటిస్తోంది. ఆమిర్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ వంటి ప్రముఖ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సనా తాజాగా ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్ వద్ద దర్శనమిచ్చింది. సీరియస్‌గా పుస్తకం చదువుతూ కనిపించిన ఈ అమ్మడిని ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. అదేంటి ఆమె కనుబొమ్మ ఒకటి అలా ఉంది అని ఆరా తీస్తున్నారు. ఒక కనుబొమ్మపై గాటులాగా ఉండటంతో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా లుక్కు కోసం అలా అయ్ బ్రోను షేవ్ చేసుకుందా? అని కామెంట్ చేస్తున్నారు. -
బిగ్ బి @ 49
సరిగ్గా నలబైతొమ్మిదేళ్ల క్రితం ఓ నూనూగు మీసాల యువకుడు ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో వెండితెర తలుపు తట్టాడు. ఎన్నో అవమానాలు, తిరస్కారాల తరువాత తన తొలి సినిమాకు సంతకం చేశాడు. ఆ రోజున ఎవరూ ఊహించలేదు.. ఆ కుర్రాడే ఇండియన్ సినిమాకు పర్యాయపదంగా మారతాడని, ఆ కుర్రాడే కమర్షియల్ సినిమాను కొత్తపుంతలు తొక్కిస్తాడని.. ఏకంగా ఐదు దశాబ్దాల పాటు బాలీవుడ్ షెహన్షాగా వెండితెరను ఏలతాడని. సరిగ్గా 49 ఏళ్ల క్రితం 1969 ఫిబ్రవరి 15న బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన తొలి సినిమా ‘సాత్ హిందుస్థాని’ కోసం అగ్రిమెంట్ సంతకం చేశారు. ఆ రోజునే ఆయన అధికారికంగా భారతీయ సినీరంగంలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఏడుగురు హీరోల్లో ఒకరిగా నటించారు బిగ్ బి. అందుకే తొలి సినిమాతో అమితాబ్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తరువాత తరువాత ఆయనే సక్సెస్‌కు చిరునామాగా మారారు. వెండితెరను శాసించారు. ఇప్పటికీ బాలీవుడ్ టాప్ స్టార్‌గా కొనసాగుతున్నారు. తను తొలి సినిమా అంగీకరించి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమితాబ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. తొలి సినిమాలోని స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బిగ్ బి ‘49 ఏళ్ల క్రితం నేను ఈ కలల నగరానికి వచ్చి తొలి సినిమాకు సంతకం చేశాను’ అంటూ కామెంట్ చేశారు. అమితాబ్ ప్రస్తుతం 102 నాట్ అవుట్ సినిమాతో పాటు ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాలో నటిస్తున్నారు. T 2615 - 49 years ago I came to the city of dreams and signed my first film .. "Saat Hindustani' on Feb 15, 1969 .. pic.twitter.com/lNABGJIIXQ — Amitabh Bachchan (@SrBachchan) 14 February 2018 -
కెవ్వు కేక!
‘కెవ్వు’... ఈ మధ్య ఆమిర్ ఖాన్ నొప్పితో చాలాసార్లు పెట్టిన కేక ఇది. అయ్యో పాపం.. ఆమిర్‌కి ఏమైంది? అనుకుంటున్నారా! మరేం లేదు. తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ కోసం ఆమిర్ చెవులు, ముక్కు కుట్టించుకున్నారు. లేత వయసులో ఉన్నంత సున్నితంగా యాభైఏళ్ల వయసులో ఉన్నవారి చర్మం స్మూత్‌గా ఉండదు కదా. అందుకని చెవులు, ముక్కు కుట్టేటప్పుడు ఆమిర్ చాలా బాధపడ్డారట. ‘‘ఆ నొప్పి తగ్గడానికి నెల రోజులు పైనే పట్టింది’’ అని ఆమిర్ పేర్కొన్నారు. అంతా ఓకే.. చెవులకీ, ముక్కుకీ ఆభరణాలు పెట్టుకున్న ఆమిర్‌ని చూడాలని ఆయన ఫ్యాన్స్ ఉత్సాహపడ్డారు. ఇదిగో ఇక్కడున్న ఫొటోలో ఆమిర్ ఎలా ఉన్నారో చూశారుగా. సింప్లీ సూపర్బ్ కదా! చెవి, ముక్కు కుట్టించుకున్నప్పుడు ఆమిర్ కెవ్వున కేక పెట్టినా.. గెటప్ మాత్రం కెవ్వు కేక కదా!