మరోసారి రెచ్చిపోయిన కత్తి కత్రినా | Katrina Kai flamboyant dance moves will take your breath away | Sakshi
Sakshi News home page

మరోసారి రెచ్చిపోయిన కత్తి కత్రినా

Published Wed, Oct 24 2018 6:17 PM | Last Updated on Wed, Oct 24 2018 7:05 PM

Katrina Kai  flamboyant dance moves will take your breath away - Sakshi

సాక్షి, ముంబై: ‘మై నేమ్ ఈజ్ షీలా... షీలా కీ జవానీ...' అంటూ  ఒకపుడు ఉర్రూతలూగించిన కత్తి లాంటి కత్రినా  కైఫ్‌ మరోసారి రెచ్చిపోయింది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్లు  అమితాబ్‌ ఆమీర్‌‌ఖాన్‌ తాజా చిత్రం  ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్’ లోని ఒక సాంగ్‌లో ఈ బాలీవుడ్‌ హీరోయిన్‌  స్టెప్పులతో​ ఇరగదీసింది. ఒకప్పుడు గ్లామర్‌తో ఆకట్టుకున్న కత్రినా.. ఇపుడిక ట్రెండ్‌కి తగ్గట్టుగా డ్యాన్స్‌పై దృష్ టిపెట్టినట్టుంది. దీంతో ఈ సినిమాలో మరోసారి కత్రినా స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవడం ఖాయమని సినీ విమర్శకులు చెబుతున్నారు.

‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్‌లో  వేగం పెంచింది యూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ సురైయా ప్రొమోని రిలీజ్ చేసింది. లెహెంగాలో కత్రినా చేసిన డ్యాన్సు ఇపుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ కానుంది. అబితాబ్‌ భట్టాచార్య గీతానికి, అజయ్‌ అతుల్‌ సంగీతానికి పోటీగా కత్రినా స్టెప్పులతో   మెస్మరైజ్‌ చేసింది.

మరోవైపు విజయ్‌ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దంగల్‌ నటి ఫాతిమా సనా షేక్‌ , ఇంగ్లీషు నటి లలోయిడ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌లను ఇప్పటికే  విడుదల చేశారు. కాగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement