amirkhan
-
చాలామంది తండ్రులు చేసే తప్పే ఇది..! అమీర్ ఖాన్ సైతం..
బాలీవుడ్ దర్శకురాలు, నిర్మాత కిరణ్ రావు సింగిల్ మదర్‌గా పిల్లల పెంపకం విషయంలో ఎదురయ్యే సాధకభాదల్ని గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల కరీనా కపూర్‌తో జరిగిన విమెన్స్ వాంట్ వాంట్ అనే చాట్ షోలో కిరణ్ రావు తల్లిదండ్రులిద్దరూ పిల్లల బాధ్యతల్లో పాలుపంచుకోవడంపై చాలా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. అంతేగాదు సింగిల్ పేరెంట్‌గా తన అనుభవాన్ని గురించి కూడా చెప్పారు. పిల్లల విషయంలో చాలామంది తండ్రులు చేసే అతి పెద్ద తప్పు గురించి చెప్పడమే గాక అమీర్ ఖాన్ కూడా అంతే అంటూ ఆ షోలో నిజాయితీగా మాట్లాడారు. ఇంతకీ పిల్లల విషయంలో తండ్రులు చేసే తప్పు ఏంటంటే..కిరణ్ రావ్ అమీర్ ఖాన్ దంపతులకు అజాద్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అమీర్ బిజీ షెడ్యూల వల్ల పిల్లలకు తగిన సమయం కేటాయించలేకపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు కూడా. కిరణ్ రావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..మేము వివాహం చేసుకుని ఒక్కటైనప్పటికీ అమీర్ చాలా బిజీగా ఉండేవారని అన్నారు. తాము తల్లిదండ్రులుగా మారిన తర్వాత కూడా అతడి తీరులో మార్పులేదు. ఇక తాను ఒక తల్లిగా తల్లిదండ్రులిద్దరూ అందించాల్సిన ప్రేమని కొడుకు ఆజాద్‌కి తానే అందించానని అన్నారు. ఆ సమయంలో అమీర్‌కి ఆజాద్‌కి సమయం కేటాయించడం అనేది ఓ పెద్ద సమస్యాత్మకమైన నిర్ణయంగా ఉండేది. తామిద్దరం కలిసి ఉండటం వల్ల అదంతా నేనే చూసుకున్నాను. ఎప్పుడైతే 2021లో విడాకులు తీసుకున్నామో అప్పుడు ఆజాద్ విషయం సున్నితమైన అంశంగా మారిపోయింది. ఇక అమీర్ కూడా అజాద్ విషయంలో తానేం చేసింది గ్రహించాడు. నిజానికి చాలామంది తండ్రులు ఇలానే ఉంటున్నారు. పిల్లల స్కూల్‌కి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటారు. అదంతా తల్లి బాధ్యత అన్నట్లుగా వదిలేస్తారు. అని భావోద్వేగంగా మాట్లాడారు కిరణ్ రావ్.సింగిల్ పేరెంట్‌గా..తనకు తన కొడుకుతో గడిపే క్షణాలన్నీ మంచిరోజులే అన్నారు. అతడు తనని నవ్వించే యత్నం చేస్తుంటాడని అన్నారు. తనను ఒక్క క్షణం కూడా నిశబ్దంగా ఉండనివ్వడని కొడుకు ఆజాద్ గురించి సంతోషంగా చెప్పుకొచ్చారు. అలాగే ఈ సమయంలో తన తల్లిదండ్రులు తనకు పూర్తి మద్దుతగా నిలిచారని అన్నారు. వారి సహాయంతోనే మరింత సమర్థవంతంగా తన పిల్లవాడిని పెంచగులుగుతన్నాని అన్నారు. అయితే తల్లులు ఎప్పుడూ తండ్రుల్లా వారి బాధ్యతల విషయంలో తప్పించుకోరు. ఒకరకంగా ఇలా.. తల్లి పిల్లల మధ్య స్ట్రాంగ్ అనుబంధం ఏర్పడుతుందన్నారు. అంతేగాదు భవిష్యత్తులో సింగిల్ మదర్లకు వారి పిల్లలే పూర్తి ఆసరాగా ఉండి వారి బాగోగులను చూసుకుంటారని చాలా నమ్మకంగా అన్నారు. అయితే సింగిల్ మదర్ రోల్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లలకు తండ్రి లేని లోటుని కనిపించనీయకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం అని కిరణ్ రావ్ చెప్పుకొచ్చారు. కాగా, గతంలో అమీర్ రియా చక్రవర్తితో జరిగిన పోడ్కాస్ట్లో "నా బిజీ షెడ్యూల్ కారణంగా పిల్లల కోసం సమయం కేటాయించలేకపోయాను. అందువల్లే ఇరా, ఇరా డిప్రెషన్‌తో బాధపడిందని అన్నారు. అయితే ఆమె ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఇక జునైద్ తన కెరీర్‌ని ప్రారంభించాడు. అతడు కూడా నేను లేకుండానే గడిపాడు. కనీసం ఆజాద్ అయినా అలాకాకుడదని భావించి సమయం కేటాయించే ప్రయత్నం చేస్తున్నా. అయితే నాకు కుటుంబం పట్ల బలమైన అనుభూతి ఉంది, కానీ ప్రేక్షకుల మనసుని గెలుచుకునే హీరో అవ్వాలనే తాపత్రయంలో ఫ్యామిలీకి దూరం అయ్యాను." అని అమీర్ చెప్పారు.(చదవండి: 'తల్లులు' డోంట్ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్ 34 రోజుల్లోనే..!) -
'ముందు వెళ్లి మీ భర్తను అడగండి'.. స్టార్ హీరో భార్యకు స్ట్రాంగ్ కౌంటర్!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం యానిమల్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది ప్రముఖులు సైతం మండిపడ్డారు. అయితే ఈ సినిమాపై అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం విమర్శలు గుప్పించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. అయితే తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే చురకలంటించారు. ఒకసారి అమిర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చాడు. సందీప్ మాట్లాడుతూ.. 'నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతనితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు' అని యానిమల్ దర్శకుడు తెలిపారు. కాగా..ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. -
బాలీవుడ్ లో కామన్ అయిపోయిన విడాకులు
-
లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె
ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన మానసిక ఒత్తడిపై తాజాగా ఓ వీడియో సందేశాన్ని పంచుకుంది. ఇటీవల ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్బంగా తను నాలుగేళ్లకు పైగా డిప్రెషన్‌కు గురైనట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి ఆమె ఒత్తిడికి గల కారణాలు చెప్పాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యలో ఇరా సోమవారం నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పంచుకున్నారు. పది నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఇరా తన మానసిక ఒత్తిడికి గల కారణాలపై మాట్లాడింది. ‘కొద్ది రోజులుగా నా మానసిక అనారోగ్యానికి గల కారణాలను వెతకడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ దానికి తగిన కారణాలు నాకు దొరకడం లేదు. అందుకే మీకు సమాధానం చెప్పలేకపోతున్న. ఎందుకంటే నాకు అన్ని సౌకర్యాలు లభించాయి’ అని చెప్పుకొచ్చింది. (చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: హీరో కూతురు) అంతేగాక ‘మూడున్నరేళ్ల క్రితం ఎప్పుడైతే నా ప్రవర్తన మారడం ప్రారంభమైందో నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడం మానేశాను. ఎదో విషయంపై దీర్ఘంగా ఆలోచించేదాన్ని. ఒంటరిగా గదిలోనే ఉండేదాన్ని. ఎక్కవ సమయంలో నిద్రపోయోదాన్ని. అసలు నా గది, మంచం వదిలి ఎక్కువగా బయటకు వచ్చేదాన్ని కాదు. దీర్ఘంగా ఆలోచిస్తూ అలా మంచంపైనే ఉండేదాన్ని. కానీ అది ఉపయోగపడే విషయం కూడా కాదని తర్వాత తెలిసింది’ అలాగే తన తల్లిదండ్రుల విడాకుల విషయంపై స్పందిస్తూ.. ‘నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నాను. వారి విడాకుల విషయం నన్ను అంతగా బాధపెట్టలేదు. ఎందుకంటే వారు నా కోసం ఎప్పుడు ఉంటారు. వారి విషయంలో నేను ఎప్పుడు ఒత్తిడికి గురి కాలేదు. ఇంకా నాకు 6 ఏళ్ల వయసులో క్షయ వ్యాధి వచ్చింది. అది కూడా నన్ను బాధించలేదు’ అని చెప్పింది. (చదవండి: ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరా ఖాన్) అదే విధంగా తను లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొన్నట్లు ఈ సందర్భంగా ఇరా తెలిపింది. ‘నాకు 14 ఏళ్ల వయసులో ఉండగా లైంగిక వేధింపులకు గురయ్యాను. అప్పుడు ఆ వ్యక్తి ఏమి చేస్తున్నాడో నాకు తెలియదు. అయితే ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి తెలిస్తే అది విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే ఆ పరిస్థితి నాకు ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యేది. ఈ క్రమంలో ఏడాది తర్వాత నాకు అర్థమైంది. వెంటనే నా తల్లిదండ్రులకు ఈ మెయిల్ ద్వారా విషయం చెప్పి దాని నుంచి బయటపడ్డాను. ఇక అది కూడా నాపై పెద్ద ప్రభావం చూపలేదు. దాని నుంచి నేను ముందుకు సాగాను, జీవితంలో కూడా నాకు చెడుగా అనిపించలేదు’ అని ఆమె వివరించింది. అయితే చివరకు తన మానసిక వేదన గల కారణాలపై స్పష్టత ఇవ్వకుండానే వీడియో ముగించి నెటిజన్లను, అభిమానులను ఇరా నిరాశపరిచింది. (చదవండి: ‘ఇరా డిప్రెషన్‌కు ఆమె తల్లిదండ్రులే కారణం’) -
నా పేరు లాల్
‘నమస్కారం. నా పేరు లాల్.. లాల్‌సింగ్ చద్దా’ అని పరిచయం చేసుకుంటున్నారు ఆమిర్ ఖాన్. ప్రస్తుతం చేస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ కోసం పంజాబీ సర్దార్‌గా ఆమిర్ ఖాన్ మారిపోయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాకు ‘లాల్‌సింగ్ చద్దా’ హిందీ రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్ కథానాయిక. వయాకామ్ స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేశారు ఆమిర్‌ఖాన్. వచ్చే ఏడాది క్రిస్మస్కు ఈ సినిమా రిలీజ్ కానుంది. -
ది బెస్ట్ టీం ఇదే: కరీనా కపూర్
ముంబై: బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్, కరీనా కపూర్‌ఖాన్ జంటగా నటిస్తున్నకొత్త సినిమా ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర బృందం షూటింగ్ కోసం ప్రస్తుతం చండీఘడ్‌లో ఉంది. పలు సన్నివేశాల షూట్ పూర్తి చేసుకున్న చిత్రబృందం సభ్యులు అందరూ సరదాగా పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో హీరో అమీర్‌ఖాన్, హీరోయిన్ కరీనా కపూర్, సినిమా యూనిట్‌తో పాటు అమీర్ భార్య కిరణ్‌రావు కూడా ఉన్నారు. దీంతో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ చిత్రం హీరోయిన్ కరీనా కపూర్ ఓ ఫోటోను తన ఇస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘ది బెస్ట్ టీమ్’ అని కామెంట్ చేశారు. ఇటీవల ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్ సమయంలో లీకైన కరీనా, అమీర్ ఖాన్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. View this post on Instagram The Best Team ❤️❤️❤️❤️ #lalsinghchaddha #chandigarhnights @nainas89 nainas89 @poonamdamania @makeupbypompy A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on Nov 11, 2019 at 2:02pm PST అమీర్ ఇటీవల ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించారు. లాల్‌సింగ్ చద్దా.. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది తన పుట్టిన 54వ పుట్టినరోజు సందర్భంగా అమీర్ ఖాన్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. 1994లో రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రంలో టామ్ హాంక్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసందే. -
త్రీఇన్ వన్
బాలీవుడ్ బాక్సాఫీస్ త్రిమూర్తులు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్. ఈ ఖాన్స్ త్రయమే బాలీవుడ్‌ను చాలా ఏళ్లుగా ఏలుతోంది. ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రల్లో మెరిసిన వీరు ఒకేసారి స్క్రీన్‌పై మాత్రం కలసి కనిపించలేదు. అయితే త్వరలోనే ఖాన్స్ ముగ్గుర్నీ స్క్రీన్‌పై చూడొచ్చు అని బాలీవుడ్ టాక్. ఆమీర్ తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్ ఇది. ఈ సినిమాలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఈ ముగ్గురూ ఒకేసారి ఫ్రేమ్‌లో కనిపిస్తే ఖాన్ ఫ్యాన్స్‌కు ఖుషీఖుషీయే. -
పండగ ఎవరికి?
వచ్చే ఏడాది క్రిస్మస్కు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ టాప్ హీరోలు ఆమిర్‌ఖాన్, హృతిక్ రోషన్. గత ఏడాది డిసెంబర్లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆమిర్ ఖాన్. ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో తర్వాతి సినిమాకు కాస్త టైమ్ తీసుకున్న ఆమిర్ ఖాన్ ఆస్కార్ అవార్డ్ సాధించిన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ‘లాల్‌సింగ్ చద్దా’లో నటించనున్నట్లు ఇటీవల తన పుట్టినరోజు నాడు వెల్లడించాడు. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిందని బాలీవుడ్ సమాచారం. ‘క్రిష్’ ఫ్రాంచైజీలో రానున్న ‘క్రిష్ 4’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కే విడుదల చేయనున్నట్లు హృతిక్ రోషన్ తెలిపారు. సో.. ఇలా వచ్చే ఏడాది క్రిస్మస్కు ఇద్దరు టాప్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. మరి.. బాక్సాఫీస్ వద్ద ఎవరి పంట పండుతుందో, సినిమా విజయంతో ఎవరు పండగ చేసుకుంటారో చూడాలి. అయితే ఇంకా ‘క్రిష్ 4’ సెట్స్ పైకి వెళ్లలేదు. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కేన్సర్ బారిన పడి, చికిత్స తీసుకుని ప్రస్తుతం బాగానే ఉన్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. -
సిస్టరాఫ్ ఆమిర్
ఆమీర్ ఖాన్ నటనలో సూపర్ స్టార్. పాత్ర పర్ఫెక్ట్గా రావడం కోసం ఎంతైనా శ్రమిస్తారు. ఇప్పుడు వాళ్ల ఫ్యామిలీ నుంచి ఒకరు యాక్టర్‌గా మారబోతున్నారు. ఆమిర్ సోదరి నిఖాత్ ఖాన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. తాప్సీ, భూమీఫెడ్నేకర్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సాంద్ కీ ఆంఖ్’. షూటర్స్ చంద్రో తోమర్, ప్రకాషీ తోమర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో నిఖాత్ ఖాన్ మహారాణి పాత్రలో కనిపిస్తారు. సినిమాలో చిన్న పాత్రలా కాకుండా సినిమా మొత్తం కనిపించే పాత్ర ఇది అని బాలీవుడ్ సమాచారం. మరి సిస్టరాఫ్ ఆమిర్ ఆడియన్స్‌ను ఏ రేంజ్లో ఇంప్రెస్ చేస్తారో వేచి చూడాలి. -
అనుకోకుండా కలిశారు
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ అనుకోకుండా జపాన్‌లో కలుసుకున్నారు. ‘సైరా’ షూటింగ్‌కి కాస్త గ్యాప్ దొరకడంతో సతీమణి సురేఖతో కలిసి జపాన్ వెళ్లారు చిరంజీవి. హాలీడే ఎంజాయ్ చేసి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా టోక్యో ఎయిర్‌పోర్ట్‌లో అమిర్ ఖాన్‌ను కలుసుకున్నారు. ఆ సందర్భంలో దిగిన ఫొటో ఇది. ‘‘నా అభిమాన నటుడు చిరంజీవిగారిని అనుకోకుండా కలుసుకున్నాను. ఆయన చేస్తున్న స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడుకున్నాం. మీరెప్పుడూ మాకు స్ఫూర్తిని ఇస్తుంటారు సార్’’ అని ట్వీటర్లో షేర్ చేసుకున్నారు ఆమిర్. ‘‘ఆమిర్ లాంటి అద్భుతమైన నటుడిని కలుసుకోవడం హ్యాపీగానూ, సర్ప్రైజింగ్గానూ ఉంది. హాలీడే ముగిసింది. ‘సైరా’ కోసం తిరిగి హైదరాబాద్ వస్తున్నాను’’ అన్నారు చిరంజీవి. -
మరోసారి రెచ్చిపోయిన కత్తి కత్రినా
సాక్షి, ముంబై: ‘మై నేమ్ ఈజ్ షీలా... షీలా కీ జవానీ...' అంటూ ఒకపుడు ఉర్రూతలూగించిన కత్తి లాంటి కత్రినా కైఫ్ మరోసారి రెచ్చిపోయింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు అమితాబ్ ఆమీర్‌ఖాన్ తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లోని ఒక సాంగ్‌లో ఈ బాలీవుడ్ హీరోయిన్ స్టెప్పులతో ఇరగదీసింది. ఒకప్పుడు గ్లామర్‌తో ఆకట్టుకున్న కత్రినా.. ఇపుడిక ట్రెండ్‌కి తగ్గట్టుగా డ్యాన్స్‌పై దృష్ టిపెట్టినట్టుంది. దీంతో ఈ సినిమాలో మరోసారి కత్రినా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవడం ఖాయమని సినీ విమర్శకులు చెబుతున్నారు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లో వేగం పెంచింది యూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ సురైయా ప్రొమోని రిలీజ్ చేసింది. లెహెంగాలో కత్రినా చేసిన డ్యాన్సు ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ కానుంది. అబితాబ్ భట్టాచార్య గీతానికి, అజయ్ అతుల్ సంగీతానికి పోటీగా కత్రినా స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది. మరోవైపు విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దంగల్ నటి ఫాతిమా సనా షేక్ , ఇంగ్లీషు నటి లలోయిడ్ ముఖ్యపాత్రలు పోషించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌లను ఇప్పటికే విడుదల చేశారు. కాగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ?rel=0 -
అంత్యక్రియల్లో నవ్వినందుకు..
సాక్షి, ముంబై : ఇటీవల కన్నుమూసిన లెజెండరీ నటుడు రాజ్‌కపూర్ భార్య కృష్ణరాజ్ కపూర్‌కు బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ బచన్, ఆమిర్ ఖాన్, రాణీ ముఖర్జీ, కరణ్ జోహార్, అలియా భట్ వంటి ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. కాగా కృష్ణరాజ్ కపూర్ ప్రేయర్ మీట్లో కరణ్ జోహార్, ఆమిర్ ఖాన్, రాణీ ముఖర్జీలు నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు వీరు ప్రార్ధనా సమావేశంలో ఎందుకు నవ్వుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నటుల తీరును తప్పుపడుతూ పెద్దసంఖ్యలో కామెంట్లు పోటెత్తాయి. వీరు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారా లేక పార్టీలోనా..? అని కామెంట్ చేశారు. మిస్టర్ ఫర్పెక్షనిస్ట్ నుంచి ఇలాంటి దిగజారుడు చర్యను ఊహించలేమని.. షేమ్ అంటూ మరొక నెటిజన్ ఆమిర్‌ఖాన్‌ను ఉద్దేశించి ట్రోల్ చేశారు. రాణీ, కరణ్ జోహార్లు సిగ్గుమాలిన పని చేశారు. రాణీ ముఖర్జీ.. ఆదిత్యా చోప్రాను పెళ్లాడటం ఘనంగా భావిస్తోందని..తాము ఆమెను ద్వేషిస్తున్నామని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
అమ్మమ్మ మీద ఒట్టు
‘‘నా పేరే ఫిరంగీ మల్హా. నా వంటి నిజాయతీ పరుడు ఈ భూ ప్రపంచం మీద ఎక్కడా దొరకడు. నిజం నా రెండో పేరు. నిజాయతీ నా పని తీరు. మా అమ్మమ్మ మీద ఒట్టు’’ అని తన పాత్ర విశేషాలు పంచుకున్నారు ఆమిర్ ఖాన్. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. ఈ చిత్రంలోని ప్రతీ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు చిత్రబృందం. సోమవారం ఆమిర్ ఖాన్ లుక్‌ను రిలీజ్ చేశారు. గాడిద మీద కూర్చొని, పచ్చని జాకెట్, ఎర్రటి కళ్లజోడు, టోపీతో విచిత్రమైన వేషధారణలో ఫిరంగీ పాత్రలో కనిపించనున్నారు ఆమిర్. ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 27న, సినిమా నవంబర్ 8న రిలీజ్ కానున్నాయి. -
నయా లుక్
ఇక్కడున్న ఫొటో చూశారుగా.. హీరో ఆమిర్‌ఖాన్ 1980 నాటి సిగార్‌ను నోట్లో పెట్టుకుని ఎలా దర్జాగా కూర్చున్నారో. ఇది ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమా కోసమే. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ఇది. ఫిలిప్ మెడోస్ టేలర్ రాసిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ లుక్‌ను కత్రినా కైఫ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అలాగే ఇకనుంచి సినిమాలో కీలక తారాగణానికి సంబంధించిన లుక్స్‌ని వారానికి ఒకటి విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కానుంది. -
దేశీ ఫారెస్ట్ గంప్
‘ఓషో’ స్క్రిప్ట్‌తో పూర్తిగా సంతృప్తి చెందలేదట బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. దాంతో పారామౌంట్ సంస్థ నిర్మించిన ఓ హాలీవుడ్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా ఏంటో తెలిసిపోయింది. 1994లో రిలీజ్ అయిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రాన్ని ఆమిర్ రీమేక్ చేయాలనుకుంటున్నారట. ‘మై నేమ్ ఈజ్ గంప్, ఫారెస్ట్ గంప్’ అంటూ మానసిక వికలాంగుడిగా టామ్ హ్యాంక్స్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’. టామ్ హ్యాంక్స్ నటనకు ఆస్కార్ కూడా లభించింది. ఫారెస్ట్ గంప్ అనే వ్యక్తి జీవిత కథతో ఈ సినిమా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇండియన్ ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టుగా మార్పులు చేయిస్తున్నారట ఆమిర్. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయితే ఆయన తర్వాతి ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. -
నెట్‌జంక్
జంక్ ఫుడ్‌ని చూస్తే తినబుద్ధేస్తుంది. కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. సోషల్ మీడియా కామెంట్స్ కూడా జంక్ ఫుడ్ లాంటివే. కాలక్షేపానికి బాగానే ఉంటాయి. కానీ అవి.. ‘టార్గెట్’ అయినవారి మనశ్శాంతిని కబళించివేస్తాయి. అందుకే.. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ఫ్యామిలీ విషయాలను నెట్లో ‘పంపకానికి’ పెట్టకపోవడమే మంచిది. ‘నెట్ జంక్’ కాకుండా ఉంటారు. నిరంతరం ఆహారం కోసంవెదుకుతుండే గేలాలకు చిక్కుకోకుండా ఉంటారు. ఇటీవల ఆమిర్‌ఖాన్ ఫేస్బుక్లో, ఐశ్వర్యారాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ల వాళ్ల పర్సనల్ ఫొటోలను పోస్ట్ చేయడం వివాదం అయింది. ఆమిర్ తన 21 ఏళ్ల కూతురు ఇరాతో కలిసి పచ్చిక బయళ్లో ప్లేఫుల్ మూడ్‌లో ఉన్నప్పుడు తీయించుకున్న ఫొటో వాటిల్లో ఒకటి. సోషల్ మీడియా ఆ ఫొటోను ఏమాత్రం సహించలేకపోయింది. అందులో ఇరా షార్ట్ గౌన్ వేసుకుని తన తండ్రి గుండెలపై కూర్చుని ఉంది. తండ్రీకూతుళ్ల మధ్య బంధం స్వచ్ఛమైనదే కావచ్చు. అలాంటి ఫొటోను పోస్ట్ చేయడంలో ఏమాత్రం స్వచ్ఛత లేదని కామెంట్లు వస్తున్నాయి. ఆమిర్ వివాదాలకు దూరంగా ఉంటారు. మాటు వేసి ఉండే ఫొటోగ్రాఫర్లకు కూడా ఆయన చిక్కరు. అలాంటిది ఇవాళ ఆయనకై ఆయనే స్వయంకృతాపరాధిలా నిలబడ్డారు. వయసొచ్చిన కూతురితో ఆ ఆటలేంటి, రంజాన్ నెలలో ఈ విపరీతం ఏంటని.. నిరంతరం ఆహారం కోసం వెతుకుతుంటే సముద్రపు చేపల్లా.. ట్రోలింగ్ వేటగాళ్లు ఆమిర్‌పై బాణాలు వేశారు. రాయడానికి వీల్లేని మాటల్లో ఆ తండ్రీకూతుళ్ల బాంధవ్యానికి సంబంధాలను అంటగట్టారు. ఆమిర్ ఏం మాట్లాడలేదు. మనం రైట్ అనుకున్నదాన్ని రాంగ్ అనేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. అందుకే కుటుంబ అనుబంధాలను ఈ రైట్లు, రాంగ్ల మధ్యకు తీసుకురాకూడదు. ఈ విషయం ఆమిర్‌కు తెలియకుండా ఉంటుందా? లిప్ టు లిప్ కిస్ తల్లికి కూతురు ఇచ్చిన ముద్దే అది. అయినా ఈ బాహాటపు ముద్దును సోషల్ మీడియా భరించలేకపోయింది. కూతురు ఆరాధ్య పెదవులపై తన పెదవులు ఆన్చి ముద్దు పెడుతున్న ఫొటోను ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ్యగానే నెటిజన్లు చికాకుపడిపోయారు. ‘ఏంటమ్మా తల్లీ ఇదీ.. ఎబ్బెట్టుగా’ అని విరుచుకుపడ్డారు. ఐశ్వర్య ఆ ఫొటో కింద.. ‘లవ్ యు అన్కండిషనల్లీ. హ్యాపీయస్ట్ మామా ఇన్ ది వరల్డ్’ అని ఎంతో ఉన్నతమైన కాప్షన్ కూడా పెట్టారు. అయితే ఆ ఔన్నత్యాన్ని ఆ ముద్దు.. సొరచేపలా మింగేసింది. ఐశ్వర్య అభిమానుల హృదయాన్ని తల్లీకూతుళ్ల అనుబంధం కరిగించి ఉండొచ్చు. అయితే ఆమెపై కోపగించి ఎటాక్ చేసినవారే ఎక్కువ.‘ఐదారేళ్ల పిల్లల్ని పెదవులపై ముద్దుపెట్టుకోవడం ఏంటో.. యాక్!’‘లెస్బియనా ఏంటి!’‘ఐశ్వర్యా.. పిల్లలతో సెక్స్ తప్పు’.‘ఈ పాడు వెస్ట్రన్ కల్చర్మనకెందుకు?’..ఇలా ఐశ్వర్య నెట్లో ట్రోల్ అయ్యారు.బ్రిటన్ సెలబ్రిటీ విక్టోరియా బెక్‌హామ్ కూడా సేమ్ ఐశ్వర్యలాగే టార్గెట్ అయ్యారు. సేమ్ ఐశ్వర్యలాగే కాదు! ముందు ఇలా చేసింది విక్టోరియానే.. గత ఏడాది జూలైలో. అప్పట్లో ఆమె తన కూతురు హార్పర్ పెదవులపై పెదవులు పెట్టి కిస్ చేసిన ఫొటోపైన కూడా ఇలాంటి కామెంట్లే వచ్చాయి. అక్కడే వచ్చాయంటే.. ఇక్కడ రాకుండా ఉంటాయా? తప్పు.. ఒప్పు తేల్చేదెవరు? పబ్లిక్ పర్సన్స్ పర్సనల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంట్రస్టింగ్ దేన్, ప్రైవేట్ పర్సన్స్ పబ్లిక్ లైఫ్. ఎవరో తెలియనివాళ్లు ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. పెద్దవాళ్ల వ్యక్తిగత విషయాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఆమిర్, ఐశ్వర్య, విక్టోరియా.. వీళ్లు చేసింది తప్పా, ఒప్పా అని జడ్జిమెంట్ ఇచ్చేయడం తొందరపాటు అవుతుంది. ఎక్కువ మంది తప్పు అంటే తప్పు, ఒప్పంటే ఒప్పు అయిపోదు ఏది కూడా! ‘ప్రేమను భౌతిక స్పర్శతో వ్యక్తం చెయ్యడంలో తప్పేమీ లేదు. పిల్లలకు బయటి వ్యక్తుల గుడ్ టచ్ ఏదో, బ్యాడ్ టచ్ ఏదో తెలియడానికి తల్లిదండ్రుల ద్వారా చల్లని స్పర్శ తెలిసి ఉండడం అవసరం. అయితే మన సమాజం ఇటువంటి భౌతిక స్పర్శను అసౌకర్యంగా భావిస్తుంది’ అనేది ఒక అభిప్రాయం. ‘వీళ్లకొచ్చిన ఇబ్బందేమిటో అర్థం కావడం లేదు. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య కొన్ని స్పెషల్ మోమెంట్స్ ఉంటాయి. వాటిని వాళ్లు ఎంజాయ్ చేస్తున్నట్లే మనమూ ఎంజాయ్ చెయ్యడానికి ఇబ్బందేమీ పడక్కర్లేదు. పేరెంట్స్ ప్రేమకు విపరీతార్థాలు తియ్యడం కరెక్ట్ కాదు’ అనేది ఇంకో అభిప్రాయం. -
ద్రౌపదిగా దీపిక?
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ద్రౌపదిగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘మహాభారతాన్ని వెండి తెరకెక్కించడం నా కల’ అంటూ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన మనసులోని మాటను గతంలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. అత్యధిక బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబాని నిర్మించనున్నారనే వార్తలు గతంలో హల్చల్ చేశాయి. ఆమిర్ అలా చెప్పారో లేదో.. ఏ పాత్రకు ఎవరు సరిపోతారంటూ బాలీవుడ్లో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ చిత్రంలో ద్రౌపది పాత్రకి దీపిక పదుకోన్‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్. ‘బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ వంటి చారిత్రక సినిమాల్లో తన నటనతో దీపిక ఏ రేంజ్లో ప్రేక్షకులను అలరించారో తెలిసిందే. ఆ రెండు చిత్రాల్లో దీపిక కనబర్చిన నటన చూసి, ‘మహాభారతం’ సినిమాలో ద్రౌపది పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్‌గా సరిపోతారని ఆమిర్ ఆలోచనట. ‘బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ చిత్రాల్లో దీపిక పాత్రలు వివాదాస్పదమైన సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ అనుభవాలతో ద్రౌపదిగా నటించేందుకు దీపిక ఒప్పుకుంటారా? అని కొందరు అంటుంటే.. ఆమిర్ అంతటివాడు అడిగితే ఈ బ్యూటీ కాదంటారా? అనేవారూ లేకపోలేదు. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ద్రౌపది పాత్రను దీపికానే చేస్తారా? ఈ ప్రాజెక్ట్‌లో నటించే చాన్స్ ఎవరెవరికి దక్కుతుంది? అనే విషయాలకు కాలమే సమాధానం చెప్పాలి. -
నాకు సున్నా మార్కులేశాడు!
కమిలి కమిలి (ధూమ్ 3–2013), చిక్నీ చమేలి (అగ్నిపత్–2012), షీలాకి జవానీ (థీస్ మార్ ఖాన్–2010)... ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఈ సాంగ్స్‌లో హీరోయిన్ కత్రినా కైఫ్ కుర్రకారును ఏ లెవల్లో ఊర్రూతలూగించారో. ఆ పాటల్లో కత్రినా చేసిన డ్యాన్స్‌కు ఎంతోమంది ఫిదా అయ్యారు. అలాంటి కత్రినా కైఫ్ కెరీర్ స్టార్టింగ్‌లో డ్యాన్స్‌తో కాస్త ఇబ్బందిపడ్డారట. ఈ విషయం గురించి కత్రినా చెబుతూ– ‘‘తెలుగులో ఓ స్టార్ హీరోతో సినిమా చేశాను. అప్పట్లో నా డ్యాన్స్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల సాంగ్స్ షూట్‌కు టైమ్ పట్టింది. అప్పుడు ఆ కొరియోగ్రాఫర్ నన్ను ఏమీ అనలేదు. ఆ తర్వాత అదే కొరియోగ్రాఫర్ ఓ హిందీ సినిమాకు వర్క్ చేస్తున్న టైమ్‌లో కత్రినా కైఫ్‌కు డ్యాన్స్‌లో ‘జీరో మార్క్స్’ అన్నారని నా సన్నిహితులు నాతో చెప్పారు. అది విని షాక్ అయ్యాను’’ అని పేర్కొన్నారు. ఇంకా చెబుతూ– ‘‘డ్యాన్స్‌లో నేను కాస్త వీక్ అని నాకు తెలుసు. అయితే నాతో విషయం చెప్పకుండా వేరేవాళ్ల దగ్గర నన్ను విమర్శించడం బాధ అనిపించింది. ఆ తర్వాత కథక్ గురు వీరు కృష్ణణ్ పర్యవేక్షణలో డ్యాన్స్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకున్నాను. ప్రతిరోజూ 12 గంటలకు పైగా సాధన చేశాను. కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నాలో ఆత్మవిశ్వాసం నింపారు’’ అన్నారు కత్రినా. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఆమిర్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా, ఫాతిమా సనాషేక్ ముఖ్య తారలుగా రూపొందుతున్న ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమాలో ఓ డ్యాన్స్ నంబర్‌కు ఇటీవల కాలు కదిపారామె . ఈ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడే ఈ విషయాలు పంచుకున్నారు. -
నేనిలా ఉండటానికి కారణం నువ్వే
53వ పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేశారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది సమయంలోనే ఆయన్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. మొదటి పోస్ట్‌గా ‘‘నేనిలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే’’ అంటూ తల్లి జీనత్ హుసేన్ ఫొటోను అప్లోడ్ చేశారు ఆమిర్ ఖాన్. ‘‘బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇంట్లోవాళ్లతో గడపమని మా డైరెక్టర్ (విజయ్‌కృష్ణ ఆచార్య) నన్ను త్వరగా షూటింగ్ నుంచి వదిలేశారు. సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌కి వస్తాను’’ అంటూ మొదటి ఇన్స్టాగ్రామ్ స్టోరీగా వీడియోను పోస్ట్ చేశారు ఆమిర్ ఖాన్. ప్రస్తుతం జోద్‌పూర్‌లో ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ షూటింగ్లో బిజీగా ఉన్న ఆమిర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం ముంబైలో వాలిపోయారు. -
కురుక్షేత్రంలో ఖిల్జీ!
కర్ణుడా.. దుర్యోధనుడా.. అర్జునుడా.. భీముడా.. రణ్వీర్ సింగ్ ఏ రోల్ చేస్తే బాగుంటుందంటారు? ఇదిగో ఇలాంటి చర్చే జరుగుతుంది బీటౌన్‌లో. ఎందుకంటే బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’లో రణ్వీర్ నటించనున్నారట. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్ట్ పనిలో ఉన్న ఆమిర్ రీసెంట్ టైమ్స్‌లో కాస్త స్పీడ్ పెంచారు. రణ్వీర్ సింగ్‌తో చర్చలు జరిపారు. రణ్‌వీర్‌ని తీసుకోవాలని ఆమిర్ అనుకోవడానికి కారణం ‘పద్మావత్’ సినిమా. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, రణ్‌వీర్‌సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రంలో ఖిల్జీ పాత్రలో అందర్నీ మెప్పించారు రణ్వీర్. ఆమిర్ ఖాన్ కూడా ఖిల్జీకి ఫిదా అయ్యారు. అంతకుముందు రణ్వీర్ చేసిన పాత్రలు ఇష్టమైనప్పటికీ ఖిల్జీ పాత్ర ఆయనకు బాగా నచ్చిందట. అందుకే మహాభారతం సినిమా తీస్తే అందులో ఏ క్యారెక్టర్ సూట్ అవుతుందా? అని రణ్‌వీర్‌తోనే చర్చలు జరిపారు. రీసెంట్గా ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్ కోసం కలిసిన వీళ్లు.. మరో కార్యక్రమం కోసం మళ్లీ కలిశారు. అక్కడే ఇద్దరి మధ్య మహాభారతం గురించిన టాపిక్ వచ్చిందట. ఈ సంగతి ఇలా ఉంచితే ప్రస్తుతం ‘గల్లీబాయ్’ చిత్రంతో రణ్వీర్, ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమాతో ఆమిర్ బిజీగా ఉన్నారు. మరి.. ‘మహాభారతం’ పట్టాలెక్కేదెప్పుడు? కాలమే చెప్పాలి. -
ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్
ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ అంటూ ట్రెండ్‌కు తగ్గట్టు చాలా చాలెంజ్‌లు చూశాం. ఇప్పుడు మరో చాలెంజ్‌ను మన ముందుకు తీసుకు వస్తున్నారు ఆమిర్ ఖాన్. అదే ‘ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్’. అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ ముఖ్య తారలుగా ఆర్.బాల్కీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమిర్‌ఖాన్ ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ చాలెంజ్’ స్టార్ట్ చేశారు. అరుణాచలమ్ మురుగనాథమ్ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ నేప్కిన్లను తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆ విధంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన అరుణాచలమ్ కథతో ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ తీశారు. ఇతరుల్లో అవగాహన కలిగించే ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువ అవ్వాలని ఆమిర్ ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ చాలెంజ్‌కు నాంది పలికారు. ఇంతకీ ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాకి, ఆమిర్‌కీ సంబంధం ఏంటీ అనుకుంటున్నారా? ఈ సినిమాను అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా నిర్మించారు. ట్వింకిల్, ఆమిర్ మంచి స్నేహితులు. ట్వింకిల్ అడగ్గానే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఫొటోలో చూస్తున్నారుగా! ఆమిర్ ఖాన్ శానిటరీ ప్యాడ్‌ను ఇలా పట్టుకొని ఫొటో పోస్ట్ చేసి ‘‘అవును.. నా చేతిలో ఉన్నది శానిటరీ ప్యాడే. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు’’ అని పేర్కొన్నారు. అంతే కాదు.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కూడా ఇలా శానిటరీ ప్యాడ్ పట్టుకొని ఫొటో పోస్ట్ చేయమని చాలెంజ్ విసిరారు. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నది కాదు. సోషల్ అవేర్నెస్ కోసం స్టార్ట్ చేసిన చాలెంజ్. ఈ చాలెంజ్ ముఖ్య ఉద్దేశం ప్యాడ్స్ గురించి మాట్లాడటానికి మనం సిగ్గుపడకూడదని. ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. -
రజనీ అడిగినా ‘2.0’ చేయనన్నా!
లడ్డూ లాంటి ఛాన్స్ చేతిదాకా వస్తే చటుక్కున లాగేసుకోవాలని ఎవరైనా అనుకుంటాం. లూస్ చేసుకుంటే లాస్ అవుతాం కదా! కానీ, ఆ లడ్డూ ఆఫర్‌కి మనం అర్హులమా? కాదా? అని ఆలోచించేవాళ్లు మాత్రం లాస్ గురించి ఆలోచించకుండా వదిలేసుకుంటారు. ఆమిర్ ఖాన్ అదే చేశారు. మరి... దాదాపు 400 కోట్ల సినిమాని వదులుకోవడం అంటే నటుడిగా నష్టమే కదా? రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ ‘2.0’ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ‘‘ఈ సినిమాలో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది’’అని ఆమిర్ ఖాన్‌కి స్వయంగా రజనీ ఫోన్ చేశారట. కానీ, ఆమిర్ చాలా వినయంగా ఆ అవకాశాన్ని తిరస్కరించారు. ఆయనకు ‘2.0’ స్క్రిప్ట్ మొత్తం తెలుసు. వసూళ్ల రికార్డులు బద్దలు కొడుతుందని కూడా అనుకున్నారట. మరి.. ఎందుకు చేయకూడదనుకున్నారో ఆమిర్ మాటల్లో తెలుసుకుందాం. ‘‘నిజానికి ‘2.0’ ప్లాన్ చేసినప్పుడు రజనీకి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దాంతో ఆ సినిమా చేయలేనేమోననుకుని నన్ను చేయమన్నారు. ‘ఏ సమస్య ఉన్నా ఫర్వాలేదు.. మీరే చేయాలి’ అన్నాను. ఎందుకంటే, రజనీలా నేను మేజిక్ చేయలేను. ఆయనలా నేను యాక్ట్ చేయలేను. ఆ స్క్రిప్ట్ గురించి ఎప్పుడు తలుచుకుని కళ్లు మూసుకున్నా... నాకు రజనీయే కనిపించేవారు. దాంతో శంకర్ దగ్గర ‘నేను చేయలేను. ఈ సినిమా రజనీ మాత్రమే చేయగలరు’ అని చెప్పాను. నేను రజనీ అభిమానిని. ఫస్ట్ పార్ట్ (‘రోబో’) చూశాను. ఆయన అద్భుతంగా నటించారు. ఆ నటన నా మనసులో నాటుకుపోయింది. ‘2.0’ ఎన్ని భాషల్లో విడుదలైతే అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అవుతుంది’’ అని ఆమిర్ పేర్కొన్నారు. జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. -
కోడెవయసు రామ్మూర్తులు
దంగల్ దంగల్ సినిమా పుణ్యమా అని ఉత్తర భారతదేశంలో మళ్లీ కుస్తీలకు గిరాకీ పెరిగింది. పల్లెపట్టుల్లో ఇప్పటికే ఆదరణ ఉన్న ఈ క్రీడకు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ సినిమాల వల్ల భారీగా గ్లామర్ తోడయ్యింది. సుల్తాన్‌లో సల్మాన్‌ఖాన్ స్వయంగా ఒక మల్లయోధుడిగా నటిస్తే, దంగల్‌లో ఆమిర్‌ఖాన్ తన కూతుళ్లను తీర్చిదిద్దే మాజీ మల్లయోధుడిగా కనిపిస్తారు. స్త్రీలైనా పురుషులైనా పౌరుషంగా ప్రత్యర్థులను మట్టికరిపించవచ్చు అని నిరూపించిన ఈ సినిమాలతో ఒక్కసారిగా ఉత్తరాదిగా లంగోటీ బిగించే పిల్లల, కుర్రవాళ్ల శాతం పెరిగింది. అయితే దీనికి నేపధ్యం కూడా ఉంది. భారతదేశంలో మొదటి నుంచి ‘మల్లయుద్ధం’ ఉంది. భీముడు మల్లయోధుడే. అయితే మొఘలులు మన దేశానికి వచ్చాక వారికి తెలిసి ‘పహిల్వానీ’ క్రీడను వ్యాప్తి చేశారు. దేశీయంగా ఉన్న మల్లయుద్ధం, మొఘలులు తెచ్చిన పహిల్వానీ కలిసి ఇప్పటి ‘కుస్తీ’గా మారిందని కొందరి అభిప్రాయం. తెలుగునాట తొలిరోజుల్లో కోడి రామ్మూర్తి, ఆ తర్వాతికాలంలో నెల్లూరు కాంతారావు మల్లయోధులుగా ఖ్యాతి పొందారు. దేశవ్యాప్తంగా అయితే ధారాసింగ్‌కు ఉన్న పేరు తెలిసిందే. ఆ స్థాయిలో కాకపోయినా ఆ తర్వాత చాలామందే వచ్చారు. ఇప్పుడు దంగల్ పుణ్యమా అని రానున్న కాలంలో క్రికెట్లోనే కాదు కుస్తీలో కూడా అంతటి గ్లామర్ ఉన్న హీరోలను మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నది రెండురోజుల క్రితం అమృతసర్ శివార్లలో కుస్తీ ప్రాక్టీసు చేస్తున్న ఔత్సాహికుల చిత్రాలు. కుస్తీ కోసం గోదాలో ఉన్న మట్టిని నీళ్లు, తేనె కలిపి ప్రత్యేకంగా మెత్తగా చేస్తారు. అలాంటి మట్టిలోనే కుస్తీ ఆడాలి. అప్పుడే వాళ్లకు క్షేమకరం. మనకు నయనానందకరం. -
ఆ నటుడు దేశానికి గర్వకారణం
ప్రేక్షకులను పవన్‌కల్యాణ్ సర్ప్రైజ్ చేశారు. సర్ప్రైజ్ కాకుంటే మరేంటి? ఎప్పుడూ సోషల్ మీడియాలో రాజకీయ సామాజిక అంశాలపై స్పందించే పవన్‌కల్యాణ్ తొలిసారి ఓ సినిమా గురించి మాట్లాడారు. అదీ కొత్త ఏడాది కానుకగా ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఆయన కొత్త సినిమా ‘కాటమరాయుడు’ గురించి కాదు. ఓ హిందీ సినిమా చూసి ట్విట్టర్లో స్పందించారాయన. ఆమిర్‌ఖాన్ ‘దంగల్’పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘శనివారం (డిసెంబర్ 31న) ‘దంగల్ సినిమా చూశా. నా అభిప్రాయం ఏమిటో అందరికీ చెప్పకపోతే నా మనస్సాక్షి ఒప్పుకోదు. మన తరంలో ఆమిర్‌ఖాన్ లాంటి నటుడు ఉన్నందుకు దేశమంతా గర్వపడాలి. ‘దంగల్’లోని ఆయన నటన ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మనసుల్ని దోచుకుంది. దర్శకుడు నితీశ్ తివారీ, మిగతా ప్రధాన పాత్రధారులకు నా శుభాకాంక్షలు. మన దేశంలో కొరవడిన మహిళల సాధికారిత దిశగా పని చేయాల్సిన అవసరం ఉందని ఈ చిత్రం మనందరికీ గుర్తు చేసింది’’ అన్నారు పవన్. అన్నట్టు... ‘దంగల్’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమిర్‌ఖాన్ హైదరాబాద్ వచ్చి నప్పుడు ‘‘తెలుగులో మల్టీస్టారర్ చేయవలసి వస్తే.. చిరంజీవి లేదా పవన్‌కల్యాణ్‌లతో చేస్తా’’ అన్న సంగతి తెలిసిందే. -
బాలీవుడ్‌తో పాటు, ఖాన్‌లపై వర్మ ఏమన్నారంటే..
ముంబై: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బస్తీమే సవాల్ అంటూ.. వంగ వీటి సినిమా వివాదాన్ని చాలెంజ్ చేసిన వర్మ ఈ సారి బాలీవుడ్ ఖాన్ లపై విరుచుకుపడ్డారు. అమీర్ ఖాన్ తాజా మూవీ దంగల్ పై ప్రశంసలు కురిపించడంతో పాటుగా అటు సినిమా ఇండస్ట్రీపై , ఇటు ఇతర ఖాన్ లపై వరుస ట్వీట్లలో రెచ్చిపోయి కమెంట్ చేశారు. భారతీయ ప్రేక్షకుల తెలివితేటలపై అమిర్ ఖాన్ నమ్మకానికి సలాం కొట్టాల్సిందే. సూపర్ స్టార్లు ఎప్పటికీ యంగ్ గానే కనిపిస్తుంటారు. 50ల తర్వాత కూడా సిక్స్ ప్యాక్ లు చేసి చూపిస్తుంటారు. అమిర్ కూడా అదే చేశాడు. అసాధ్యం అనుకున్న వాటిని చేసి చూపిస్తాడు.అలా ఎదగడంలో అమీర్ సిన్సియారిటీని చూస్తే.. ఆయన పాదాలను తాకాలని ఉంది. అమిర్ కారణంగా ప్రపంచం అంతా ఇండియాను సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది. బాలీవుడ్ లో ఆలం ఆరా కాలం నుంచి చూస్తున్నా.. ఏ స్టార్ హీరో అయినా తండ్రిగా కనిపించేందుకు బరువు పెరిగి లావుగా కనిపించాలని అనుకున్నాడా? ఇతర ఖాన్స్ అంతా ప్రేక్షకులను వెర్రివాళ్లను చేద్దామని అనుకుంటే.. అమిర్ మాత్రం ప్రేక్షకుల ఇంటెలిజెన్స్ ను నమ్ముతాడు' అంటూ ట్వీట్ చేశాడు. ఇంతటితో సరిపెట్టలేదు వర్మ... 'దంగల్' చూశాక మొత్తం చిత్ర పరిశ్రమతోపాటు మిగిలిన ఖాన్లు కూడా జిమ్నాస్టిక్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తీరాలని తాను ఫీల్ అవుతున్నట్టు వర్మ ట్వీట్ చేశారు. Seeing Dangal I feel all us in entire industry including other khans should learn gymnastic martial arts and kick ourselves on our asses — Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2016 Which Star of Bollywood since Alam Ara would have taken a decision of putting on weight to look like a father of grown up daughters ? — Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2016 -
ఆమిర్... నువ్వంటే ద్వేషం!
సల్మాన్! నీ ‘ద్వేషం’లో నేను ‘ప్రేమ’నే చూశా. నిన్ను ద్వేషిస్తున్నంతగానే... ప్రేమిస్తున్నాను – ఆమిర్ యాభై ఏళ్ల వయసులో బాడీ మేకోవర్ అంటే మామూలు విషయం కాదు. అందుకు ఎంతో కృషి, తపన ఉంటేగానీ సాధ్యం కాదు. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, ఆమిర్‌ఖాన్ యాభైఏళ్లలోనూ బాడీ మేకోవర్ చేసి అందర్నీ ఔరా! అనిపించారు. సల్మాన్, ఆమిర్ మల్లయోధులుగా చిత్రాలు ప్రకటించినప్పటి నుంచే వాళ్ల ఫిజిక్, పెర్ఫార్మెన్స్పై అంచనాలు నెలకొన్నాయి. సల్మాన్ ‘సుల్తాన్’ విడుదలై ఘనవిజయం సాధించి మాంచి వసూళ్లు రాబట్టింది. ‘సల్మాన్ సూపర్’ అని అందరూ అన్నారు. ఇప్పుడు విడుదలైన ఆమిర్ ‘దంగల్’ చిత్రం కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆమిర్ మేకోవర్కి ప్రశంసలు లభిస్తున్నాయి. అభినందించిన వాళ్లల్లో సల్మాన్ కూడా ఉన్నారు. ‘‘నా ఫ్యామిలీతో కలిసి ‘దంగల్’ చూశా. ‘సుల్తాన్’ కన్నా ఇదే బాగుందన్నారు. ఆమిర్.. వ్యక్తిగతంగా నువ్వంటే ఇష్టం. అయితే వృత్తిపరంగా మాత్రం ద్వేషం’’ అని సల్మాన్ సరదాగా చమత్కరించారు. సల్మాన్ చేసిన ఫన్నీ ట్వీట్‌కి అంతే ఫన్నీగా ఆమిర్ కూడా ట్విట్టర్ ద్వారా పై విధంగా సమాధానం ఇచ్చారు. -
సూపర్‌స్టార్‌కు ఆమిర్‌ఖాన్ విజ్ఞప్తి
సూపర్‌స్టార్‌కు కోలీవుడ్, బాలీవుడ్ దాటి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాలీవుడ్లో హీరోగా పలు చిత్రాల్లో నటించిన రజనీకాంత్‌కు బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ నుంచి ఆమిర్‌ఖాన్, షారుక్ ఖాన్ అంటూ అందరితోనూ స్నేహసంబంధాలున్నాయి. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ మన సూపర్‌స్టార్‌ను ఒక కోరిక కోరడం విశేషం. ఆమిర్‌ఖాన్ తాజాగా నటించిన చిత్రం దంగళ్. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ రజనీకాంత్, ధనుష్‌ల కుటుంబానికి ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. అదే సమయంలో ఆమిర్‌ఖాన్ రజనీకాంత్‌ను ఒక విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దంగళ్ చిత్రంలో ఆయన పోషించిన పాత్రకు తమిళంలో రజనీకాంత్‌ను డబ్బింగ్ చెప్పాల్సిందిగా కోరినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఆయన కోరికను సూపర్‌స్టార్ తీరుస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. దంగళ్ చిత్రంలో ఆమిర్‌ఖాన్ పాత్ర యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకూ సాగుతుంది. ఇందులో ఆయన అద్భుతంగా నటించారనే టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయ్యింది. క్రిస్మస్ పండుగకు ముందు విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. -
వాణీ అయితే వద్దట!
హీరోయిన్ ఎంపిక విషయంలో నిర్మాతతో ఆమిర్ ఖాన్‌కి విభేదాలు వచ్చాయట. అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్ హీరోలుగా ‘ధూమ్ 3’ ఫేమ్ విజయకృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో హీరోయిన్గా వాణీ కపూర్‌ను తీసుకోవాలని నిర్మాత ఆదిత్యా చోప్రా, వాణీ వద్దంటూ ఆమిర్ పట్టుదలగా ఉన్నారట. యశ్‌రాజ్ సంస్థతో వాణీకి త్రీ ఫిల్మ్స్ కాంట్రాక్ట్ ఉంది. ఆదిత్యా చోప్రా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘బేఫికర్’లోనూ ఆమే హీరోయిన్. ‘థగ్స్ ఆఫ్...’కి హీరోయిన్గా వాణీ వద్దని ఆమిర్ చెప్పడంతో ఆదిత్య డైలమాలో పడ్డారట. ఇంతకీ వాణీ వద్దని ఆమిర్ ఎందుకంటున్నారో? -
'నేనే డైరెక్టర్ని అయితే..'
ముంబయి: తాను మెగాఫోన్ పడితే ఆ చిత్రంలో ఎట్టి పరిస్థితుల్లో నటించబోనని బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ అన్నారు. ముంబయిలో మామి ఫిల్మ్ క్లబ్ ప్రారంభం సందర్భంగా ఆయన దర్శకత్వ బాధ్యతల విషయంలో స్పందించారు. 'ఒక నటుడిగా డైరెక్టర్‌పై నమ్మకాన్ని కలిగి ఉండాలి. కానీ, నా గత కొన్ని రోజుల్లో కొంతమంది దర్శకులతో పనిచేశాను. కానీ, వారికి నాకు మ్యాచ్ కాలేదు. అందుకే నేను ఇబ్బంది పడ్డాను. అప్పటి నుంచి దర్శకుడిని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాను... ఒక వేళ నేనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి వచ్చినప్పుడు ఆ చిత్రంలో నేను నటించను' అని అమిర్ చెప్పారు. త్వరలోనే దంగల్ అనే చిత్రంతో అమిర్ ఖాన్ ప్రేక్షకులను అలరించనున్న విషయం తెలిసిందే. -
‘ప్రొజేరియా’ బ్రాండ్ అంబాసిడర్ మృతి
సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెందిన బీట్ల నేహాల్(15) ప్రొజేరియా వ్యాధితో మంగళవారం వేకువజామున మరణించాడు. అమెరి కాలోని ప్రొజేరియా రీసెర్చ్ ఫౌండేషన్ నేహా ల్ను ప్రొజేరియాకు ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. బీట్ల శ్రీనివాస్-శ్రీదేవిల కుమారుడైన నేహాల్ మూడేళ్ల వరకు అందరు పిల్లల్లానే ఆరోగ్యంగానే ఉన్నాడు. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం 15 ఏళ్ల క్రితమే మహారాష్ట్రలోని భివండికి వెళ్లారు. శ్రీనివాస్ మొబైల్ రిపేర్స్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. నేహాల్ అనారోగ్యం బారిన పడడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా, వ్యాధి నిర్ధారణ కాలేదు. అప్పటినుంచి పలు ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం కనిపించలేదు. చివరకు 2014లో వైద్యుల సూచన మేరకు ముంబైలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)లో చూపిం చారు. అక్కడ డాక్టర్ పరక్ తరహంకర్ పరీ క్షించి ప్రొజేరియా వ్యాధిగా నిర్ధారించారు. జన్యు సంబంధ సమస్యలతోనే ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. ఇలాంటివారు ఎండలో తిరగకూడదు. ఎప్పుడూ ఏసీలోనే ఉండాలి. ఎముకలు పెలుసుగా ఉండి, చిన్నవయసులోనే ముసలితనం వచ్చినట్లుగా మారడం ఈ వ్యాధి లక్షణం. ప్రపంచంలోనే ఈ వ్యాధిగ్రస్తులు 134 మంది ఉండగా ఇండియాలో గుర్తించిన నలుగురిలో మొదటివాడు నేహాలే. అమెరికాలోని ప్రొజేరియా రీసెర్చ్ ఫౌండేషన్ ఈ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా సేవ చేయడమే కాకుండా వ్యాధి నయం చేసేందుకు రూ.3 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడింది. అమెరికాలోని లెల్లెగారెడ్డన్ అనే డాక్టర్ సంరక్షణలో నేహాల్కు వైద్యసేవలందిస్తున్నారు. 15 ఏళ్ల వయసులోనూ నేహాల్ బరువు 13 కిలోలకు మించలేదు. ఇటీవల తన బాబాయి కూతురు పెళ్లి ఉండడంతో స్వగ్రామం పూసాలకు నేహాల్‌తోపాటు కుటుంబం వచ్చింది. సోమవారం ఎండతీవ్రత అధికంగా ఉండడంతో అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకోగా, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల సూచన మేరకు కరీంనగర్ వైద్యులు ముంబైలో నేహాల్కు చికిత్స అందిం చే వైద్యులను ఫోన్లో సంప్రదించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున నేహాల్ మృతిచెందాడు. స్వగ్రామం పూసాలలో అంత్యక్రియలు నిర్వహించారు. నేహాల్ కోరికల్లో అమిర్‌ఖాన్‌ను కలుసుకోవడం, హోండా హహియో కారులో తిరగడం, లాంబోగిని స్పోర్ట్స్ కారులో తిరగడం తీరాయి. చివరి కోరిక డీజీ లాండ్లో తిరగాలని ఉందని చెప్పేవాడు. -
సన్నీ కోరిక తీర్చిన షారుక్!
సన్నీ లియోన్ బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో కాలు కదిపే అవకాశం దక్కించేసుకున్నారు. ఐటమ్ సాంగ్స్, హాట్ క్యారెక్టర్స్ చేస్తూ దూసుకెళుతున్న సన్నీకి షారుక్‌తో నటించాలనే కల ఎప్పట్నుంచో ఉంది. అయితే, గతంలో ఆమె నీలి చిత్రాల్లో నటించినందున సన్నీని మెయిన్ స్ట్రీమ్ నాయికగా చూడ్డానికి బాలీవుడ్లో చాలామంది ఇష్టపడటంలేదు. అంతెందుకు... స్టార్ హీరోల భార్యలు తమ భర్త సన్నీతో నటించడానికి ససేమిరా అంటున్నారు. ఇప్పుడా పరిస్థితిలో మార్పొచ్చింది. సన్నీకి బాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇటీవల ఆమిర్‌ఖాన్ కూడా సన్నీతో నటించడానికి తనకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు షారుక్ ఖాన్ తన తాజా చిత్రం ‘రాయీస్’లో సన్నీకి ప్రత్యేక గీతంలో నర్తించే అవకాశమిచ్చారు. ఈ సందర్భంగా సన్నీ లియోన్ మాట్లాడుతూ - ‘‘ఇదో కలలా ఉంది. అందుకే ఈ సినిమాకి అవకాశం వచ్చినప్పుడు నన్ను నేను గిల్లి చూసుకున్నా. ఈ అవకాశం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. షారుక్ సరసన చేసే అదృష్టం కోసం ఆ దైవాన్ని ప్రార్థించాను. ఇంత కాలానికి నా కోరిక తీరింది’’ అని ఉద్వేగంగా అన్నారు. 1980లో జీనత్ అమన్ నర్తించిన ‘ఖుర్బానీ’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘లైలా ఓ లైలా...’ పాటను ‘రాయీస్’ చిత్రం కోసం రీమిక్స్ చేయనున్నారు. ఈ పాటకే షారుక్ ఖాన్‌తో సన్నీ కాలు కదపనున్నారు -
అనుకున్నామని జరగవు అన్నీ...
ఏ బియ్యపు గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటుందో ఎవరికి తెలుసు? సినిమా పాత్రల విషయమూ సరిగ్గా అంతే! ఒక పాత్ర ఒకరి కోసం అనుకున్నా... ఆఖరికి అది వేరెవరికో దక్కడం సినీ రంగంలో సహజం. అలాంటి కొన్ని హిందీ చిత్రాలు... విచిత్రాలు... ‘జంజీర్’ అనగానే మనకు అమితాబ్ గుర్తుకొస్తారు. కానీ, జంట రచయితలు సలీమ్ -జావేద్ ‘జంజీర్’ కథ తయారు చేసి మొదట వినిపించింది దేవానంద్‌కు! ఆ తర్వాత ధర్మేంద్రకు చెప్పారు. ఇద్దరూ నిరాకరించారు. రాజేశ్ ఖన్నాకు చెబుదా మనుకున్నారు. అయితే ‘హాథీ మేరే సాథీ’ షూటింగ్లో రాజేశ్ ఖన్నాకు, వీరికి భేదాభిప్రాయాలు వచ్చాయి. మరి ఈ కథను ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అమితాబ్ బచ్చన్ నటించిన ‘బాంబే టూ గోవా’ చూశారు జావేద్. * ఆ కథకు అతనే హీరో అని నిర్ణయించేసుకున్నారు. అలా అనుకోకుండా దక్కిన ‘జంజీర్’తో అమితాబ్ సూపర్స్టారైపోయారు. * ‘షోలే’లో గబ్బర్‌సింగ్ పాత్రకు మొదట డానీని అనుకున్నారు. ఆయన నిరాకరించడంతో అమ్జాద్ఖాన్కు అవకాశం దక్కింది. * ‘ఆనంద్’ సినిమాను హృషీకేశ్ ముఖర్జీ నిజానికి ఉత్తమ్‌కుమార్‌తో తీయాలనుకున్నారు. కుదర్లేదు. ఆ తర్వాత కిశోర్‌కుమార్, శశికపూర్‌తో చేయాలనుకున్నారు. చివరకు రాజేశ్‌ఖన్నా, అమితాబ్ బచ్చన్‌తో ‘ఆనంద్’ పూర్తి చేశారు. * ‘రజనీగంధ’ చిత్రంలో మొదట శశికపూర్, షర్మిలా టాగూర్, అమితాబ్ బచ్చన్లను తీసుకోవాలనుకున్నారు బాసూ చటర్జీ. కానీ, వారి కాల్షీట్లు దొరకలేదట. అందుకే కొత్త తారలతో చేయాలని నిశ్చయించుకున్నారు. శశికపూర్ వేషానికి అమోల్ పాలేకర్‌ను, షర్మిలా టాగూర్ వేషానికి విద్యను, అమితాబ్ వేషానికి దినేష్ టాగూర్‌ను తీసుకున్నారు. కొత్తవారితో తీసిన ఆ చిత్రం గొప్ప విజయం సాధించింది. * అనిల్‌కపూర్, శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో మొదట హీరోగా అమితాబ్ బచ్చన్‌ను అనుకున్నారు. * షారుక్ ఖాన్ కెరీర్లో మైలురాయి అంటే ‘దిల్ వాలే దుల్హేనియా లేజాయేంగే’చెప్పుకోవాలి. అందులో హీరోగా మొదట అనుకున్నది - సైఫ్ అలీఖాన్ని. * ‘లగాన్, మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రాలకు హీరోగా ముందు షారుక్ ఖాన్‌ను అనుకున్నారు. చివరకు ‘లగాన్’ ఆమిర్‌ఖాన్ చేస్తే, ‘మున్నాభాయ్’ చిత్రాన్ని సంజయ్‌దత్ చేశారు. * వసూళ్లలో సంచలనం సృష్టించిన ‘త్రీ ఇడియట్స్’కు మొదట హీరోగా షారుక్‌ఖాన్‌ను అనుకున్నారు రాజ్‌కుమార్ హిరానీ. అయితే షారుక్ ఖాన్ తన సొంత సంస్థలో చేద్దామని షరతు పెట్టాడు. దాంతో ఆ సినిమా ఆమిర్‌ఖాన్ దగ్గరకు వచ్చింది. * ‘రంగ్ దే బసంతి’ నిజానికి హృతిక్ రోషన్ సినిమా. ఆయన ఈ కథ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆమిర్‌ఖాన్ మాత్రం ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాడు. -
ఆమిర్ వ్యాఖ్యలపై దుమారం
-
ఆమిర్ వ్యాఖ్యలపై దుమారం
మద్దతిచ్చిన కాంగ్రెస్.. మండిపడిన బీజేపీ ♦ రామ్‌గోపాల్‌వర్మ, అనుపమ్ ఖేర్‌ల తీవ్ర నిరసన ♦ ఆమిర్ దేశం విడిచి వెళ్తే జనాభా తగ్గుతుందన్న బీజేపీ ఎంపీ న్యూఢిల్లీ/ముంబై: భారత్‌లో అసహన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ బాలీవు డ్ స్టార్ ఆమిర్‌ఖాన్(50) చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్నే లేపాయి. అటు రాజకీయ రంగం నుంచి, ఇటు సినిమా రంగం నుంచి ఆమిర్‌పై సానుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమిర్ వ్యాఖ్యలపై ఢిల్లీలోని న్యూ అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ముంబైలోని ఆమిర్ నివాసం ముందు హిందూ సేన కార్యకర్తలు నిరసన తెలిపారు. దాంతో ఆమిర్‌కు ముంబై పోలీసులు భద్రత కల్పించారు. ఆమిర్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపగా.. బీజేపీ మండిపడింది. సినీరంగ ప్రముఖులు అనుపమ్ ఖేర్, రామ్‌గోపాల్ వర్మ ఆమిర్ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసించారు. ఇతర విపక్ష నేతలు ఆమిర్ వ్యాఖ్యలు సరైనవేనన్నారు. ఆమిర్ దేశం విడిచి వెళ్తే ఆ మేరకు జనాభాను తగ్గించినవాడవుతాడంటూ బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హిందువును మించిన పొరుగు లేదు ఆమిర్‌పై ఎదురుదాడికి బీజేపీ తమ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేస్‌ను రంగంలోకి దింపింది. ముంబైలో విలేకరుల సమావేశంలో హుస్సేన్ మాట్లాడుతూ.. ‘ఇండియా విడిచి ఆమిర్ ఏ దేశం వెళ్తాడు? ప్రపంచంలో భారత్‌ను మించిన దేశం లేదు.. భారతీయ ముస్లింకు హిందువును మించిన పొరుగు లేదు. యూరోప్‌లో, ముస్లిం దేశాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియదా? అసహనం ఎక్కడ లేదు? ప్రపంచమంతటా ఉంది’ అన్నారు. ‘మన దేశంలో కళాకారుడిని అతడి కులం ఆధారంగానో, మతం ఆధారంగానో అభిమానించరు. అతడి కళను చూసి ప్రేమిస్తారు’ అన్నారు. ఆమిర్‌కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతు తెలపడంపై స్పందిస్తూ.. భారత్‌లో అసహన వాతావరణం నెలకొందన్న ప్రచారంతో దేశాన్ని అప్రతిష్ట పాలుచేసేందు కు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. ‘మంత్రుల ముందు, బహిరంగవేదికపై ఆమిర్ ఆ విధంగా మాట్లాడగలగడమే దేశంలో భావ ప్రకటన స్వాతంత్య్రానికి, సహన శీలతకు సజీవ తార్కాణ’మని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ప్రపంచమంతా చెబుతున్నదే..: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అందరినీ దేశభక్తి లేనివారనో, జాతి వ్యతిరేకులనో, దేశద్రోహులనో ముద్ర వేయడం సరికాదని.. అందుకు బదులుగా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోదీ ప్రభుత్వానికి హితవు చెప్పారు. ‘బీజేపీ సీనియర్ నేతల ముందు ఆమిర్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచమంతా, దేశమంతా చెబుతున్నవే.’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. ఆమిర్ వాస్తవ కఠిన పరిస్థితులపై ధైర్యంగా స్పందించారని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. ‘ఆమీర్‌ను అభినందిస్తున్నా. ఆయనన్న ప్రతీమాటా వాస్తవమే’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘కశ్మీర్ ఉగ్రవాదుల పోరులో ప్రాణాలర్పించిన కల్నల్ సంతోశ్ మహాదిక్ త్యాగం ఆమిర్ వ్యాఖ్యల కన్నా ముఖ్యమైంది’ అంటూ ఎన్సీపీ నేత శరద్‌పవార్ అన్నారు. అతిగా ఉన్నాయి: మిల్ఖా సింగ్ చండీగఢ్: ప్రభుత్వ అవార్డులను వెనక్కివ్వడాన్ని ప్రముఖ అథ్లెట్, పద్మశ్రీ పురస్కార గ్రహీత మిల్ఖా సింగ్ తప్పుబట్టారు. సాధించిన విజయాల ప్రాతిపదికగా లభించిన పురస్కారాలను తిరిగివ్వడం సరికాదన్న మిల్ఖా.. అలాంటి చర్యలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపబోవన్నారు. వాటివల్ల ఏం సాధిస్తారని ప్రశ్నించారు. అసహనంపై ఆమిర్ చేసిన వ్యాఖ్యలు కాస్త అతిగా ఉన్నాయన్నారు. ముస్లింలు దేశాన్ని వీడరు: ఒవైసీ హైదరాబాద్: ఈ దేశ ముస్లింలు దేశాన్ని వదిలి ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లరని.. భారతీయులుగా చెప్పుకునేందుకే గర్వపడతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సంఘ్ పరివార్ తాటాకు చప్పుళ్లకు భారత ముస్లింలు భయపడరన్నారు. ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు స్వాతంత్య్ర సమరయోధులను అవమానించే విధంగా ఉన్నాయన్నారు. ఆ ముగ్గురు పాములు ఆమిర్ వ్యాఖ్యలపై శివసేన మంత్రి రామ్‌దాస్ కదమ్ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఆమిర్, షారూఖ్, వెటరన్ హీరో దిలీప్ కుమార్..ఈ ముగ్గురు పాముల్లాంటివారని, వారి వ్యాఖ్యలు చూస్తోంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎంతో అభిమానించినా.. విశ్వాస ఘాతకులుగా వ్యవహరిస్తున్నారన్నారు. అసహన ఇండియా ఎప్పుడైంది?: అనుపమ్ ఖేర్ ఆమిర్ ఖాన్ అనే స్టార్‌ను తయారు చేసింది ఇండియానే అని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. ‘ఏ దేశానికి వెళ్దామ ని మీ భార్య కిరణ్‌రావు సూచించింది. మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చింది ఈ దేశమేనని ఆమెకు మీరు చెప్పారా? ఇంతకన్నా దారుణ పరిస్థితులెదుర్కొన్న సమయంలోనూ దేశం విడిచి వెళ్లాలన్న ఆలోచన మీకు రాలేదని మీరు తనతో చెప్పలేదా?’ అని వరుస ట్వీట్లలో ప్రశ్నించారు. ‘మీరనే ఈ అసహన సమాజమే మిమ్మల్ని స్టార్‌ను చేసింద’ంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఆమిర్, సల్మాన్, షారూఖ్‌లను ప్రస్తావిస్తూ.. భారత్ అసహన దేశమే అయితే ముగ్గురు ముస్లింలు సూపర్ స్టార్లు కాలేకపోయేవారన్నారు. మరే ఇతర దేశంతో పోల్చినా.. భారత్ గొప్ప సహన శీల దేశమని వర్మ పేర్కొన్నారు. రిషీ కపూర్, రవీనా టాండన్, పరేశ్‌రావల్ తదితర ప్రముఖులు కూడా ఆమిర్ వ్యాఖ్యలపై స్పందించారు. -
సారూ.. ఈసారైనా!
గాసిప్ ఐశ్వర్యరాయ్, ఆమిర్‌ఖాన్‌లు కలిసి నటిస్తే చూడాలనేది ఇద్దరి అభిమానుల చిరకాల కోరిక. కారణాలు ఏమైతేనేంగానీ... అదో తీరని కోరికగానే మిగిపోతోంది. నిజానికి ఐషు తన తొలి సినిమాను ఆమిర్తోనే చేయాల్సి ఉంది. అయితే ఆమిర్‌ఖాన్‌తో నటించే అవకాశాన్ని ఆమె తిరస్కరించింది. దీనికి సంబంధించి ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కార్యక్రమంలో ఆమె ఇలా చెప్పింది... ‘‘రాజా హిందుస్థానీ సినిమాలో ఆమిర్‌తో నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పుడు నేను పూర్తిగా చదువులపైనే దృష్టి పెట్టాను. దీంతో ఆ ఆఫర్‌ను వదులుకోక తప్పలేదు’’ అని. ఐషు, ఆమిర్‌ఖాన్‌లతో ఒక సినిమా తీయడానికి గత సంవత్సరం కరణ్ జోహార్ ప్రయత్నించాడు. ఆమిర్‌కు స్క్రిప్ట్ నచ్చలేదని ఒకవైపు, ఆమిర్‌కు నచ్చిందిగానీ ఐశ్వర్యారాయ్‌కు నచ్చలేదని మరోవైపు గాసిప్‌లు వినబడ్డాయి. అయితే ఏది నిజమో తెలియదుగానీ మొత్తానికైతే ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. ‘‘ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఎప్పుడు నటిస్తున్నారు?’’ అనే మీడియా ప్రశ్నకు -‘‘ఇది తెలుసుకోవాలని నాకు కూడా భలే ఆసక్తిగా ఉంది’’ అని అందంగా నవ్వేది ఐషు. బాలీవుడ్ సూపర్ స్టార్లు ఆమిర్‌ఖాన్, ఐశ్వర్యరాయ్‌లతో సినిమా తీయడానికి ఒక బాలీవుడ్ దర్శకుడు బాగా కష్టపడి ఒక స్క్రిప్ట్ తయారుచేసినట్లు వినికిడి. పుసుక్కున ఆ సినిమా వర్కవుట్ అయితే ఆమిర్, ఐషు అభిమానులకు పండగే. ఆ డెరైక్టర్ ఎవరో తెలిస్తే మాత్రం...‘సారూ... ఈసారైనా’ అని అభిమానులు వెంట పడడం ఖాయం! -
జాకీ యోగా!
‘కుంగ్ ఫూ యోగా’....యాక్షన్ సూపర్ స్టార్ జాకీచాన్ నటించే ఈ సినిమా కోసం ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్-చైనాలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టాన్లీ టాంగ్ దర్శకుడు. ఈ చిత్రంలో ఆమిర్‌ఖాన్, కత్రినాకైఫ్‌లు నటిస్తారని టాక్ రావడంతో ఈ చిత్రంపై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బిజీ షెడ్యూల్స్ కారణంగా వారిద్దరూ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది. జాకీచాన్ శైలిలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. 33 రోజుల పాటు దుబాయ్‌లోనే యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత మరో షెడ్యూల్ కోసం జాకీచాన్ భారత్ రానున్నారు. ‘ద మిత్’ తర్వాత భారత్‌లో షూటింగ్లో జరుపుకునే జాకీచాన్ రెండో సినిమా ఇదే. -
సారీ అండీ!
గాసిప్ ‘హెరా ఫేరీ 3’లో శ్రుతీహాసన్ నటించనుందనే వార్తలు నిన్నా మొన్నటి వరకు గట్టిగా వినిపించాయి. అయితే ఈ సినిమా చేయడం లేదని ఆమె తాజాగా ప్రకటించింది. డేట్స్ కమిట్మెంట్స్ వల్ల సినిమా చేయలేకపోతోందట. అయితే గుసగుసలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. తండ్రి కమల్‌హాసన్, బాలీవుడ్ నటదిగ్గజం ఆమిర్ఖాన్లకు ఉన్న ‘పర్ఫెక్షనిస్ట్’ అనే పేరు తాను కూడా తెచ్చుకోవాలనుకోవడంతో ఆమె అతిగా ఆచితూచి వ్యవహరిస్తోందనే మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. నీరజ్ వొరా దర్శకత్వం వహిస్తున్న ‘హెరా ఫేరి 3’ సేఫ్ ప్రాజెక్ట్‌గానే చెప్పుకోవాలి. పైగా పరేష్ రావల్, సునీల్‌శెట్టి, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్‌లాంటి ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. బాలీవుడ్లో నిలబడడానికి శ్రుతీహాసన్‌కు ఈ సినిమా ఉపకరిస్తుందని కూడా సినీ పండితులు అంచనా వేశారు. మరి ఈ తేనె కళ్ల సుందరి సినిమా ఎందుకు చేయనంది? తాజా గుసగుస ప్రకారం... ఈ సినిమాలో తన పాత్రను హీరోల పాత్రలతో పాటు హీరోయిన్లు ఇషా గుప్తా, నేహాశర్మల పాత్రలతో పోల్చి చూసుకుందట. కొలతలు వేసిందట. మిగిలిన వారితో పోల్చితే తన పాత్రకు ప్రత్యేకత ఏదీ కనిపించలేదట. ‘మొక్కుబడిగా కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తేనే మేలు’ అనుకొని డెరైక్టర్ నీరజ్‌కు, ప్రొడ్యూసర్ ఫిరోజ్‌కు ‘సారీ’ చెప్పిందట! -
ఓవర్సీస్లోనే 300 కోట్లు..!
2014 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన పికె ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అమీర్‌ఖాన్, అనుష్క శర్మ, బోమన్ ఇరనీ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు. ఇప్పటికే భారత్‌లో అత్యధిక వసూళ్లు సాదించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన పికె తాజాగా ఓవర్సీస్లోనూ ఓ అరుదైన ఘనత సాదించింది. మూఢనమ్మకాలపై సెటైరికల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలో రూ. 348 కోట్ల వసూళ్లు సాదించగా, ఓవర్సీస్లో కూడా రూ. 300 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. హాంకాగ్, తైవాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఇప్పటికీ నడుస్తున్న పికె, భవిష్యత్తులో మరిన్ని రికార్డ్‌లు నెలకొల్పే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. విధూ వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాలో అమీర్‌ఖాన్ గ్రహాంతరవాసిగా నటించాడు. పొరపాటున భూమి మీదకు వచ్చిన ఓ ఏలియన్ తిరిగి తన గ్రహానికి వెళ్లటానికి కావల్సిన కీ పోగొట్టుకోవటం, ఆ కీని వెతుక్కునే ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే పాయింట్‌ను సెటైరికల్ కామెడీ జానర్లో తెరకెక్కించారు. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే కథ కావటంతో ఇప్పటికీ ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాస్తూనే ఉంది. -
గుడ్డుపై నిషేధమా!
ఆహారపుటలవాట్లను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రాంతం, వాతావరణం, లభ్యత...మన దేశంలో అయితే కులం వగైరాలు తినే తిండిని నిర్దేశిస్తాయి. శాకాహారం గొప్పదా...మాంసాహారం గొప్పదా అనే చర్చ ఎప్పటినుంచో ఉంది. రెండింటిలోనూ మంచిని వెతికేవారూ ఉన్నారు. లోపాలను ఏకరువు పెట్టేవారున్నారు. జనం మనోభావాలతో ముడిపెట్టకుండా దీన్ని చర్చిస్తే ఏ సమస్యా ఉండదు. అలా ముడిపెట్టినప్పుడే ఇబ్బందులొస్తాయి. తాను ఇకపై పూర్తి స్థాయి శాకాహారిగా మారిపోతున్నానని...మాంసాహారంతోపాటు గుడ్లు, పాలు, పాలతోచేసే ఇతర పదార్థాలూ కూడా వదిలేస్తున్నానని రెండు నెలలక్రితం బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ ప్రకటించారు. శాకాహారాన్ని ఉద్యమస్థాయిలో ప్రచారం చేసే గ్రూపులు పాశ్చాత్యదేశాల్లో కూడా కనబడతాయి. కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శాకాహారి గనుక అంగన్వాడీల్లో కోడిగుడ్లు పంపిణీ చేయరాదనే నియమం పెట్టుకోవడం వింతగొలుపుతుంది. ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈమధ్య కాలంలో వివాదాలకెక్కిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ తాజా నిర్ణయానికి మూలకారకుడు. ఆ రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉండే మూడు జిల్లాల్లోని అంగన్వాడీల్లో ప్రయోగాత్మకంగా కోడిగుడ్లు పంపిణీచేయాలన్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనను చౌహాన్ తోసిపుచ్చారు. దానికి బదులుగా పాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించమని ఆయన సూచించారు. అయిదేళ్ల క్రితం ఒకసారి మధ్యాహ్న భోజనంలో బడి పిల్లలకు కోడిగుడ్లు అందించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా చౌహాన్ దాన్ని అంగీకరించలేదు. అంతేకాదు...‘నేను సీఎంగా ఉన్నంతకాలమూ ఈ రాష్ట్రంలో మాంసాహారంతో సమానమైన గుడ్ల పంపిణీకి అంగీకరించబోన’ని ప్రతిజ్ఞ చేశారు. అది గుర్తులేకనో, ఏమో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తాజా ప్రతిపాదనను ఆయన ముందుంచినట్టు కనబడుతున్నది. వ్యక్తిగా చౌహాన్‌కు మాంసాహారంపై కొన్ని అభిప్రాయాలుండొచ్చు. శాకాహారమే శ్రేష్టమైనదన్న విశ్వాసం ఉండొచ్చు. అందుకు ఆయన్ను తప్పుబట్టాల్సింది లేదు. కానీ...తనకు ఇష్టంలేదు కనుక ఖజానానుంచి అందు నిమిత్తం ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టడానికి వీల్లేదనడం అన్యాయమవుతుంది. సరైన పోషకాహారం అందక ఏటా మన దేశంలో 13 లక్షలమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం తేల్చింది. ఈ మరణాల్లో 90 శాతం డయేరియా, న్యూమోనియా, మలేరియా వంటి వ్యాధులవల్లే కలుగుతున్నాయని...మంచి పోషకాలు లభ్యమయ్యే ఆహారాన్ని అందిస్తే వీరిని కాపాడవచ్చునని తెలిపింది. ఈ పిల్లలంతా అయిదేళ్లలోపువారే. పిల్లల్లో పోషకాహారలేమి ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌దే అగ్రస్థానం. అక్కడ ఆరేళ్లలోపు పిల్లల్లో సగంమంది తక్కువ బరువుతో ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారు తినే తిండిలో విటమిన్లు, మాంసకృత్తులు, ఖనిజలవణాలు లేకపోవడమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అటు బాలింతలకు సరైన పోషకాహారం లభ్యంకాకపోవడంవల్ల గర్భస్త శిశుమరణాలు, నవజాత శిశుమరణాలు సంభవిస్తున్నాయి. అమ్మలవుతున్న అనేకమంది ప్రాణాంతక వ్యాధులబారిన పడుతున్నారు. మంచి ఆహారం అందించగలిగితే వీరిలో 90 శాతంమందిని రక్షించడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నా మన ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కూడా ఇలాంటి సమస్యను అరికట్టడానికే గుడ్ల పంపిణీ ప్రతిపాదన తెచ్చింది. ఇష్టంలేని దేన్నయినా నిషేధించాలనే తత్వం ప్రమాదకరమైనది. అది పసిపిల్లల ఆహారం విషయంలో పాటించడం మరింతగా ఇబ్బంది కలిగించేది. ఎంపికచేసిన మూడు జిల్లాల్లోనూ ఆదివాసీలు, ఆ తర్వాత దళితులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారిలో సహజంగానే పోషకాహారలేమి ఎక్కువ స్థాయిలో ఉంది. పర్యవసానంగా పిల్లల్లో మరణాల రేటు, ప్రమాదకర వ్యాధుల రేటు ఎక్కువగా ఉంది. కోడిగుడ్లకు పాలు ప్రత్యామ్నాయం కాదని ఆహార హక్కు ఉద్యమకారుల వాదన. కోడిగుడ్డులో సి విటమిన్ మినహా మిగిలిన అన్ని విటమిన్లు ఉంటాయని...మాంసకృత్తులు, ఖనిజలవణాలు సమృద్ధిగా లభ్యమవుతాయని వారు చెబుతున్నారు. పైగా పాలల్లో నీళ్లు కలిపినట్టు గుడ్లను కల్తీ చేయడం కుదరదుగనుక పిల్లలకూ, బాలింతలకూ మంచి పోషకవిలువలుండే ఆహారం అందుబాటులోకొస్తుందంటున్నారు. కర్ణాటకలో పోషకాహార లోపాన్ని గుర్తించాక అంగన్వాడీలద్వారా కోడిగుడ్లు అందించడం మొదలుపెట్టారు. దాని ఫలితాలు కూడా బాగున్నాయి. పరిస్థితులు దారికొస్తున్న సంకేతాలు కనబడుతున్నాయి. మన దేశంలో ఒక చిత్రమైన పరిస్థితి కనబడుతుంది. నిరుపేదల్లో ఆకలినీ, పౌష్టికాహారలోపాన్నీ సరిదిద్దటానికి ఉద్దేశించిన ఆహార భద్రతా చట్టం ఎన్నడో 2013 సెప్టెంబర్‌లో ఆమోదం పొందినా దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావడంలేదు. మొన్న ఏప్రిల్‌నాటికి కేవలం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే ఆ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. మిగిలిన 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గడువు తీరగానే కొత్త గడువు అడగటం మినహా అడుగు ముందుకేయడం లేదు. కేంద్రం కూడా చాలా ఉదారంగా వ్యవహరిస్తూ వారు కోరగానే గడువును పొడిగించుకుంటూ పోతోంది. దారిద్య్రరేఖకు దిగువునున్నవారికి సరైన పోషకాహారం అందటం లేదన్న కారణంతో తీసుకొచ్చిన ఈ చట్టం అమలును వాయిదా వేయడంద్వారా నిరుపేద వర్గాలకు ఆకలినీ, పౌష్టికాహారాలోపాన్నీ శాశ్వతం చేస్తున్నామన్న స్పృహ పాలకులకు కలగడం లేదు. ఇలా చేయకపోగా సెంటిమెంటు పేరుతో పేద వర్గాల పిల్లలకూ, బాలింతలకూ పోషక విలువలుండే కోడిగుడ్డును అందకుండా అడ్డుకుంటున్నారు. ఇది ఒక్క మధ్యప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. రాజస్థాన్, పంజాబ్, హర్యానా,యూపీ వంటి రాష్ట్రాల్లో కూడా అంగన్ వాడీల్లోగానీ, బడిపిల్లల మధ్యాహ్న భోజనంలోగానీ గుడ్లు అందించడంలేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీయరాదన్న భావనతోనే ఇలా చేస్తున్నామన్నది ఆయా రాష్ట్రాలు చెబుతున్న జవాబు. మెజారిటీ ప్రజలు తినే ఆహారాన్ని పంచడంవల్ల ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అర్ధంకాని విషయం. ఈ విషయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పునరాలోచించుకుంటే లక్షలాదిమంది పిల్లలకు ప్రాణం పోసినవారవుతారు. ఎందరో తల్లులకు గర్భశోకం తప్పించినవారవుతారు. -
ఇప్పటికింకా నా వయసు..
‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అనడం లేదు గానీ, తన వయసు ఇప్పటికీ పద్దెనిమిదేనంటున్నాడు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమిర్ ఖాన్. రేపటితో తనకు యాభయ్యేళ్లు నిండుతున్నాయని, అయినా, మానసికంగా తన వయసు పద్దెనిమిదేళ్లేనని అంటున్నాడు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పాతికేళ్లు పూర్తయినా, కెరీర్లో ఇంకా అత్యున్నత శిఖరాలకు చేరుకున్నట్లు తాను భావించడం లేదని చెబుతున్నాడు. -
దిస్ ఈజ్ నాట్ కరెక్ట్
కుళ్లు జోకులు తనకు నచ్చవంటున్నారు ఆమిర్‌ఖాన్. తనను ఇంప్రెస్ చేయాలంటే ఎదుటివారిని కించపరచేవి కాకుండా మనస్ఫూర్తిగా నవ్వుకునే జోకులు వేస్తే చాలంటున్నాడీ మిస్టర్ పర్ఫెక్ట్. ఇటీవల ఏబీఐ నాకౌట్ ఫీచరింగ్ ఓ వర్గాన్ని కించపరచేలా ఉందంటూ వచ్చిన వార్తలపై అమీర్ పైవిధంగా స్పందించాడు. సదరు కార్యక్రమంలో పాల్గొన్న డెరైక్టర్ కరణ్ జోహార్, నటులు అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడటం లేదంటూనే.. ఇలాంటి ప్రోగ్రామ్స్ రూపొందించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని హితవుపలికారు. -
నానా సిక్స్ ప్యాక్!
క్యారెక్టర్ డిమాండ్ చేసిందో... లేదంటే నాకేంటి తక్కువనుకున్నాడో... బాలీవుడ్ నటుడు నానాపటేకర్ లేటు వయసులో సిక్స్ ప్యాక్ బాటపట్టాడు. రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లే అలవాటున్నా.. ఇప్పటివరకూ ఆ ప్రయత్నం చేయలేదు ఈయన. రీసెంట్గా ఆమిర్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, హృతిక్‌రోషన్, అజయ్‌దేవ్‌గణ్ వంటి స్టార్లకు సిక్స్ ప్యాక్ సమకూర్చిన ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా యాభై ఏళ్ల నానాకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడట. ‘యాభై ఏళ్ల తరువాత సిక్స్ ప్యాక్ రాబట్టాలంటే కొంత కష్టమే. ఈ వయసులో జీవన క్రియ మందగిస్తుంది. అయినా నానాకు శిక్షణ ఇచ్చేందుకు రెడీ. ఆయనతో పనిచేయడం నిజంగా గొప్ప అనుభూతినిస్తుంది’ అన్నాడు సత్యజిత్. సో... లెట్స్ వెయిట్ ఫర్ ‘సిక్స్ ప్యాక్ నానా’. -
‘పీకే’పై చర్యలకు సర్కార్ ఆదేశం
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాపై నానాటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర హోం శాఖ మంత్రి రామ్ షిండే మాట్లాడుతూ.. సినిమాను చూసి భాంతి భద్రత లకు భంగం కలిగించే అంశాలేమైనా ఉంటే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఐజీ (లా అండ్ ఆర్డర్) దేవన్ భర్తీని ఆదేశించామన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్చిట్ ఇచ్చింది. కాగా, సినిమాలో కొన్ని సన్నివేశాలు మతవిశ్వాసాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఆరోపిస్తూ పలు సంస్థలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మూడు, నాలుగు రోజుల్లో ఈ సినిమాపై పోలీసు శాఖ నుంచి తగిన నివేదిక వస్తుందని, తర్వాత దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని షిండే స్పష్టం చేశారు. -
‘పీకే’ థియేటర్లపై బజరంగ్ దాడి
హిందూ దేవతలను కించపరచారని ఆందోళన అహ్మదాబాద్/భోపాల్: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాలో హిందూ దేవతలను హాస్యాస్పదంగా చిత్రీకరించి, తమ మనోభావాలను కించపరచారని భోపాల్, అహ్మబాదాద్‌లలో ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై సోమవారం బజరంగ్దళ్ సభ్యులు దాడి చేశారు. అహ్మదాబాద్‌లో కర్రలు, రాడ్లతో వచ్చిన పాతిక మంది రెండు థియేటర్ల అద్దాలు పగలగొట్టి, పోస్టర్లు చింపేశారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ దాడికి తామే బాధ్యులమని, పీకేను నిలిపేయకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని భోపాల్ బజరంగ్దళ్ చీఫ్ జ్వలిత్ మెహతా హెచ్చరించారు. ఆమిర్ ఉద్దేశం సరైందైతే ఆయన మతానికి చెందిన దేవుళ్లను ఎందుకలా చిత్రీకరించరని ప్రశ్నించారు. అయితే అంతకుముందే ఇలాంటి వ్యాఖ్యల్ని ఆమిర్ కొట్టిపడేశారు. తనకు అన్ని మతాలు సమానమేనని, తన సినిమా సిబ్బందిలో 99 శాతం మంది హిందువులేనని పేర్కొన్నారు. -
అబ్బో... ఆమిర్!
తాజాగా రిలీజ్ అయిన ‘పీకే’ సినిమా హిట్‌తో హీరో ఆమిర్‌ఖాన్‌పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆమిర్ అదని... ఇదని... అసలేం చేసినా సూపరనీ తెగ మోసేస్తున్నారు బాలీవుడ్ జనాలు. రొమాంటిక్ భామ మల్లికా షెరావత్ అయితే ఓ అడుగు ముందుకేసింది. అసలు విషయం వదిలేసి... ఆమిర్ సొసైటీకి ఎంతో సేవ చేసేస్తున్నాడంటూ కితాబిచ్చేసింది. ‘ఐ లవ్ దట్ మూవీ. ఈ ఏడాదికి అద్భుతమైన ముగింపు ఇది. అంతే కాదు... సమాజ శ్రేయస్సులో ఆమిర్ భాగస్వామ్యం అమూల్యం. నిస్వార్థం’ అంటూ సినిమా క్యారెక్టర్‌ను నిజ జీవితానికి ముడిపెట్టేసింది. అందుకు తన ట్విట్టర్ పేజీని వేదికగా చేసుకుందీ చక్కని చుక్క! -
గీత అద్భుతం! - ఆమిర్
సిటీకి ఎంతో మంది వస్తుంటారు...పోతుంటారు. కానీ ఆమిర్‌ఖాన్ మాత్రం స్పెషల్... ఇతను ఆ....రడుగుల బుల్లెట్ కాడు... ఐదున్నర అడుగుల మిసైల్! 42 ఏళ్ళ వయస్సులో 18 ఏళ్ళ కుర్రతనం చూపాడు.. వినోదంలోనూ వివేకం కనబరుస్తాడు. సమాజాన్ని నిద్రలేపుతూ సాక్షాత్తూ పార్లమెంట్‌నే దడదడలాడించాడు. ఇవన్నీ ఆమిర్ గురించి తెలిసిన విషయాలు. కానీ స్వయంగా కలిస్తేనే తెలిసే సంగతులు, కలిగే స్ఫూర్తి మాటల్లో చెప్పడం కష్టం. చాలా మంది స్టార్స్‌ని చూస్తూంటాం కానీ, ఆమిర్‌ఖాన్ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ తన పరిధిలోకి వచ్చిన వారందరినీ బహుశా తాకుతుందేమో. పదిమంది బాడీగార్డుల మధ్య ఈ కాంతికిరణం నడుచుకుంటూ వచ్చింది. మొదటిసారి ఆమిర్‌ని నేరుగా చూసాను. కళ్ళల్లో చిలిపితనం, సహజమైన మంచితనం, బాడీ లాంగ్వేజ్‌లో కాన్ఫిడెన్స్... ప్రవర్తనలో మనిషితనం.. స్పందనలో స్థిత ప్రజ్ఞత... ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనిపించుకున్నాడు ఆమిర్... ఇంతకీ...‘పీకే’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమిర్‌ఖాన్, అనుష్కాశర్మ ఇంకే పికే బృందం హైదరాబాద్ వచ్చారు. నేను రేడియో జాకీగా పనిచేస్తున్న బిగ్ ఎఫ్ఎమ్ నిర్వహించిన కాంటెస్ట్‌లో భాగంగా ఆమిర్‌ని కలిసే అవకాశం వచ్చింది. బిగ్ ఎఫ్ఎమ్ టీంతోపాటు ఆమిర్ ఎక్స్‌క్లూజివ్ చిట్‌చాట్ చేద్దామని వెళ్ళాను. ఆ సందర్భంగా వెలికి తీసిన కొన్ని సంగతులు... హైదరాబాద్ మీకు వెల్కమ్ చెప్తోంది. ఆమిర్: ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మేం కేవలం ఒక స్టార్‌గా చూడట్లేదు. మీరు ఒక వ్యక్తిత్వం ఆమిర్! ఆమిర్: నాపై ఇక్కడివారు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. థాంక్యూ! రాజూ హిరానితో మళ్ళీ పనిచేయడం ఎలా అనిపించింది? ఆమిర్: మేము అనుకున్నది చేయగల్గుతామా, తెరపైకి తీసుకురాగల్గుతామా అన్నది ఒక్కటే నిత్యం మాముందుండే సవాల్. అంతకుమించి అంతా బావుంది. ఏమంటారు రాజూ? (రాజువైపు చూస్తూ) రాజు: నిజమే! అంతిమంగా మనం తీసిన సినిమాని చూసి మనం గర్వపడాలి. అది అందరికీ నచ్చాలి. కనుక గతంలో తీసిన సినిమాకంటే బాగా రావాలన్న తపన ఉంటుంది. అనుష్కా, ఆమిర్ నగ్నంగా ఉండే ఆ వివాదాస్పద పోస్టర్‌పై మీరు లేరేం? అనుష్క: (ఉలిక్కిపడి)...ఉన్నానుగా... మిగిలినవాటిపై (నవ్వు) అవును ఆ పోస్టర్లో కూడా ఉండాల్సిందేమో! ‘పీకే’లో కళ్ళార్పకుండా నటించడం కష్టమనిపించిందా? ఆమిర్: అవును. ిపీకేలో నా పాత్ర కళ్ళార్పకుండా ఉండడం.. కొంచెం కష్టమయ్యింది. అందులోనూ నేను కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. ఇలా చేయాలని సూచించింది విధువినోద్‌చోప్రా. రిహార్సల్స్‌లో తను చెప్పిన తర్వాత నా పాత్రకి కావలసిన మూలం దొరికింది. ....అదే కళ్ళార్పకపోవడం. ‘ప్రొడ్యూసర్ ఈజ్ కింగ్’ అంటారు. మరి మీరు? వినోద్: నేను ప్రొడ్యూసర్ని కాను, మేమంతా కో-వర్కర్స్, అందరం సమానం. అది వాళ్ళంతా నాకు పెట్టిన పేరు మాత్రమే. అనుష్కా! ఆమిర్‌తో నటించిన అనుభవం? అనుష్క: వండర్ఫుల్, మొదట్లో ఇబ్బంది పడ్డాను. ఆమిర్ అసలు మాట్లాడడు- ఎంతో అవసరమైనప్పుడు తప్ప. ఆమిర్: (వెంటనే) దాట్స్ అబ్సర్డ్! నేను చాలా రిలాక్స్డ్గా ఉంటాను. మే బీ... మీ ఆవిడ చూస్తారని భయమా ఆమిర్? (అందరూ పగలబడి నవ్వు..) అనుష్క: నేను ఆర్మీ వాతావరణంలో పెరిగాను కనుక సీనియర్లకి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నాను. నా అంతట నేనే సరదాగా ఉండటం చేతకాదు. కానీ మెల్లగా చనువు పెరిగింది. ఆమిర్‌ది చాలా తెలివైన, షార్ప్ బ్రెయిన్. ఆమిర్: ఆల్సో వెరీ లవ్వింగ్, డేరింగ్... అండర్స్టాండింగ్ (నవ్వుతూ) అనుష్కా ... ఇందులో మీ పాత్ర? అనుష్క: పీకేలో నేనొక జర్నలిస్ట్ పాత్ర వేసాను. నా పాత్రపేరు జగత్జనని. ఇంతకు మించి ఇప్పుడే ఏం చెప్పను. కానీ మీరందరూ చూసి గర్వపడతారు. ఇంతకీ సినిమా కథ? రాజు: చెప్తే... వీళ్ళందరూ నన్ను చంపేస్తారు!! ఒకటి మాత్రం నిజం. గతంలో మేం చేసిన ఫిలింస్లాగా ఇది కూడా కాన్సెప్ట్ ఫిల్మ్. చాలా భిన్నమైన కథాంశం. హైదరాబాద్‌కి రావడం ఎలా అనిపిస్తోంది? ఆమిర్: నేను షూటింగ్ కోసం గతంలో హైదరాబాద్ వచ్చాను. నాకిష్టమైన సిటీ హైదరాబాద్. ఇక్కడ బిరియానీ, హలీమ్ చాలా ఇష్టపడతాను. వినోద్: నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి పెళ్ళి ఇక్కడే ఫలక్‌నుమాలో చేసాను. జస్టిస్ చలం నా వియ్యంకుడు. ఆమిర్: నా సినిమాలు చూసి ఇక్కడి వాళ్ళు చాలా బాగా స్పందించారు. ఆ విధంగానూ హైదరాబాదు నా మనసుకి చాలా క్లోజ్. తెలుగువారందరికీ నా ప్రేమ! అనుష్క: చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. మోడలింగ్ డేస్‌లో, అలాగే ప్రమోషన్స్ కోసం కూడా వచ్చాను. భగవద్గీతని జాతీయగ్రంథం చేయాలన్న ప్రతిపాదనపై మీ కామెంట్? ఆమిర్: నేను రెండుసార్లు స్వయంగా భగవద్గీత చదివాను. గీత చాలా అద్భుతమైన గ్రంథం. కానీ ఈ అంశం పై నేను చెప్పలేను. నేను మహాభారతం అంతా చదివాను. చాలా ఉన్నతమైన తాత్వికగ్రంథం అని నమ్ముతాను. బహుశా... దీనిపై నిర్ణయం తీసుకోవలసింది సామాజిక, తత్వవేత్తలు. సత్యమేవజయతే వెనుక ఉన్న సంకల్పం? ఆమిర్: మన సమాజాన్ని ప్రతిబింబించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. వీలైతే దానివల్ల కొంత మార్పు వస్తుందన్న ఆశ. హీరోకన్నా హీరోయిన్ పొడుగ్గా ఉంటే సినిమా సూపర్‌హిట్ అనే నమ్మకం ఉంది. నిజమా ఆమిర్? ఆమిర్: వావ్! అవునా? అందుకేనేమో - నా సినిమాలన్నీ హిట్టయ్యాయి (నవ్వుతూ) అనుష్క: నేను ఆమిర్ కంటే పొడుగు కాబట్టి పీకే ఖచ్చితంగా హిట్!! -
దోస్త్.. మేరా దోస్త్!
బాలీవుడ్లో ఖాన్ త్రయం ఇప్పుడు స్నేహ గీతికలు ఆలపిస్తోంది. నిన్నమొన్నటి దాకా కొట్టుకుని మళ్లీ ఒకటైన షారూఖ్- సల్మాన్లిద్దరూ ఒకరి కోసం ఒకరన్నట్టుగా తిరిగేస్తున్నారు. వీళ్లిద్దరితో పాటు ఆమిర్‌ఖాన్ జతవడంతో... జోష్‌కు అంతే లేకుండా పోతోంది. సల్మాన్ చెల్లి అర్పిత పెళ్లి దగ్గరి నుంచే సీన్ ఇలా మారిపోయింది. ఇటీవల ఓ టీవీ షోలో అంతా కలసి ‘టవల్ డ్యాన్స్’ చేసేసి హుషారెత్తించేశారు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే... తన రాబోయే చిత్రం ‘పీకే’ తొలి కాపీని షారూఖ్, సల్మాన్‌లకు చూపాలని ఉబలాటపడుతున్నాడట ఆమిర్. ప్రొడక్షన్ టీమ్ ఇందుకోసం ఏర్పాటు చేస్తోందట. దోస్తుల ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవాలని ఆమిర్ కూడా ఆతృతగా ఉన్నాడట. -
రజనీ రోల్ ఆమిర్‌కు!
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం ‘పీకే’ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగానే మరో ఆఫర్‌కు ఓకే చెప్పాడట. అది కూడా రజనీకాంత్ ‘రోబో’కు సీక్వెల్! సూపర్ డెరైక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ ‘రోబో 2’కు తొలుత రజనీనే అనుకున్నా... ఎందుకో ఆ ప్రతిపాదన ఓకే కాలేదు. అయితే ఆమిర్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ న్యూస్. ‘రోబో’లో బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ కథానాయిక. మరి సీక్వెల్లో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
ఆమిర్‌ఖాన్ బాధ!
‘నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయుం తీసుకున్నప్పుడల్లా... అందరూ దాన్ని తప్పుగా చూసేవారే గానీ... మద్దతిచ్చేవారే లేరు’ అంటూ తెగ బాధపడిపోతున్నాడు సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్. ‘నాకిదో బాధాకరమైన పరిస్థితి. ఎప్పుడే కీలక నిర్ణయుం తీసుకున్నా... నువ్వు తప్పు చేస్తున్నావంటూ హెచ్చరిస్తారు. నాకు దగ్గరవారు,ముఖ్యమైనవారు... అందరిదీ ఇదే వూట. అయితే ఎవరేం చెప్పినా వింటా. తరువాత నా మనసేం చెబితే అదే చేస్తా. 25 ఏళ్ల విజయువంతమైన కెరీర్లో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకొంటే... ఎంతో సంతోషం కలుగుతుంది’ అంటూ ఓ సెమినార్లో చెప్పుకొచ్చాడు ఆమిర్. -
సత్యమే
సత్యమే ఆమిర్‌ఖాన్ నిర్వహిస్తున్న సత్యమేవ జయతే కార్యక్రమంలో ‘చెత్త’ గురించి ప్రత్యేకంగా ఎపిసోడ్ చేసి చూపించారు. మన దేశంలో చెత్త నిర్వహణే ‘చెత్త’గా ఉందని చెప్పి అందరినీ ఆలోచింపజేశారు ఆమిర్. ఇంట్లోని చెత్తని ఎలా వేరుచేసి ఉపయోగించాలో పాఠ్యపుస్తకాల ద్వారా చిన్నతనంలో తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరంగా బోధించారు. చెత్తతో బయోగ్యాస్ ఎలా తయారుచేయాలో, వెర్మీ కంపోస్ట్‌గా ఎలా ఉపయోగించుకోవాలో క్లాస్‌రూమ్‌లలో తెలియజేయడం వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరికీ దాని అవసరం గురించి, విధానం గురించి సులువుగా తెలుస్తుందని చెప్పాడు. ఈరోజు పర్యావరణానికి ముప్పు వస్తుందని చెప్పి ఉన్నట్టుండి చెత్త గురించి బోధనలు మొదలుపెడితే సాధారణ మహిళకు ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. పరిశుభ్రత ఇంటి నుంచే మొదలవ్వాలనీ, మన ఇంటి చెత్త ప్రపంచానికి ముప్పు కాకూడదనీ హితవుచెప్పి ముగించారు. ఈ ఎపిసోడ్‌కి వీక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. -
అమితాబ్, ఆమిర్, సచిన్ ఉపాధి కూలీలు!
గోవాలో పక్కదారి పట్టిన ఉపాధి హామీ పథకం జాబితాలో బాలీవుడ్, క్రికెట్ స్టార్స్ పనాజీ: వారంతా బాలీవుడ్ సెలబ్రిటీలు.. క్రికెట్ స్టార్స్.. కానీ వారికి తినడానికి తిండి కూడా లేదట. అందుకే ఉపాధి హామీ పథకంలో కూలీలుగా చేరారట. బాలీవుడ్ సెలబ్రిటీలు కూలీలుగా చేరడమా అని ఆశ్చర్యపోతున్నారా.. గోవాలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఇదే నిజమని చెపుతోంది. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, ఆమిర్‌ఖాన్, కపిల్‌దేవ్, రాహుల్ ద్రావిడ్, సౌరభ్ గంగూలీ, యువరాజ్‌సింగ్ అంతా ఉపాధి కూలీలే అంటోంది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేరు కూడా ఉండటం గమనార్హం. గోవాలో ఉపాధి హామీ పథకం అమలులో అవకతవకలను స్వచ్ఛంద సంస్థ గోవా పరివర్తన్ మంచ్(జీపీఎం) శనివారం బట్టబయలు చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా గోవా గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి ఈ వివరాలు సేకరించిన జీపీఎం.. యూపీఏ ప్రభుత్వం ప్రధాన ప్రచారాస్త్రంగా చెప్పుకుంటున్న ఉపాధిహామీలో నిధులు ఎలా పక్కదారి పడుతున్నాయో వెల్లడించింది. బోగస్ లబ్దిదారుల పేరుతో నిధులు ఎలా కొల్లగొట్టారో లెక్కలతో సహా బయటపెట్టింది. స్థానిక ఛింబల్ ప్రాంతంలో కూలీల మార్కెట్లో సుమారు వెయ్యి మందికిపైగా ఉపాధి హామీ లబ్దిదారులు ఉన్నారు. ఈ జాబితాను ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించిన జీపీఎం అందులో బాలీవుడ్.. క్రికెట్ సెలబ్రిటీల పేర్లు ఉండటాన్ని గుర్తించింది. రోజుకు రూ. వంద చొప్పున.. 150 రోజులకు సెలబ్రిటీలకు కూలీ చెల్లించారని, అలాగే వీరి భార్యలు, పిల్లల పేర్లపై సైతం చెల్లించినట్టు లెక్కలు చూపారు. అమితాబ్ బచ్చన్ మొత్తం కుటుంబం, సచిన్‌తో పాటు ఆయన భార్య అంజలి, ఇద్దరు పిల్లలు, ద్రవిడ్‌తో పాటు ఆయన భార్య, కుమారుడు, యువరాజ్‌సింగ్, రికీ పాంటింగ్ ఫ్యామిలీలు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. గోవాలో ఉపాధి హామీ అమలులో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపి.. అక్రమార్కులపై చర ్యలు తీసుకోవాలని జీపీఎం కన్వీనర్ యతీష్ నాయక్ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై శనివారం జీపీఎం ప్రతినిధి బృందం గోవా గవర్నర్ బీవీ వాంచూను కలసి విచారణకు ఆదేశించాల్సిందిగా కోరింది. -
ఒకరికి మిస్సు...మరొకరికి ప్లస్సు..!
మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉండాలంటారు. అలాగే, ఏ పాత్ర ఎవరికి దక్కాలో కూడా ముందే రాసి ఉంటుందేమో. ఒక హీరో... ఫ్లాప్ అవుతుందని వదులుకున్న సినిమాలో మరో హీరో నటించి, హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. ‘డర్’... షారుక్ ఖాన్‌లోని మరో కోణం చూపించిన చిత్రం. ‘3 ఇడియట్స్’... ఆమిర్‌ఖాన్ కెరీర్లో మైలురాయిలాంటి సినిమా. కుడి ఎడమైతే అన్నట్లు.. వాస్తవానికి ‘డర్’లో ఆమిర్ నటించాల్సింది. కానీ, వర్కవుట్ కాదమోనని వదులుకున్నారు. ‘3 ఇడియట్స్’ మీద అదే ఫీలింగ్‌తో షారుక్ తిరస్కరించారు. ఇలాంటి సువర్ణావకాశాలను వదులుకున్న బాలీవుడ్ తారలు చాలామందే ఉన్నారు. వాళ్లల్లో ప్రధానంగా కొంతమంది గురించి చెప్పుకోవాలి. ఆ తారలు తిరస్కరించిన చిత్రాలేంటి? వాళ్లు వదులుకున్న కారణంగా లాభపడిన ఇతర తారలెవరు?... ఆ విషయాల్లోకి ఓ లుక్కేద్దాం... ఆమిర్‌కి భయం వేసింది! ‘డర్’ అంటే భయం అని అర్థం. బాలీవుడ్ అగ్రదర్శకుడు యశ్ చోప్రా సొంత సినిమా ఇది. ఇందులో నెగటివ్ షేడ్ ఉన్న లీడ్ రోల్‌కి ముందుగా ఆమిర్ ఖాన్నే తీసుకోవాలనుకున్నారు యశ్ చోప్రా. కానీ, ఈ పాత్ర తనకు సూట్ కాదనో లేక కథ మీద నమ్మకం కుదరకో ఆమిర్ తిరస్కరించారు. ఆయన అనుమానం, భయం షారుక్‌కి వరం అయ్యాయి. ఆమిర్ కాదనడంతో అప్పటికే ‘బాజీగర్’లో నెగటివ్ టచ్ ఉన్న కేరక్టర్ చేసిన షారుక్‌ని తీసుకున్నారు యశ్. ఈ సినిమా షారుక్ కెరీర్‌ని టర్న్ చేసింది. సో.. ఈ సినిమా విషయంలో తన జడ్జిమెంట్ తప్పినందుకు ఆమిర్ తనని తాను నిందించుకునే ఉంటారు. షారుక్‌కి మూడు షాక్‌లు! ఆమిర్ వదులుకున్న ‘డర్’ని వదులుకుని, జడ్జిమెంట్ విషయంలో ఫుల్ మార్కులు కొట్టేసిన షారుక్ ఖాన్, మూడు సినిమాలను అంచనా వేయడంలో విఫలమవ్వడం విశేషం. భారతదేశం గర్వించదగ్గ చిత్రాల్లో ‘లగాన్’ ఒకటనడం అతిశయోక్తి కాదు. ఇందులో హీరోగా నటించే అవకాశం ముందు షారుక్‌నే వరించింది. చిత్రదర్శకుడు అశుతోష్ గోవార్కర్ కథ రాసుకున్నప్పుడే షారుక్‌ని అనుకున్నారట. కానీ, ఈ బాలీవుడ్ బాద్షాకి ‘లగాన్’ కథ మీద నమ్మకం కుదరక సినిమా చేయడం కుదరదన్నారు. దాంతో ఆమిర్‌ఖాన్‌ని కలిశారు. ఈ సినిమా తర్వాత మరో గోల్డెన్ చాన్స్‌ని కూడా వదులుకున్నారు షారుక్. అదే ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’. సంజయ్ దత్ నటించిన ఈ చిత్రం నవ్వుల పువ్వులు పూయించడంతో పాటు పెద్ద హిట్టయ్యింది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలు రాజ్‌కుమార్ హిరానీ, విదు వినోద్ చోప్రాలు ‘మున్నాభాయ్’గా షారుక్ బాగుంటారనుకున్నారు. కానీ, షారుక్ కాదనడంతో సంజయ్ దత్‌ని తీసుకున్నారు. ఆ సినిమా సాధించిన విజయానికి ఇతర భాషలవారి దృష్టి పడటం, తెలుగు, తమిళ్.. ఇలా పలు భాషల్లో రీమేక్ కావడం తెలిసిందే. లడ్డూలాంటి రెండు అవకాశాలను వదులుకున్న షారుక్ మిస్సయిన మూడో మంచి చాన్స్ ‘3 ఇడియట్స్’. ‘మున్నాభాయ్’ని కాదన్నప్పటికీ ఈసారి షారుక్ అంగీకరిస్తాడనే బలమైన నమ్మకంతో ‘3 ఇడియట్స్’ కథతో ఆయన్ని కలిశారు రాజ్‌కుమార్ హిరానీ. టైటిలే తేడాగా ఉంది... ఇదేం సినిమానో అనుకున్నారో ఏమో ఈ చిత్రాన్ని కూడా తిరస్కరించేశారు షారుక్. కట్ చేస్తే.. ఆమిర్ ఆ సినిమా చేయడం, 200 కోట్లు వసూలు చేసిన తొలి హిందీ సినిమాగా రికార్డ్ సృష్టించడం జరిగింది. ఇక, షారుక్ బాధ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. షాహిద్ వల్ల ధనుష్‌కి లాభం చాక్లెట్ బోయ్ ఇమేజ్ ఉన్న షాహిద్ కపూర్ కారణంగా తమిళ హీరో దనుష్ చాలా లాభపడ్డారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ‘రాన్‌జనా’ చిత్రంలో షాహిదే నటించాల్సి ఉంది. షాహిద్‌కి ఆ చిత్రకథ, హీరో పాత్ర నచ్చాయి. కానీ, డేట్స్ లేకపోవడంతో ఆ సినిమా వదులుకున్నారు. సినిమాలో హీరో తమిళ కుర్రాడు కాబట్టి, తమిళ హీరోనే తీసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నారు ఆనంద్. మంచి మాస్ హీరోగా, నటుడిగా ధనుష్‌కి కోలీవుడ్‌లో మంచి పేరు ఉంది. అందుకని తనని తీసుకున్నారు. మొత్తం బాలీవుడ్ అంతా విస్తుపోయేలా ధనుష్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఒకవేళ షాహిద్ అయినా ఆ పాత్ర బాగానే చేసి ఉంటారు. ప్చ్.. డేట్స్ లేక వదులుకున్నారు. ఇక, షాహిద్ వదులుకున్న మరో మంచి అవకాశం ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’. పరిణీతి చోప్రా, వాణీకపూర్ నాయికలుగా నటించారు. కొత్త నాయికల సరసన నటించడానికి ఇష్టపడక షాహిద్ ఈ చిత్రాన్ని వదులుకున్నారనే టాక్ ఉంది. ఆయన అయిష్టమే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి హెల్ప్ అయ్యింది. ‘కై పో చే’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన సుశాంత్ సింగ్‌కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చేసిన ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోగలుగుతాడనే ఇమేజ్ తెచ్చింది. కరీనా వదులుకున్న ఆ నాలుగు సినిమాలు కల్ హో నా హో, హమ్ దిల్ దే చుకే సనమ్, క్వీన్, గోలియోన్ కీ రాసలీలా రామ్-లీలా... ఇలా కరీనా కపూర్ వదులుకున్న సూపర్ హిట్ చిత్రాల జాబితా చాలానే ఉంది. ఈ నాలుగు సినిమాలూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి.. సూపర్ హిట్ మూవీస్‌ని వదులుకున్నందుకు కరీనా ఫీలవుతారా అంటే లేదనే చెప్పాలి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో.. ‘‘నేను ఓ సినిమా వదులుకున్నాననుకోండి.. వేరే హీరోయిన్‌కి అవకాశం ఇచ్చినట్లేగా. నా కారణంగా ఇతర నాయికలు లాభపడటం నాకు ఆనందమే’’ అని కరీనా చెప్పడం విశేషం. కంగనా జాతీయ అవార్డు మిస్సయిందా? రజ్జో, క్వీన్.. ఇలా ఇటీవల కంగనా రనౌత్ చేసిన సినిమాలు ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా తనలో మంచి నటి ఉందని నిరూపించాయి. ఒకవేళ ‘డర్టీ పిక్చర్’ చేసి ఉంటే, ఆమెలో మంచి నటి ఉందని కొంచెం ముందే ప్రేక్షకులకు తెలిసి ఉండేది. కానీ, ‘డర్టీ పిక్చర్’కి నిర్మాత ఏక్తా కపూర్ అడిగినప్పుడు, సంశయించారట కంగనా. కొన్ని రోజులు ఆలోచించుకుని, చివరికి ‘నో’ అనేశారట. ఆ తర్వాత హోమ్లీ ఇమేజ్ ఉన్న విద్యాబాలన్ ఈ చిత్రాన్ని అంగీకరించడం, నటనాపరంగా విజృంభించడం తెలిసిందే. ఈ సినిమా ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఒకవేళ కంగనా చేసి ఉంటే.. తనను ఆ అవార్డు వరించి ఉండేదేమో. ఇలా చెప్పుకుంటూ పోతే... మంచి సినిమాలను ‘మిస్’కొట్టిన తారల జాబితా చాలానే ఉంటుంది. ఎంతో నమ్మకంతో ఒప్పుకున్న సినిమాలు అపజయం పాలవ్వడం, ఏ అంచనాలూ లేకుండా చేసిన సిని మాలు ఘనవిజయం సాధించడం జరుగుతుంది. అందుకే అంటారు.. సినిమా అనేది ‘లాటరీ’లాంటిదని. -
భారత్-చైనాల మధ్య బాలీవుడ్ వారధి
చైనా సైనికులు మన దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్నా ఆ దేశ సినీ అభిమానులు మాత్రం భారతీయ చిత్రాలను గుండెలకు హత్తుకుంటున్నారు. ముఖ్యంగా పలు బాలీవుడ్ చిత్రాలు చైనీయుల భాషలోకి అనువాదమవుతూ అక్కడ విశేష ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. బాలీవుడ్ చిత్రాల్లోని శృంగారం, భావోద్వేగాలు, హాస్యం, కట్టూ-బొట్టూ చైనీయులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. పలు బాలీవుడ్ పాటలతో చైనీయులు కూనిరాగాలు కూడా తీస్తున్నారు. అంతేనా బాలీవుడ్ పాటలు అక్కడి వేడుకల్లో కూడా హంగామా చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా యువత బాలీవుడ్ సినిమాలను విశేషంగా ఆదరిస్తున్నారని జియాచెన్ ఫాంగ్ అనే సందర్శకురాలు తెలిపింది. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ... ‘రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్’ సినిమా మా భాషలోకి కూడా అనువాదమైంది. ఈ సినిమాకు యువత నుంచి మంచి స్పందన వచ్చింది. నేను కూడా ఆ సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. మరోసారి కూడా చూడాలనుకుంటున్నా. మనసు చెప్పిన మాట వినాలని, మనసుకు నచ్చిందే చేయాలని ఆ సినిమాలో తెలిజెప్పిన తీరు అద్భుతంగా అనిపించింది. ఆమిర్‌ఖాన్ చిత్రాలకు చైనాలో మంచి డిమాండ్ ఉంది. జాన్ అబ్రహాం నటించిన ‘ధన్ ధనా ధన్ గోల్’ కూడా ఎంతగానో నచ్చిందని’ చెప్పింది. క్లాకీ ఝోవ్ అనే మరో యువతి మాట్లాడుతూ.. ‘సంజయ్ దత్ నటించిన ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్’ చిత్రాలు కూడా బాగా ఆడాయి. మున్నాభాయ్ సిరీస్‌లో మూడో చిత్రం కోసం ఎదురుచూస్తున్నా. చాందినీచౌక్ టు చైనా, 3 ఇడియట్స్, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే వంటి సినిమాలు కూడా ఎంతగానో నచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ చిత్రాలతో పోటీపడుతున్నాయ’ని చెప్పింది. మొత్తానికి ఇండియా-చైనాల మధ్య సంబంధాలను బాలీవుడ్ మెరుగుపరుస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమో కళకు అంతటి శక్తి ఉందేమో..! చూద్దాం..!