
సాక్షి, ముంబై : ఇటీవల కన్నుమూసిన లెజెండరీ నటుడు రాజ్‌కపూర్ భార్య కృష్ణరాజ్ కపూర్‌కు బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ బచన్, ఆమిర్ ఖాన్, రాణీ ముఖర్జీ, కరణ్ జోహార్, అలియా భట్ వంటి ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. కాగా కృష్ణరాజ్ కపూర్ ప్రేయర్ మీట్‌లో కరణ్ జోహార్, ఆమిర్ ఖాన్, రాణీ ముఖర్జీలు నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు వీరు ప్రార్ధనా సమావేశంలో ఎందుకు నవ్వుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
నటుల తీరును తప్పుపడుతూ పెద్దసంఖ్యలో కామెంట్లు పోటెత్తాయి. వీరు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారా లేక పార్టీలోనా..? అని కామెంట్ చేశారు. మిస్టర్ ఫర్‌పెక్షనిస్ట్ నుంచి ఇలాంటి దిగజారుడు చర్యను ఊహించలేమని.. షేమ్ అంటూ మరొక నెటిజన్ ఆమిర్‌ఖాన్‌ను ఉద్దేశించి ట్రోల్ చేశారు. రాణీ, కరణ్ జోహార్‌లు సిగ్గుమాలిన పని చేశారు. రాణీ ముఖర్జీ.. ఆదిత్యా చోప్రాను పెళ్లాడటం ఘనంగా భావిస్తోందని..తాము ఆమెను ద్వేషిస్తున్నామని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment