
ఇప్పటికింకా నా వయసు..
‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అనడం లేదు గానీ, తన వయసు ఇప్పటికీ పద్దెనిమిదేనంటున్నాడు ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమిర్ ఖాన్. రేపటితో తనకు యాభయ్యేళ్లు నిండుతున్నాయని, అయినా, మానసికంగా తన వయసు పద్దెనిమిదేళ్లేనని అంటున్నాడు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పాతికేళ్లు పూర్తయినా, కెరీర్‌లో ఇంకా అత్యున్నత శిఖరాలకు చేరుకున్నట్లు తాను భావించడం లేదని చెబుతున్నాడు.