దిస్ ఈజ్ నాట్ కరెక్ట్
కుళ్లు జోకులు తనకు నచ్చవంటున్నారు ఆమిర్‌ఖాన్. తనను ఇంప్రెస్ చేయాలంటే ఎదుటివారిని కించపరచేవి కాకుండా మనస్ఫూర్తిగా నవ్వుకునే జోకులు వేస్తే చాలంటున్నాడీ మిస్టర్ పర్‌ఫెక్ట్. ఇటీవల ఏబీఐ నాకౌట్ ఫీచరింగ్ ఓ వర్గాన్ని కించపరచేలా ఉందంటూ వచ్చిన వార్తలపై అమీర్ పైవిధంగా స్పందించాడు. సదరు కార్యక్రమంలో పాల్గొన్న డెరైక్టర్ కరణ్ జోహార్, నటులు అర్జున్ కపూర్, రణ్‌వీర్ సింగ్ గురించి మాట్లాడటం లేదంటూనే.. ఇలాంటి ప్రోగ్రామ్స్ రూపొందించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని హితవుపలికారు.