mr. perfect
-
థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ ఇది!
‘సంతోషం’, ‘సంబరం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’లతో కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దశరథ్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం - ‘శౌర్య’. మంచు మనోజ్, రెజీనా జంటగా మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. దశరథ్ చెప్పిన ముచ్చట్లు... డిఫరెంట్ లవ్‌స్టోరీ చేయాలని ‘శ్రీ’ చిత్రం నుంచి ప్రయత్నిస్తున్నా. అది ఇప్పటికి కుదిరింది. ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్లో, తల్లితండ్రులు ఒప్పుకోకపోవడం వల్లో ప్రేమకథలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే ‘శౌర్య’లో ఎవరూ ఊహించని ప్రత్యేక కోణం ఉంటుంది. ఇదొక థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ. ఫైట్లుండవు. సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో మనోజ్ రెండు వేర్వేరు పాత్రల్లో నటించాడు. తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ‘శ్రీ’ చిత్రం తర్వాత చాలా కాలానికి మళ్ళీ మనోజ్‌తో చేసిన చిత్రమిది. ఇప్పుడు కూడా తనలో ఎనర్జీ ఏ మాత్రమూ తగ్గలేదు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. నా కెరీర్లో జయాలు, అపజయాలు చూశా. ఆ రెండింటినీ సమానంగా చూడడం వల్లే సంతోషంగా ఉన్నా. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. సినిమాలోని విషయం నచ్చితే ఆదరిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో నాకు కొద్దిమంది స్నేహితులున్నారు. దర్శకుడు వీవీ వినాయక్, హీరోలు మనోజ్, ప్రభాస్, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మంచి స్నేహితులు. సినిమాలతో సంబంధం లేకుండా మేము రెగ్యులర్‌గా కలుస్తుంటాం. ప్రభాస్‌తో తప్పకుండా ఓ చిత్రం చేస్తా. ఆ వివరాలు త్వరలో చెబుతా. -
దిస్ ఈజ్ నాట్ కరెక్ట్
కుళ్లు జోకులు తనకు నచ్చవంటున్నారు ఆమిర్‌ఖాన్. తనను ఇంప్రెస్ చేయాలంటే ఎదుటివారిని కించపరచేవి కాకుండా మనస్ఫూర్తిగా నవ్వుకునే జోకులు వేస్తే చాలంటున్నాడీ మిస్టర్ పర్ఫెక్ట్. ఇటీవల ఏబీఐ నాకౌట్ ఫీచరింగ్ ఓ వర్గాన్ని కించపరచేలా ఉందంటూ వచ్చిన వార్తలపై అమీర్ పైవిధంగా స్పందించాడు. సదరు కార్యక్రమంలో పాల్గొన్న డెరైక్టర్ కరణ్ జోహార్, నటులు అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడటం లేదంటూనే.. ఇలాంటి ప్రోగ్రామ్స్ రూపొందించేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని హితవుపలికారు. -
పదేళ్ల ప్రయాణంలో... అఖిల్ కార్తీక్
-
పదేళ్ల ప్రయాణంలో...
‘‘నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లయ్యింది. ‘దోస్త్, అంజలి ఐ లవ్ యు, ప్రామిస్, అలా, లైఫ్ స్టయిల్’ తదితర చిత్రాల్లో హీరోగా చేశాను. ‘మొగుడ్స్ పెళ్లామ్స్, ఎవడైతే నాకేంటి, రామరామ కృష్ణకృష్ణ, మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాల్లో కీలక పాత్రలు చేశాను’’ అని నటుడు అఖిల్ కార్తీక్ చెప్పారు. నటునిగా దశాబ్ద ప్రయాణం పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఆయన పత్రికల వారితో ముచ్చటించారు. ‘‘ఇన్నేళ్ల ప్రయాణంలో మలుపులూ, మెరుపులూ లేకపోయినా భవిష్యత్తుపై భరోసా ఉంది. కచ్చితంగా ఎప్పటికైనా విజయం సాధిస్తాను. హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధం. ప్రస్తుతం నేను చేస్తున్న ‘తీయని కలవో, క్రిమినల్స్, వేగం’ తదితర చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చి పెడతాయి’’ అని అఖిల్ కార్తీక్ తెలిపారు. -
మిస్టర్ పర్ఫెక్ట్
ఏబీ డివిలియర్స్...దక్షిణాఫ్రికా క్రికెటర్. మన లో చాలామందికి అంతవరకే తెలుసు. కానీ తనో అసాధారణ ఆల్‌రౌండర్ అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. సాధారణంగా ఏ క్రీడాకారుడైనా తాను ఎంచుకున్న క్రీడలో ప్రావీణ్యం సాధించేందుకు తీవ్రంగా చెమటోడుస్తాడు. ప్రొఫెషనల్‌గా మారాలంటే చాలా ఏళ్లు పడుతుంది. ఇక జాతీయ జట్టులో చోటు సంపాదించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. అయితే మనవాడు మాత్రం ఒక్క క్రికెట్లోనే కాదు.. చాలా క్రీడల్లో అందె వేసిన చెయ్యి. ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, రగ్బీ, స్విమ్మింగ్, గోల్ఫ్, బ్యాడ్మింటన్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మిక్కిలి క్రీడల్లో మాంచి ప్రావీణ్యం ఉంది. అంతేకాదు.. అతడు ఆడే ఏ ఆట అయినా తన ప్రతిభతో అందరి మన్ననలు అందుకోవడం ప్రత్యేకత. క్రీడ ఏదైనా బరిలోకి దిగాడంటే మెడలో పతకం పడాల్సిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిలియర్స్ గతంలో చాలా క్రీడల్లో బరిలోకి దిగి అదుర్స్ అనిపించుకున్నాడు. డివిలియర్స్ ఘనతలు క్రికెట్లో ఎదురులేని ఆటగాడు. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడతాడు. కెప్టెన్‌గానూ విజయవంతం. దక్షిణాఫ్రికా హాకీ, ఫుట్‌బాల్ జట్ల సెలక్షన్‌కు షార్ట్‌లిస్ట్‌లో చోటు జూనియర్ రగ్బీ జట్టు కెప్టెన్ బ్యాడ్మింటన్ అండర్-19 చాంపియన్ స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్‌లో ఆరు రికార్డులు. 100మీ. స్విమ్మింగ్‌లో రికార్డు ఇప్పటికీ తన పేరు మీదే ఉంది. టెన్నిస్ ఆటలోనూ దిట్టే గోల్ఫ్ ఆటలోనూ మాంచి ప్రావీణ్యం. -
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్పై మచ్చ!
అమితాబ్ బచ్చన్ అంటే సూపర్‌స్టార్ అని టకీమని చెప్పేస్తాం. మరి ఆమిర్ ఖాన్ గురించి చెప్పమంటే వెంటనే ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని చెప్పేస్తారు. వివాదాలకు, అనవసరపు ప్రచార ఆర్భాటాలకు చాలా దూరంగా ఉన్నట్టు కనపడే ఆమిర్, ‘సత్యమేవ జయతే’ షో చేయడం మొదలుపెట్టిన తర్వాత నీతీ, నిజాయితీకీ చిరునామా అన్నంత ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. అలా ‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమిర్ తన స్వార్థం కోసం ముంబయ్‌లోని బాంద్రాలో నివసిస్తున్నవారిని ఇబ్బందులపాలు చేస్తున్నారనే వార్త వెలుగులోకొచ్చింది. ఆ ఏరియాలో ఆమిర్ పెద్ద బంగ్లా ఒకటి కట్టుకోవాలనుకుంటున్నారట. దాదాపు 20వేల చదరపు అడుగుల్లో భవంతి కట్టించాలన్నది ఆయన ఆలోచన అని సమాచారం. బాంద్రాలోని హౌసింగ్ సొసైటీవారిని సంప్రదించి, అక్కడ నివసిస్తున్నవారిని ఖాళీ చేయాల్సిందిగా కోరారట ఆమిర్. దాంతో ఆ హౌసింగ్ సొసైటీ రంగంలోకి దిగిందని వినికిడి. ఆమిర్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు, ఆ ఏరియా నుంచి మారినా ఫర్వాలేదనుకున్నవాళ్లు తమ ఇళ్లను అమ్మడనికి పచ్చజెండా ఊపారట. కానీ, పమేలా అనే 87ఏళ్ల వృద్ధురాలు, ఆమె కూతురు మాత్రం ఆమిర్‌కి అడ్డం తిరిగారని తెలిసింది. తమను ఒత్తిడి చేస్తున్న హౌసింగ్ సొసైటీపై కేసు కూడా పెట్టారట ఈ తల్లీకూతుళ్లు. ఉత్తమ నటుడిగానే కాకుండా ఉత్తమ లక్షణాలున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఈ విధంగా చేయడం చాలామందిని షాక్‌కి గురి చేసింది. ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ ఇలా చేయడం తగదని చెప్పుకుంటున్నారు. -
అమ్మాయిల జోలికి పోనంటున్న నితిన్
-
లేటైనా లేటెస్ట్ ఛాన్స్
తాప్పీ ఇప్పటికి పదమూడు సినిమాల్లో నటించింది. అందులో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సూపర్‌హిట్. గుండెల్లో గోదారి, సాహసం ఏవరేజ్. మిగిలినవన్నీ పరాజయాలే. అయినా... క్షణం తీరిక లేకుండా ఉన్నారు తాప్సీ. జయాపజయాలకు అతీతంగా కెరీర్‌ను సాగిస్తున్నారామె. బాలీవుడ్లో ఆమె నటించిన ‘చష్మే బద్దూర్’ చిత్రం మంచి కామెడీ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో అవకాశాలు పోటెత్తుతాయి అనుకున్న తాప్సీకి అక్కడ కూడా నిరాశే మిగిలింది. అయితే... రీసెంట్గా ఈ ఢిల్లీభామకు ఓ మంచి బాలీవుడ్ ఆఫర్ తలుపుతట్టింది. బాలీవుడ్ సూపర్‌హిట్ ‘విక్కీడోనర్’ దర్శకుడు సూజిత్ సర్కార్ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయికగా ఎంపికయ్యారు. ‘కై పో చే’ ఫేం అమిత్ సద్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడు అమిత్ రాయ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో తాప్సీ పాత్ర విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ఈ సినిమాతో పాటు తమిళంలో అజిత్‌కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నారు తాప్సీ. ఇక తెలుగు, తమిళ భాషల్లో లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ముని-3’ ఎలానో ఉంది.