దోస్త్.. మేరా దోస్త్! | .. Mera Dost Dost! | Sakshi
Sakshi News home page

దోస్త్.. మేరా దోస్త్!

Published Sat, Dec 6 2014 12:28 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దోస్త్.. మేరా దోస్త్! - Sakshi

దోస్త్.. మేరా దోస్త్!

బాలీవుడ్‌లో ఖాన్ త్రయం ఇప్పుడు స్నేహ గీతికలు ఆలపిస్తోంది. నిన్నమొన్నటి దాకా కొట్టుకుని మళ్లీ ఒకటైన షారూఖ్- సల్మాన్‌లిద్దరూ ఒకరి కోసం ఒకరన్నట్టుగా తిరిగేస్తున్నారు. వీళ్లిద్దరితో పాటు ఆమిర్‌ఖాన్ జతవడంతో... జోష్‌కు అంతే లేకుండా పోతోంది.

సల్మాన్ చెల్లి అర్పిత పెళ్లి దగ్గరి నుంచే సీన్ ఇలా మారిపోయింది. ఇటీవల ఓ టీవీ షోలో అంతా కలసి ‘టవల్ డ్యాన్స్’ చేసేసి
 హుషారెత్తించేశారు.

ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే... తన రాబోయే చిత్రం ‘పీకే’ తొలి కాపీని షారూఖ్, సల్మాన్‌లకు చూపాలని ఉబలాటపడుతున్నాడట ఆమిర్. ప్రొడక్షన్ టీమ్ ఇందుకోసం ఏర్పాటు చేస్తోందట. దోస్తుల ఫీడ్‌బ్యాక్ తెలుసుకోవాలని ఆమిర్ కూడా ఆతృతగా ఉన్నాడట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement