'నేనే డైరెక్టర్ని అయితే..' | if I would direct a film, I would not act in it: Aamir Khan | Sakshi
Sakshi News home page

'నేనే డైరెక్టర్ని అయితే..'

Published Tue, May 24 2016 2:52 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'నేనే డైరెక్టర్ని అయితే..' - Sakshi

'నేనే డైరెక్టర్ని అయితే..'

ముంబయి: తాను మెగాఫోన్ పడితే ఆ చిత్రంలో ఎట్టి పరిస్థితుల్లో నటించబోనని బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ అన్నారు. ముంబయిలో మామి ఫిల్మ్‌ క్లబ్ ప్రారంభం సందర్భంగా ఆయన దర్శకత్వ బాధ్యతల విషయంలో స్పందించారు.

'ఒక నటుడిగా డైరెక్టర్పై నమ్మకాన్ని కలిగి ఉండాలి. కానీ, నా గత కొన్ని రోజుల్లో కొంతమంది దర్శకులతో పనిచేశాను. కానీ, వారికి నాకు మ్యాచ్ కాలేదు. అందుకే నేను ఇబ్బంది పడ్డాను. అప్పటి నుంచి దర్శకుడిని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాను... ఒక వేళ నేనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి వచ్చినప్పుడు ఆ చిత్రంలో నేను నటించను' అని అమిర్ చెప్పారు. త్వరలోనే దంగల్ అనే చిత్రంతో అమిర్ ఖాన్ ప్రేక్షకులను అలరించనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement