ఆ నటుడు దేశానికి గర్వకారణం | The actor is a matter of pride for the country | Sakshi
Sakshi News home page

ఆ నటుడు దేశానికి గర్వకారణం

Published Sun, Jan 1 2017 11:52 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఆ నటుడు దేశానికి గర్వకారణం - Sakshi

ఆ నటుడు దేశానికి గర్వకారణం

ప్రేక్షకులను పవన్‌కల్యాణ్‌ సర్‌ప్రైజ్‌ చేశారు. సర్‌ప్రైజ్‌ కాకుంటే మరేంటి? ఎప్పుడూ సోషల్‌ మీడియాలో రాజకీయ సామాజిక అంశాలపై స్పందించే పవన్‌కల్యాణ్‌ తొలిసారి ఓ సినిమా గురించి మాట్లాడారు. అదీ కొత్త ఏడాది కానుకగా ఫస్ట్‌ లుక్, మేకింగ్‌ వీడియో రిలీజ్‌ చేసిన ఆయన కొత్త సినిమా ‘కాటమరాయుడు’ గురించి కాదు. ఓ హిందీ సినిమా చూసి ట్విట్టర్‌లో స్పందించారాయన. ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘శనివారం (డిసెంబర్‌ 31న) ‘దంగల్‌ సినిమా చూశా. నా అభిప్రాయం ఏమిటో అందరికీ చెప్పకపోతే నా మనస్సాక్షి ఒప్పుకోదు. మన తరంలో ఆమిర్‌ఖాన్‌ లాంటి నటుడు ఉన్నందుకు దేశమంతా గర్వపడాలి.

‘దంగల్‌’లోని ఆయన నటన ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మనసుల్ని దోచుకుంది. దర్శకుడు నితీశ్‌ తివారీ, మిగతా ప్రధాన పాత్రధారులకు నా శుభాకాంక్షలు. మన దేశంలో కొరవడిన మహిళల సాధికారిత దిశగా పని చేయాల్సిన అవసరం ఉందని ఈ చిత్రం మనందరికీ గుర్తు చేసింది’’ అన్నారు పవన్‌. అన్నట్టు... ‘దంగల్‌’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమిర్‌ఖాన్‌ హైదరాబాద్‌ వచ్చి నప్పుడు ‘‘తెలుగులో మల్టీస్టారర్‌ చేయవలసి వస్తే.. చిరంజీవి లేదా పవన్‌కల్యాణ్‌లతో చేస్తా’’ అన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement