ప్రతిఫలం దక్కింది | Sanya Malhotra opens up about her struggling days as an actor | Sakshi
Sakshi News home page

ప్రతిఫలం దక్కింది

Published Mon, Sep 24 2018 12:32 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Sanya Malhotra opens up about her struggling days as an actor - Sakshi

సన్యా మల్హోత్రా

షూటింగ్‌ లొకేషన్లో స్టార్స్‌కి ఏదో ఒక ఫ్రూట్‌ జ్యూస్, డ్రై ఫ్రూట్స్‌... ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అందిస్తుంటారు. ఇలాంటి సౌకర్యాలు దక్కించుకునే పొజిషన్‌కి రావడానికి చాలా కష్టాలు  పడాలి. ‘‘ఇలా బ్రేక్స్‌ మధ్యలో తినే ఫ్రూట్స్‌ కూడా తినలేని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేదాన్ని’’ అంటూ హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు సన్యా మల్హోత్రా. ‘దంగల్‌’లో ఆమిర్‌ ఖాన్‌ చిన్నకూతురిగా నటించిన ఈ అమ్మాయి వెంటనే గుర్తుకురాక మానదు. ఆ సినిమా తర్వాత విశాల్‌ భరద్వాజ్‌ ‘పటాకా’, ‘బదాయ్‌ హో’ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు.

నటిగా తన స్ట్రగులింగ్‌ డేస్‌ని గుర్తు చేసుకుంటూ – ‘‘యాక్టర్‌ అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఆ కల నెరవేర్చుకునే ప్రయత్నంలో మా పేరెంట్స్‌ బాగా సపోర్ట్‌ చేసేవారు. కానీ మన కాళ్ల మీద మనం నిలబడాలనే మనస్తత్వం నాది. అందుకే వాళ్లని ఊరికే డబ్బులడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇప్పుడంటే అన్ని లగ్జరీలు వస్తున్నాయి కానీ ఆ రోజుల్లో నా దగ్గర ఆపిల్స్‌ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. డ్రై ఫ్రూట్స్‌ అనే ప్రసక్తే లేదు. ఆ స్ట్రగులింగ్‌ డేస్‌ అన్నీ గతం. ప్రస్తుతం నా లక్ష్యాన్ని చేరుకున్నాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది’’ అని పేర్కొన్నారు సన్యా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement