struggling
-
ఆశలు పోయి.. ఆవేదనే మిగిలి..
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లలో, కాలనీల్లో మోకాళ్లలోతు బురద పేరుకుపోయింది. ఎంతగా ఎత్తిపోస్తున్నా తగ్గడం లేదు. బురద, చెత్తాచెదా రం కారణంగా డ్రైనేజీలూ మూసుకుపోయి ఉన్నాయి. ఒక్కపూట తిండి కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం కూడా అల్లాడుతు న్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులెవరూ తమ ప్రాంతాలకు రాలేదని, ఎలాంటి సాయం అందలేదని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. పెద్దతండా, జలగంనగర్, బొక్కల గడ్డ, వెంకటేశ్వర కాలనీలలో పరిశీలించగా.. అంతటా బాధితుల నుంచి ఇదే మాట. ‘‘మాకు ఇక ఏడ్చేందుకూ కన్నీళ్లు కూడా లేవు..’’ అని వెంకటేశ్వర కాలనీలో అక్కి మంగమ్మ వాపోయింది. ‘‘మా ఇళ్లు గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులుగా కట్టుబట్టలతో ఉన్నాం. ఇదేం పాపమో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..’’ అని కె.సరిత, శీలం ప్రియాంక, ఎం.మమత, సత్యమ్మ బావురు మన్నారు. కాలనీ వైపు ఎవరొచ్చినా.. ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశగా చూస్తున్నామని పేర్కొన్నారు.బురద ఎత్తిపోస్తూ.. ఆరోగ్యం దెబ్బతిని..ఇళ్లలో పేరుకున్న బురద ఎత్తిపోస్తూ, సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో చాలా మంది ముంపు బాధితులకు ఎలర్జీలకు లోనయ్యారు. కాళ్లు, చేతులపై పుండ్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ పుండ్లను చూపిస్తూ డి.లలిత, నారాయణమ్మ, రమణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. ఫంగస్ వ్యాధులే దీనికి కారణమని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. డ్రైనేజీలు పూడుకుపోయి.. తీవ్ర దుర్గంధంలో..వరద ప్రభావిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. బురద నిండి నడవడమూ కష్టంగా మారింది. అన్నీ చిన్న చిన్న కాలనీలు కావడంతో కార్పొరేషన్ వాహనాలు రావడం లేదు. అక్కడి పేదలే రాత్రింబవళ్లు బురద ఎత్తిపోస్తున్నారు. వరద వచ్చిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం నిత్యావసరాలు, దుప్పట్లను సరఫరా చేసినా.. అవి సరిపోని పరిస్థితి. బురద, చెత్తాచెదారంతో కాలనీల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే అంటువ్యాధులు వ్యాపిస్తాయని సహాయక శిబిరాల్లోని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా. ఇక్కడి నుంచి రోజూ 300 ట్రాక్టర్ల చెత్తను డంప్‌యార్డ్‌లకు పంపుతున్నామని వరంగల్ నుంచి వచ్చిన శానిటేషన్ సూపర్వైజర్ చందు తెలిపారు.అధికారుల జాడే లేదంటూ..వరదలపై అప్రమత్తం చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. ముంపు తర్వాత కూడా అధికారులెవరూ తమ దగ్గరకు రాలేదని వెంకటేశ్వర కాలనీకి చెందిన పార్వతమ్మ వాపోయారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి సాయం లేదని.. శాంతినగర్‌లోని చుట్టాల ఇంటికెళ్లి తినివస్తున్నామని, ఎన్నాళ్లిలా తింటామని జి.నాగమణి కన్నీళ్లు పెట్టింది. కూలీ పనిచేసే వడ్లకొండ సూరమ్మ మూడుగదుల రేకుల ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటిని చూస్తూ ఆమె కన్నీళ్లుపెడుతూనే ఉంది. తల్లితండ్రి గుండెపోటుతో చనిపోతే ఒక్కడే ఉంటున్న కిరణ్ ఇల్లు కూలిపోయింది. చదువుకున్న సర్టిఫికెట్లు కూడా నీటిపాలై ఆవేదనలో పడిపోయాడు.‘పండుగ’కూ వరద ముంపుఖమ్మం పట్టణం, రూరల్ మండలాలను ముంచేసిన వరద.. ఈసారి వినాయక చవితి పండుగనూ ముంచేసింది. ముంపు కాలనీల్లో ఏటా వీధివీధినా వినా యక విగ్రహాలతో నవరాత్రులను ఘనంగా జరుపు కొనేవారు. కానీ ఈసారి వరదల కలకలంతో పండుగ కళ దూరమైంది. వినాయక విగ్రహాలు, పూజా సామ గ్రి విక్రయించేవారు కూడా నిరాశలో పడిపోయారు. కాలేజీల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో బాధితులు వస్త్రాలు, సామగ్రి ఆరబెట్టుకో వడం కనిపించింది. వరదలకు ముందే కాలనీల ప్రజలు వినాయక విగ్రహాల కోసం ఆర్డర్లు ఇచ్చారని.. అవన్నీ క్యాన్సిల్ అయ్యాయని విగ్రహాల తయారీదా రు హరికుమార్ వాపోయారు.‘పాత సామాన్లు కొంటాం’!కొందరికి అంతులేని ఆవేదన.. మరికొందరికి ఎంతో కొంత ఆశ. ముంపు ప్రాంతాల్లోనివారు వరదల్లో తడి సి, పాడైపోయిన సామగ్రిని ఓ మూలకు పడేస్తున్నా రు. ఈ నేపథ్యంలో పాత సామాన్లు కొనే వారి హడా వుడి పెరిగింది. ఆటో ట్రాలీలకు మైకులు పెట్టుకుని ‘పాత సామాన్లు కొంటాం. విరిగిన వస్తువులు, కుర్చీ లు కొంటాం..’ అంటూ తిరుగుతున్నారు. ఇది చూసి బాధితులు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. -
దిగజారిపోతున్న పుతిన్ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!
Putin's health has always in focus across the world: ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలయ్యాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగాలు వినిపిస్తున్నాయి. తాజాగా.. పుతిన్ విదేశాల్లో ఉంటే మలమూత్రాదులను సైతం మాస్కోలోనే పడేసేలా ఒక బాడీగార్డ్‌ని పెట్టుకున్నాడంటూ ఒక వార్త కూడా హల్ చల్ చేసింది. అనారోగ్యం బయటపడకుండా ఉండేందుకే అలా చేస్తున్నాడంటూ ఫాక్స్ న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది. రష్యా అధ్యక్షుడితో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒలిగార్చ్ ఒకరు.. పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, రెండు మూడేళ్ల కంటే బతకడంటూ ఒక వార్త కథనం కూడా వచ్చింది. వీటన్నింటినీ ధృవీకరించేలా.. రష్యా విక్టరే పరేడ్‌లో దగ్గుతూఉండటం, చలికి తట్టుకోలే దుప్పట్లు వేసుకుని ఉన్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఐతే ఇప్పుడూ తాజాగా క్రెమ్లిన్‌లో జరిగిన ఒక అవార్డుల ప్రధానోత్సవంలో వణుకుతూ కనిపిస్తున్న పుతిన్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రష్యా చిత్ర నిర్మాత నికితా మిఖైలోవ్కు, అధ్యక్షుడు పుతిన్ ‘రష్యన్ ఫెడరేషన్ స్టేట్ ప్రైజ్’ని ప్రదానం చేశారు. ఆపై తర్వాత కనిపించినంత సేపు ఆయన వణుకుతూనే ఉన్నాడు. ఇక పుతిన్ పోడియం వద్ద ప్రసంగిస్తున్న టైంలోనూ.. కాళ్లు వణుకుతున్నట్లు కనిపించాయి. ఎక్కువసేపు అలా నిలబడి మాట్లాడలేక ఇబ్బందికి గురయ్యాడు ఆయన. పుతిన్ వైద్యులు అతని అరోగ్య దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు నుంచోవద్దని సూచించారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఉక్రెయిన్ పై దురాక్రమణ యుద్ధం దిగిన తర్వాత నుంచి ప్రపంచ దృష్టి పుతిన్ ఆరోగ్యం పైనే పడింది. అతను చేసిన దురాగతాలకు తగిన శిక్షపడుతుందంటూ పలు దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. Putin’s legs shaking, he looks unsteady on his feet, fueling more speculation about his health. Video was taken Sunday. pic.twitter.com/TIVfK30tAp — Mike Sington (@MikeSington) June 14, 2022 (చదవండి: ‘తూర్పు’పై రష్యా పట్టు ) -
సందేహాలు తీరేదెలా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఆన్లైన్ విద్యా విధానంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుపై బోధన వ్యవధిని ప్రభుత్వ కాలేజీలు కేవలం అరగంటకే పరిమితం చేశాయి. దీంతో అరకొరగా పాఠం వినడానికే సమయం సరిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ప్రత్యక్ష బోధనలోనైతే పాఠం చెప్పిన వెంటనే ప్రశ్నలు అడిగే వీలుంటుంది. లెక్చరర్లు ప్రధానంగా దీనికే ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థి సృజనాత్మకత ఇక్కడే గుర్తిస్తామని లెక్చరర్లు అంటున్నారు. ఆన్లైన్ క్లాసుల్లో ఎవరి సత్తా ఏంటనేది తెలుసుకునే వీల్లేకుండా పోతోందని కరీంనగర్‌కు చెందిన శేషుకుమార్ అనే లెక్చరర్ చెప్పారు. ‘సందేహాలు, సమాధానాలు’లేకపోతే బోధన అసంపూర్తిగానే ఉన్నట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల నుంచీ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గణితంలో కఠినమైన ఫార్ములాల గురించి లెక్చరర్లతో సంభాషించే అవకాశం ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సవాలక్ష డౌట్లతో పాఠాలు సరిగా అర్థం కావడంలేదని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో చదివే విద్యార్థుల నుంచి ఈ ఫిర్యాదులు తక్కువగా వస్తున్నాయి. పుస్తకాలు మారినా... వాస్తవానికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు, మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పుస్తకాలు మారాయి. విద్యాశాఖ మంత్రి ఈ మధ్యే వీటిని విడుదల చేసినా ప్రభుత్వ కాలేజీలకు పూర్తిస్థాయిలో చేరలేదు. కోవిడ్ కారణంగా ప్రింటింగ్ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. నిజానికి మారిన పుస్తకాలను ముందుగా లెక్చరర్లు చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత విద్యార్థులకు చెప్పాలి. వారి నుంచి అనేక సందేహాలు వస్తుంటాయి. వీటిని మళ్లీ అధ్యయనం చేసి నివృత్తి చేయాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు. విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలైనా ఇంత వరకూ కొత్త పుస్తకాల మొఖమే చూడలేదని, ఇలాంటప్పుడు బోధనలో నాణ్యత ఎలా ఉంటుందని ప్రభుత్వ కాలేజీలు అంటున్నాయి. ఇతర సబ్జెక్టుల విషయంలోనూ ఇదే గందరగోళం కన్పిస్తోంది. పోటీ పరీక్షల కోణంలో విద్యార్థులకు లోతుగా చెప్పేందుకు ముందుగా వారికి ఉన్న సందేహాలను గుర్తించాల్సి ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు. బుర్రకెక్కడం లేదు – అన్విత్ (విద్యార్థి), భద్రాద్రి కొత్తగూడెం ఇంటర్ ఫస్టియర్ ఆన్లైన్ క్లాసులు వింటున్నా. మేథ్స్ విన్నాక అనేక డౌట్స్ వస్తున్నాయి. కొత్త ప్రాబ్లమ్స్ చేయాలంటే కష్టంగా ఉంది. ఎంత ప్రయత్నించినా రావడం లేదు. కాలేజీలో అయితే లెక్చరర్‌ను అడిగి తెలుసుకునే వీలుంటుంది. ఇంత వరకూ ఇంగ్లిష్ బుక్ చూడలేదు – పల్లవి (విద్యార్థి), హన్మకొండ ఇంగ్లిష్ పాత పుస్తకాలు చూశాం. కానీ బుక్ మారింది. కొత్త పుస్తకం చూడలేదు. పాఠాలూ జరగడం లేదు. పుస్తకాలూ అందుబాటులులో లేవు. ఇతర సబ్జెక్టుల్లోనూ డౌట్స్ వస్తున్నాయి. ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఆన్లైన్ క్లాస్ తర్వాత లైన్ కట్ అవుతోంది. బోధకులేరీ? ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు పెరిగాయి. మునుపెన్నడూ లేనివిధంగా లక్షకు పైగా అడ్మిషన్లు వచ్చాయి. అయితే లెక్చరర్ల కొరత వేధిస్తోందని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. రాష్ట్రంలో 405 కాలేజీలుంటే... రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నది కేవలం 751 మంది మాత్రమే. 3,599 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 1,658 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రతీ అకడమిక్ సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్స్ సర్వీసును పొడిగిస్తారు. ఈసారి కొన్ని కోర్టు వివాదాల నేపధ్యంలో ఇంతవరకూ వారికి పొడిగింపు ఇవ్వలేదు. దీంతో 25 శాతం వరకూ లెక్చరర్ల కొరత ప్రభుత్వ కాలేజీల్లో ఉంది. ఇన్ని సమస్యలుంటే విద్యాబోధన సాఫీగా ఎలా సాగుతుందని అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
తెల్లవారుజాము 3 గంటల నుంచే..
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం 3 గంటల నుంచే క్యూలైన్లో నిలబడ్డారు. ఉదయం 10 గంటల వరకు కూడా అధికారులు రాకపోవడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చింది వచ్చినట్లుగానే లారీల్లో నుంచి యూరియా ఖాళీ అయిపోయింది. అయితే చాలామంది మొక్కజొన్న రైతులకు యూరియా అందలేదు. ఇప్పటి వరకు 538 టన్నుల యూరి యా పంపిణీ చేశామని, మరో 150 టన్నులు వస్తే ఈ సీజన్‌కు యూరియా సరిపోతుందని వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. యూరి యా కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. -
సాగు పనులకు కూలీలు దొరకట్లేదు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, నెట్వర్క్: ముందస్తు వర్షాలు కురవడం, ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల్లో నీరు నిల్వ ఉండటంతో పంట సాగుపై రైతన్న భారీ ఆశలు పెట్టుకున్నాడు. నీరు, విత్తనాలు, ఎరువులు ఉన్నా వ్యవసాయ కూలీలు దొరక్క రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. నాట్లు వేయడానికి కూలీ లేక పంట సాగు ఆలస్యం అవుతోంది. పంట వేయడంలో ఆలస్యమైతే సరైన దిగుబడి రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంతూళ్లలో కూలీలు దొరక్కపోతే పక్క ఊర్లకు నుంచి వాహనాల్లో తీసుకొచ్చుకుని, పని అయిపోయాక తిరిగి వాళ్ల ఊర్లలో దించిరావాలి. పైగా కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. తీవ్రత అధికంగా ఉండటంతో ఎక్కువ కూలీ చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఉంది. కూలీల కొరతపై పలు జిల్లాల్లో ఉన్న పరిస్థితులపై ప్రత్యేక కథనం.. ఇతర రాష్ట్రాల కూలీలతో వరినాట్లు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా ఉంది. నాట్లు వేసేందుకు ఒక్కో మహిళా కూలీకి రోజుకు రూ.400 నుంచి రూ.500 చెల్లిస్తున్నారు. కనీసం 10 మంది కూలీల అవసరం ఉంటోందని, ఎకరానికి కనీసం రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఖర్చు వస్తోంది. స్థానికంగా కూలీలు దొరక్కపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలతో వరినాట్లు వేయిస్తున్నారు. మెదక్, హవేలీఘణపురం, నిజాంపేట్ తదితర మండలాల్లో బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలు నాట్లు వేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు డ్రమ్ సీడర్లను వినియోగిస్తున్నారు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో.. నిజామాబాద్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 2,86,160 ఎకరాలు కాగా, 3,82,800 ఎకరాల్లో సాగవుతుందని ప్రతిపాదించారు. ఇప్పటికే 2.95 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. కామారెడ్డిలో సాధారణ వరి విస్తీర్ణం 1.62 లక్షలు కాగా, 2.18 లక్షల ఎకరాల్లో వరి సాగుకు ప్రతిపాదించారు. ఇందులో 1.07 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. వరిసాగు పెరుగుతుండటంతో కూలీల కొరత తీవ్రంగా ఉంది. మాల్తుమ్మెద వ్యవసాయ క్షేత్రంలో వరి నాటుకు కూలీల సమస్య ఉంది. దీంతో జిల్లాలోని రైతులు వరినాటు యంత్రం, పవర్ టిల్లర్ ద్వారా, పొడి దుక్కుల్లో వరి విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరి నాట్లు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి పురుషులు నాట్లు వేస్తున్నారు. యంత్రాల వైపు రైతన్న మొగ్గు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కూలీల కొరత రైతులను వేధిస్తోంది. దీంతో చాలామంది రైతులు యంత్రాలను వినియోగించుకుంటున్నారు. యం త్రాలు నడిపే డ్రైవర్లు కూడా ఏడాదికి లక్ష నుంచి 2 లక్షల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంట దిగుబడి కంటే డ్రైవర్ల వేతనం ఎక్కువగా ఉంటుండటంతో వ్యవసాయ యంత్రాలను గం టల చొప్పున అద్దెకు తెచ్చుకుంటున్నారు. చత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి కూలీలను 30 రోజులకు ఒ ప్పందం చేసుకుని పనులు చేయించుకుంటున్నారు. సాగుపై కూలీ భారం.. ఇటీవల వర్షాలు పడటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ అయిపోయారు. ఒకేసారి పనులు ఊపందుకోవడంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. సాధారణంగా రూ.200 నుంచి రూ.300 వరకు ఒకరోజు కూలీ ఉంటుంది. ప్రస్తుతం కూలీల కొరతతో రూ.500 నుంచి రూ.700 వరకు చెల్లించాల్సి వస్తోంది. కూలీల రవాణా చార్జీలు కూడా రైతులే చెల్లిస్తున్నారు. కూలీల కొరత కారణంగా డ్రమ్ సీడర్ విధానానికి రైతులు మొగ్గుచూపుతున్నారు. దీనిపై అవగాహన లేక ఆపరేట్ చేయడానికి తమిళనాడు నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. నాగర్‌కర్నూలులో ఇబ్బందులు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూలీల కొరత పెద్దగా లేదు. నాగర్‌కర్నూల్ జిల్లా మారుమూల ప్రాంతం కావడంతో అక్కడి రైతులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. పక్క మండలాల నుంచి ఒక్కో కూలీకి రూ.400–500 చెల్లించి రప్పించుకుంటున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తికి సంబంధించి క్రాసింగ్ చేసేందుకు కర్ణాటక నుంచి కూలీలను పిలిపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వరి నారుమడుల దశలో ఉండటంతో మరో 10–15 రోజుల్లో కూలీల అవసరం ఏర్పడనుంది. మహిళకు రూ.400.. పురుషులకు రూ.700 గతంలో వ్యవసాయ పొలాల్లో పనిచేయడానికి మహిళలకు రూ.200, పురుషులకు రూ.400 కూలీ ఇచ్చేవారు. ప్రసుత్తం ఆడవారికి రూ.400, మగవారికి రూ.700 నుంచి వెయ్యి వరకు ఇవ్వాల్సి వస్తోంది. కాగా, కూలీలు దొరక్కపోవడంతో ఎకరానికి ఇంత అని రైతులు గంపగుత్తగా ఇస్తున్నారు. గంపగుత్తగా ఇవ్వడం ద్వారాæ పని త్వరగా అవుతుందని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ పనులకు గ్రా మాల్లో ట్రాక్టర్లకు భలే డిమాండ్ ఏర్పడింది. ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చినా ట్రాక్టర్లు దొరకట్లేదు. కూలీలు దొరకట్లేదు.. మా గ్రామంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. పంటల్లో కలుపు తీయడానికి, ఇతర పనులకు ఇబ్బందులు పడుతున్నాం. కూలీల రేట్లు పెరగడంతో పాటు దూరప్రాంతాల నుంచి తీసుకురావడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకా మాకు యంత్రాల వినియోగం అలవాటు కాలేదు. – రేగుల రవి, రైతు, అక్కంపేట, ఆత్మకూరు, వరంగల్ రూరల్ జిల్లా మోయలేని భారం.. మా దగ్గర కూలీల కొరత బాగా ఉంది. మా ఊర్లో ఉపాధి పనులకు వెళ్తుండటంతో వ్యవసాయ పనులకు దొరకట్లేదు. వరంగల్ నుంచి కూలీలు వస్తున్నారు. వీరికి రూ.200తో పాటు రవాణా ఖర్చులు ఇవ్వాల్సి వస్తోంది. – ఉప్పుల సుదర్శన్, రైతు, ఆత్మకూరు, వరంగల్ రూరల్ జిల్లా రోజుకు వెయ్యి ఇస్తున్నారు.. మాది ఉత్తరప్రదేశ్‌లోని బలిమి జిల్లా. మాకు అక్కడ పెద్దగా పనిలేదు. జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చినం. నాట్లు వేస్తే రోజుకు రూ.వెయ్యి కూలీ గిట్టుబాటవుతంది. భార్యాపిల్లలు అక్కడే ఉన్నరు. ఉదయం వంట చేసుకొని 6 గంటలకు నాటు వేయడానికి పొలానికి వెళ్తానం. – ప్రేమ్‌దాస్, ఉత్తరప్రదేశ్ కూలీ డ్రమ్ సీడర్‌తో.. పెద్దపల్లి జిల్లాలో 2,93,441 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా.. అందులో 2,05,089 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. వరి సాగు అధికంగా ఉండటం, వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో నాట్లు వేగం పుంజుకున్నాయి. దీంతో కూలీల కొరత రైతులను వేధిస్తోంది. జిల్లాలో కొందరు వెదజల్లే పద్ధతి, డ్రమ్‌సీడర్ సాయంతో నాట్లు వేస్తున్నారు. ఓదెల మండలంలో కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలతో వరినాట్లు వేయిస్తున్నారు. -
సంబురం ఆవిరి
సాక్షి, హైదరాబాద్: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి పండుగ సంబరాన్ని ఆవిరి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి భయం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు అనూహ్యంగా పెరగడం.. ఇటీవలి వరదలు, పంట నష్టంతో ఆదాయం తగ్గడంతో పండుగ సంతోషం కాస్తా పటాపంచలవుతోంది. చేతిలో చిల్లిగవ్వ కరువు కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే పట్టణ, గ్రామీణ ప్రాంత పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలపై పెను ప్రభావాన్ని చూపింది. వ్యాపార లావాదేవీలు తగ్గడం, జీతభత్యాలు, ఉద్యోగాల్లో కోతలు సామాన్యుడి నడ్డి విరిచాయి. మార్చి – ఆగస్టు మధ్య కాలంలో 84 శాతం కుటుంబాలు ఆదాయాన్ని కోల్పోవడం లేదా తగ్గుదలను ఎదుర్కొంటున్నాయని జాతీయ సర్వేలు అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా పట్టణ జనాభాలో కనీసం 13.9 కోట్ల మంది కరోనా విపత్తు నేపథ్యంలో పొదుపు (సేవింగ్స్)ను పూర్తిగా మరిచిపోయాయని ఈ సర్వేలు పేర్కొన్నాయి. దీన్నుంచి కోలుకుంటున్న సమయంలోనే భారీ వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికితోడు వరి, మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో కొనుగోళ్లు జరగక చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి ఎదురైంది. ఇక హైదరాబాద్, వరంగల్ వంటి పట్టణాల్లో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. వీటి నుంచి తేరుకుంటున్న సమయంలోనే పెరుగుతున్న ధరలు మరింత కలవరపెడుతున్నాయి. పప్పులుడకట్లే.. సామాన్యులకు పప్పన్నమూ కరువవుతోంది. లాక్డౌన్ అనంతరం ఒక్కసారిగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. ప్రస్తుత సాధారణ పరిస్థితుల్లోనూ కిలో రూ.100కి తగ్గకుండా పలుకుతున్నాయి. దిగిరానంటున్న ధరలతో వంటింట్లో పప్పులుడకట్లేదు. విదేశీ దిగుమతులు తగ్గడం, దేశీయంగా పప్పుల దిగుబడులు తగ్గడంతో ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు. లాక్డౌన్ ముందువరకు కంది, పెసర, మినపపప్పుల ధరలు కిలో రూ.100కి తక్కువగా ఉన్నా.. ఆ తరువాత ధర రూ.100కి ఎగబాకింది. ప్రస్తుతం మార్కెట్లో మేలు రకం కందిపప్పు కిలో రూ.110– 115 మధ్య ఉంది. గతేడాది ఇదే సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే కనిష్టంగా రూ.20 మేర ఎక్కువ. గ్రేడ్–2 రకం కిలో రూ.90–100 పలుకుతోంది. పెసర, మినపపప్పు ధరలూ రూ.105–110 వరకు ఉన్నాయి. వీటి ధరలు గతేడాదితో పోల్చినా రూ.25 మేర పెరిగాయి. కాగుతున్న నూనెలు.. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, అందుకు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో నూనెల ధరలు అమాంతం పెరిగాయి. లాక్‌డౌన్‌కు ముందు సన్‌ఫ్లవర్ లీటర్ ధర హోల్‌సేల్‌లో రూ.100 ఉండగా, ప్రస్తుతం హోల్‌సేల్‌లోనే రూ.115 పలుకుతోంది. ఇది వినియోగదారుడికి రిటైల్‌లో రూ.120కి చేరుతోంది. ఇది గతేడాది ధరలతో పోలిస్తే ఏకంగా రూ.30 మేర ఎక్కువ. సామాన్యులు అధికంగా వినియోగించే పామాయిల్.. గతేడాది సెప్టెంబర్‌లో రిటైల్‌లో రూ.85 ఉండగా, ప్రస్తుతం రూ.100కి చేరింది. ఇక వేరుశనగ నూనె ధర సైతం గతేడాది రూ.120 ఉండగా, రూ.150కి చేరింది. ఉల్లి కిలో రూ.100 కిలో రూ.50గా ఉన్న ఉల్లి ధర వారం వ్యవధిలో ప్రస్తుతం రూ.100కి చేరింది. ఉల్లి ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పంటలు దెబ్బతిని, దిగుబడి తగ్గిపోవడం, డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలకు కళ్లెంవేసే చర్యలేవీ లేకపోవడంతో ఇప్పట్లో దిగివచ్చేలా లేవు. ఇక టమాటాదీ అదే పరిస్థితి. దీని సాగు రాష్ట్రంలో తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలతో పంట దెబ్బతినడంతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.50–60 పలుకుతోంది. వీటితో పాటే వంకాయ, ఆలుగడ్డ, బీరకాయ ధరలు రూ.60–70 పలుకుతుండటంతో సామాన్యులు ఏం కొనే పరిస్థితి కనిపించట్లేదు. -
కొరియో‘గ్రాఫ్’ పడిపోయింది !
ఆడిందే ఆట.. పాడిందే పాట బ్రేక్డ్యాన్సు.. షేక్ డ్యాన్సు.. మిక్స్ చేస్తే బ్రేషే డ్యాన్సు లేదంటే బెల్లీ.. గిల్లీ.. పేరు ఏదైనా డీజే మ్యూజిక్ ప్లే అయితే కాళ్లు, చేతులకు కరెంటు పెట్టినట్లు యమ స్పీడ్‌గా కదులుతాయి చూసేవాళ్లకు కనుల విందు వారిని చూస్తుంటే డ్యాన్సర్లకు పసందు అయితే వారేవా.. అంటూ మోగే చప్పట్లకు ఇప్పుడు లాక్డౌన్ పడింది కొరియోగ్రాఫర్ల ఉపాధి గ్రాఫ్‌కు గండి పడింది! ఇప్పుడు ఓన్లీ ఆడియో ప్లే అవుతోంది వీడియో ఎప్పటికి రిలీజ్ అవుతుందో.. ఈ కళాకారులకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుందో!!! ఒంగోలు మెట్రో: గతంలో పెళ్లో మరేదో శుభకార్యమో అయితే అర్కె్రస్టాతో నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. డ్యాన్సర్లు ఓ టీంగ్గా ఏర్పడి ఈవెంట్లు చేయడం నడుస్తోంది. ఇలాంటి వారు నృత్యాలు చేసి కూలీతో పొట్టపోసుకుంటారు. అయితే లాక్డౌన్ వల్ల గడచిన మూడు నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో ఉపాధి లేక కొరియోగ్రాఫర్లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని నాలుగు డివిజన్లలో వివిధ డ్యాన్స్ ట్రూపులు, గ్రూపుల్లో దాదాపు వెయ్యిమందికి పైగా డ్యాన్సర్లు ఉన్నారు. ఒంగోలులోనే 120 మంది వరకూ ఉన్నారు. ఈవెంట్స్ సమయాల్లో సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటుంటారు. వేర్వేరు తరగతుల నుంచి డ్రాపవుట్లుగా మారి, ఉన్న కొద్దిపాటి అర్హతలకు ఏ ఉద్యోగమూ రాక తమకు వచ్చిన కళతో ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలో కొందరు తెలివైన వాళ్లు ‘ఈవెంట్ మేనేజ్మెంట్’ సంస్థలు ఏర్పాటు చేసుకుని చిన్నా చితకా డ్యాన్సర్లను ఏకం చేసి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వచ్చే డబ్బులో ఒక్కో డ్యాన్సర్‌కు రు. 500 వరకు ఇస్తారు. పెళ్లి ఫంక్షన్లు, రిసెప్షన్లు తదితర పలు కార్యక్రమాల ఆధారంగా వీరు జీవనం సజావుగా సాగేది. అయితే మార్చి రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా మొదలైన లాక్డౌన్ వీరి పాలిట శాపంగా మారింది. చేద్దామంలే కూలి పనుల్లేక, పోదామంటే ఈవెంట్స్ లేక కష్టాల సుడిగుండంలో బతుకులీడుస్తున్నారు. కళాకారుల పట్ల ఉదారంగా ఉండి ఆదుకుంటున్న అనేక సేవా సంస్థలు వీరి ఊసే మరచిపోయాయి. కళాకారుల గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అన్ని వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటున్నట్టుగానే తమనూ ఆదుకోవాలని కోరుతున్నారు. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోషియేషన్ ప్రతినిధుల కోసం 9391781212 నంబర్‌ను సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నా డ్యాన్స్ కార్యక్రమాలు లేక కూలీకి వెళ్లాను, అక్కడ కాలుజారి పడిపోయాను. వెన్నెముక సమస్యతో ఇబ్బందులు పడుతున్నా. ప్రభుత్వం దయతో ఆదుకోవాలని విన్నవించుకుంటున్నా. -రఘునాథ్ జగనన్నకు రుణపడి ఉంటాం.. ప్రభుత్వానికి సంబధించి అనేక ఈవెంట్స్ నిర్వహించాం. డ్యాన్స్ ద్వారా ఉపాధి పొందుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు అవస్థలు పడుతున్నాం. అన్ని వర్గాల పేద ప్రజలను జగనన్న ఆదుకుంటున్నారు. అలాగే డ్యాన్సర్లుగా ఉపాధి పొందుతున్న మమ్మల్ని ఆదుకుంటే జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – సురేష్ ఆరిగ ప్రభుత్వం ఆదుకోవాలి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార సందర్భాల్లో కూడా మేము ఈవెంట్స్ నిర్వహించాం. అన్ని వర్గాల్లోని పేదలను ఆదుకుంటున్న మాదిరిగానే ప్రభత్వం మమ్మల్ని కూడా ఆదుకుని కాపాడాలి. -వరుణ్ -
కార్మికుల క్యాంపులో కరోనా సెగ!
మోర్తాడ్ (బాల్కొండ): గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలుగు కార్మికులు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న తమ ఆరోగ్యం గురించి కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికు లు వాపోతున్నారు. యూఏఈలోని దుబాయ్‌లోని అజ్మాన్ క్యాంపులో 40 మంది తెలుగు కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా నిజామాబాద్, జగిత్యా ల, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారే. దుబాయ్‌లో ని బెల్ హాసా కంపెనీ వలస కార్మికులను నియమించుకుని ఆస్పత్రిలో రోగులకు సేవలు అందించడానికి తరలిస్తుంది. రోగులకు సేవలు అందించే కార్మికులను అక్కడ మెసెంజర్లుగా పిలుస్తారు. రోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు తీసుకెళ్లడం.. మృతదేహాలను మార్చురీకి తరలించడం ఈ మెసెంజర్ల బాధ్యత. దుబాయ్‌లోని అల్ ఖస్సిమి ఆస్పత్రిలో కరోనా బారినపడిన వారి సంఖ్య ఎక్కు వే ఉంది. అయితే.. కరోనా రోగులకు సేవలు అందిస్తున్న కార్మికులకు కేవలం మాస్కులు మాత్రమే అందించారు. దీంతో కొందరి ఆరోగ్యం దెబ్బతినడం.. 10 మంది కార్మికులకు కరోనా లక్షణాలు ఉ న్నట్లు తేలడంతో వారికి మెరుగైన వైద్యం అందించకుండా, క్యాంపులోని ఒక గదిలో సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. ఒకే కాంపౌండ్‌లో క్వారంటైన్లో ఉన్న వీరి తో పాటు ఇతర కార్మికులను ఉంచడంతో అక్కడి తెలుగు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కం పెనీ యాజమాన్యం తీరును ఆక్షేపిస్తూ కార్మికులు వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా గోడును వెళ్లబోసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి యూఏఈలోని మన విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడాలని వారు కోరుతున్నారు. -
హాయ్.. చిన్నారీ
లాక్డౌన్లో కాలూచెయ్యీ ఆడదు. ఆటిజం పిల్లలున్న తల్లిదండ్రులకు మాత్రం ఆ తేడా తెలియదు! ఆ చిన్నారుల శిక్షణ, సంరక్షణల కోసం వాళ్లెప్పుడూ.. లాక్డౌన్లో ఉన్నట్లే ఉంటారు. శిక్షణ కొనసాగింపు మాత్రమే ఇప్పుడు వారి సమస్య. ఆ సమస్యకు హారిక మంచి పరిష్కారం కనిపెట్టారు. ఆటిజం ఉన్న పిల్లలను ప్రత్యేక పాఠశాలలకు పంపుతూ వస్తున్న తల్లిదండ్రులకు ఈ ‘లాక్డౌన్’ సమయంలో ఆ పిల్లల్ని చూసుకోవడం పెద్ద సవాల్ అవుతోంది. అలాంటి తల్లిదండ్రులకు, వారి పిల్లలకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు ఆటిజం చికిత్సా నిపుణురాలు పట్లోళ్ల హారికారెడ్డి. ‘స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్’ కోసం హైదరాబాద్ అత్తాపూర్‌లో ఉన్న యాదా ఎబిఎ సెంటర్లో నిపుణురాలిగా ఉన్న హారిక సైకాలజీలో ఎమ్మెస్సీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని సైకాలజీ విభాగంలో ఆటిజం ముఖ్యాంశంగా రెండేళ్ల కోర్సు చేసి వచ్చాక గత ఐదేళ్లుగా ఆటిజం ఉన్న చిన్నారులను సాధారణ స్థితికి తెచ్చేందుకు వారికి, వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడినా ఆటిజం పిల్లల మానసిక స్థితిని మెరుగు పరిచేందుకు, అదే సమయంలో తల్లిదండ్రులకు ఆలంబనగా నిలిచేందుకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన సాక్షితో ముచ్చటించారు. పిల్లలకు.. పెద్దలకూ ‘‘ఆటిజం ఉన్న పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. వాళ్లంతట వాళ్లు ఆడుకోలేరు. తినలేరు. పిలిస్తే పలకరు. ఇలాంటి పిల్లలకు వారానికి నలభై గంటల చొప్పున రెండు సంవత్సరాలు అంతరాయం లేకుండా శిక్షణ ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఓ వైపు ఇలా పిల్లలకు శిక్షణ ఇస్తూనే మరోవైపు ఆ పిల్లలతో ఎలా మెలగాలో పెద్దలకీ శిక్షణ ఇస్తుంటాం. అయితే ఆ శిక్షణ.. పూర్తయ్యేవరకు క్రమం తప్పకూడదు. అందుకే ఈ లాక్‌డౌన్‌లోనూ వారందరికీ ఆన్లైన్లో ప్రతిరోజూ కౌన్సెలింగ్ ఇస్తున్నాను. ఈ ఖాళీ టైమ్‌లో పిల్లలను ఎలా ఎంగేజ్ చేయాలి, వారిచేత ఏమేం యాక్టివిటీస్ చేయించాలి, వాళ్ల ప్రవర్తనలో మార్పులు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి.. ఇలాంటివన్నీ ఆన్లైన్లోనే సూచిస్తున్నాను. ‘వెళ్లి కూర్చో’ అనకూడదు ఇంట్లో అయితే రోజులో ఇన్ని గంటలు చెప్పాలి అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఉదాహరణకు.. తల్లి కిచెన్‌లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ టైమ్‌లో అమ్మాయి / అబ్బాయి వస్తే ఓ దగ్గర కూర్చో అని చెప్పకూడదు. కూరగాయలన్నీ కలిపి వాటిని వేటికవి విడి విడిగా చేయమనాలి. కూర్చోబెట్టి కొద్దిసేపు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించవచ్చు. ఏ పనులు వీలైతే అందులో నిమగ్నం అయ్యేలా చెయ్యాలి. తీరిక సమయాలలో మన చిన్నప్పుడు ఆడిన అష్టాచెమ్మా, మ్యూజికల్ చెయిర్స్, డ్యాన్స్.. ఇలా ఫన్‌గా ఉన్నవన్నీ చేయిస్తుంటే పిల్లలకు ఉత్సాహం కలుగుతుంది. ఇలాంటి టైమ్‌లో ప్రత్యక్ష శిక్షణలో ఉన్నంతగా చేయలేరు. కానీ, కొంత రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుంది. తండ్రికి కనెక్ట్ అవుతారు మగపిల్లలు తండ్రి చెబితే త్వరగా కనెక్ట్ అవుతారు. తండ్రి నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారు. స్నానం చేయడం ఎలాగో చెప్పడం, బట్టలు వేసుకోవడం, పెన్ను పట్టుకోవడం.. రాయడం.. ఇలా ఏవైనా తండ్రి చెప్పవచ్చు. కాసేపు పిల్లలతో ఆడుకున్నా వాళ్లు బాగా రిలీఫ్ అవుతారు. తోబుట్టువులు ఇంట్లో ఉంటే వాళ్లతో కలిసి ఆడుకోవడం, కలిసి చేసే పనుల వల్ల నలుగురితో మసలే నైపుణ్యాలు కూడా పెరుగుతాయి’’ అని తెలిపారు హారిక. ‘దిద్ది’ పంపుతున్నా ప్రస్తుతం ఆన్లైన్లో కౌన్సెలింగ్ తీసుకుంటున్న తల్లిదండ్రులలో కొందరు.. చెప్పినవి పాటిస్తూ తమ పిల్లలు నేర్చుకున్న విషయాలను వీడియోలు చేసి పంపిస్తున్నారు. ఆ వీడియోలు చూసి పిల్లల ప్రవర్తనలో లేదా పాటించే పద్ధతుల్లో ఎక్కడైనా లోపం ఉంటే వాటిని కరెక్ట్ చేస్తూ ఉంటాను. కొన్ని మెళుకువల్ని ఎలా పాటించాలో చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. వారి పిల్లలందరి గురించి నాకు ముందే కొంత తెలుసు కాబట్టి వారికి సంబంధించిన విషయాలను మరింత వివరంగా చెప్పగలుగుతాను. ఇప్పుడు అదే చేస్తున్నాను. – హారికారెడ్డి, ఆటిజం చికిత్సా నిపుణురాలు -
ఆఖరి మజిలికీ కష్టాలే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జీవితాంతం ఎంత దర్జాగా బతికినా.. చనిపోతే ఖననానికి ఆరు గజాల స్థలం కరువవుతోంది. కనీసం దహన సంస్కారం చేయాలన్నా అందుబాటులో లేని వైకుంఠధామాలతో మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి నెలకొంది. నాడు ఒకప్పుడు భుజాల మీద నిర్వహించే శవయాత్రలు.. నేడు వాహనాల్లో దర్శనమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజల చావు కష్టాలు వర్ణాతీతం. ఎవరైనా చనిపోతే ఖననానికీ.. దహన సంస్కారానికీ మృతుల కుటుంబీకులు, బంధుమిత్రులు నానాయాతన పడుతున్నారు. మనిషి జీవితానికి సంబంధించి ఆఖరి మజిలీ అయిన దహస సంస్కారాలకూ అనువైన స్థలం అందుబాటులో లేకుండాపోయింది. శాస్త్రాలు.. సంప్రదాయాలకనుగుణంగా దహన సంస్కారాలు చేసుకునే వీలుగా ఉండాల్సిన వైకుంఠధామాలు ఉమ్మడి జిల్లాలో పావువంతు గ్రామాల్లోనూ నిర్మాణాలకు నోచుకోలేదు. ఎవరు చనిపోయినా.. మైళ్ల దూరం శవయాత్రలు నిర్వహించాల్సిన దుస్థితి వందలాది గ్రామాల్లో నెలకొంది. వైకుంఠధామాలు లేకపోవడంతో చాలా మంది కుటుంబీకులు తమ పొలాల్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇంకొందరు గ్రామ శివార్లలో ఉన్న చెరువులు.. కుంటల వద్ద దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. వైకుంఠధామం నిర్మాణాల కోసం స్థలం అందుబాటులో లేకపోవడం.. మంజూరైన చోట్ల నిధుల కొరత.. స్థలం, నిధులు రెండూ ఉన్నా నిర్మాణ పనులపై సరైన పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో ఉమ్మడి జిల్లాలో శ్మశాన వాటికల నిర్మాణాలు అటకెక్కాయని చెప్పవచ్చు. •మహబూబ్‌నగర్ జిల్లాలో 442 గ్రామ పంచాయతీలు ఉంటే 61 గ్రామాల్లోనే వైకుంఠధామాలున్నాయి. 329 పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించారు. పనులు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. 52 గ్రామాల్లో స్థల సేకరణ చేయాల్సి ఉంది. •వనపర్తి జిల్లాలో 255 పంచాయతీలుండగా.. ప్రస్తుతం 78 వైకుంఠధామాలు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో 178 నిర్మాణా లకు పరిపాలనా ఆమోదం లభించింది. ఇందులో 25 నిర్మాణాల పనులు ప్రారంభించగా.. ఒక్కటి పూర్తి చేశారు. 24 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన నిర్మాణాలకు సంబంధించి స్థల సేకరణ చేయాల్సి ఉంది. •నారాయణపేట జిల్లాలో 280 గ్రామ పంచాయతీలకు ఇప్పటి వరకు రెండు గ్రామాల్లోనే వైకుంఠధామాలున్నాయి. పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా 256 గ్రామాల్లో నిర్మాణాలకు పరిపాలనా ఆమోదం లభించింది. 232 చోట్ల స్థల సేకరణ చేశారు. 24 గ్రామాల్లో స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 80 చోట్ల నిర్మాణ పనులు వివిధ దశలో ఉన్నాయి. •జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు 160 గ్రామాల్లో వైకుంఠధామాలున్నాయి. 30రోజులప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు 66 చోట్ల స్థలాన్ని గుర్తించారు. వీటి నిర్మాణాలకు సంబంధించి భూమి పూజ చేశారు. పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. మరో 29 చోట్ల స్థలాలను సేకరించాల్సి ఉంది. •నాగర్‌కర్నూల్ జిల్లాలో 453 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం ఐదింటిలోనే వైకుంఠధామాలున్నాయి. వీటి నిర్మాణం కోసం 407 గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. 64 చోట్ల పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం ఐదు పంచాయతీల్లోనే పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో 46 గ్రామాల్లో స్థలాలను గుర్తించలేకపోయారు. అటకెక్కిన ‘ఉపాధి’ నిర్మాణాలు ఏళ్ల నుండి వేధిస్తోన్న వైకుంఠధామాల లేమీ సమస్య పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఈ క్రమంలో గతంలోనే వైకుంఠధామాలు లేని గ్రామాలను గుర్తించి వాటిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించాయి. రెండేళ్ల క్రితమే సంబంధిత అధికారుల నుంచి ప్రభుత్వం తీర్మానాలు తెప్పించుకుంది. ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి రూ.10 లక్షల నుంచి రూ.10.40 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని ప్రభుత్వ ఉపాధి హామి అధికారులకు సూచించింది. ఈ నిధులతో శ్మశాన వాటిక, ప్రహరీ , స్నానపు గదులు, దహనపు గద్దె, వేచి ఉండే గడి, కార్యాలయం నిర్మాణాలు చేపట్టాలని పేర్కొంది. అయితే వైకుంఠధామాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములు గుర్తించాల్సిన బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించింది. గుర్తించిన భూములను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని సూచించింది. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో స్థలాలు గుర్తించడంలో జాప్యం జరుగుతుంది. దీంతో ఎవరైనా చనిపోతే వారి సొంత పొలాల్లో, అడవుల్లో చెరువులు, వాగులు, కుంటలు, రహదారుల సమీపంలో దహన సంస్కారాలు జరుపుతున్నారు. తర్వాత స్నానాలు చేసేందుకు మహిళలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెట్ల పొదల చాటుకు వెళ్లి స్నానాలు చేసి బట్టులు మార్చునే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో వందలాది గ్రామాల్లో ఉంది. ఇదీలావుంటే.. తమ తమ గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలంటూ అనేక మంది ప్రజలు ప్రజాప్రతినిదులు, అధికారులను ఎన్నోసార్లు వేడుకున్నారు. శవాలు ఏటి పాలు..! వనపర్తి జిల్లా అమరచింత మండలం జూరాల ముంపు గ్రామాలకు పునరావాసాన్ని కల్పించిన అధికారులు శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించలేదు. దీంతో ఈర్లదిన్నె గ్రామస్తులు శ్మశాన వాటిక స్థలం కోసం ఏళ్లతరబడి అధికారులు, ప్రజాప్రతినిధులకు తమ గోడును విన్నవిస్తూనే ఉన్నారు. శ్మశాన వాటిక కోసం ప్రత్యేకమైన స్థలం లేకపోవడంతో సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణానది ఒడ్డున మృతదేహాలను ఖననం చేస్తున్నారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా పూడ్చిన శవాల సమాధుల ఆనవాలు కూడా నీటిలోనే కొట్టుకుపోతున్నాయి. దీంతో తమ తాత, ముత్తాతల సమాధులను కూడా గుర్తించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఈర్లదిన్నె, కిష్ణంపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలాలను సేకరిస్తున్నాం.. గ్రామ ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో వందలాది గ్రామాల్లో వైకుంఠధామాలు లేవు. అన్నిట్లో ఏర్పాటు చేసేలా స్థలాలను గుర్తిస్తున్నాం. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు అదే పనిలో ఉన్నారు. అయితే స్థ్థలాల సేకరణ కొంత ఇబ్బందిగా ఉంది. త్వరలోనే ప్రక్రియను పూర్తి చేస్తాం. – డీపీఓ వెంకటేశ్వర్లు స్థల సమస్య తీవ్రంగా ఉంది మా ఊర్లో శ్మశాన వాటికకు స్థల సమస్య తీవ్రంగా ఉంది. భూములు ఉన్న వారు తమ సొంత పొలాల్లో పూడ్చి పెడుతున్నారు. సొంత స్థలాలు లేని వారు కాల్వ వద్ద పూడ్చాల్సి వస్తోంది. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఊరికి సమీపంలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేక సమస్య వచ్చి పడింది. ఇప్పుడు కాల్వ వద్ద పూడ్చే పరిస్థితి లేక గుట్ట వద్దకు వెళ్తున్నారు. – డి.బాలరాజు, సంకలమద్ది, మూసాపేట లెక్కలేనన్ని సార్లు కలిశా.. మా ఊర్లో శ్మశానవాటిక లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఇందుకోసం లెక్కలేనన్ని సార్లు అధికారులను కలిశా. ఇప్పటికి సమస్య తీరలేదు. నాలుగేళ్ల నుంచి శ్మశానవాటిక కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నా.. అయినా స్పందించడం లేదు. ప్రభుత్వ స్థలంలో శ్మశానవాటిక లేనందున ప్రైవేట్ స్థలాల్లో ఎక్కడా పెట్టనివ్వడం లేదు. తక్షణం అధికారులు స్పందించి సమస్యను తీర్చాలి. – మంగలి వెంకటస్వామి, కందూర్, అడ్డాకుల -
ప్రతిఫలం దక్కింది
షూటింగ్ లొకేషన్లో స్టార్స్‌కి ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్... ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అందిస్తుంటారు. ఇలాంటి సౌకర్యాలు దక్కించుకునే పొజిషన్‌కి రావడానికి చాలా కష్టాలు పడాలి. ‘‘ఇలా బ్రేక్స్ మధ్యలో తినే ఫ్రూట్స్ కూడా తినలేని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేదాన్ని’’ అంటూ హీరోయిన్గా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు సన్యా మల్హోత్రా. ‘దంగల్’లో ఆమిర్ ఖాన్ చిన్నకూతురిగా నటించిన ఈ అమ్మాయి వెంటనే గుర్తుకురాక మానదు. ఆ సినిమా తర్వాత విశాల్ భరద్వాజ్ ‘పటాకా’, ‘బదాయ్ హో’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. నటిగా తన స్ట్రగులింగ్ డేస్‌ని గుర్తు చేసుకుంటూ – ‘‘యాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. ఆ కల నెరవేర్చుకునే ప్రయత్నంలో మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేసేవారు. కానీ మన కాళ్ల మీద మనం నిలబడాలనే మనస్తత్వం నాది. అందుకే వాళ్లని ఊరికే డబ్బులడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇప్పుడంటే అన్ని లగ్జరీలు వస్తున్నాయి కానీ ఆ రోజుల్లో నా దగ్గర ఆపిల్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. డ్రై ఫ్రూట్స్ అనే ప్రసక్తే లేదు. ఆ స్ట్రగులింగ్ డేస్ అన్నీ గతం. ప్రస్తుతం నా లక్ష్యాన్ని చేరుకున్నాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది’’ అని పేర్కొన్నారు సన్యా. -
తల పట్టుకుంటున్న బాబు
చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవుల జాతర ప్రారంభమైంది. ఈ పదవుల విషయంలో అప్పుడే తమ్ముళ్లలో విభేదాలు పొడసూపాయి. చివరికి ఈ వివాదం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. దీనికి ఆయన సమాధానమిస్తూ..పార్టీ కోసం పనిచేసిన వారెవరో, ఎవరికి ఏమివ్వాలో అంతా తనకు తెలుసన్నారని సమాచారం. ఈ విషయంలో తనను ఇబ్బంది పెట్టిన వారు ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. అసలే ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చలేక సతమతమవుతుంటే ఇప్పుడీ పదవుల పందేరం చంద్రబాబుకు తలనొప్పి తెచ్చిపెట్టినట్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.