Putin's health has always in focus across the world: ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలయ్యాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగాలు వినిపిస్తున్నాయి. తాజాగా.. పుతిన్ విదేశాల్లో ఉంటే మలమూత్రాదులను సైతం మాస్కోలోనే పడేసేలా ఒక బాడీగార్డ్‌ని పెట్టుకున్నాడంటూ ఒక వార్త కూడా హల్ చల్ చేసింది. అనారోగ్యం బయటపడకుండా ఉండేందుకే అలా చేస్తున్నాడంటూ ఫాక్స్ న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
రష్యా అధ్యక్షుడితో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒలిగార్చ్ ఒకరు.. పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, రెండు మూడేళ్ల కంటే బతకడంటూ ఒక వార్త కథనం కూడా వచ్చింది. వీటన్నింటినీ ధృవీకరించేలా.. రష్యా విక్టరే పరేడ్‌లో దగ్గుతూఉండటం, చలికి తట్టుకోలే దుప్పట్లు వేసుకుని ఉన్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఐతే ఇప్పుడూ తాజాగా క్రెమ్లిన్‌లో జరిగిన ఒక అవార్డుల ప్రధానోత్సవంలో వణుకుతూ కనిపిస్తున్న పుతిన్ వీడియో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో రష్యా చిత్ర నిర్మాత నికితా మిఖైలోవ్‌కు, అధ్యక్షుడు పుతిన్ ‘రష్యన్ ఫెడరేషన్ స్టేట్ ప్రైజ్’ని ప్రదానం చేశారు. ఆపై తర్వాత కనిపించినంత సేపు ఆయన వణుకుతూనే ఉన్నాడు. ఇక పుతిన్ పోడియం వద్ద ప్రసంగిస్తున్న టైంలోనూ.. కాళ్లు వణుకుతున్నట్లు కనిపించాయి. ఎక్కువసేపు అలా నిలబడి మాట్లాడలేక ఇబ్బందికి గురయ్యాడు ఆయన.
పుతిన్ వైద్యులు అతని అరోగ్య దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు నుంచోవద్దని సూచించారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఉక్రెయిన్ పై దురాక్రమణ యుద్ధం దిగిన తర్వాత నుంచి ప్రపంచ దృష్టి పుతిన్ ఆరోగ్యం పైనే పడింది. అతను చేసిన దురాగతాలకు తగిన శిక్షపడుతుందంటూ పలు దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా.
Putin’s legs shaking, he looks unsteady on his feet, fueling more speculation about his health. Video was taken Sunday. pic.twitter.com/TIVfK30tAp
— Mike Sington (@MikeSington) June 14, 2022
(చదవండి: ‘తూర్పు’పై రష్యా పట్టు )
Comments
Please login to add a commentAdd a comment