shaking
-
దిగజారిపోతున్న పుతిన్ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!
Putin's health has always in focus across the world: ఉక్రెయిన్‌పై దురాక్రమణ మొదలయ్యాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగాలు వినిపిస్తున్నాయి. తాజాగా.. పుతిన్ విదేశాల్లో ఉంటే మలమూత్రాదులను సైతం మాస్కోలోనే పడేసేలా ఒక బాడీగార్డ్‌ని పెట్టుకున్నాడంటూ ఒక వార్త కూడా హల్ చల్ చేసింది. అనారోగ్యం బయటపడకుండా ఉండేందుకే అలా చేస్తున్నాడంటూ ఫాక్స్ న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది. రష్యా అధ్యక్షుడితో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒలిగార్చ్ ఒకరు.. పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని, రెండు మూడేళ్ల కంటే బతకడంటూ ఒక వార్త కథనం కూడా వచ్చింది. వీటన్నింటినీ ధృవీకరించేలా.. రష్యా విక్టరే పరేడ్‌లో దగ్గుతూఉండటం, చలికి తట్టుకోలే దుప్పట్లు వేసుకుని ఉన్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఐతే ఇప్పుడూ తాజాగా క్రెమ్లిన్‌లో జరిగిన ఒక అవార్డుల ప్రధానోత్సవంలో వణుకుతూ కనిపిస్తున్న పుతిన్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రష్యా చిత్ర నిర్మాత నికితా మిఖైలోవ్కు, అధ్యక్షుడు పుతిన్ ‘రష్యన్ ఫెడరేషన్ స్టేట్ ప్రైజ్’ని ప్రదానం చేశారు. ఆపై తర్వాత కనిపించినంత సేపు ఆయన వణుకుతూనే ఉన్నాడు. ఇక పుతిన్ పోడియం వద్ద ప్రసంగిస్తున్న టైంలోనూ.. కాళ్లు వణుకుతున్నట్లు కనిపించాయి. ఎక్కువసేపు అలా నిలబడి మాట్లాడలేక ఇబ్బందికి గురయ్యాడు ఆయన. పుతిన్ వైద్యులు అతని అరోగ్య దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు నుంచోవద్దని సూచించారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఉక్రెయిన్ పై దురాక్రమణ యుద్ధం దిగిన తర్వాత నుంచి ప్రపంచ దృష్టి పుతిన్ ఆరోగ్యం పైనే పడింది. అతను చేసిన దురాగతాలకు తగిన శిక్షపడుతుందంటూ పలు దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. Putin’s legs shaking, he looks unsteady on his feet, fueling more speculation about his health. Video was taken Sunday. pic.twitter.com/TIVfK30tAp — Mike Sington (@MikeSington) June 14, 2022 (చదవండి: ‘తూర్పు’పై రష్యా పట్టు ) -
ఇంకా షాక్‌లోనే ఉన్నా!
కూతురిని సిల్వర్ స్క్రీన్‌పై చూసి మురిసిపోవాలనుకున్నారు శ్రీదేవి. తనలానే కూతురు కూడా అంచలంచెలుగా పైకెళ్తుంటే పడిపోకుండా పక్కనుండి పట్టుకోవాలని ఆశపడ్డారు. కానీ కూతురి మొదటి చిత్రాన్ని (ధడక్) చూడకుండానే శ్రీదేవి చనిపోయారు. ‘తల్లి మరణం తనకింకా షాక్‌గానే ఉంది’ అంటున్నారు జాన్వీ కపూర్. ఈ విషయం గురించి ఇటీవల ఓ షోలో మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి చాలామంది చాలాసార్లు అడిగారు. చాలాసార్లే చెప్పాను కూడా. కానీ అమ్మ మరణం నాకిప్పటికీ షాకింగ్‌గానే ఉంది. ఆ వార్తను ఎందుకో జీర్ణించుకోవడానికి నా మనసు ఇష్టపడటం లేదు. ‘అమ్మ చనిపోయింది’ అనే వార్త విన్నప్పటినుంచి ఆ తర్వాత నాలుగు నెలల వరకూ జరిగిన సంఘటనలు ఏవీ నా మైండ్‌లో రిజిస్టర్ కాలేదు. జ్ఞాపకాలన్నీ అమ్మ చుట్టూనే ఉండిపోయాయి’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే షోను తేలికపరచడం కోసం తన తల్లిదండ్రులు ‘చాలా డ్రమాటిక్’ అని మరో విషయాన్ని షేర్ చేసుకున్నారు. ‘‘డేటింగ్ విషయాన్ని అమ్మా, నాన్న చాలా డ్రామా చేసేవారు. ‘నీకెవరైనా నచ్చితే మాతో వచ్చి చెప్పు. మేం నీకు పెళ్లి చేస్తాం’ అనేవారు. అప్పుడు నేనేమో ‘నచ్చిన ప్రతీ అబ్బా యిని పెళ్లి చేసుకోలేం కదా. జస్ట్ ఫ్రెండ్లీగా చిల్ కూడా అవ్వొచ్చు అనుకుంటా?’ అని సమాధానం చెప్పేదాన్ని. ‘చిల్ అవ్వడమంటే? ఏంటి?’ అని తిరిగి ప్రశ్నించేది అమ్మ. ఇలా సరదాగా జోక్ చేసుకునేవాళ్లం’’ అని పేర్కొన్నారు జాన్వీ. సినిమాల విషయానికి వస్తే జాన్వీ ప్రస్తుతం పైలెట్ గుంజన్ సక్సెనా బయోపిక్‌లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ దుర్ఘటన కళ్లముందే మెదులుతోంది
తణుకు : ‘బస్సు వేగంగా వెళుతోంది.. అర్ధరాత్రి.. అందరం గాఢ నిద్రలో ఉన్నాం.. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ పెద్ద శబ్దం.. ఒక్కసారిగా కుదుపు.. కళ్లు తెరిచి చూస్తే నీళ్లల్లో ఉన్నాం.. చుట్టూ హాహాకారాలు.. ఇంతలో కొందరు యువకులు వచ్చి బస్సు అద్దాలు పగలగొట్టి మమ్మల్ని బయటకు తీశారు.. అప్పుడు తెలిసింది మేం ప్రయాణిస్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైందని’. ఇదీ ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడినlతణుకు మండలం పైడిపర్రుకు చెందిన గొర్రె లక్ష్మి, నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామానికి చెందిన తోట నాగమణిల మనోగతం. వీరిని సోమవారం అర్ధరాత్రి తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిద్దరికీ ఛాతీ, నడుంభాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో సొంత జిల్లాలోనే చికిత్స అందజేయాలనే ఉద్దేశంతో వీరిని ప్రత్యేక అంబులెన్సులో ఖమ్మం నుంచి తణుకు తరలించారు. ప్రస్తుతం వీరు కోలుకుంటున్నారు. ఇప్పటికీ ఘోర దుర్ఘటన దృశ్యాలు తమ కళ్లముందే కదలాడుతున్నాయని వారు కన్నీటిపర్యంతమయ్యారు. కూతురి వెంట వెళ్లి.. తిరుగు ప్రయాణంలో.. నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామానికి చెందిన తోట నాగమణి కూతురు, అల్లుడు హైదరాబాదులో ఉంటున్నారు. ఈనెల 19న కుమార్తె ఆకుల పుణ్యసాయి హైదబాద్ వెళ్తూ తనతోపాటు నాగమణిని తీసుకెళ్లారు. సోమవారం తిరుగు ప్రయాణంలో షాపూర్ వద్ద నాగమణిని కూతురు, అల్లుడు బస్సుక్కించారు. సాధారణంగా రైలు ప్రయాణం చేసే నాగమణి పుష్కరాలు, పెళ్లి ముహూర్తాల వల్ల రైళ్లు ఖాళీ లేకపోవడంతో చివరి నిమిషంలో బస్సు ప్రయాణం ఎంచుకున్నారు. తనతోపాటు నిడర్రుకు చెందిన బంధువు వానపల్లి పెద్దిరాజు అదే బస్సులో ఉండటంతో తోడుగా ఉంటారని ఆ బస్సు ఎక్కారు. డ్రైవర్ వెనుక రెండో సీట్లో కూర్చున్న నాగమణి వెనుక సీట్లో పెద్దిరాజు కూర్చున్నారు. ఈ ప్రమాదంలో పెద్దిరాజు మృతి చెందడంతో నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. కుమారుడి వద్దకు వెళ్లి వస్తూ.. తణుకు మండలం పైడిపర్రు ప్రాంతంలో నివాసం ఉంటున్న గొర్రె లక్ష్మి కుమారుడు రాజు హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. కొన్ని రోజులు కుమారుడు వద్ద ఉండి వద్దామని దాదాపు నెల రోజుల క్రితం లక్ష్మి హైదరాబాద్ వెళ్లారు. సోమవారం రాత్రి మియాపూర్ వద్ద కుమారుడు రాజు ఆమెను బస్సు ఎక్కించారు. నాగమణి సీటు పక్కనే లక్ష్మి కూర్చున్నారు. వీరిద్దరూ కూర్చున్న సీటుకు ముందున్న రాడ్ వీరిద్దరికీ రక్షణగా ఉండటంతో వీరి ప్రాణాలు దక్కాయి. అయితే సీటు భాగం నొక్కేయడంతో ఛాతీ, నడుం భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.