వైరల్: అన్నిరోజులు ఒకేలా ఉండవు.. ఒక్కరి టైమే నడవదు. అలాగే ఎంతటి వాళ్లైనా.. ఏదో ఒక టైంలో అవమానంపాలు కాకతప్పదు. ఎదుటివాళ్లకు టైం రావాలంతే!. జగమొండిగా పేరున్న వ్లాదిమిర్ పుతిన్ కూడా అందుకు అతీతం ఏం కాదు.
థగ్ లైఫ్, ఆటిట్యూడ్ అంటూ పుతిన్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ నడుస్తుంటుంది. ఆయన అభిమానులు కూడా వాటిని విపరీతంగా షేర్ చేస్తుంటారు. అలాంటిది పుతిన్‌కే ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది?. తాజాగా అదే జరిగింది..
మంగళవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఆస్తానా త్రైపాక్షిక సదస్సులో భాగంగా.. టెహ్రాన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హాలులో ఈ ఇద్దరూ భేటీ అయ్యారు. అయితే ఈ అధికార సమావేశానికి ముందుగా పుతిన్ వచ్చారు. దాదాపు ఒక నిమిషం పాటు ఎర్డోగన్ కోసం హాలులోనే ఆయన ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ టైంలో మీడియా కెమెరాలన్నీ పుతిన్ వైపే ఉండగా.. ఆయన చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. చేతులు కట్టుకుని నీళ్లు నములుతూ.. కనుబొమ్మలు ఎగరేస్తూ విచిత్రమైన హవభావాలు ఇచ్చారు. ఆపై ఎర్డోగన్ రాకను చూసి చిరునవ్వుతో షేక్‌హ్యాండ్ ఇచ్చారు.
Those 50 seconds that Erdogan made Putin wait, looking frazzled in-front of cameras say plenty of how much has changed after Ukraine: pic.twitter.com/giGirqaYYP
— Joyce Karam (@Joyce_Karam) July 19, 2022
సాధారణంగా.. ఇలాంటి భేటీల్లో ఇద్దరు నేతలు ఒకేసారి వేదిక మీదకు రావడం జరుగుతుంటుంది. కానీ, ఎర్డోగన్ మాత్రం ఆలస్యంగా రావడంతో పుతిన్‌కు తలకొట్టేసినంత పనైంది. అయితే ఈ పరిణామం గురించి చర్చించుకోవడం వెనుక ఓ కారణం కూడా ఉంది. కట్ చేస్తే..
2020 మాస్కో వేదికగా పుతిన్-ఎర్డోగన్ మధ్య కీలక భేటీ జరిగింది. ఆ సమయంలో ముందుగా చర్చావేదిక వద్దకు చేరుకున్న ఎర్డోగన్.. పుతిన్ కోసం రెండు నిమిషాలు ఎదురు చూడాల్సి వచ్చింది. అంతకు ముందు పోప్ ఫ్రాన్సిస్ విషయంలోనూ క్రెమ్లిన్ నేత ఇలాగే వ్యవహరించాడు. 2013లో పోప్‌ను యాభై నిమిషాలు వెయిట్ చేయించిన పుతిన్.. 2020లో గంటకు పైనే పోప్‌ను తన కోసం ఎదురు చూసేలా చేశాడు. అంతేకాదు ఒకప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టోర్ యానుకోవిచ్‌ను ఏకంగా నాలుగు గంటలపాటు వెయిట్ చేయించాడు పుతిన్. అందుకే ప్రస్తుతం పుతిన్ ఎదుటివాళ్ల కోసం ఎదురు చూసిన క్షణాలు ఇంటర్నెట్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment