MAMI
-
దీపికా రాజీనామా!
ముంబై అకాడెమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (మామి) అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నారు హీరోయిన్ దీపికా పదుకోన్ . ‘మామి’ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు సోమవారం వెల్లడించారామె. ప్రతి ఏడాదీ ముంబయ్‌లో ‘ముంబయ్ చలన చిత్రోత్సవాలు’ (ఎమ్ఎఫ్ఎఫ్)ను నిర్వహిస్తుంటుంది ‘మామి’. ‘‘నిజానికి ‘మామి’ అధ్యక్షురాలి బాధ్యతలు నిర్వహించడం మంచి అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చాయి. నా కర్తవ్యాన్ని నేను బాగానే నిర్వహించాననే అనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నా రెండో ఇంటిగా నేను భావించే ముంబయ్‌కి తీసుకురావడం నాలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. కానీ నా ప్రస్తుత పరిస్థితుల కారణంగా అధ్యక్షురాలి పదవీ బాధ్యతలపై నేను సరైన ఏకాగ్రత చూపించలేకపోతున్నాను. నాకన్నా సమర్థులైన వారి చేతిలో అధ్యక్ష పదవి ఉంటే నాకు çహ్యాపీగా ఉంటుంది’’ అన్నారు దీపికా పదుకోన్. -
అప్పటి నుంచి మనశ్శాంతి లేదు: హీరోయిన్
ముంబై : బాల్యంలో జరిగే అత్యాచారాలు బాధితులను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి... అందుకు తానే ఓ ఉదాహరణ అంటున్నారు హీరోయిన్ పార్వతి. అంతేకాదు అటువంటి సంఘటనలు మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. దక్షిణాది సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీ ఇర్ఫాన్ ఖాన్ సినిమా ‘కరీబ్ కరీబ్ సింగిల్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ముంబైలో జరిగిన మామీ ఫిలిం ఫెస్టివల్‌కి పార్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. ‘నేను ఈరోజు ఇక్కడ కూర్చుంది ఓ మనిషిగా. నువ్వు మహిళవు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావంటూ నాపై ముద్ర వేసే అవకాశం ఉంది. అయినా ఫర్లేదు. ఎందుకంటే బాధితుల మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఏమీ తెలియని వయస్సులో జరిగిన వాటి గురించి ఇప్పుడెలా తెలిసిందోనని వ్యంగ్యమాడే ప్రబుద్ధులు కూడా ఉంటారు. పర్లేదు. మూడేళ్ల ప్రాయంలో నాపై జరిగినవి అకృత్యాలు అని తెలుసుకోవడానికి నాకు పన్నెండేళ్లు పట్టింది. ఈ విషయం తెలిసిన నాటి నుంచి నా మనశ్శాంతి దూరమైంది. దాడి జరగడం అంటే కేవలం భౌతికంగా మాత్రమే కాదు. ఆ దాడి తాలూకు చేదు ఙ్ఞాపకాలు నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. నేను రోజూ వాటితో పోరాడుతూనే ఉన్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రతీ విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకునే తాను ఈ విషయంలో మాత్రం ఏళ్లపాటు ఎలా సైలెంట్‌గా ఉన్నానో తనకే అర్థం కాలేదంటూ చెప్పుకొచ్చారు.( చదవండి : #మీటూ : ‘అతడి మీద అసహ్యంతో డెటాల్ తాగేశా’) -
భారత్‌కు బాండ్ గర్ల్
స్పెక్టర్ సినిమాలో బాండ్ గర్ల్ గా అలరించిన మోనికా బెలూసి త్వరలో భారత్ కు రానున్నారు. 50 ఏళ్ల వయసులో బాండ్ గర్ల్ గా నటించి మెప్పించిన ఈ సీనియర్ హాలీవుడ్ నటి ఓల్డెస్ట్ బాండ్ గర్ల్ గా రికార్డ్ సృష్టించారు. స్పెక్టర్ తో పాటు ది మ్యాట్రిక్స్ రిలోడెడ్, ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మోనికా ముంబై లో జరగనున్న మామి ముంబై ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నారు. తొలిసారిగా భారత్ కు రావటంపై మోనిక హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫెస్టివల్ లో మోనికా బెలూసి నటించిన ఆన్ ద మిల్కీ వే, ఇర్రివర్సిబుల్ సినిమాలను ప్రదర్శించనున్నారు. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ ఆధ్వర్యంలో జరిగే ఆ వేడుక అక్టోబర్ 12 నుంచి 18 వరకు కొనసాగనుంది. అనురాగ్ కశ్యప్ ప్రారంభించనున్న ఈ వేడుకలో 49 దేశాలకు చెందిన 51 భాషల 220 సినిమాలను ప్రదర్శించనున్నారు. -
'కరణ్ ఎటువంటి తప్పుచేయలేదు'
ముంబై: సినిమాలను టార్గెట్ చేయడం బాధాకరమని దర్శకురాలు జోయ అక్తర్ అన్నారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాపై వివాదం రేగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ఎటువంటి తప్పుచేయలేదని, చట్టాలను ఉల్లంఘించలేదన్నారు. భారత్-పాకిస్థాన్ సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా షూటింగ్ చేశాడని వెల్లడించారు. సినిమా విడుదల సమయానికి పరిస్థితులు మారిపోవడంతో అతడిపై దాడి చేస్తున్నారని వాపోయారు. పాకిస్థాన్ నటీనటులకు కేంద్ర ప్రభుత్వమే వీసాలు మంజూరు చేసిందని గుర్తుచేశారు. పాక్ కళాకారులు ఇక్కడ చట్టబద్దంగానే పనిచేస్తున్నారని చెప్పారు. ఎటువంటి సెన్సార్ రిష్ అయినా బాధాకరమని నటి కల్కీ కొచ్లిన్ అన్నారు. ఏ సినిమా చూడాలో, చూడకూడదో ఎంచుకునే స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని ధియేటర్ల యజమానుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దరూ ఈవిధంగా స్పందించారు. -
'నేనే డైరెక్టర్ని అయితే..'
ముంబయి: తాను మెగాఫోన్ పడితే ఆ చిత్రంలో ఎట్టి పరిస్థితుల్లో నటించబోనని బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ అన్నారు. ముంబయిలో మామి ఫిల్మ్ క్లబ్ ప్రారంభం సందర్భంగా ఆయన దర్శకత్వ బాధ్యతల విషయంలో స్పందించారు. 'ఒక నటుడిగా డైరెక్టర్‌పై నమ్మకాన్ని కలిగి ఉండాలి. కానీ, నా గత కొన్ని రోజుల్లో కొంతమంది దర్శకులతో పనిచేశాను. కానీ, వారికి నాకు మ్యాచ్ కాలేదు. అందుకే నేను ఇబ్బంది పడ్డాను. అప్పటి నుంచి దర్శకుడిని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాను... ఒక వేళ నేనే ఓ చిత్రానికి దర్శకత్వం వహించాల్సి వచ్చినప్పుడు ఆ చిత్రంలో నేను నటించను' అని అమిర్ చెప్పారు. త్వరలోనే దంగల్ అనే చిత్రంతో అమిర్ ఖాన్ ప్రేక్షకులను అలరించనున్న విషయం తెలిసిందే.