'కరణ్ ఎటువంటి తప్పుచేయలేదు' | Karan Johar didn't do anything wrong, says Zoya Akhtar | Sakshi
Sakshi News home page

'కరణ్ ఎటువంటి తప్పుచేయలేదు'

Published Fri, Oct 21 2016 8:27 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

'కరణ్ ఎటువంటి తప్పుచేయలేదు'

'కరణ్ ఎటువంటి తప్పుచేయలేదు'

ముంబై: సినిమాలను టార్గెట్ చేయడం బాధాకరమని దర్శకురాలు జోయ అక్తర్ అన్నారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాపై వివాదం రేగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ఎటువంటి తప్పుచేయలేదని, చట్టాలను ఉల్లంఘించలేదన్నారు. భారత్-పాకిస్థాన్ సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా షూటింగ్ చేశాడని వెల్లడించారు. సినిమా విడుదల సమయానికి పరిస్థితులు మారిపోవడంతో అతడిపై దాడి చేస్తున్నారని వాపోయారు. పాకిస్థాన్ నటీనటులకు కేంద్ర ప్రభుత్వమే వీసాలు మంజూరు చేసిందని గుర్తుచేశారు. పాక్ కళాకారులు ఇక్కడ చట్టబద్దంగానే పనిచేస్తున్నారని చెప్పారు.

ఎటువంటి సెన్సార్ రిష్ అయినా బాధాకరమని నటి కల్కీ కొచ్లిన్‌ అన్నారు. ఏ సినిమా చూడాలో, చూడకూడదో ఎంచుకునే స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని ధియేటర్ల యజమానుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దరూ ఈవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement