Director Anurag Kashyap Poses With His Ex Wives, Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Anurag Kashyap: మాజీ భార్యల నడుమ స్టార్‌ డైరెక్టర్‌, వాళ్లే నా పిల్లర్స్‌ అంటూ పోస్ట్‌..

Published Wed, Aug 17 2022 5:39 PM | Last Updated on Thu, Aug 18 2022 12:57 PM

Director Anurag Kashyap Poses With His Ex Wives Aarti Bajaj and Kalki Koechlin - Sakshi

బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ల సినిమా వస్తుందంటే చాలు చూసేదే లేదని తెగేసి చెప్తున్నారు హిందీ ఆడియన్స్‌. ప్రేక్షకుల దెబ్బకు కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా బడ్జెట్‌లో కనీసం పావు వంతైనా రాబట్టకపోవడంతో నిర్మాతలు అల్లాడిపోతున్నారు. త్వరలో తాప్సీ- అనురాగ్‌ కశ్యప్‌ల నుంచి కొత్త సినిమా రాబోతోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన దొబారా ఆగస్టు 19న విడుదల కాబోతోంది. అయితే తమ సినిమాను కూడా బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో డిమాండ్‌ చేయాలని, అప్పుడే తమ చిత్రం అందరికీ రీచ్‌ అవుతుందని వింతగా స్పందించారు తాప్సీ, అనురాగ్‌.

ఇక మరోవైపు తాప్సీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యాడీ డైరెక్టర్‌. ఇదిలా ఉంటే తాజాగా తన మాజీ భార్యలతో కలిసి ఫొటోలను పోజిచ్చాడు. దొబారా సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయన తన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్‌, ఆర్తి బజాజ్‌లతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. వీరిద్దరూ తన రెండు పిల్లర్లు అని రాసుకొచ్చాడు. ఈ ఫొట నెట్టింట వైరల్‌ అవగా అనురాగ్‌- ఆర్తిల కూతురు ఆలియా కశ్యప్‌ ఐకానిక్‌ అంటూ ఈ పోస్ట్‌పై కామెంట్‌ చేసింది.

కాగా అనురాగ్‌ కశ్యప్‌- ఆర్తి బజాజ్‌ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు ఆలియా జన్మించింది. ఆ తర్వాత 2009లో వీరు విడిపోయారు. అనంతరం అనురాగ్‌ 2011లో నటి కల్కి కొచ్లిన్‌ను పెళ్లాడగా 2015లో విడాకులు తీసుకున్నాడు.

చదవండి: తాప్సీపై డైరెక్టర్‌ వల్గర్‌ కామెంట్స్‌, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement