నన్ను కలవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే! | Anurag Kashyap Shares Rates For Meetings In Instagram | Sakshi

షార్ట్‌కట్స్‌ కావాలా? ఇప్పటికే చాలా టైం వేస్ట్‌ చేశా.. ఇక చాలు!

Mar 23 2024 3:34 PM | Updated on Mar 23 2024 3:51 PM

Anurag Kashyap Shares Rates for Meetings in Instagram - Sakshi

మేము తెలివైనవాళ్లం అని చెప్పుకుతిరిగేవాళ్లకోసం ఓ రేటు పెడుతున్నాను. నన్ను ఒక పది, పదిహేను నిమిషాలు కలవాలంటే రూ.1 లక్ష చెల్లించాలి. ఒక అరగంట మాట్లాడాలంటే రూ.2 లక్షలు.. అదే గంటసేపు నాతో మాట్లాడటానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ కొత్త పాట పాడుతున్నాడు. ఇకనుంచి ఎవరినీ ఊరికే కలిసేది లేదంటున్నాడు. డబ్బులిస్తేనే పని జరుగుతుందంటున్నాడు. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన ఇకనుంచి ఏదీ ఫ్రీగా చేయనంటున్నాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. 'ఇండస్ట్రీకి వచ్చే కొత్తవాళ్లకు సాయం చేయడం కోసం ఇప్పటికే నేను చాలా సమయాన్ని వృథా చేశాను. కొన్నిసార్లు టైం వేస్ట్‌ తప్ప ఏమీ మిగల్లేదు. కాబట్టి నేనో నిర్ణయానికి వచ్చాను.

పావుగంటకు లక్ష.. గంటకు..?
మేము తెలివైనవాళ్లం.. మా దగ్గర టాలెంట్‌కు కొదవే లేదని చెప్పుకుని తిరిగేవాళ్లతో నా సమయం వృథా చేయాలనుకోవడం లేదు. ప్రతిదానికి ఓ రేటు పెడుతున్నాను. నన్ను ఒక పది, పదిహేను నిమిషాలు కలవాలంటే రూ.1 లక్ష చెల్లించాలి. అరగంట మాట్లాడాలంటే రూ.2 లక్షలు.. అదే గంటసేపు నాతో మాట్లాడటానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

షార్ట్‌కట్స్‌ కావాలా?
మీరు అంత డబ్బు ఇవ్వగలిగేవారైతేనే రండి. లేదంటే వెళ్లిపోండి. షార్ట్‌కట్స్‌ వెతుక్కుంటూ వచ్చేవారిని చూసి అలిసిపోయాను. మరో ముఖ్య విషయం.. ఆ డబ్బంతా కూడా ఒక్కసారే అడ్వాన్స్‌గా ఇచ్చేయాలి' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అతడి కూతురు ఆలియా.. నీకు ఫార్వర్డ్‌ చేయమంటూ నాకు స్క్రిప్టులు పంపుతున్న ప్రతిఒక్కరికీ ఈ మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేస్తాను అని రిప్లై ఇచ్చింది.

చదవండి: మొన్నే ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌.. కుమారుడితో కలిసి పార్టీ ఇచ్చిన హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement