Kalki Koechlin
-
చాలామందితో డేటింగ్ చేశా
-
ఒకే సమయంలో పలువురితో... హద్దుల్లోనే!: బాలీవుడ్ నటి
ఈరోజుల్లో ప్రేమ-బ్రేకప్ అనేది సర్వసాధారణమైపోయింది. ఎంత త్వరగా లవ్‌లో పడుతున్నారో, అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. మళ్లీ కొద్దిరోజులకే ఫ్రెష్‌గా మరొకరిని లవ్ చేస్తున్నారు. అయితే తాను మాత్రం ఒకేసారి పలువురినీ ప్రేమించానంటోంది బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్.ఒకే టైంలో చాలామందితో డేటింగ్తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను ఒకే టైంలో పలువురితో డేటింగ్ చేసేదాన్ని. నా జీవితంలోనే అదొక డిఫరెంట్ జర్నీ.. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. కానీ ఇప్పుడు నాకంటూ ఓ లైఫ్ పార్ట్నర్, పాప ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను అలాంటివాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడంత టైం లేదుఅంతదాకా ఎందుకు? నా జీవిత భాగస్వామి గురించి పట్టించుకోవడానికే నాకు టైం దొరకడం లేదు. అయితే ఎప్పుడైనా సరే.. మనకంటూ కొన్ని సరిహద్దులు గీసుకోవడమే చాలా మంచిది అని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. కాగా కల్కి గతంలో బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్‌ను పెళ్లిచేసుకుంది. 2015లో అతడి నుంచి విడాకులు తీసుకుంది. సినిమా..తర్వాత ఇజ్రాయెల్ మ్యుజీషీయన్ గయ్ హెర్ష్‌బర్గ్‌తో లవ్‌లో పడింది. వీరి ప్రేమకు గుర్తుగా 2020లో కూతురు జన్మించింది. సినిమాల విషయానికి వస్తే.. దేవ్ డి, షైతాన్, జిందగీనా మిలేగి దొబారా, యే జవానీ హై దీవాని, వెయిటింగ్, మార్గరిట విత్ ఎ స్ట్రా, గల్లీ బాయ్, గోల్డ్ ఫిష్ ఇలా తదితర చిత్రాల్లో నటించింది. కల్కిస్ గ్రేట్ ఎస్కేప్ షోతో హోస్ట్‌గానూ మారింది.చదవండి: సోనియా ఎలిమినేట్? సీక్రెట్ రూమ్‌లో.. -
ఇద్దరు మాజీ భార్యలతో స్టార్ డైరెక్టర్, ఫొటో వైరల్
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ల సినిమా వస్తుందంటే చాలు చూసేదే లేదని తెగేసి చెప్తున్నారు హిందీ ఆడియన్స్. ప్రేక్షకుల దెబ్బకు కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా బడ్జెట్లో కనీసం పావు వంతైనా రాబట్టకపోవడంతో నిర్మాతలు అల్లాడిపోతున్నారు. త్వరలో తాప్సీ- అనురాగ్ కశ్యప్‌ల నుంచి కొత్త సినిమా రాబోతోంది. వీరి కాంబినేషన్లో వచ్చిన దొబారా ఆగస్టు 19న విడుదల కాబోతోంది. అయితే తమ సినిమాను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేయాలని, అప్పుడే తమ చిత్రం అందరికీ రీచ్ అవుతుందని వింతగా స్పందించారు తాప్సీ, అనురాగ్. ఇక మరోవైపు తాప్సీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యాడీ డైరెక్టర్. ఇదిలా ఉంటే తాజాగా తన మాజీ భార్యలతో కలిసి ఫొటోలను పోజిచ్చాడు. దొబారా సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయన తన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్‌లతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీరిద్దరూ తన రెండు పిల్లర్లు అని రాసుకొచ్చాడు. ఈ ఫొట నెట్టింట వైరల్ అవగా అనురాగ్- ఆర్తిల కూతురు ఆలియా కశ్యప్ ఐకానిక్ అంటూ ఈ పోస్ట్‌పై కామెంట్ చేసింది. కాగా అనురాగ్ కశ్యప్- ఆర్తి బజాజ్ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు ఆలియా జన్మించింది. ఆ తర్వాత 2009లో వీరు విడిపోయారు. అనంతరం అనురాగ్ 2011లో నటి కల్కి కొచ్లిన్ను పెళ్లాడగా 2015లో విడాకులు తీసుకున్నాడు. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు -
హీరోయిన్ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు!
ఈ శీర్షిక కింద మీరు చదువుతున్నవి గాలి కబుర్లు కావు. గాసిప్స్లాంటి నిజాలు. కాలక్షేపానికి పనికొచ్చే సంగతులు! నమ్మాల్సిందే! ఆమె ముత్తాతే... పారిస్‌లోని ఈఫిల్ టవర్ నిర్మాణానికి బాలీవుడ్ నటి.. కల్కి కొచ్లిన్ ముత్తాత మోరిస్ కొచ్లిన్ చీఫ్ ఇంజినీర్ అట. న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సహా చాలా చారిత్రక కట్టడాలకు పనిచేశాడట ఆయన. గొంతు బాలేదని.. గబ్బర్ సింగ్ తెలుసు కదా.. పవన్ కళ్యాణ్ కాదు, ‘షోలే’ గబ్బర్ సింగ్.. అమ్జద్ ఖాన్! ఆ సినిమాలో ఆ పాత్రకు అమ్జద్ ఖాన్‌ను ఎంపిక చేసినా, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అఖ్తర్‌కు నచ్చలేదుట. గబ్బర్ సింగ్ రోల్‌కు సరిపడా స్వరం అమ్జద్‌కు లేదని, గొంతు పీలగా ఉందని పెదవి విరిచాడట. అతని అసంతృప్తిని భరించలేక రమేశ్ సిప్పీ దాదాపుగా అమ్జద్‌ను ఆ సినిమా నుంచి తొలగించే నిర్ణయం తీసేసుకున్నాడు. నిజానికి ఆ పాత్రకు ముందు డానీ డెన్జోంగ్పాను అనుకున్నారట. అతను సరిపోడని.. అమ్జద్‌ను తీసుకున్నారు. అమ్జద్ మీదా అసంతృప్తి రావడంతో.. రమేశ్ సిప్పీ ఇరకాటంలో పడ్డారట. ఏమైతేనేం ఫైనల్‌గా అమ్జదే ఖరారయ్యాడు. న భూతో న భవిష్యతి అన్నంతగా గబ్బర్ సింగ్ పాత్రను రక్తి కట్టించాడు. గ్యారేజ్‌లో కాపురం.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తెలుసు కదా. సినిమా అవకాశాలు కాస్త పెరగడం మొదలయ్యాక అతని కుటుంబాన్ని ముంబైకి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్లెక్కడ ఉన్నారో తెలుసా? రాజ్ కపూర్ వాళ్లింటి కారు గ్యారేజ్‌లో. తర్వాత ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాక ముంబైలోని మధ్యతరగతి వాళ్లుండే ప్రాంతంలోని ఒక గది అద్దెకు తీసుకుని అందులోకి మారారుట. నోట్లోంచి మాట రాలేదు.. రాజ్ కపూర్, నర్గిస్ ప్రేమ ఎంత ప్రాచుర్యం పొందిందో నర్గిస్ మీద సునీల్ దత్కున్న ప్రేమా అంతే ఆరాధ్యనీయమైంది. సినిమాల్లోకి రాకముందు సునీల్ దత్ సిలోన్ రేడియోలో ఆర్జేగా పనిచేశాడు. ఆ సమయంలో నర్గిస్ దత్ టాప్ మోస్ట్ హీరోయిన్. ఆమెను ఇంటర్వ్యూ చేయాలని తహతహలాడాడు సునీల్ దత్. తీరా ఆ అవకాశం వచ్చి.. నర్గిస్ అతని ముందు కూర్చునేటప్పటికి నోట్లోంచి మాట పెగలక తత్తరపడ్డాడట. దాంతో ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఆ పాజ్‌ను చాలా ఏళ్ల తర్వాత కనెక్ట్ చేస్తే సునీల్ దత్ సినిమాల్లోకి వచ్చాడు. ‘మదర్ ఇండియా’లో నర్గిస్‌కు కొడుకుగా నటించాడు. తర్వాత ఆమె జీవిత భాగస్వామి కూడా అయ్యాడు. సైఫ్ అలీ ఖాన్‌కు రావాల్సింది.. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే.. సినిమా ఎంత హిట్టో చెప్పడానికి ఇక్కడ ప్రత్యేకంగా విశేషణాలు పేర్చాల్సిన పనిలేదు. అయితే అందులోని రాజ్ మల్హోత్రా (హీరో) పాత్రకు ముందుగా సైఫ్ అలీ ఖాన్‌ను ఎంపిక చేశారట. ఒకానొక దశలో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను కూడా అడిగారని వార్త. ఏమైందో తెలియదు స్క్రీన్ మీద మాత్రం షారుఖ్ ఖాన్ కనబడ్డాడు. చదవండి: అలాంటి పాత్రను నేనెందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డా సండే ఫ్లాష్‌బ్యాక్: పాత సినిమాకెళ్తాం నాన్నా! -
మీ టూ: అనురాగ్‌కు మాజీ భార్య మద్దతు
ముంబై: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్ నటులు మద్దుతగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ భార్య నటి కల్కి కోచ్లిన్ కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో కల్కి... ‘ప్రియమైన అనురాగ్ సోషల్ మీడియాల్లో వస్తున్న పుకార్లను మీరు పట్టించుకోకండి. మీ స్కిప్ట్‌లో మహిళల స్వేచ్చ కోరే వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా పరిశ్రమలో మహిళల సమగ్రతను సమర్థిస్తారు. దానికి నేనే సాక్ష్యం. వ్యక్తిగతంగా, వృత్తిపరమంగా నన్ను ఎప్పుడూ మీతో సమానంగా చుశారు. మన విడాకుల తర్వాత కూడా నా చిత్తశుద్ధి కోసం నిలబడ్డారు. నేను నా వర్క్ ప్లేస్‌లో అసౌకర్యం, అసురక్షితకు లోనైనప్పుడు మీరు నాకు మద్దతుగా నిలిచారు’ అంటూ కల్కి రాసుకొచ్చారు. (చదవండి: అనురాగ్ నన్ను ఇబ్బందిపెట్టాడు) అంతేగాక ‘‘ఈ సమయం చాలా ప్రమాదకరమైనది. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ విమర్శించడం, తప్పుడు వాదనలు చేస్తారు. ఇది స్నేహితులను, బంధువులను, కుటుంబాలను నాశనం చేస్తుంది. అలాగే అవసరమైన సమయంలో ప్రేమ పంచే మనుషులే కాకుండా.. చూట్టు ఎవరూ లేనప్పుడు దయ, చూపే వ్యక్తులు కూడా ఉంటారు. అది మీకు కూడా తెలుసు. అయితే అలాంటి గౌరవానికే మీరు కట్టుబడి ఉండండి. ధైర్యంగా ఉండండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి’’ అంటూ ఆమె ప్రకటన విడుదల చేశారు. అయితే దర్శకుడు అనురాగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి పాయల్ శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందిస్తూ.. వెంటనే అనురాగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బాలీవువడ్లో ఇలాంటివి సర్వసాధరమని, ఇకనైన ఇలాంటి ఘటనపై స్పందించాలన్నారు. అనురాగ్ వంటివి వాళ్లను అరెస్టు చేసి మరోసారి ఇలాంటివి జరగకుండా అడ్డుకట్ట వేయాలని మండిపడ్డారు. (చదవండి: నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: అనురాగ్) View this post on Instagram @anuragkashyap10 A post shared by Kalki (@kalkikanmani) on Sep 20, 2020 at 11:13pm PDT -
చిన్నప్పుడు
ఇది వినకూడని సంగతైతే కాదు కానీ, తెలుసుకుంటే పోయేదేమీ లేని విషయమే. కల్కీ కోక్లాన్ పేరు కొత్తగా ఉన్నట్లే.. ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి కూడా కొత్తగానే ఉంది. కల్కి ఫ్రెంచి సంతతి భారతీయ నటి. బాలీవుడ్లో ఆమె మంచి సినిమాలే చేస్తున్నారు. వాటిల్లో ఒక మంచి సినిమా ‘జిందగి న మిలేగి దొబారా’. చిన్నప్పుడు స్కూల్లో ‘వెరీ నాటీ’ ఉండేదట కల్కి. ‘‘టీచర్ అలా బయటికి వెళ్లగానే ఇలా బాయ్స్‌ని కిస్ చేసేదాన్ని. అప్పుడు వాళ్లు చికాగ్గా బుగ్గలు తుడుచుకుంటుంటే నాకు భలే సరదాగా ఉండేది. యు నో.. ఆ ఏజ్‌లో మగపిల్లలు ఆడపిల్లల్ని అమితంగా ద్వేషిస్తుంటారు. ఆ ద్వేషం వాళ్ల ముఖంలో కనిపించేస్తుంటుంది. వాళ్లు అలా ఉన్నప్పుడు తటాలున వెళ్లి ముద్దు పెట్టేసేదాన్ని. టీచర్ బయటికి వెళుతోందంటే.. అబ్బాయిలు నేనేం చేస్తానని ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండేవాళ్లు. కొందరైతే టీచర్ తోపాటు జంప్..’’ అని కల్కీ ఒకటే నవ్వడం! -
వేశ్య అని వేధించేవారు: బాలీవుడ్ నటి
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు, వివాదాలపై ఏ మాత్రం జంకకుండా తన అభిప్రాయాలను వెల్లబుచ్చడంలో బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఎప్పుడూ ముందుంటారు. ఫ్రాన్స్‌కు చెందిన కల్కి బాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపుపొందారు అంతేకాకుండా ఏ విషయంలోనైనా నిక్కశ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. అయితే తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అవమాన సంఘటనలు తాజాగా అభిమానులతో పంచుకున్నారు. తొలి చిత్రం ‘దేవ్ డి’తర్వాత ఎన్నో అవమానాలతో పాటు పరోక్షంగా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ చిత్రంలో వేశ్య పాత్ర పోషించడంతో తనను రష్యన్ వేశ్య అని వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?) ‘దేవ్ డి చిత్రం విడుదలైన తర్వాత ఓ ఆంగ్ల పత్రికలో ఇలాంటి రష్యన్ వేశ్యలను బాలీవుడ్‌కు ఎందుకు తీసుకొస్తారో తెలియదు అని పరోక్షంగా నా గురించి ఓ వార్త రాశారు. ఇది చదివాక నేను చాలా బాధపడ్డాను. అయితే నేను రష్యా నుంచి రాలేదు కదా అనుకున్నా. ఇక 2013లో కల్కి.. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే కలిసి ‘యే జవానీ హై దివానీ’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించినా నాకు సరైన అవకాశాలు రాలేదు. దీంతో కొంత కాలం ఖాళీగా ఉన్నాను. ఈ క్రమంలో ఓ సినిమా నిర్మాత సినిమా అవకాశం ఇస్తానని చెప్పి పరోక్షంగా లైంగికంగా వేధించాడు. ఈ లైంగిక వేధింపులు, అవమానాలు కేవలం బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్లో కూడా ఉంటాయి. ఒక సారి హాలీవుడ్లో నటించడానికి వెళితే ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు రష్యన్ వేశ్య అని అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఓ మహిళ నా దగ్గరకు వచ్చి నీ ముఖ్యంపై ముడతలు కనిపించడంలేదు, ఎక్కువగా నవ్వకు, జట్టు పైకి కట్టుకో అంటూ బెదిరించింది. ఇలా అన్ని చోట్లా అవమానాలు, వేధింపులు భరించాను. అంతేకాకుండా నేను పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో అందరూ ఆ బిడ్డకు తండ్రెవరు అంటూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఇప్పటికీ సమాజం ఓ తప్పుగా భావిస్తుంది. నా ఇంట్లోవారికి నా పక్కింటి వారికి నేనుంటున్న కాలనీ మొత్తానికి నాకు పెళ్లి కాలేదని తెలుసు. కానీ వాళ్లెప్పుడూ నన్ను వేలెత్తి ప్రశ్నించింది లేదు. ఇక నేను తల్లిని కాబోతుండటంతో నన్ను సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు ఈ ఆలోచనా విధానం మారాలి’అని కల్కి పేర్కొన్నారు. రీసెంట్గా ఈ భామ సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రెడ్ గేమ్స్’ లో కనిపించిన విషయం తెలిసిందే. -
బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?
ముంబై : తాను తల్లి కాబోతున్నానని ప్రకటించిన నాటి నుంచి బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్‌ను వివాహం చేసుకున్న కల్కి.. 2015లో అతడి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె... జెరూసలేం(ఇజ్రాయెల్)కు చెందిన పియానిస్ట్ గయ్ హర్ష్‌బర్గ్‌తో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం గర్భం దాల్చిన కల్కి.. తాను త్వరలోనే మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించబోతున్నానంటూ సన్నిహితులు, అభిమానులతో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బేబీ బంప్‌తో కనిపిస్తున్న కల్కి ఫొటోలను కొంతమంది నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ‘ బిడ్డను కంటున్నావు సరే. మరి నీ భర్త ఎక్కడ. నువ్వసలు ఇలా చేస్తావని అనుకోలేదు. సరే జరిగిందేదో జరిగింది. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు. సౌకర్యవంతంగా ఉండే దుస్తులు వేసుకో’ అంటూ చివాట్లు పెడుతూనే జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ విషయంపై స్పందించిన కల్కి పింక్‌విల్లాతో మాట్లాడుతూ... ‘ నేను సెలబ్రిటీ కాబట్టి అందరూ నాపై దృష్టిసారిస్తున్నారు. ఒకవేళ నేను కూడా సెలబ్రిటీ కాకపోయినా నా అభిప్రాయాలు, నిర్ణయాలకు అందరి ఆమోదం లభించదు. నన్ను తిడుతున్న వాళ్లతో పాటు అండగా నిలిచేవాళ్లు కూడా ఉన్నారు. అయితే వారంతా నాకు నేరుగా ఎదురుపడటం లేదు. ఎవరు ఏమన్నా ఇది నా జీవితం. ఇక ఎవరి సంగతి ఎలా ఉన్నా మా అపార్టుమెంటులో చాలా మందికి తెలుసు... నేను డివోర్సీని. నాకు ఇప్పుడు పెళ్లి కాలేదు అని. అయినా కొంతమంది ఆంటీవాళ్లు నా పట్ల ప్రేమపూర్వకంగానే ఉంటున్నారు. తినడానికి ఏమైనా చేసి పెట్టాలా అమ్మా అని అడుగుతున్నారు. వాళ్లు నిజంగా నాకు ఎంతో మనోస్థైర్యాన్ని ఇస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఇరవైల్లోనే.... డివోర్సీ అయిన అనురాగ్‌ను పెళ్లి చేసుకున్న కల్కి స్వల్ప కాలంలోనే అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో పాటు, వెబ్‌సిరీస్‌లతోనూ బిజీగా ఉన్నారు. -
తల్లి కాబోతున్నా.. పుట్టేది గే అయినా ఓకే: నటి
ముంబై : త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ తెలిపారు. తన సహచరుడు గయ్ హర్ష్‌బర్గ్‌తో కలిసి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఐదు నెలల గర్భవతిని అని.. గోవాలో ప్రసవం కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ లేదా థర్‌్డ జెండర్ అయినా ఫరవాలేదని.. తన కోసం సూటయ్యే పేరును ఇప్పటికే ఎంపిక చేశానని చెప్పుకొచ్చారు. కాగా దేవ్ డీ, రిబ్బన్, గల్లీబాయ్ వంటి పలు చిత్రాల్లో నటించిన కల్కి.. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2015లో వీరిద్దరు సామరస్యపూర్వకంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లోని జెరూసలేంకు చెందిన పియానిస్ట్ గయ్‌తో సహజీవనం చేస్తున్న కల్కి.. మాతృత్వాన్ని ఆస్వాదించే సమయం వచ్చినందున బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతుండటం గురించి కల్కి మాట్లాడుతూ.. ‘నా బిడ్డతో ఎప్పుడు కనెక్ట్ అవాలో నాకు తెలుసు. ఇందుకోసం ప్రత్యేక నియమ నిబంధనలు ఏవీ పెట్టుకోలేదు. తను ఆడైనా, మగ అయినా, గే అయినా నా ప్రేమలో తేడా ఉండదు. లింగవివక్ష వేళ్లూనుకుపోయిన ఈ ప్రపంచంలో నా బిడ్డ పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో పెరగాలన్నదే నా అభిమతం. తన కోసం ఇప్పటికే పేరును కూడా ఎంపిక చేశాను. గర్భవతిని అయ్యాక నాలో చాలా మార్పులు వచ్చాయి. నెమ్మదిగా నడుస్తున్నా. ఓపిక బాగా పెరిగింది. మాతృత్వంలో ఉన్న గొప్పదనం అంటే ఇదేనేమో. గోవాలో పురుడుపోసుకోవాలని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. ఇరవైల్లోనే పెళ్లి చేసుకుని తప్పు చేశానని.. ఇప్పుడు తన ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ఇక అనురాగ్ కశ్యప్ కూడా భార్య నుంచి విడిపోయిన అనంతరం కల్కిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కల్కితో కూడా అతడి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. -
డిజిటల్ ఎంట్రీ
నెట్‌ఫ్లిక్స్ తమిళంలో ఓ వెబ్ యాంథాలజీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ వెబ్ యాంథాలజీ (పలువురు దర్శకులు పలు కథలతో ఒక సినిమాగా రూపొందించడాన్ని యాంథాలజీ అంటారు) రూపొందించడం కోసం నలుగురు దర్శకులను కూడా సంప్రదించింది. గౌతమ్ మీనన్, సుధా కొంగర, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్ ఒక్కో భాగాన్ని డైరెక్ట్ చేస్తారు. పరువు హత్యల నేపథ్యంలో ఈ యాంథాలజీ సాగు తుందని సమాచారం. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించే భాగం చిత్రీకరణ కూడా మొదలైందట. ఇందులో అంజలి, బాలీవుడ్ నటి కల్కీ కొచ్లిన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇదే అంజలి డిజిటల్ ఎంట్రీ కావడం విశేషం. మిగతా దర్శకుల భాగాల్లో నటించే వారి వివరాలు తెలియాలి. -
వెబ్ ఇంట్లోకి...
అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్స్ వైపు కూడా ఆడియన్స్ దృష్టి సారిస్తున్నారు. కంటెంట్ ఉన్న వెబ్‌సిరీస్‌లను బాగా ఆదరిస్తున్నారు. అందుకే యాక్టర్స్ కూడా అటువైపు ఓ కన్నేశారు. ఆసక్తికరమైన పాత్రలకు అవకాశం వచ్చినప్పుడు వెబ్ ఇంట్లో వాలిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో తన పేరును కూడా రాయించుకున్నారు నటి భూమిక చావ్లా. ‘భ్రమ్’ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ ప్రధాన పాత్రధారి. ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఎక్కువ శాతం షూటింగ్‌ను సిమ్లాలో ప్లాన్ చేశారు. సంజయ్ సూరి, ఓంకార్ కపూర్, ఐజాజ్ ఖాన్ ఈ సిరీస్‌లో కీలక పాత్రధారులు. -
కల్కీ కిక్
స్పెషల్ సాంగ్స్ మాస్ ఆడియన్స్‌కు స్పెషల్ కిక్ ఇస్తాయి. అందులోని డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయేలా ఉంటే థియేటర్స్‌లో ఆడియన్స్ ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. ఈ మ్యాజిక్‌నే క్రియేట్ చేయడానికి అజిత్ అండ్ టీమ్ ప్లాన్ వేసింది. బాలీవుడ్ స్పెషల్ సాంగ్స్ ఫేమ్ కల్కీ కొచ్లిన్‌తో స్పెషల్ సాంగ్‌ను షూట్ చేసింది ‘నేర్కొండ పార్వై’ టీమ్. అజిత్, శ్రద్ధాశ్రీనాథ్, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా టరియాంగ్ ప్రధాన పాత్రల్లో విద్యాబాలన్ కీలక పాత్ర చేసిన చిత్రం ‘నేర్కొండ పార్వై’. బోనీ కపూర్ నిర్మించారు. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన ‘పింక్’ చిత్రానికి ఇది తమిళ రీమేక్. ఈ సినిమాలో కల్కీతో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. ‘‘ఇదొక పెప్పీ సాంగ్. ఇందులో క్యాప్ అండ్ హిప్పీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. కల్కీనే కరెక్ట్ అనిపించింది. ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేశారు’’ అన్నారు బోనీ. ఈ సినిమాలో అజిత్ భార్యగా విద్యాబాలన్ నటించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానుంది. -
ధైర్యం కావాలి
ఈ ఏడాది ఫుల్ రైజింగ్‌లో ఉన్నారు కథానాయిక రాధికా ఆప్టే. ఇటు బాలీవుడ్ సినిమాలతో పాటు అటు హాలీవుడ్ చాన్స్‌లను దక్కించుకుంటున్నారు. మరోవైపు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ మరో హిందీ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తారు. అలాగే కల్కి కోచ్లిన్ మరో కథానాయిక. మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో ఓ డైనమిక్ లేడీ పాత్రలో కనిపించనున్నారు రాధిక. ‘‘ఓ ఖాళీ ప్రదేశంలో కనిపించకుండా ఉన్నారు. వారిని దాటుకుంటూనే చాలామంది వెళ్తుంటారు. ఆ కనిపించనివారికి హలో కూడా చెప్పవచ్చు. కానీ వాళ్ల గురించి తెలుసుకోవడానికి మాత్రం ధైర్యం కావాలి. కమింగ్ సూన్’’ అని ఈ సినిమా కథనాన్ని వివరించే ప్రయత్నం చేశారు రాధిక. ‘‘ఈ మూవీలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను. ఈ నెల 13న మరిన్ని వివరాలు చెబుతాం’’ అని రాజ్‌కుమార్ రావు పేర్కొన్నారు. -
రానాకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో రానా ప్రస్తుతం పీరియాడిక్ జానర్లో తెరకెక్కుతున్న హాథీ మేరీ సాథీ సినిమాలో నటిస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెలుగులో అరణ్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రానాకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్లో విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్న కల్కి కొచ్చిన్, అరణ్యలో రానాకు జోడీగా నటించనుంది. పాండిచ్చేరిలో పుట్టి పెరిగిన కల్కికి తమిళ్ చాలా బాగా వచ్చు. అందుకే సౌత్ సినిమాలో అవకాశం వచ్చిన వెంటనే ఒప్పేసుకుంది. -
'కరణ్ ఎటువంటి తప్పుచేయలేదు'
ముంబై: సినిమాలను టార్గెట్ చేయడం బాధాకరమని దర్శకురాలు జోయ అక్తర్ అన్నారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాపై వివాదం రేగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ఎటువంటి తప్పుచేయలేదని, చట్టాలను ఉల్లంఘించలేదన్నారు. భారత్-పాకిస్థాన్ సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా షూటింగ్ చేశాడని వెల్లడించారు. సినిమా విడుదల సమయానికి పరిస్థితులు మారిపోవడంతో అతడిపై దాడి చేస్తున్నారని వాపోయారు. పాకిస్థాన్ నటీనటులకు కేంద్ర ప్రభుత్వమే వీసాలు మంజూరు చేసిందని గుర్తుచేశారు. పాక్ కళాకారులు ఇక్కడ చట్టబద్దంగానే పనిచేస్తున్నారని చెప్పారు. ఎటువంటి సెన్సార్ రిష్ అయినా బాధాకరమని నటి కల్కీ కొచ్లిన్ అన్నారు. ఏ సినిమా చూడాలో, చూడకూడదో ఎంచుకునే స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని ధియేటర్ల యజమానుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దరూ ఈవిధంగా స్పందించారు. -
బైకుపై హీరోయిన్ సాహసయాత్ర!
జీవితమంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు.. గమ్యం కోసం చేసే ప్రయాణమని చెప్తారు. దేశాంతర సంచారాలు చేసే ప్రయాణికులు, సాహసికులకు అది నిజమే అనిపిస్తోంది. ప్రయాణం ఎన్నో మధురానుభూతుల్ని మిగిలిస్తుంది. ప్రయాణం జీవితాన్ని కొత్తగా అందంగా చూపిస్తుంది. సరికొత్త ఊపిరినింపుతుంది. అందుకే ప్రయాణాలు చేసి కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అదే కోవలో బాలీవుడ్ నటి కల్కీ కొచ్లిన్ సాహసయాత్రకు పూనుకుంది. ఫొటోగ్రాఫర్, బైకర్ అయిన తన తండ్రి జోయెల్ కొచ్లిన్‌తో కలిసి ఆమె బైకులపై సాహసయాత్రకు బయలుదేరింది. ఒక్కటి కాదు రెండు ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల బైకుయాత్ర.. అందమైన ఈశాన్య భారతం మీదుగా, అసోం, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్‌లోని అందమైన ప్రాంతాలను అన్వేషిస్తూ ఆమె ముందుకుసాగింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై తండ్రి, కూతుళ్లు కలిసి చేసిన ఈ సుదీర్ఘ యాత్ర త్వరలో ’ఫాక్స్ లైఫ్’ కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం కానుంది. సాధారణంగా సెలబ్రిటీ ప్రయాణాలు అనగానే విలాసవంతంగా, సుఖవంతంగా ఉంటాయి. అందుకుభిన్నంగా వాస్తవికతతో, విభిన్నమైన దృష్టితో సాగే ఈ బైకు యాత్ర ఈ నెల 17 నుంచి ’కల్కీస్ గ్రేట్ ఎస్కేప్’ షో పేరిట ప్రసారం కానుంది. -
'టెర్రరిస్టు'తో హీరోయిన్ డేటింగ్!
ముంబై: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయి కొన్ని నెలలుగా నటి కల్కి కొచ్లిన్ దూరంగా ఉంటోంది. అయితే ఆమె ఇటీవల ఓ కొత్త వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. కల్కి డేటింగ్ గురించి బాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే టెర్రిరిస్టుతో డేటింగ్ చేయడమేంటని కంగారు పడకండి. ఆ వివరాలపై ఓ లుక్కేద్దామా మరి. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కల్కి చాలా ఫాస్ట్. ఇటీవల విడుదలై బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిండంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ 'నీర్జా'. ఈ సినిమాలో కరడుగట్టిన టెర్రరిస్టుగా జిమ్ సరభ్ కనిపిస్తాడు. పాక్ టెర్రరిస్టుగా నటించిన జిమ్, ఎయిర్ హోస్టెస్ నీరజా బానోతు(సోనమ్ కపూర్)తో పాటు విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తాడు జిమ్. జిమ్, కల్కి గత కొంత కాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. రిలేషన్ పై వారిద్దరూ కాస్త సీరియస్ గా కనిపిస్తున్నారన్న వార్త స్థానిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుండటంతో వీరి డేటింగ్ విషయం గుప్పుమంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా 2009లో వచ్చిన 'డేవ్.డి'తో బెస్ట్ సపోర్టింగ్ నటిగా అవార్డు అందుకున్న కల్కి ఆ తరువాత మరిన్ని మూవీల్లో నటనకుగానూ ఎన్నో అవార్డులు సాధించింది. అయితే రియల్ స్టోరీ 'నీర్జా' మూవీతో పేరు తెచ్చుకున్న జిమ్ అప్పుడే మంచి స్టార్ నటితో డేటింగ్ మొదలెట్టడంతో వీరి రిలేషన్ పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. -
'అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు'
ముంబై: బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు..'మార్గరిటా' విత్ ఏ స్ట్రా చిత్రాన్ని స్పెషల్ షోలో చూసిన అమీర్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తారని హీరోయిన్ కల్కి కోయిచ్లిన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ చిత్రంలో ఏముంటిందిలే అంటూ.. భార్య కిరణ్ రావు బలవంతం మీదే మార్గరిటా చిత్రాన్ని అమీర్ ఖాన్ చూశారని, అయితే ఈ సినిమా చూసే సమయంలో అమీర్ కంటతడి పెట్టకుండా ఉండలేక పోయారన్నారు. అమీర్‌కి ఈ సినిమా బాగా నచ్చిందన్నారని కల్కి చెప్పారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరి ప్రశంసలు అందుకున్న తర్వాత భారత అభిమానుల ముందుకు ఈ చిత్రం త్వరలో రాబోతోంది. ఈ చిత్రంలో కల్కి ఒక 'మస్తిష్క పక్షవాతం'(సెరెబ్రల్ పల్సి) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పాత్రలో నటించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షోకి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటు ఆయన భార్య జయాబచ్చన్ కూడా వచ్చి తిలకించారు. -
దేడ్ ఇష్కియా ప్రీమియర్ షో