ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు, వివాదాలపై ఏ మాత్రం జంకకుండా తన అభిప్రాయాలను వెల్లబుచ్చడంలో బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఎప్పుడూ ముందుంటారు. ఫ్రాన్స్‌కు చెందిన కల్కి బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపుపొందారు అంతేకాకుండా ఏ విషయంలోనైనా నిక్కశ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. అయితే తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అవమాన సంఘటనలు తాజాగా అభిమానులతో పంచుకున్నారు. తొలి చిత్రం ‘దేవ్ డి’తర్వాత ఎన్నో అవమానాలతో పాటు పరోక్షంగా లైంగిక వేధింపులను ఎదుర్కొన్న విషయాన్ని బయటపెట్టారు. ఈ చిత్రంలో వేశ్య పాత్ర పోషించడంతో తనను రష్యన్ వేశ్య అని వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?)
‘దేవ్ డి చిత్రం విడుదలైన తర్వాత ఓ ఆంగ్ల పత్రికలో ఇలాంటి రష్యన్ వేశ్యలను బాలీవుడ్‌కు ఎందుకు తీసుకొస్తారో తెలియదు అని పరోక్షంగా నా గురించి ఓ వార్త రాశారు. ఇది చదివాక నేను చాలా బాధపడ్డాను. అయితే నేను రష్యా నుంచి రాలేదు కదా అనుకున్నా. ఇక 2013లో కల్కి.. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే కలిసి ‘యే జవానీ హై దివానీ’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించినా నాకు సరైన అవకాశాలు రాలేదు. దీంతో కొంత కాలం ఖాళీగా ఉన్నాను. ఈ క్రమంలో ఓ సినిమా నిర్మాత సినిమా అవకాశం ఇస్తానని చెప్పి పరోక్షంగా లైంగికంగా వేధించాడు. ఈ లైంగిక వేధింపులు, అవమానాలు కేవలం బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లో కూడా ఉంటాయి.
ఒక సారి హాలీవుడ్‌లో నటించడానికి వెళితే ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు రష్యన్ వేశ్య అని అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఓ మహిళ నా దగ్గరకు వచ్చి నీ ముఖ్యంపై ముడతలు కనిపించడంలేదు, ఎక్కువగా నవ్వకు, జట్టు పైకి కట్టుకో అంటూ బెదిరించింది. ఇలా అన్ని చోట్లా అవమానాలు, వేధింపులు భరించాను. అంతేకాకుండా నేను పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో అందరూ ఆ బిడ్డకు తండ్రెవరు అంటూ సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఇప్పటికీ సమాజం ఓ తప్పుగా భావిస్తుంది. నా ఇంట్లోవారికి నా పక్కింటి వారికి నేనుంటున్న కాలనీ మొత్తానికి నాకు పెళ్లి కాలేదని తెలుసు. కానీ వాళ్లెప్పుడూ నన్ను వేలెత్తి ప్రశ్నించింది లేదు. ఇక నేను తల్లిని కాబోతుండటంతో నన్ను సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు ఈ ఆలోచనా విధానం మారాలి’అని కల్కి పేర్కొన్నారు. రీసెంట్‌గా ఈ భామ సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రెడ్ గేమ్స్’ లో కనిపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment