'అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు' | Aamir Khan Cried After Watching Margarita: Kalki Koechlin | Sakshi
Sakshi News home page

'అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు'

Published Sat, Apr 11 2015 11:18 AM | Last Updated on Sun, Sep 3 2017 12:10 AM

'అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు'

'అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు'

ముంబై: బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు..'మార్గరిటా' విత్ ఏ స్ట్రా చిత్రాన్ని స్పెషల్ షోలో చూసిన అమీర్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తారని హీరోయిన్ కల్కి కోయిచ్‌లిన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ చిత్రంలో ఏముంటిందిలే అంటూ.. భార్య కిరణ్ రావు బలవంతం మీదే మార్గరిటా చిత్రాన్ని అమీర్ ఖాన్ చూశారని, అయితే ఈ సినిమా చూసే సమయంలో అమీర్ కంటతడి పెట్టకుండా ఉండలేక పోయారన్నారు. అమీర్కి ఈ సినిమా బాగా నచ్చిందన్నారని కల్కి చెప్పారు.  

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరి ప్రశంసలు అందుకున్న తర్వాత భారత అభిమానుల ముందుకు ఈ చిత్రం త్వరలో రాబోతోంది. ఈ చిత్రంలో కల్కి ఒక 'మస్తిష్క పక్షవాతం'(సెరెబ్రల్ పల్సి) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పాత్రలో నటించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షోకి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటు ఆయన భార్య జయాబచ్చన్ కూడా వచ్చి తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement