cried
-
సినిమా రిలీజ్ కాదన్నారు.. వారం క్రితం ఏడ్చేశాను: నిఖిల్
Nikhil Says He Cried About Karthikeya 2 Movie Release Problems: టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. 'హ్యాపీ డేస్' సినిమాతో వెండితెరకు పరిచయమైన నిఖిల్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' రానున్న విషయం తెలిసిందే. ఇందులో నిఖిల్‌కు జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ మూవీ అనేక వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్రబృందం వినూత్నంగా కాంటెస్ట్‌లు కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'కార్తికేయ 2' సినిమా విడుదల విషయంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయని, ఒకానొక సమయంలో ఏడ్చాను అని తెలిపాడు నిఖిల్. ''ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలను ఇటు అటు నెట్టేస్తారని అంటారు కదా.. అలానే మా సినిమాకు జరిగింది. నిజం చెప్పాలంటే ఒక ఐదు రోజుల క్రితం సినిమా రిలీజ్ డేట్ ఆగస్ట్ 12 అని ప్రకటించేటప్పుడు.. అది కూడా వద్దని చెప్పారు. చదవండి: నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీ కాంటెస్ట్.. గెలిస్తే రూ. 6 లక్షలు ప్రియుడితో బర్త్‌డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ అక్టోబర్‌కు వెళ్లిపోండి. నవంబర్‌కు వెళ్లిపోండి. ఇప్పుడు అప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు. మీకు షోస్ దొరకవు. థియేటర్లు ఇవ్వము. అన్న స్టేజ్ వరకు వెళ్లింది. అప్పుడు నేను ఏడ్చాను. నేను నిజానికి చాలా స్ట్రాంగ్ పర్సన్‌ను. హ్యాపీ డేస్ సినిమా నుంచి ఇప్పటివరకు మూవీ విడుదల కాదు, థియేటర్లు దొరకవు అని ఎప్పుడు అనిపించలేదు. ఒక వారం క్రితం అయితే ఏడ్చేశాను. నువ్ ఎంత కష్టపడినా నీ సినిమా రిలీజ్ అవ్వదురా అని అన్నప్పుడు బాధేసింది. చివరికీ మా నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ సపోర్ట్‌తో పట్టుబట్టి ఆగస్టు 12కే వస్తున్నాం అని ప్రకటించాం'' అని నిఖిల్ పేర్కొన్నాడు. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ -
థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్
Sadha Cried In Theater While Watching Major Movie: 'జయం' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయింది ముద్దుగుమ్మ సదా. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుని వెళ్లవయ్యా వెళ్లు అంటూ యూత్ హృదయాలను కొల్లగొట్టింది. తర్వాత దొంగ దొంగది, అవునన్నా కాదన్నా, అపరిచితుడు, ప్రియసఖి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ థియేటర్లో కన్నీళ్లు పెట్టుకుంది. తన మనసుకు ఆ సినిమా ఎంతగానో చేరువైందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకి ఆ సినిమా ఏంటంటే ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన 'మేజర్'. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీకి ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఈ విధంగానే తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సదా ఎమోషనల్ అయింది. ఫస్ట్ ఆఫ్‌లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తను ముంబయిలోనే ఉన్నాని, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొంది. శశి కిరణ్ కథను తెరకెక్కించిన విధానం, అడవి శేష్ నటన అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిచింది. View this post on Instagram A post shared by Major (@majorthefilm) -
డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
A Women Cried After Watching The Kashmir Files Movie: సామాజిక అంశాలను తన సినిమాలతో వేలెత్తి చూపే బాలీవుడ్ దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందింది ఈ సినిమా. ఈ సినిమా మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చింది హర్యానా ప్రభుత్వం. హర్యానా ప్రభుత్వపు అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 'ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకు హర్యానా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తుంది' అని ట్వీట్ చేసింది. हरियाणा सरकार ने फिल्म #TheKashmirFiles को राज्य में टैक्स फ्री कर दिया है। #Haryana #DIPRHaryana pic.twitter.com/Zg8XWC8OoV — DPR Haryana (@DiprHaryana) March 11, 2022 बहुत आभार माननीय @mlkhattar जी। corona काल की आर्थिक समस्याओं के बाद सामान्य परिवारों को यह फ़िल्म देखने में आपका यह निर्णय काफ़ी मदद करेगा। साथ ही सिनेमा हॉल का व्यवसाय भी मज़बूती पकड़ेगा। 🙏🙏🙏 https://t.co/VNZNqcai9U — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 11, 2022 ఈ విషయంపై మూవీ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి స్పందించారు. తన సినిమాకు పన్ను మినహాయింపు చేసినందుకు హర్యానా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్ వివేక్, నటుడు దర్శన్ కుమార్ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్, దర్శన్ కుమార్ సైతం కంటతడి పెట్టుకున్నారు. Presenting #TheKashmirFiles It’s your film now. If the film touches your heart, I’d request you to raise your voice for the #RightToJustice and heal the victims of Kashmir Genocide.@vivekagnihotri @AnupamPKher @AdityaRajKaul pic.twitter.com/Gnwg0wlPKU — Suresh Raina🇮🇳 (@ImRaina) March 11, 2022 -
బుడి బుడి అడుగులు చూడలేదని ఏడ్చేశా!
లండన్: అమెరికన్ టెన్నిస్ నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు ఆటంటే ప్రాణం. అందుకే గర్భంతోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడింది. ఇప్పుడు తన చిన్నారే ఆమె లోకం. ఆ గారాలపట్టిని ముద్దు చేయడానికి, మురిపెంగా చూసుకోవడానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అలా అని ఆటని వదలట్లేదు. తన అమ్మాయిని వీడి ఉండట్లేదు. ప్రస్తుతం వింబుల్డన్ ఆడేందుకు కుమార్తె ఒలింపియాతో కలిసి ఇక్కడికి వచ్చిన సెరెనా ప్రాక్టీస్ సమయంతో తన చిట్టితల్లికి దూరమవుతోంది. ఇదే ఆమె మనసుకు భారమవుతున్నట్లుంది. అందుకేనేమో చిన్నారి తొలిసారిగా వేసే బుడిబుడి అడుగులు చూడలేకపోయినందుకు తెగ ఏడ్చేశానని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘ఇది 2018 అని తెలుసు. ఆధునిక యుగమని తెలుసు. కానీ అమ్మ అమ్మే కదా. సహజంగా నేనూ అంతే. అందుకే ఆ చిన్ని సంగతులన్నీ విశేషాలుగానే తోస్తాయి. ఈ ఆనంద క్షణాలన్నీ పంచుకోవాలనుకుంటా’నని సెరెనా పేర్కొంది. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన సెరెనా వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు చేరింది. -
'అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు'
ముంబై: బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు..'మార్గరిటా' విత్ ఏ స్ట్రా చిత్రాన్ని స్పెషల్ షోలో చూసిన అమీర్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తారని హీరోయిన్ కల్కి కోయిచ్లిన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ చిత్రంలో ఏముంటిందిలే అంటూ.. భార్య కిరణ్ రావు బలవంతం మీదే మార్గరిటా చిత్రాన్ని అమీర్ ఖాన్ చూశారని, అయితే ఈ సినిమా చూసే సమయంలో అమీర్ కంటతడి పెట్టకుండా ఉండలేక పోయారన్నారు. అమీర్‌కి ఈ సినిమా బాగా నచ్చిందన్నారని కల్కి చెప్పారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరి ప్రశంసలు అందుకున్న తర్వాత భారత అభిమానుల ముందుకు ఈ చిత్రం త్వరలో రాబోతోంది. ఈ చిత్రంలో కల్కి ఒక 'మస్తిష్క పక్షవాతం'(సెరెబ్రల్ పల్సి) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పాత్రలో నటించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షోకి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటు ఆయన భార్య జయాబచ్చన్ కూడా వచ్చి తిలకించారు. -
'కన్నీళ్లు పెట్టిన మంత్రులు' !
హైదరాబాద్: శాసనమండలి సమావేశాల చివరి రోజైన శుక్రవారం చైర్మన్ స్వామిగౌడ్ జూబ్లీహాలు ప్రాంగణంలో మంత్రులు, సభ్యులతో ఫొటోషూట్ ఏర్పాటు చేయిం చారు. మండలి చైర్మన్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ సభ్యులంతా ఫొటోలు దిగడానికి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో దానికితోడు అంతా ఎదురెండకు కూర్చోవడంతో.. ఎండతీవ్రత, వెలుతురుకు కళ్లు మూతపడకుండా ఉండడానికి నానా తంటాలు పడ్డారు. హరీశ్‌రావు మధ్యలో ఓసారి లేచి, మళ్లీ కూర్చున్నారు. ఈ సమయంలో ఎండ తీవ్రతకు ఈటెల, హరీశ్‌రావు కళ్లలో నీళ్లు వచ్చాయి. త్వరగా ఫొటోలు దిగి లాబీల్లోకి వచ్చిన మంత్రి ఈటెల.. ‘సూర్యుడి కళ్లలోకి సూటిగా చూసే ధైర్యం ఎవరు చేస్తారు.’ అని సరదాగా అన్నారు. వెంటనే కొందరు మీడియా ప్రతినిధులు.. ‘కన్నీళ్లు పెట్టుకున్న మంత్రులు..’ అనడంతో నవ్వులు పూశాయి. గ్రాఫిక్స్‌లో కలిపేస్తే సరి.. మంత్రులు, ఎమ్మెల్సీలంతా ఫొటోలు దిగేట ప్పుడు.. పదవీకాలం త్వరలో ముగియబోతున్న పలువురు ఎమ్మెల్సీలు ముందు వరుసలో చైర్మన్, మంత్రులు, విపక్షనేత డీఎస్‌తో కుర్చీల్లో కూర్చున్నారు. మిగతా ఎమ్మెల్సీలు వెనుక నిలబడ్డారు. అయితే ఈ గ్రూప్ ఫొటో తీసే సమయంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్, పొంగులేటి సుధాకరరెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు అక్కడలేరు. టీ బ్రేక్ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వెళ్లిన వారంతా.. ఫొటోలు తీయడం పూర్తయ్యాక వచ్చారు. దీంతో ఈ ముగ్గురూ విడిగా ఫోటో దిగారు.ప్రస్తుతం మారిన సాంకేతిక యుగంలో విడిగా తీసిన ఫొటోలను కూడా గ్రూపు ఫొటోలో జత చేయవచ్చని ఫోటోగ్రాఫర్ చెప్పడంతో.. తమ ఫోటోలనూ అందు లో కలపాలని చెప్పారు. ‘ఆఖరిరోజు సీఎం ఎలాగూ రాలేదు.. ఆయన ఫొటోను కూడా కలపవయ్యా..’ అని టీడీపీ సభ్యుడు అరికెల నర్సారెడ్డి అనడంతో అందరూ నవ్వేశారు. 17 మంది ఎమ్మెల్సీలకు వీడ్కోలు పదిమంది శాసనమండలి సభ్యుల పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. మరో ఏడుగురు సభ్యుల పదవీకాలం మే ఒకటో తేదీతో ముగియనుంది. ఈ పది హేడు మంది శాసనమండలి సభ్యులకు మం డలి చివరిరోజు శుక్రవారం వీడ్కోలు పలికారు. డి.శ్రీనివాస్‌తో పాటు కె.ఆర్.ఆమోస్, నాగపురిరాజలింగం, కె.యాదవరెడ్డి, నేతి విద్యాసాగర్, వి.భూపాల్‌రెడ్డి ,భానుప్రసాద్‌రావు, ఎస్.జగదీశ్వర్‌రెడ్డి రిటైరయ్యే వారిలో ఉన్నారు. వీరితో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, బోడకుంటి వెంకటేశ్వర్లు, పి.నరేందర్‌రెడ్డి, పొట్ల నాగేశ్వర్రావు, పీర్‌షబ్బీర్ అహ్మద్, అరికెల నర్సారెడ్డి, డాక్టర్ కె.నాగేశ్వర్, కపిలవాయి దిలీప్‌కుమార్, బి.వెంకట్రావుల ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తోంది. మార్చి 29న కొందరు, మే ఒకటో తేదీన మరికొందరు.. మొత్తంగా నెల రోజుల వ్యవధిలోనే పదిహేడుమంది సభ్యులు మాజీలుగా మారుతున్నారు. కాగా, ఇటీవలే ముగిసిన పట్టభద్రుల నియోజక వర్గ ఎన్నికల్లో విజయం సాధించిన రామచందర్‌రావు (బీజేపీ), పల్లారాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్)లు కొత్త సభ్యులుగా వచ్చే సమావేశాలకు హాజరు కానున్నారు. మళ్లీ సమావేశాలు జరిగే నాటికి అటు ఎమ్మెల్యే కోటా, ఇటు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
లొకేషన్లోనే ఏడ్చేసిన దీపికా పదుకొనే
ఆరోజు ఎప్పటిలానే దీపికా పదుకొనె ఉత్సాహంగా షూటింగ్ స్పాట్‌లోకి అడుగుపెట్టారు. అందరికీ శుభోదయం చెప్పి, తీయబోయే సన్నివేశాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా ప్రిపేర్ అయ్యి, కెమెరా ముందుకెళ్లారు. వన్, టు త్రీ... అంటూ టేక్స్ మీద టేక్స్ తీసుకుంటున్నారు. కట్ చేస్తే.. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి కోపం వచ్చింది. దీపికాని చెడామడా తిట్టేశారు. రణవీర్‌సింగ్, దీపికా జంటగా స్వీయదర్శకత్వంలో భన్సాలీ రూపొందిస్తున్న చిత్రం ‘రామ్‌లీలా’. ఈ చిత్రంలో దీపికా పాత్ర పేరు ‘లీలా’. అది సంజయ్‌లీలా భన్సాలీ తల్లి పేరు. అందుకని, ఈ పేరు పలికినప్పుడల్లా ఆయన మాటల్లో ఓ ఆత్మీయత కనిపించేదట. భన్సాలీ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. పైగా ఆయన తల్లి పేరున్న పాత్ర చేయడం అంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. అందుకే లీలా పాత్రను అద్భుతంగా పోషించి, భన్సాలీ దగ్గర అభినందనలు కొట్టేయాలనుకున్నారు దీపికా. అయితే ఆయన అనుకున్న విధంగా నటించలేక మూడు, నాలుగు సార్లు తిట్లు తిన్నారు. బాధ తట్టుకో లేక ఒక్కోసారి ఏడ్చేశారు కూడా. ఆ విధంగా ఈ షూటింగ్ స్పాట్లో చాలాసార్లు అప్సెట్ అయ్యారు దీపికా. కానీ, షూటింగ్ చివరి రోజున మాత్రం ఆమెకు ‘స్వీట్ షాక్’ తగిలింది. దీపికాకి గుడ్ బై చెబుతూ, ‘పర్ఫెక్షన్ కోసం ఒకటికి రెండు, మూడు సార్లు యాక్ట్ చేయాల్సి వస్తుంది. సీన్ ఓకే అయ్యేవరకు ఏ దర్శకుడికైనా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్‌తో తిట్టేస్తాం. ఏదేమైనా నువ్వు చాలా అద్భుతంగా యాక్ట్ చేశావ్. సూపర్’ అని అభినందించారట భన్సాలీ. షూటింగ్ స్పాట్లో తిట్టినందుకు బాధతో ఏడ్చిన దీపికా... ఈ కాంప్లిమెంట్ అందుకున్న తర్వాత ఆనందంతో కంట తడిపెట్టుకున్నారట.