
లండన్: అమెరికన్ టెన్నిస్ నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు ఆటంటే ప్రాణం. అందుకే గర్భంతోనే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడింది. ఇప్పుడు తన చిన్నారే ఆమె లోకం. ఆ గారాలపట్టిని ముద్దు చేయడానికి, మురిపెంగా చూసుకోవడానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అలా అని ఆటని వదలట్లేదు. తన అమ్మాయిని వీడి ఉండట్లేదు. ప్రస్తుతం వింబుల్డన్ ఆడేందుకు కుమార్తె ఒలింపియాతో కలిసి ఇక్కడికి వచ్చిన సెరెనా ప్రాక్టీస్ సమయంతో తన చిట్టితల్లికి దూరమవుతోంది. ఇదే ఆమె మనసుకు భారమవుతున్నట్లుంది.
అందుకేనేమో చిన్నారి తొలిసారిగా వేసే బుడిబుడి అడుగులు చూడలేకపోయినందుకు తెగ ఏడ్చేశానని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘ఇది 2018 అని తెలుసు. ఆధునిక యుగమని తెలుసు. కానీ అమ్మ అమ్మే కదా. సహజంగా నేనూ అంతే. అందుకే ఆ చిన్ని సంగతులన్నీ విశేషాలుగానే తోస్తాయి. ఈ ఆనంద క్షణాలన్నీ పంచుకోవాలనుకుంటా’నని సెరెనా పేర్కొంది. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన సెరెనా వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment