Sadha Cried In Theater While Watching Major Movie, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sadha Cried In Theater: థియేటర్‌లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్‌

Published Sat, Jun 18 2022 6:07 PM | Last Updated on Sat, Jun 18 2022 7:44 PM

Sadha Cried In Theater While Watching Major Movie - Sakshi

Sadha Cried In Theater While Watching Major Movie: 'జయం' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయింది ముద్దుగుమ్మ సదా. ఒక్క సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుని వెళ్లవయ్యా వెళ్లు అంటూ యూత్ హృదయాలను కొల్లగొట్టింది. తర్వాత దొంగ దొంగది, అవునన్నా కాదన్నా, అపరిచితుడు, ప్రియసఖి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్‌, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ థియేటర్‌లో కన్నీళ్లు పెట్టుకుంది. తన మనసుకు ఆ సినిమా ఎంతగానో చేరువైందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇంతకి ఆ సినిమా ఏంటంటే ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ బయోపిక్‌గా తెరకెక్కిన 'మేజర్‌'. అడవి శేష్‌ హీరోగా న​​టించిన ఈ మూవీకి ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు. ఈ విధంగానే తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సదా ఎమోషనల్‌ అయింది. ఫస్ట్‌ ఆఫ్‌లోనే భావోద్వేగాన్ని కంట్రోల్‌ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తను ముంబయిలోనే ఉన్నాని, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొంది. శశి కిరణ్‌ కథను తెరకెక్కించిన విధానం, అడవి శేష్‌ నటన అద్భుతంగా ఉన్నాయని  ప్రశంసిచింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement