shashi kiran
-
సైకలాజికల్ థ్రిల్లర్
హర్షివ్ కార్తీక్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ అండ్ ది యాక్టర్’ అనేది ట్యాగ్‌లైన్ . ఈ చిత్రంలో స్వర్ణిమ సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ రిలీజ్ వేడుకకి అతిథిగా హాజరైన డైరెక్టర్ శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ– ‘‘బహుముఖం’ టీజర్ బాగుంది. టీజర్ చూస్తుంటే విజువల్స్‌తో పాటుగా సౌండ్‌కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కార్తీక్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు. ‘‘అమెరికాలో చేసిన పక్కా తెలుగు సినిమా ఇది. ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రం చేశాం’’ అన్నారు హర్షివ్ కార్తీక్. చిత్ర సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్, నేపథ్య సంగీతం అందించిన శ్రీ చరణ్ పాకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సహ–నిర్మాత అరవింద్ రెడ్డి. -
ట్రైలర్ చూశాక సినిమాపై ఆసక్తి పెరిగింది
‘‘అథర్వ’ ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి పెరిగింది. ప్రతి విషయాన్ని ఎంతో వివరంగా చూపించారు. పోలీస్ విభాగంలో క్లూస్ టీం గురించి చక్కగా వివరించారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ శశి కిరణ్ తిక్క అన్నారు. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శశి కిరణ్ తిక్క, హీరో చైతన్య రావు రిలీజ్ చేశారు. మహేశ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో క్లూస్ టీమ్ గురించి చూపించబోతున్నాం. సురేష్ ప్రొడక్ష¯Œ ్సతో కలిసి భారీ ఎత్తున రాబోతున్నాం’’ అన్నారు. ‘‘ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సుభాష్ నూతలపాటి, కార్తీక్ రాజు. ఈ కార్యక్రమంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, కెమెరామేన్ చరణ్ మాట్లాడారు. -
థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్
Sadha Cried In Theater While Watching Major Movie: 'జయం' సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం అయింది ముద్దుగుమ్మ సదా. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుని వెళ్లవయ్యా వెళ్లు అంటూ యూత్ హృదయాలను కొల్లగొట్టింది. తర్వాత దొంగ దొంగది, అవునన్నా కాదన్నా, అపరిచితుడు, ప్రియసఖి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సదా యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ థియేటర్లో కన్నీళ్లు పెట్టుకుంది. తన మనసుకు ఆ సినిమా ఎంతగానో చేరువైందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకి ఆ సినిమా ఏంటంటే ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన 'మేజర్'. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీకి ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఈ విధంగానే తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సదా ఎమోషనల్ అయింది. ఫస్ట్ ఆఫ్‌లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తను ముంబయిలోనే ఉన్నాని, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొంది. శశి కిరణ్ కథను తెరకెక్కించిన విధానం, అడవి శేష్ నటన అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిచింది. View this post on Instagram A post shared by Major (@majorthefilm) -
'మేజర్' సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్: చిరంజీవి
Chiranjeevi Appreciates Adivi Sesh Major Movie Team: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. అడివి శేష్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. అనురాగ్, శరత్ నిర్మించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు ప్రశంసలు సైతం లభిస్తున్నాయి. మేజర్ మూవీ అద్భుతంగా తీశారంటూ చిత్రయూనిట్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు జనాలు. తాజాగా ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన చిరంజీవి 'మేజర్' చిత్రబృందాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మేజర్ ఒక సినిమా మాత్రమే కాదు. అదొక నిజమైన ఎమోషన్. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని హత్తుకునేలా సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటి మూవీని మహేశ్‌బాబు నిర్మించినందుకు గర్వంగా ఉంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు. అని ట్వీట్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మంచి సినిమాల గురించి చిరంజీవి ఎప్పుడూ మాట్లాడుతుంటారని, మేకర్స్‌ను ప్రోత్సహిస్తారని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల 'విక్రమ్' మూవీ విజయం సందర్భంగా కమల్ హాసన్‌ను చిరంజీవి సత్కరించిన విషయం తెలిసిందే. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా రెండేళ్ల తర్వాత తల్లిని కలుసుకున్న హీరోయిన్.. #Major is not a film.Its truly an Emotion Story of a great Hero & Martyr#MajorSandeepUnnikrishnan told in the most poignant way.A must-watch Proud of @urstrulyMahesh for backing such a purposeful film HeartyCongrats to @AdiviSesh @saieemmanjrekar #Sobhita @SashiTikka & Team pic.twitter.com/1lW1m3xmFO — Chiranjeevi Konidela (@KChiruTweets) June 13, 2022 -
అడవి శేష్ 'మేజర్' ప్రామిస్.. అలాంటి వారికి సపోర్ట్..
Adivi Sesh Major Promise To Those Who Wants To Join In Army: ‘‘ఎమోషనల్‌గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నిటి కంటే ‘మేజర్’ ఐదు రెట్లు పెద్దది. ఈ సినిమా చూసిన చాలామంది ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలని ఉందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై నేనొక మేజర్ ప్రామిస్ చేస్తున్నాను. సీడీఎస్, ఎన్డీఏలో చేరాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్నవారికి సపోర్ట్ చేయాలని మా టీమ్ నిర్ణయించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్‌ని లాంచ్ చేస్తాం’’ అన్నారు అడివి శేష్. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రలో అడివి శేష్ నటించగా, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం ‘ఇండియా లవ్స్ మేజర్’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. దర్శకుడు శశికిరణ్ మాట్లాడుతూ– ‘‘సందీప్ రియల్ హీరో అని తెలుసు కానీ ఈ సినిమాకి నన్ను డైరెక్టర్‌గా చేయమని శేష్ అన్నప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకుని, సందీప్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ ఈ సినిమా చేశాం. శేష్‌కి స్పెషల్ థాంక్స్. అలాగే రచయిత అబ్బూరి రవిగారి సపోర్ట్‌ని మర్చిపోలేం’’ అని తెలిపారు. చదవండి: 'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి ‘‘మా మొదటి సినిమా ‘మేజర్’ గొప్ప విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. అడివి శేష్ మేజర్ సందీప్ కథ చెప్పడం, నమ్రత మేడమ్ గారిని కలవడం, తర్వాత సోనీ పిక్చర్స్ రావడం.. ఇలా యూనిట్ అంతా నమ్మకంగా పని చేశాం. ఆ నమ్మకమే ఇప్పుడు తెరపై అంత అద్భుతంగా కనిపిస్తోంది. ‘మేజర్’ లాంటి క్లాసిక్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు ఒక ఎమోషనల్ లెవల్ దాటి మనసుతో స్పందిస్తున్నారు’’ అని నిర్మాతలు శరత్, అనురాగ్ పేర్కొన్నారు. చిత్రకథానాయిక సయీ మంజ్రేకర్, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నటుడు అనీష్ కురువిల్లా ‘మేజర్’ విజయం పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: మేజర్ గుండెల్ని పిండేసే సినిమా: అల్లు అర్జున్ -
గూఢచారి మళ్ళొస్తాడు
తెలుగు సినిమా కొత్తపుంతలు తొక్కుతోంది. పాతచింతకాయ పచ్చడి నుంచి బయటకొచ్చి కథే మూలంగా కథనం నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే చిన్న సినిమాలూ పెద్ద విజయాలు అందుకుంటున్నాయి. ఓ బలమైన కథతోఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన గూఢచారి... తెలుగు జేమ్స్‌బాండ్‌లా గుర్తింపు పొందింది. ప్రేక్షకులకుఓ మంచి కిక్ ఇచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తాయనితీయని కబురు అందించారుచిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క.ఆయన ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలివీ... శ్రీనగర్‌కాలనీ: మాది రాజమండ్రి. ఇంట్లో అమ్మానాన్న, అన్నయ్య, నేను. విజయవాడ లయోలా కాలేజీలో బీకాం చేశాను. అక్కడ కల్చరల్ వింగ్‌కు లీడర్ నేనే. కొత్త ఆలోచనలతో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాడిని. నేను చేసిన ఓ ఈవెంట్ చూసిన నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారు. బీకాం తర్వాత ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను. అప్పుడే ఐడీబీఐ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను. జాబ్ ఆఫర్ వచ్చినప్పటికీ సినిమాలపై ఆసక్తితో 2007లో హైదరాబాద్ వచ్చేశాను. ఇంగ్లిష్ సినిమాకుఅవకాశం... సన్నిహితుల ద్వారా ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి వెళ్లాను. మార్కెటింగ్ ఆఫర్ చేస్తే, నాకు క్రియేటివ్ సైడ్ ఆసక్తి ఉందని చెప్పాను. నా మొండితనం నచ్చి ఏజెన్సీ ఓనర్ సోదరుడు వాల్ట్ డిస్నీ యానిమేషన్ ఇంగ్లిష్ సినిమాలకు పనిచేసే ఉమాకాంత్ దగ్గరికి పంపించారు. అలా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిల్డ్రన్ సినిమా ‘7 డేస్ ఇన్ స్లో మోషన్’ అనే ఇంగ్లీష్ చిత్రానికి ప్రోడక్షన్లో పని చేశాను. ఆ చిత్రాన్ని హైదరాబాద్‌లోనే రూపొందించారు. తర్వాత న్యూయార్క్ వెళ్లి ‘న్యూయార్క్ ఫిలిం అకాడమీ’లో దర్శకత్వంపై శిక్షణ తీసుకున్నాను. అసిస్టెంట్‌గా ప్రయాణం ప్రారంభం... ఇంగ్లిష్ చిత్రానికి పనిచేసిన సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసే సూరి పరిచయమయ్యారు. ఇండియాకు తిరిగొచ్చాక ఆయన ద్వారా శేఖర్ కమ్ముల దగ్గర ‘లీడర్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. నా పని విధానం నచ్చిన ఆయన సినిమాలకు ట్రై చేయమని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే అడవి శేష్‌తో పరిచయం ఏర్పడింది. సినిమాల కోసం ప్రయత్నిస్తుండగా ఓ పెద్ద ప్రొడక్షన్లో అవకాశం వచ్చింది. కానీ అనివార్య కారణాలతో అది పట్టాలెక్కలేదు. ఆ సమయంలో అమెరికాలో వెబ్ సీరిస్ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఇక వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే శేష్‌తో మంచి స్నేహం ఉంది. ఆయన అమెరికాలోనే ఉంటే.. ఫోన్ చేసి విషయం చెప్పాను. అయితే శేష్ నన్ను వద్దని వారించాడు. ‘సినిమా తీయాలనే నీ కలను నెరవేర్చుకో ముందు అని..’ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేయించాడు. మూల కథ శేష్‌దే... శేష్‌కు నేనో బ్యాంక్ దొంగతనం కథ చెప్పాను. కానీ అది వర్కవుట్ కాలేదు. అప్పుడు శేష్ నాకో కథ చెప్పాడు. అయితే అది ఇప్పుడున్న పరిస్థితులకు సరిపోదని, ఇద్దరం కలిసి 8 నెలలు శ్రమించి స్క్రిప్ట్ రెడీ చేశాం. స్పై, థ్రిల్లింగ్, యాక్షన్ సన్నివేశాలతో తెలుగు జేమ్స్‌బాండ్‌లా గూఢచారిని రూపొందించాం. టెక్నాలజీ అడ్వాన్స్‌గా ఉండాలని దానిపై దృష్టిపెట్టాం. చిత్రంపై నమ్మకంతో నిర్మాతలు సైతం వెనుకాడలేదు. రచయిత అబ్బూరి రవి సలహాలు సూచనలిచ్చారు. 116 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. ట్రైలర్‌కు, ఆ తర్వాత సినిమాకు వస్తున్న స్పందన మాకెంతో ఆనందాన్నిస్తోంది. ఇది అందరి కృషితోనే సాధ్యమైంది. గూఢచారి 2, గూఢచారి 3 చేయాలనే ఆలోచనలు మా ఇద్దరికీ ఉన్నాయి. సీక్వెల్‌కు ప్రయత్నాలు చేస్తున్నాం. యాక్షన్, కామెడీ ఇష్టం... నాకు యాక్షన్‌తో పాటు కామెడీ చిత్రాలు చేయాలని ఉంది. కామెడీ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాం. సినిమా హిట్ అయిందనే గర్వం లేదు. హిట్ అయినా కాకున్నా సినిమానే జీవితం. నలుగురికి మంచి చేయాలనేదే నా భావజాలం. హైద రాబాద్‌లో ఫ్రీడమ్, ప్రశాంతత ఉంటుంది. ప్రశాసన్‌నగర్‌లోని పార్క్ అంటే ఇష్టం. జూబ్లీహిల్స్‌లోని స్మార్ట్ అలెక్, బంజారాహిల్స్‌లోని టెర్రసన్ కెఫెకు వెళ్తుంటాను. సమయం దొరికితే ఇంట్లోనే ఉంటాను. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పెళ్లి... నాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. నా భార్య దీపిక యూఎస్‌లో జాబ్ చేస్తుండేది. మ్యాట్రిమోనీలో ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అప్పటికి గూఢచారి పట్టాలెక్కలేదు. ఇరు కుటుంబాల అంగీకారంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. పెళ్లికి అయ్యే ఖర్చును బ్యాంక్‌లో డిపాజిట్ చేసి, వచ్చే వడ్డీతో అనాథలకు సహాయం చేస్తున్నాం. మా ఆలోచనలు మానవతా దృక్పథానికి దగ్గరగా ఉంటాయి. కొంచెం సెటిల్ అయ్యాక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. -
చెట్టును ఢీకొన్న కారు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతచెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దుమ్ముగూడెం మండలం తూరుపాక గ్రామం వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం... వరంగల్ జిల్లా జనగాం మండలం కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జిలకర సురేష్.. భద్రాచలంలోని రిక్షా కాలనీలో ఉంటున్న బంధువులైన గిరిగాని వెంకటేశ్వర్లు-పద్మ ఇంటికి శుక్రవారం సాయంత్రం కారులో చుట్టపు చూపుగా వచ్చాడు. కొద్దిసేపటి తరువాత వెంకటేశ్వర్లు-పద్మ దంపతుల కుమారులు సాయికిరణ్, శశికిరణ్‌ను తీసుకుని బజారులో చికెన్ తెచ్చేందుకుని సురేష్ బయల్దేరాడు. వారు చికెన్ తీసుకుని, పెద్దనల్లబల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి బయల్దేరారు. ఆ పిల్లలు దారి మధ్యలో తమ తల్లికి ఫోన్ చేసి, పెద్దనల్లబల్లిలో బంధువులను కలిసి వస్తామని చెప్పారు. ‘త్వరగా రండి..’ అంటూ ఆమె ఫోన్ పెట్టేసిన కొద్ది క్షణాలకే.. తూరుబాక వద్ద కారు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. స్థానికులిచ్చిన సమాచారంతో వెంటనే 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే, తలకు బలమైన గాయంతో సాయికిరణ్ (13) మృతిచెందాడు. శశికిరణ్, సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానిక జ్యోతి కాన్వెంట్లో సాయికిరణ్ 8వ తరగతి, శశికిరణ్ 5వ తరగతి చదువుతున్నారు. పిల్లల తల్లి గిరిగాని పద్మ.. సీపీఎం అనుబంధ మహిళా సంఘం (ఐద్వా) డివిజన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.