ట్రైలర్‌ చూశాక సినిమాపై ఆసక్తి పెరిగింది | Director Sashi Kiran Tikka Speech at Atharva Trailer Launch | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ చూశాక సినిమాపై ఆసక్తి పెరిగింది

Published Thu, Nov 16 2023 4:23 AM | Last Updated on Thu, Nov 16 2023 4:23 AM

Director Sashi Kiran Tikka Speech at Atharva Trailer Launch - Sakshi

‘‘అథర్వ’ ట్రైలర్‌ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి పెరిగింది. ప్రతి విషయాన్ని ఎంతో వివరంగా చూపించారు. పోలీస్‌ విభాగంలో క్లూస్‌ టీం గురించి చక్కగా వివరించారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని డైరెక్టర్‌ శశి కిరణ్‌ తిక్క అన్నారు. కార్తీక్‌ రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేశ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్‌ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 1న రిలీజ్‌ అవుతోంది.

ఈ చిత్రం ట్రైలర్‌ని శశి కిరణ్‌ తిక్క, హీరో చైతన్య రావు రిలీజ్‌ చేశారు. మహేశ్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో క్లూస్‌ టీమ్‌ గురించి చూపించబోతున్నాం. సురేష్‌ ప్రొడక్ష¯Œ ్సతో కలిసి భారీ ఎత్తున రాబోతున్నాం’’ అన్నారు. ‘‘ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సుభాష్‌ నూతలపాటి, కార్తీక్‌ రాజు. ఈ కార్యక్రమంలో సిమ్రాన్‌ చౌదరి, ఐరా, సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌ పాకాల, కెమెరామేన్‌ చరణ్‌ మాట్లాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement