కార్తీక్ రాజు హీరోగా సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఈ సినిమాని గతేడాది డిసెంబర్ 1న థియేటర్స్‌లో విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ ఏడాది జనవరి 25 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ఇప్పటికీ ఈ చిత్రం టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. అన్ని భాషల్లో ఈ మూవీ ట్రెండ్ అవుతున్న సందర్భంగా.. హిందీలోనూ డబ్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే హిందీ భాషలో కూడా అథర్వ అందుబాటులోకి రానుంది. ఓటీటీ ఆడియెన్స్‌ను అథర్వ ఆకట్టుకుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇంకా అథర్వ సినిమా ట్రెండ్ అవుతుండటంతో ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు.
అథర్వ కథేంటంటే..
దేవ్ అథర్వ కర్ణ అలియాస్ కర్ణ(కార్తీక్ రాజు)కి చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనే కోరిక ఉంటుంది. తన కలను నేరవేర్చుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ అతని ఉన్న అనారోగ్యం కారణంగా పోలీసు ఉద్యోగానికి సెలెక్ట్ కాలేకపోతాడు. చివరకు క్లూస్ టీమ్‌లో జాయిన్ అవుతాడు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి చురుగ్గా పని చేస్తూ.. చాలా కేసులను సాల్వ్ చేస్తుంటాడు.
ఓసారి తన కాలేజీలో జూనియర్ అయిన నిత్య(సిమ్రన్ చౌదరి)..క్రైమ్ రిపోర్టర్‌గా తనని కలుస్తుంది. నిత్య అంటే కర్ణకి చాలా ఇష్టం. కానీ తన ప్రేమ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పలేకపోతాడు. నిత్య ఫ్రెండ్ జోష్నీ(ఐరా) ఓ స్టార్ హీరోయిన్. ఓ సారి కర్ణ, నిత్యలు కలిసి జోష్నీ ఇంటికి వెళ్తారు. అలా వాళ్లిద్దరూ ఆమె ఇంటికి వెళ్లిన తరువాత షాక్ అవుతారు. అక్కడ జోష్ని, ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి.. అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు కొట్టేస్తారు. కానీ నిత్యం మాత్రం అందులో నిజం లేదని అనుమానిస్తుంది. దీంతో కర్ణ రంగంలోకి దిగుతాడు. అసలు హీరోయిన్ జోష్ని, ఆమె ప్రియుడు శివ ఎలా చనిపోయారు? ఒక్క క్లూ కూడా లేని ఈ కేసు కర్ణ ఎలా పరిష్కరించాడు? అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment