ప్రస్తుతం అందరూ 'యానిమల్' సినిమా ఓటీటీ రిలీజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు 'నెరు', 'సామ్ బహుదూర్' లాంటి క్రేజీ చిత్రాలు ప్రస్తుతం డిజిటల్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అరె తెలుగు సినిమాలేం లేవా అని బాధపడుతున్న వాళ్ల కోసం ఓ థ్రిల్లర్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
(ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి)
కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి హీరోహీరోయిన్‌గా నటించిన సినిమా 'అథర్వ'. క్రైమ్ సీన్‌లో క్లూస్ టీమ్ ఎంత కీలకమనేది క్లియర్‌గా ఈ చిత్రంలో చూపించారు. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా.. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న వచ్చిన ఈ చిత్రం థియేటర్లలోకి మంచి టాక్ తెచ్చుకుంది.
క్రైమ్ థ్రిల్లర్‌ల స్టోరీతో తీసిన ఈ సినిమా.. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ సినిమాని మీరు చూశారా? లేదంటే ఓ లుక్ వేసేయండి. ఈ వీకెండ్‌ని టైమ్ పాస్ చేసేయండి.
(ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment