Atharva Movie
-
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘అథర్వ’
కార్తీక్ రాజు హీరోగా సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఈ సినిమాని గతేడాది డిసెంబర్ 1న థియేటర్స్‌లో విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ ఏడాది జనవరి 25 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ఇప్పటికీ ఈ చిత్రం టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. అన్ని భాషల్లో ఈ మూవీ ట్రెండ్ అవుతున్న సందర్భంగా.. హిందీలోనూ డబ్ చేయాలని చూస్తున్నారు. త్వరలోనే హిందీ భాషలో కూడా అథర్వ అందుబాటులోకి రానుంది. ఓటీటీ ఆడియెన్స్‌ను అథర్వ ఆకట్టుకుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇంకా అథర్వ సినిమా ట్రెండ్ అవుతుండటంతో ఏ రేంజ్లో డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు. అథర్వ కథేంటంటే.. దేవ్ అథర్వ కర్ణ అలియాస్ కర్ణ(కార్తీక్ రాజు)కి చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనే కోరిక ఉంటుంది. తన కలను నేరవేర్చుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ అతని ఉన్న అనారోగ్యం కారణంగా పోలీసు ఉద్యోగానికి సెలెక్ట్ కాలేకపోతాడు. చివరకు క్లూస్ టీమ్‌లో జాయిన్ అవుతాడు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి చురుగ్గా పని చేస్తూ.. చాలా కేసులను సాల్వ్ చేస్తుంటాడు. ఓసారి తన కాలేజీలో జూనియర్ అయిన నిత్య(సిమ్రన్ చౌదరి)..క్రైమ్ రిపోర్టర్‌గా తనని కలుస్తుంది. నిత్య అంటే కర్ణకి చాలా ఇష్టం. కానీ తన ప్రేమ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పలేకపోతాడు. నిత్య ఫ్రెండ్ జోష్నీ(ఐరా) ఓ స్టార్ హీరోయిన్. ఓ సారి కర్ణ, నిత్యలు కలిసి జోష్నీ ఇంటికి వెళ్తారు. అలా వాళ్లిద్దరూ ఆమె ఇంటికి వెళ్లిన తరువాత షాక్ అవుతారు. అక్కడ జోష్ని, ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి.. అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు కొట్టేస్తారు. కానీ నిత్యం మాత్రం అందులో నిజం లేదని అనుమానిస్తుంది. దీంతో కర్ణ రంగంలోకి దిగుతాడు. అసలు హీరోయిన్ జోష్ని, ఆమె ప్రియుడు శివ ఎలా చనిపోయారు? ఒక్క క్లూ కూడా లేని ఈ కేసు కర్ణ ఎలా పరిష్కరించాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?
ప్రస్తుతం అందరూ 'యానిమల్' సినిమా ఓటీటీ రిలీజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు 'నెరు', 'సామ్ బహుదూర్' లాంటి క్రేజీ చిత్రాలు ప్రస్తుతం డిజిటల్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అరె తెలుగు సినిమాలేం లేవా అని బాధపడుతున్న వాళ్ల కోసం ఓ థ్రిల్లర్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి హీరోహీరోయిన్‌గా నటించిన సినిమా 'అథర్వ'. క్రైమ్ సీన్లో క్లూస్ టీమ్ ఎంత కీలకమనేది క్లియర్‌గా ఈ చిత్రంలో చూపించారు. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా.. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న వచ్చిన ఈ చిత్రం థియేటర్లలోకి మంచి టాక్ తెచ్చుకుంది. క్రైమ్ థ్రిల్లర్ల స్టోరీతో తీసిన ఈ సినిమా.. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ సినిమాని మీరు చూశారా? లేదంటే ఓ లుక్ వేసేయండి. ఈ వీకెండ్‌ని టైమ్ పాస్ చేసేయండి. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
మంచి సినిమా తీశామంటున్నారు
‘‘అథర్వ’ చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇంత మంచి ఆదరణ రావడంతో మేం పడ్డ కష్టాన్ని మర్చిపోయాం. మంచి సినిమా తీశామని ప్రేక్షకులు అంటున్నారు.. మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న వారికి థ్యాంక్స్’’ అని హీరో కార్తీక్ రాజు అన్నారు. మహేశ్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో మహేష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొత్త పాయింట్, కొత్త కథ చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందుకే క్లూస్ టీమ్ నేపథ్యంలో ‘అథర్వ’ తీశాను. ఇంత మంచి విజయాన్నిఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మా సినిమాకు ఇంత మంచి స్పందన వస్తుందనుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు సుభాష్ నూతలపాటి. సిమ్రాన్ చౌదరి, నటీనటులు కల్పికా గణేష్, గగన్ విహారి, విజయ రామరాజు మాట్లాడారు. -
Atharva Review: అథర్వ మూవీ రివ్యూ
టైటిల్: అథర్వ నటీనటులు: కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ యాదవ్, విజయ్ రామరాజు, గగన్ విహారి తదితరులు నిర్మాత: సుభాష్ నూతలపాటి దర్శకత్వం: మహేశ్ రెడ్డి సంగీతం: శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని విడుదల తేది: డిసెంబర్ 1, 2023 ‘అథర్వ’ కథేంటంటే.. దేవ్ అథర్వ కర్ణ అలియాస్ కర్ణ(కార్తీక్ రాజు)కి చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనే కోరిక ఉంటుంది. తన కలను నేరవేర్చుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ అతని ఉన్న అనారోగ్యం కారణంగా పోలీసు ఉద్యోగానికి సెలెక్ట్ కాలేకపోతాడు. చివరకు క్లూస్ టీమ్‌లో జాయిన్ అవుతాడు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి చురుగ్గా పని చేస్తూ.. చాలా కేసులను సాల్వ్ చేస్తుంటాడు. ఓసారి తన కాలేజీలో జూనియర్ అయిన నిత్య(సిమ్రన్ చౌదరి)..క్రైమ్ రిపోర్టర్‌గా తనని కలుస్తుంది. నిత్య అంటే కర్ణకి చాలా ఇష్టం. కానీ తన ప్రేమ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పలేకపోతాడు. నిత్య ఫ్రెండ్ జోష్నీ(ఐరా) ఓ స్టార్ హీరోయిన్. ఓ సారి కర్ణ, నిత్యలు కలిసి జోష్నీ ఇంటికి వెళ్తారు. అలా వాళ్లిద్దరూ ఆమె ఇంటికి వెళ్లిన తరువాత షాక్ అవుతారు. అక్కడ జోష్ని, ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి.. అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు కొట్టేస్తారు. కానీ నిత్యం మాత్రం అందులో నిజం లేదని అనుమానిస్తుంది. దీంతో కర్ణ రంగంలోకి దిగుతాడు. అసలు హీరోయిన్ జోష్ని, ఆమె ప్రియుడు శివ ఎలా చనిపోయారు? ఒక్క క్లూ కూడా లేని ఈ కేసు కర్ణ ఎలా పరిష్కరించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అథర్వ కూడా ఆ తరహా చిత్రమే. కేసు చేధించేందుకు పోలీసులు కాకుండా క్లూస్ టీమ్ ఉద్యోగి రంగంలోకి దిగడం ఈ సినిమా ప్రత్యేకత. ఎలాంటి ఆధారాలు లేకున్నా.. హీరో తన తెలివి తేటలతో ఈ కేసును పరిష్కరించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లకు ఎలాంటి కథ, కథనాలు ఉంటే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారో అలాంటి పాయింట్‌తోనే కథ రాసుకున్నాడు దర్శకుడు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. రాబరీ కేసు నుంచి సినిమా ఊపందుకుంటుంది. అసలు కథ మాత్రం జోష్ని, ఆమె ప్రియుడు మరణించాకే ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక ద్వితీయార్దం ప్రారంభం మళ్లీ స్లో అనిపిస్తుంది. ఆ తరువాత సినిమా చకచకా పరుగులు పెడుతూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. అయితే జంట హత్యలు చోటు చేసుకోవడం.. ఆ కేసును పోలీసులు హడావుడిగా మూసివేసినా.. క్లూస్ టీమ్‌లో పని చేసే హీరోకి అనుమానం రాకపోవడం కథలో సహజత్వం లోపించినట్లు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు నాటకీయంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే ఊహించని విధంగా ఉంటుంది. కథను ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. కర్ణ పాత్రకి కార్తీక్ రాజు న్యాయం చేశాడు. లవర్‌గా, క్లూస్ టీమ్ ఉద్యోగిగా రెండు రకాల పాత్రల్లో అలరించారు. . హీరోయిజం కోసం కావాలని సీన్లు, ఫైట్లు పెట్టుకోలేదు. సహజంగా నటించాడు. హీరోయిన్ సిమ్రన్ చౌదరి తెరపై అందంగా కనిపించింది.సినిమాలో సినిమా హీరోయిన్ జోష్నిగా కనిపించిన ఐరా కూడా ఓకే అనిపిస్తుంది. పోలీసు పాత్రలు బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. శ్రీచరణ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
యానిమల్ పోటీ.. అయినా తప్పలేదు: ‘అథర్వ’ నిర్మాత
ప్రతి వారం మూడు, నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. డిసెంబర్ ఒకటవ తేదిన పాన్ ఇండియా మూవీ ‘యానిమల్’తో పాటు అథర్వ కూడా రిలీజ్ అవుతుంది. మరో వారం నాని సినిమా..ఆ తర్వాత ప్రభాస్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే డిసెంబర్ 1 మా చిత్రానికి సరైన డేట్ అనిపించింది, మా చిన్న చిత్రంపై యానిమల్ ప్రభావం ఉంటుందని తెలిసినా..రిలీజ్ చేయక తప్పట్లేదు’ అని అన్నారు నిర్మాత సుభాష్ నూతలపాటి. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘అథర్వ’. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుభాష్ నూతలపాటి నిర్మించారు.విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సుభాష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ప్రస్తుతం అందరూ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడుతున్నారు. అథర్వలో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉంటాయి. క్లూస్ డిపార్ట్మెంట్ మీద ఇంత వరకు సినిమా రాలేదు. వారు చేసే పనిని ఇందులో మరింత డీటైలింగ్‌గా చూపిస్తాం. ప్రతీ పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ►మా డైరెక్టర్ మహేష్ రెడ్డి బ్రదర్ క్లూస్ టీంలో పని చేస్తున్నారు. క్లూస్ టీం వెంకన్న గారితో మా డైరెక్టర్ ఆరు నెలలు కలిసి రీసెర్చ్ చేశారు. ప్రతీ విషయాన్ని ఎంతో క్షుణ్నంగా రీసెర్చ్ చేశారు. క్లూస్ టీంకు ప్రివ్యూ వేస్తే వారంతా చాలా ఎమోషనల్ అయ్యారు. ►ప్రతీ సినిమాకు బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. అయితే సినిమాను మరింత బాగా తీయాలనే ఉద్దేశంతోనే ఖర్చు పెడతాం. ఈ సినిమా కోసం స్పెషల్ సెట్స్ వేశాం. వాటి గురించి ఇప్పుడే చెప్పలేం. సినిమా చూస్తే అందరికీ అర్థం అవుతుంది. ►అథర్వలో ఇద్దరు హీరోయిన్లు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. కథలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతోనే పెట్టాం. ఒకరు క్రైమ్ రిపోర్టర్‌గా నటించారు. ఇంకొకరు సినిమాలో సినిమా హీరోయిన్గా నటించారు. ►ప్రతీ వారం ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. తరువాత నాని, ప్రభాస్ గార్ల సినిమాలున్నాయి. ఇలా ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఉంటుంది. యానిమల్ ప్రభావం ఉంటుందని తెలిసినా మాకు ఇదే సరైన డేట్ అనిపించింది. ►అథర్వ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అన్ని రకాల జానర్లు ఇందులో ఉంటాయి. ఒక్కొక్కొరికి ఒక్కో పాయింట్ నచ్చింది. ముఖ్యంగా ట్విస్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. -
‘అథర్వ’లో ప్రతి 10 నిమిషాలకు ఓ ట్విస్ట్..ఊహించలేరు: దర్శకుడు
‘‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘అథర్వ’ చిత్రం రూపొందింది. హత్య, దోపిడీ సన్నివేశాలతో ఈ కథను అల్లుకున్నాను. వాస్తవ ఘటనలకు కొంచెం ఫిక్షన్ జోడించాను’’ అని దర్శకుడు మహేశ్ రెడ్డి అన్నారు. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు మహేశ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేనొకసారి క్లూస్ టీమ్ హెడ్ వెంకన్నగారి ఇంటర్వ్యూ చూశాను. క్రైమ్ కేసుని 70 శాతం వరకు క్లూస్ టీమ్ పరిష్కరిస్తుంటుంది. అంత ప్రాధాన్యం ఉన్న క్లూస్ టీమ్ గురించి చెప్పాలని ‘అథర్వ’ కథ రాశాను. కార్తీక్ రాజు క్లూస్ టీమ్‌లో పని చేస్తుంటాడు. హీరోయిన్ క్రైమ్ రిపోర్టర్. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ప్రతి పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించలేరు’’ అన్నారు. -
ఆకట్టుకుంటోన్న ‘కేసీపీడీ’ వీడియో సాంగ్
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లు ఎప్పుడూ ప్రేక్షకులను కట్టిపడేస్తూనే ఉంటాయి. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్లను క్లూస్ టీం కోణంలోంచి చూపించేందుకు 'అథర్వ' అనే చిత్రం రాబోతోంది. అన్ని రకాల ఎమోషన్స్ కలిపి తీసిన ఈ చిత్రం నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందింది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో మంచి బీట్ ఉన్న వీడియో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. కేసీపీడీ అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది. ఈ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊరి వాతావరణంలో ఎంతో సహజంగా ఈ పాటను తెరకెక్కించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల బాణీ, గాత్రం ఈ పాటను వినసొంపుగా, చూడముచ్చటగా మార్చేశాయి. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
ట్రైలర్ చూశాక సినిమాపై ఆసక్తి పెరిగింది
‘‘అథర్వ’ ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి పెరిగింది. ప్రతి విషయాన్ని ఎంతో వివరంగా చూపించారు. పోలీస్ విభాగంలో క్లూస్ టీం గురించి చక్కగా వివరించారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ శశి కిరణ్ తిక్క అన్నారు. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శశి కిరణ్ తిక్క, హీరో చైతన్య రావు రిలీజ్ చేశారు. మహేశ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో క్లూస్ టీమ్ గురించి చూపించబోతున్నాం. సురేష్ ప్రొడక్ష¯Œ ్సతో కలిసి భారీ ఎత్తున రాబోతున్నాం’’ అన్నారు. ‘‘ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సుభాష్ నూతలపాటి, కార్తీక్ రాజు. ఈ కార్యక్రమంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, కెమెరామేన్ చరణ్ మాట్లాడారు. -
'అథర్వ' ట్రైలర్.. అలాంటి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమా
సస్పెన్స్, క్రైమ్ జానర్లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తీసిన సినిమా 'అథర్వ'. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా చేశారు. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా.. సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!) ట్రైలర్ చూశాక సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. డైరెక్టర్, నిర్మాతతో పాటు సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు అతిథిగా విచ్చేసిన శశికిరణ్ తిక్క చెప్పుకొచ్చారు. ఇక మూవీలోని హీరోగా చేసిన కార్తీక్ రాజు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు పూర్తి క్రెడిట్ డైరెక్టర్ మహేష్ రెడ్డికే చెందుతుంది. క్లూస్ టీం బ్యాక్‌డ్రాప్‌తో ఇంతవరకు సినిమా రాలేదు. డిసెంబర్ 1న అందరూ థియేటర్లో మా సినిమాను చూడండి' అని అన్నారు. ట్రైలర్ చూపించిన దాని ప్రకారం.. తెలుగు హీరోయిన్‌తో పాటు నగరంలో మరో మూడు మర్డర్స్ జరుగుతాయి. అయితే హీరోయిన్ని చంపింది ఆమె బాయ్‌ఫ్రెండ్ అని పోలీసులు అనుకుంటారు. కానీ క్లూస్ టీంకి చెందిన హీరోకి మాత్రం హంతకుడు వేరే ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. దీంతో హంతకుడి కోసం వేట మొదలుపెడతాడు. మరి చివరికి పట్టుకున్నాడా లేదా అనేది తెలియాలంటే 'అథర్వ' సినిమా చూడాల్సిందే. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు) -
‘విడుదలకు సిద్దమైన అథర్వ ’
సస్పెన్స్, క్రైమ్ జానర్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఆ జానర్ తో యూత్‌కు నచ్చేలా రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన చిత్రమే అథర్వ. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. అథర్వ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అథర్వ సినిమాలో క్లూస్ టీం విశిష్టతను, ప్రాముఖ్యతను చూపించేలా గ్రిప్పింగ్ కథనంతో అందరినీ ఆశ్చర్యపర్చబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ సెన్సార్ జరుగుతోంది. అథర్వ అవుట్ పుట్ పట్ల దర్శక నిర్మాతలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్. ఈ ప్రెస్ మీట్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. 'అథర్వ' సినిమాను డిసెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో భారీగా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. -
ప్రేమ.. భావోద్వేగం
కార్తీక్ రాజు హీరోగా సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్, క్రైమ్ జానర్లకు రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల భావోద్వేగాలతో తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’. క్లూస్ టీమ్ విశిష్టతను,ప్రాముఖ్యతను చూపించే కథనం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ఔట్పుట్ పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నాం. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది.. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్స్: విజయ, ఝాన్సీ. -
రింగా రింగా రోసే..
కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘అథర్వ’. మహేశ్ రెడ్డి దర్శకత్వంలో నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి ఈ సినిమాను నిర్మించారు. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్ర సంగీతదర్శకుడు శ్రీ చరణ్ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్నే చూసే.. చిట్టిగుండె కూసే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల బాణీఅందించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, జావేద్ అలీ ఆలపించారు. మాస్టర్ రాజ్‌కృష్ణ కొరియోగ్రాఫర్. ఈ పాట విడుదల సందర్భంగా హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ– ‘‘రింగా రింగా రోసే..’ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరో చిన్నతనం నుండి హీరోయిన్ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేకపోతాడు. చివరికి తన ఫీలింగ్‌ను ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు మహేశ్‌రెడ్డి. ‘‘త్వరలోనే రిలీజ్ కానున్న మా సినిమాను ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుభాష్. ‘‘ఈ చిత్రంలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు సిమ్రన్ చౌదరి. -
క్రైమ్ థ్రిల్లర్‌గా 'అథర్వ'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
యంగ్ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'అథర్వ'. ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ లోగో, పోస్టర్, టీజర్, ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. (ఇద చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!) ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను జూన్‌లో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. -
థ్రిల్లింగ్ అథర్వ.. త్వరలోనే టీజర్, ట్రైలర్
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. నేడు కార్తీక్ రాజు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘‘క్రైమ్, థ్రిల్లింగ్, ఎమోషన్స్.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
క్రైమ్ థిల్లర్‌గా వస్తున్న 'అధర్వ'.. త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్..!
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా 'అధర్వ'. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. (చదవండి: యంగ్ టైగర్ మూవీ బిగ్ అప్ డేట్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్) ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచారు మేకర్స్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
Atharva: ఆకట్టుకుంటున్న ఐరా లుక్
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అధర్వ’. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో అదే జోష్‌లో తాజాగా ఐరా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’ అంటూ మోషన్ పోస్టర్‌లోని డైలాగ్ అందరిలోనూ ఈ అధర్వ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్ఫుల్ రోల్ పోషించినట్టు గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ ను బట్టి అర్థమైంది. డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మారిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.