క్రైమ్ థిల్లర్‌గా వస్తున్న 'అధర్వ'.. త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్..! | Young Hero Karthik Raju Atharva Movie Atharva In Post Production Phase | Sakshi
Sakshi News home page

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా 'అధర్వ'.. విడుదలకు సన్నాహాలు..!

Published Sun, Nov 6 2022 9:32 PM | Last Updated on Sun, Nov 6 2022 9:33 PM

Young Hero Karthik Raju Atharva  Movie Post Production Works - Sakshi

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో క్రైమ్ థిల్లర్‌గా  తెరకెక్కుతున్న సినిమా 'అధర్వ'. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. 

(చదవండి: యంగ్ టైగర్ మూవీ బిగ్ అప్‌ డేట్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్)

ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ప్రమోషన్స్తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచారు మేకర్స్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌  మంచి రెస్పాన్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement