Karthik Raju
-
ప్రేమలో కొత్త కోణం
కార్తీక్ రాజు హీరోగా, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఐ హేట్ యు’. అంజి రామ్ దర్శకత్వం వహించారు. బి.లోకనాథం సమర్పణలో నాగరాజ్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ–‘‘లవ్, సైకలాజికల్ అంశాలతో రూపొందిన చిత్రం ‘ఐ హేట్ యు’. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో అంజిరామ్‌గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: సాకార్. -
‘ఐ హేట్ యు’ అంటున్న యంగ్ హీరో!
‘అథర్వ’ ఫేమ్ కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ఐ హేట్ యు’. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్బంగా..చిత్ర నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ ‘‘మా ‘ఐ హేట్ యు’ చిత్రం లవ్ సైకలాజికల్ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో డైరెక్టర్ అంజిరామ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ సహా అందరూ నటీనటుల, టెక్నీషియన్స్ చక్కటి సహకారాన్ని అందించటంతో అనుకున్న ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. అందరికీ థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు. -
మంచి సినిమా తీశామంటున్నారు
‘‘అథర్వ’ చిత్రానికి ఫుల్ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇంత మంచి ఆదరణ రావడంతో మేం పడ్డ కష్టాన్ని మర్చిపోయాం. మంచి సినిమా తీశామని ప్రేక్షకులు అంటున్నారు.. మా చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న వారికి థ్యాంక్స్’’ అని హీరో కార్తీక్ రాజు అన్నారు. మహేశ్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో మహేష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొత్త పాయింట్, కొత్త కథ చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. అందుకే క్లూస్ టీమ్ నేపథ్యంలో ‘అథర్వ’ తీశాను. ఇంత మంచి విజయాన్నిఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మా సినిమాకు ఇంత మంచి స్పందన వస్తుందనుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు సుభాష్ నూతలపాటి. సిమ్రాన్ చౌదరి, నటీనటులు కల్పికా గణేష్, గగన్ విహారి, విజయ రామరాజు మాట్లాడారు. -
Atharva Review: అథర్వ మూవీ రివ్యూ
టైటిల్: అథర్వ నటీనటులు: కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ యాదవ్, విజయ్ రామరాజు, గగన్ విహారి తదితరులు నిర్మాత: సుభాష్ నూతలపాటి దర్శకత్వం: మహేశ్ రెడ్డి సంగీతం: శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని విడుదల తేది: డిసెంబర్ 1, 2023 ‘అథర్వ’ కథేంటంటే.. దేవ్ అథర్వ కర్ణ అలియాస్ కర్ణ(కార్తీక్ రాజు)కి చిన్నప్పటి నుంచి పోలీసు కావాలనే కోరిక ఉంటుంది. తన కలను నేరవేర్చుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ అతని ఉన్న అనారోగ్యం కారణంగా పోలీసు ఉద్యోగానికి సెలెక్ట్ కాలేకపోతాడు. చివరకు క్లూస్ టీమ్‌లో జాయిన్ అవుతాడు. ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి చురుగ్గా పని చేస్తూ.. చాలా కేసులను సాల్వ్ చేస్తుంటాడు. ఓసారి తన కాలేజీలో జూనియర్ అయిన నిత్య(సిమ్రన్ చౌదరి)..క్రైమ్ రిపోర్టర్‌గా తనని కలుస్తుంది. నిత్య అంటే కర్ణకి చాలా ఇష్టం. కానీ తన ప్రేమ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పలేకపోతాడు. నిత్య ఫ్రెండ్ జోష్నీ(ఐరా) ఓ స్టార్ హీరోయిన్. ఓ సారి కర్ణ, నిత్యలు కలిసి జోష్నీ ఇంటికి వెళ్తారు. అలా వాళ్లిద్దరూ ఆమె ఇంటికి వెళ్లిన తరువాత షాక్ అవుతారు. అక్కడ జోష్ని, ఆమె ప్రియుడు శివ (శివ) శవాలై పడి ఉంటారు. ప్రేయసి మీదున్న అనుమానంతోనే ఆమెను చంపి.. అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు కేసు కొట్టేస్తారు. కానీ నిత్యం మాత్రం అందులో నిజం లేదని అనుమానిస్తుంది. దీంతో కర్ణ రంగంలోకి దిగుతాడు. అసలు హీరోయిన్ జోష్ని, ఆమె ప్రియుడు శివ ఎలా చనిపోయారు? ఒక్క క్లూ కూడా లేని ఈ కేసు కర్ణ ఎలా పరిష్కరించాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అథర్వ కూడా ఆ తరహా చిత్రమే. కేసు చేధించేందుకు పోలీసులు కాకుండా క్లూస్ టీమ్ ఉద్యోగి రంగంలోకి దిగడం ఈ సినిమా ప్రత్యేకత. ఎలాంటి ఆధారాలు లేకున్నా.. హీరో తన తెలివి తేటలతో ఈ కేసును పరిష్కరించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లకు ఎలాంటి కథ, కథనాలు ఉంటే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారో అలాంటి పాయింట్‌తోనే కథ రాసుకున్నాడు దర్శకుడు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. రాబరీ కేసు నుంచి సినిమా ఊపందుకుంటుంది. అసలు కథ మాత్రం జోష్ని, ఆమె ప్రియుడు మరణించాకే ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్‌కు మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక ద్వితీయార్దం ప్రారంభం మళ్లీ స్లో అనిపిస్తుంది. ఆ తరువాత సినిమా చకచకా పరుగులు పెడుతూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. అయితే జంట హత్యలు చోటు చేసుకోవడం.. ఆ కేసును పోలీసులు హడావుడిగా మూసివేసినా.. క్లూస్ టీమ్‌లో పని చేసే హీరోకి అనుమానం రాకపోవడం కథలో సహజత్వం లోపించినట్లు అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు నాటకీయంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే ఊహించని విధంగా ఉంటుంది. కథను ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. కర్ణ పాత్రకి కార్తీక్ రాజు న్యాయం చేశాడు. లవర్‌గా, క్లూస్ టీమ్ ఉద్యోగిగా రెండు రకాల పాత్రల్లో అలరించారు. . హీరోయిజం కోసం కావాలని సీన్లు, ఫైట్లు పెట్టుకోలేదు. సహజంగా నటించాడు. హీరోయిన్ సిమ్రన్ చౌదరి తెరపై అందంగా కనిపించింది.సినిమాలో సినిమా హీరోయిన్ జోష్నిగా కనిపించిన ఐరా కూడా ఓకే అనిపిస్తుంది. పోలీసు పాత్రలు బాగున్నాయి. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. శ్రీచరణ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
మా వాళ్లని హీరోల్లా చూపించారు
‘‘పోలీస్ విభాగంలో క్లూస్ టీమ్ ఎంత ప్రముఖమైనదో ‘అథర్వ’లో చూపించారు. మా వాళ్లని హీరోల్లా చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ అడిషనల్ డైరెక్టర్ డా. అనితా ఎవాంజెలిన్. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. క్లూస్, ఫోరెన్సిక్ విభాగంలోని వారికి ‘అథర్వ’ ప్రత్యేక ప్రదర్శన వేశారు. ‘‘మేం నిజంగానే క్రైమ్ సీన్లను చూస్తుంటాం కాబట్టి ఆ జానర్ సినిమాలు చూడం. కానీ ‘అథర్వ’ అద్భుతంగా అనిపించింది’’ అన్నారు హైదరాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా. వెంకన్న. -
ప్రేమ.. భావోద్వేగం
కార్తీక్ రాజు హీరోగా సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్, క్రైమ్ జానర్లకు రొమాంటిక్, లవ్ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల భావోద్వేగాలతో తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’. క్లూస్ టీమ్ విశిష్టతను,ప్రాముఖ్యతను చూపించే కథనం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ఔట్పుట్ పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నాం. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది.. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్స్: విజయ, ఝాన్సీ. -
అనులో మంచి పాత్ర చేశాను
కార్తీక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తీ చక్రవర్తి, ఆమని, దేవీ ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, ΄ోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అను’. సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఈ సినిమా విలేకర్ల సమావేశంలో ఆమని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. చక్కని సందేశాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇదే తొలి చిత్రం. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సందీప్ గోపిశెట్టి. ‘‘ఈ సినిమాలో విలన్‌గా చేశాను’’ అన్నారు ప్రశాంత్ కార్తి. దేవీ ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, లైన్ ్ర΄÷డ్యూసర్ కల్యాణ్ చక్రవర్తి ఈ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. -
ఈ నెలలో నేనేనా
రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ తమిళ చిత్రం ‘సూర్పనగై’ (తెలుగులో ‘నేనేనా’). కార్తీక్ రాజు దర్శకత్వంలో ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రోడక్షన్ నిర్మించిన చిత్రం ఇది. అక్షరా గౌడ, అలీ ఖాన్ , జై ప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. 19వ శతాబ్దంతో పాటు ప్రస్తుత కాలంతో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రెజీనా రెండు పాత్రలు చేశారు. ఓ పాత్రలో ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా కనిపిస్తారట. -
రింగా రింగా రోసే..
కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘అథర్వ’. మహేశ్ రెడ్డి దర్శకత్వంలో నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి ఈ సినిమాను నిర్మించారు. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్ర సంగీతదర్శకుడు శ్రీ చరణ్ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్నే చూసే.. చిట్టిగుండె కూసే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల బాణీఅందించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, జావేద్ అలీ ఆలపించారు. మాస్టర్ రాజ్‌కృష్ణ కొరియోగ్రాఫర్. ఈ పాట విడుదల సందర్భంగా హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ– ‘‘రింగా రింగా రోసే..’ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరో చిన్నతనం నుండి హీరోయిన్ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేకపోతాడు. చివరికి తన ఫీలింగ్‌ను ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు మహేశ్‌రెడ్డి. ‘‘త్వరలోనే రిలీజ్ కానున్న మా సినిమాను ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుభాష్. ‘‘ఈ చిత్రంలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు సిమ్రన్ చౌదరి. -
క్రైమ్ థ్రిల్లర్‌గా 'అథర్వ'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
యంగ్ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'అథర్వ'. ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టైటిల్ లోగో, పోస్టర్, టీజర్, ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. (ఇద చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!) ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను జూన్‌లో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. -
రెండు కాలాలతో...
రెజీనా ప్రధానపాత్రలో కార్తీక్ రాజు దర్శకత్వంలో రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేనే నా’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త థియేట్రికల్, నాన్–థియేట్రికల్ రైట్స్‌ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది. ‘‘1920, ప్రస్తుతం.. ఇలా రెండు విభిన్న కాలాల నేపథ్యంలో రూపొం దించిన ఫ్యాంటసీ అడ్వంచరస్ థ్రిల్లర్ ఇది. ఇందులో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తపాత్ర చేశారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ వేసవిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్. -
థ్రిల్లింగ్ అథర్వ.. త్వరలోనే టీజర్, ట్రైలర్
కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. నేడు కార్తీక్ రాజు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘‘క్రైమ్, థ్రిల్లింగ్, ఎమోషన్స్.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
'అథర్వ' నుంచి అరవింద్ కృష్ణ బర్త్ డే స్పెషల్ పోస్టర్
యంగ్ అండ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ అథర్వ.మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చితత్రాన్ని సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. నేడు (జనవరి 5) ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అరవింద్ కృష్ణ ఎంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్లోనే పోలీసులు, మీడియా అంటూ చాలా హడావిడి వాతావరణం కనిపిస్తోంది. కాగా క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు లవ్, రొమాంటిక్, కామెడీ ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామరాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. -
కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం!
కార్తీక్ రాజు, త్వరిత నగర్ జంటగా అంజీ రామ్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్‌పై దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి ప్రముఖ గాయకుడు మనో కెమెరా స్విచ్చాన్ చేయగా, దండమూడి అవనింద్ర కుమార్ క్లాప్ కొట్టారు. హీరో ఆకాష్ పూరి గౌరవ దర్శకత్వం వహించగా, పాటల రచయిత భాస్కరభట్ల స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. దండమూడి అవనింద్ర కుమార్ మాట్లాడుతూ– ‘ఈ సినిమాను హైదరాబాద్, బ్యాంకాక్, పుకెట్ సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరించటానికి సన్నాహాలు చేశాం. 35-40 రోజుల్లో మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాలనేది మా ప్లాన్. అందరూ మా యూనిట్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం’ అన్నారు. ‘‘సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గొట్టిపాటి సాయి. ‘‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల ఆధారంగా రాసుకున్న కథ ఇది’’ అన్నారు అంజీ రామ్. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మురళీమోహన్ రెడ్డి, సంగీతం: అనుదీప్ దేవ్. -
క్రైమ్ థిల్లర్‌గా వస్తున్న 'అధర్వ'.. త్వరలోనే రిలీజ్ డేట్ ఫిక్స్..!
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో క్రైమ్ థిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా 'అధర్వ'. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. (చదవండి: యంగ్ టైగర్ మూవీ బిగ్ అప్ డేట్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్) ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచారు మేకర్స్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్ వచ్చింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
Atharva: ఆకట్టుకుంటున్న ఐరా లుక్
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అధర్వ’. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. దీంతో అదే జోష్‌లో తాజాగా ఐరా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’ అంటూ మోషన్ పోస్టర్‌లోని డైలాగ్ అందరిలోనూ ఈ అధర్వ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్ఫుల్ రోల్ పోషించినట్టు గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ ను బట్టి అర్థమైంది. డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మారిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆకట్టుకుంటున్న ‘అధర్వ’ ఫస్ట్ లుక్.. ఆ ఒక్క డైలాగ్ చాలు..!
సినిమాపై బజ్ క్రియేట్ చేయడం, ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేయడం మామూలు విషయం కాదు. కానీ యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా 'అధర్వ' మీద ముందు నుంచీ ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించే వరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’అంటూ డైలాగ్ అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్లు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో యాక్షన్‌లోకి దిగినట్టు కనిపిస్తోంది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్ఫుల్ రోల్‌ను పోషించినట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. -
శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ ఫస్ట్‌లుక్
‘కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్గోల్డ్ ఫిష్’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తి చక్రవర్తి హీరోయిన్గా సందడి చేయనుంది. తేజస్వీ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సందీప్ గోపిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కార్తీక్‌రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇంప్రెసివ్‌గా ఉంది అన్నారు. చిత్రం కూడా ప్రేక్షకులు అలరించేలా ఉంటుందని అనుకుంటున్నా. ఈ మూవీ విజయం సాధించి అందరికి మంచిపేరును తీసుకురావాలని ఆశిస్తున్నా’ అన్నారు శేఖర్ కమ్ముల. అలాగే దర్శక నిర్మాత సందీప్ గోపిశె ట్టి మాట్లాడుతూ ‘ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో మా చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. ఆడియన్స్ సర్ఫ్రైజ్గా ఫీలయ్యే ఎన్నోఅంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పూర్తి కొత్తదనంతో, నిజాయితీగా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. ప్రశాంత్, భీమనేని శ్రీనివాస్, దేవి ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ఆమని, గణపతి, అన్వి, డా. శేషసాయి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. -
కార్తీక్ రాజు హీరోగా హారర్ మూవీ.. కీలక పాత్రలో ఆమని
కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారణంగా తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సందీప్ గోపి శెట్టి దర్శక నిర్మాణంలో ఓ హారర్ సినిమా తెరకెక్కుతోంది. కరనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తాజాగా రీస్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత సందీప్ గోపిశెట్టి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌గా ఇది నా తొలి చిత్రం. సినిమాపై ఉన్న ఆసక్తితో దర్శకుడిగా మారాను. కానీ నా మీద, కథపై నమ్మకంతో ఎంటైర్ యూనిట్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుగారు అందిస్తోన్న సహకారం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే హీరో కార్తీక్, ప్రశాంత్, మిస్తీ చక్రవర్తిలతో పాటు పోసాని కృష్ణమురళి, భీమినేని శ్రీనివాస్, దేవీ ప్రసాద్‌గా, ఆమని ఇలా పేరు పేరునా అందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను’అని అన్నారు. భీమినేని, దేవీ ప్రసాద్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉందన్నారు హీరో కార్తీక్ రాజు. సీనియర్ నటి ఆమని మాట్లాడుతూ.. ‘సినిమా బాగా వచ్చింది. మంచి పాత్ర చేస్తున్నాను. ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సినిమా. తొలి సినిమానే అయినా మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కిస్తున్నారు. తనకు మంచి పేరుని తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను’అన్నారు. -
దసరాకి టీజర్
‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రాజు హీరోగా, సుప్యార్దే సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘లింగొచ్చా’. ఆనంద్ బడా ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. బ్లాక్ స్టూడియోస్ సమర్పణలో శ్రీకల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యాదగిరి రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. యాదగిరి రాజు, ఆనంద్ బడా మాట్లాడుతూ– ‘‘దసరా కానుకగా ఈ నెల 23న మా సినిమా టీజర్‌ని విడుదల చేస్తున్నాం. ‘లింగొచ్చా’ టైటిల్‌కి అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ఆyì య¯Œ ్సలో మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లేశ్ కన్జార్ల, లైన్ ప్రొడ్యూసర్స్: సందీప్ తుమ్కుర్, శ్రీనాథ్ చౌదరి, సంగీతం: బికాజ్ రాజ్. -
నో డూప్
ఓ మిస్టరీని ఛేదించడాని సిద్ధమయ్యారు రెజీనా. మరి ఆ ప్రయాణంలో ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తెలియడానికి ఇంకా సమయం ఉంది. తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకరించారు రెజీనా. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్‌శేఖర్ వర్మ నిర్మించనున్నారు. తమిళనాడులో చిత్రీకరణ కూడా ప్రారంభించారు చిత్రబృందం. కన్నడ హీరోయిన్ అక్షర గౌడ ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కూడా ఉండబోతోందట. రెజీనా డూప్ లేకుండా ఫైట్స్ చేయనున్నారని సమాచారం. ఇందుకోసం శిక్షణ కూడా ప్రారంభించారట. -
కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం
‘‘నా కెరీర్ స్టార్టింగ్‌లో ‘శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం’ లాంటి మంచి సినిమాలు చేశాను. మంచి కథలు దొరకడం కష్టమవుతున్న ఈ మధ్యకాలంలో ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఒక గొప్ప సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఇది నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్’’ అని భీమనేని శ్రీనివాసరావు అన్నారు. ఐశ్వర్యా రాజేష్, డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో శివ కార్తికేయన్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు చెప్పిన విశేషాలు. ► ‘కౌసల్య కృష్ణమూర్తి’కి వచ్చినన్ని అభినందనలు నా గత సినిమాలకు రాలేదు. మా చిత్రం నచ్చడంతో మీడియా మిత్రులు కూడా సొంత సినిమా అనుకుని సపోర్ట్ చేశారు. ప్రేక్షకులు కూడా సినిమాకు 100 శాతం కనెక్ట్ అయ్యారు. చాలా మంది కాలేజ్ విద్యార్థులు ఫోన్ చేసి, ఈ సినిమా మాకు ఓ స్ఫూర్తిలా ఉందని అంటున్నారు. ► ఈ మధ్య కాలంలో ‘మజిలీ, జెర్సీ’ లాంటి క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలు వచ్చి సక్సెస్ సాధించాయి. అయితే మాది ఫిమేల్ సెంట్రిక్ మూవీ. క్రికెటర్‌గా ఎదగాలనే ఒక అమ్మాయి తపనను చూపిస్తూనే, తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్ని చూపించాం. దానికి సమాంతరంగా రైతుల సమస్యలను చూపించాం. స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరికీ నచ్చడంతో పాటు భావోద్వేగాలకు అందరూ కనెక్ట్ అవుతున్నారు. ► ‘కళాబంధు’ టి. సుబ్బిరామిరెడ్డిగారు కుటుంబ సభ్యులతో కలిసి మా సినిమా చూశారు. వారికి సినిమా విపరీతంగా నచ్చడంతో నన్ను, కె.ఎస్ రామారావుగారిని అభినందించారు. రాజేంద్రప్రసాద్, ఐశ్వర్య రాజేష్, కార్తీక్ రాజు నటనను కొనియాడి, ఫోన్లో అభినందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ వంటి గొప్ప బేనర్లో ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు కె.ఎస్ రామారావుగారికి, కె.ఎ వల్లభ గారికి థ్యాంక్స్. ► ప్రేక్షకులకు కథ నచ్చితే అది రీమేక్ సినిమానా? ఒరిజినల్ సినిమానా? అని చూడకుండా ఆదరిస్తున్నారు.. హిట్ చేస్తున్నారు. ఒక మంచి కథ ఎక్కడ ఉన్నా మన తెలుగు ప్రేక్షకులకి చూపించాలనే సంకల్పంతో ఇప్పటి వరకూ ఎక్కువ రీమేక్ సినిమాలే చేశాను. కాలంతో పాటు మనం మారాలి. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు తీసినప్పుడే విజయం సాధించగలం. ► స్కూల్, కాలేజ్ డేస్ నుంచే నేను రైటర్‌గా, ఆర్టిస్ట్‌గా చేసేవాణ్ణి. ఆ అనుభవంతో సినిమా మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్న టైమ్‌లో ‘అశ్వద్ధామ’ సినిమాలో ఓ పాత్ర చేశా. ఆర్. నారాయణమూర్తిగారి ‘ఆలోచించండి’ సినిమాలో సెకండ్ హీరోగా చేశా. ‘కుదిరితే కప్పు కాఫీ, కెరటం’ వంటి చిత్రాల తర్వాత ‘కౌసల్య కృష్ణమూర్తి’లో బ్యాంకు మేనేజర్ పాత్ర చేశా. ఈ సినిమాలో నాదొక్కటే నెగటివ్ రోల్ అయినా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇకపైన కూడా మంచి పాత్రలొస్తే నటిస్తా. ► ఏ దర్శకుడికైనా కొన్ని సినిమాలు మైలేజ్‌నిస్తాయి. నాకు ‘సుడిగాడు’ అలాంటి సినిమా. నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా. నేను, ‘అల్లరి’ నరేష్ కూడా ‘సుడిగాడు 2’ మీద చాలా ఆసక్తిగా ఉన్నాం. మంచి అవకాశం వస్తే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా. -
శంకరాభరణం.. మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమా అంటున్నారు
‘‘సినిమాకు మంచి ప్రశంసలు లభించినా కమర్షియల్‌గా సక్సెస్ సాధించడం కూడా అవసరం. అప్పుడే ఇంకా మంచి సినిమాలు రావడానికి స్కోప్ ఉంది. సినిమా చూసినవారు ‘శంకరాభరణం, మాతృదేవోభవ’ లాంటి గొప్ప సినిమా అని అభినందిస్తున్నారు. ఇకపై కూడా మా బ్యానర్లో మా గత సినిమాల్లానే క్వాలిటీతో పాటు మంచి పర్పస్ ఉన్న సినిమాలే అందిస్తాం’’ అన్నారు కేయస్ రామారావు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేశ్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. కేయస్ రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో పాటు కలెక్షన్లూ సాధిస్తోందని చిత్రబృందం తెలిపింది. శనివారం సక్సెస్ మీట్లో ఐశ్వర్యా రాజేశ్ మాట్లాడుతూ – ‘‘తమిళంలో ఎలా ఆదరించారో తెలుగులోనూ ఈ సినిమాను అలానే ఆదరిస్తున్నారు. విభిన్నమైన సినిమాలు చేయడానికి ఈ ప్రశంసలను సపోర్ట్‌గా భావిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాకు పునాది కథ. మంచి కథ ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ అయ్యాం. ఈ బ్యానర్లో గతంలో వచ్చిన గొప్ప సినిమాలకు దీటుగానే ఈ సినిమా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘ఒక గొప్ప సినిమాకు పాటలు రాసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాంబాబు గోసాల. ‘‘కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుంటాయి. అలాంటి సినిమాయే ‘కౌసల్య కృష్ణమూర్తి’’ అన్నారు బీఏ రాజు. ‘ఇండియన్ 2’ నుంచి తప్పుకున్నాను కమల్‌హాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌ది ఓ కీలక పాత్ర. డేట్స్ క్లాష్ కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు. ఇలాంటి సినిమా వదులుకోవడం బాధగా ఉందని ఐశ్వర్య తెలిపారు. -
రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా
‘‘నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. 25 తమిళ్, 2 మలయాళం, ఒక హిందీ సినిమా చేశా. ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారని చాలామంది అడుగుతుంటారు. మా నాన్న రాజేష్‌గారు ‘మల్లె మొగ్గలు, రెండు జళ్ల సీత, ‘అలజడి’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. మా అత్త శ్రీలక్ష్మిగారు కమెడియన్‌గా అందరికీ సుపరిచితురాలు. మా తాత అమర్‌నాథ్‌గారు కూడా తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. మేం తెలుగువాళ్లమే’’ అని ఐశ్వర్యా రాజేష్ అన్నారు. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, ‘వెన్నెల’ కిషోర్ ముఖ్య పాత్రల్లో ఐశ్వర్యా రాజేష్ లీడ్ రోల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’. కె.యస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా రాజేష్ చెప్పిన విశేషాలు. ► తమిళ్లో నా పాత్రలన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌గా ఉంటాయి. తెలుగులో కూడా మంచి సినిమాతో పరిచయం అవ్వాలని తాపత్రయపడేదాన్ని. ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి ఓ మంచి సినిమాతో పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తమిళంలో నేను లీడ్ రోల్ చేసిన ‘కణ’కి ఇది రీమేక్. తమిళ ప్రేక్షకుల్లా తెలుగు ప్రేక్షకులు కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకం ఉంది. ► రాజేంద్రప్రసాద్‌గారు మా నాన్నగారికి మంచి ఫ్రెండ్. ఆయనతో నటిస్తున్నప్పుడు మా నాన్నగారి గురించి చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. కె.యస్. రామారావుగారు పట్టుబట్టి ఈ సినిమా బాగా రావడానికి తోడ్పాటునందించారు. ఈ సినిమా మా అందరికీ ఒక మంచి తీపిగుర్తుగా నిలుస్తుంది. ► క్రికెట్‌కి మంచి ప్రాధాన్యం ఉన్న సినిమా కాబట్టి ఆ ఫీల్ పోకూడదని ఫీమేల్ కోచ్‌ని పెట్టుకొని ప్రాక్టీస్ చేశాను. అలా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నేర్చుకున్నాను. తమిళ్లో ఎలాగైతే రోజుకి ఎనిమిది గంటలు ఎండలో కష్టపడ్డానో.. తెలుగుకి కూడా రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డాను. ఇంత కష్టపడ్డాను కాబట్టి తెలుగులో మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ప్రస్తుతం ‘కౌసల్య కృష్ణమూర్తి’ కోసం ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లోనే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నాను. అలాగే నేను నటించిన మరో చిత్రం ‘మిస్ మ్యాచ్’ త్వరలో విడుదలవుతుంది. -
‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్