అనులో మంచి పాత్ర చేశాను | Anu Will Appeal To All Sections Of Audiences | Sakshi
Sakshi News home page

అనులో మంచి పాత్ర చేశాను

Published Thu, Aug 24 2023 1:08 AM | Last Updated on Thu, Aug 24 2023 1:08 AM

Anu Will Appeal To All Sections Of Audiences - Sakshi

కార్తీక్‌ రాజు, ప్రశాంత్‌ కార్తి, మిస్తీ చక్రవర్తి, ఆమని, దేవీ ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, ΄ోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అను’. సందీప్‌ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఈ సినిమా విలేకర్ల సమావేశంలో ఆమని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. చక్కని సందేశాత్మక చిత్రం ఇది.

ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇదే తొలి చిత్రం. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సందీప్‌ గోపిశెట్టి. ‘‘ఈ సినిమాలో విలన్‌గా చేశాను’’ అన్నారు ప్రశాంత్‌ కార్తి. దేవీ ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, లైన్‌ ్ర΄÷డ్యూసర్‌ కల్యాణ్‌ చక్రవర్తి ఈ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement