Misti chakravarthi
-
అనులో మంచి పాత్ర చేశాను
కార్తీక్ రాజు, ప్రశాంత్ కార్తి, మిస్తీ చక్రవర్తి, ఆమని, దేవీ ప్రసాద్, భీమినేని శ్రీనివాసరావు, ΄ోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అను’. సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ఈ సినిమా విలేకర్ల సమావేశంలో ఆమని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. చక్కని సందేశాత్మక చిత్రం ఇది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇదే తొలి చిత్రం. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సందీప్ గోపిశెట్టి. ‘‘ఈ సినిమాలో విలన్‌గా చేశాను’’ అన్నారు ప్రశాంత్ కార్తి. దేవీ ప్రసాద్, భీమనేని శ్రీనివాసరావు, లైన్ ్ర΄÷డ్యూసర్ కల్యాణ్ చక్రవర్తి ఈ సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. -
O Saathiya: ఫస్ట్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్నాం
ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన లవ్‌స్టోరీ ‘ఓ సాథియా’. దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మించారు. యూఎఫ్ఓ మూవీస్ సంస్థ ఈ సినిమాను ఈ నెల 7న విడుదల చేయనుంది. ‘‘లవ్‌స్టోరీలో ఓ డిఫరెంట్ యాంగిల్‌ను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రతి వ్యక్తి జీవితంలో మెమొరబుల్‌గా నిలిచే ఫస్ట్ లవ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
నేను లూజర్‌ని కాదు.. ఫైటర్ని
‘‘కంటెంట్ ఉన్న సినిమాలను ఎవ్వరూ ఆపలేరు. మార్నింగ్ షోకే బాగుందని టాక్ వస్తే ఆ సినిమా హిట్టే. ‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమానే తీసుకోండి. మార్నింగ్ షో తర్వాత అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా బాగున్న సినిమాలన్నీ ఆడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఆది సాయికుమార్. డైమండ్ రత్నబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశాలు నాయకా, నాయికలుగా శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్‌రెడ్డి నిర్మించిన ‘బుర్రకథ’ నేడు విడుదలదవుతోంది. ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి ‘బుర్రకథ’లోది చాలెంజింగ్ రోల్. ఒక మనిషికి రెండు బుర్ర లుంటే ఏ విధంగా నడుచుకుంటాడు? అనేది కథ. ఇలాంటి పట్టున్న క్యారెక్టర్స్ చేస్తేనే మనలో ఉన్న నటుడికి సరైన టెస్ట్. అందుకే చాలెంజ్ అన్నాను. రెండు బుర్రలున్న మనిషి కథ. రెండు క్యారెక్టర్లు చాలా కష్టపడి చేశాడు ఆది అనుకోకూడదు. చాలా ఈజీగా ఈజ్‌గా చేశాడే అనుకోవాలి. ఆ పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది. ► జనరల్‌గా నా సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటే నా పాత్రలు ఉంటాయి. ఉదాహరణకు నా గత చిత్రాలు ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’లను అబ్జర్వ్ చేస్తే కావాలని నేను కామెడీ చేయను. కథలోనే ఉంటుంది. ఈ సినిమాలో రత్నబాబు ఆ కామెడీ పాళ్లు కొంచెం పెంచారు. కొన్ని కొన్ని సీన్స్ ఎలా పండుతాయో, థియేటర్లో ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో చూడాలని వెయిట్ చేస్తున్నాను. ► నేను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ పాయింట్ ఉంటుందని చెప్పగలను. ఉదాహరణకు నా మూడోసినిమా ‘సుకుమారుడు’. అందులో కొంచెం గ్రే షేడ్‌తో ఉండే పాత్ర నాది. అందరూ ఆ సినిమా చేసేటప్పుడు లవర్‌బాయ్ పాత్రలు చేసుకోవచ్చు కదా అన్నారు. ‘ఒకే రకమైన పాత్రలు ఎందుకు?’ అన్నాను. నాలోనూ నటుడున్నాడు, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. సినిమా ఫెయిల్ అయ్యింది. అందరూ నువ్వు బాగానే నటించావు అన్నారు. అదే సినిమా హిట్ అయ్యుంటే అందరూ నా చాయిస్ కరెక్ట్ అనేవారు. కానీ సినిమా ఫెయిల్ అవటంతో మరో ప్రయోగం చేసే అవకాశం లేకుండా పోయింది. అందరూ లవర్‌బాయ్‌గా చేయమంటే ‘ప్యార్ మే పడిపోయానే’ సినిమా చేశాను. అలాగే ‘గాలిపటం’ మంచి సబ్జెక్ట్. మధ్యలో కొన్ని కమర్షియల్ సినిమాలు చేశాను. ఆ సినిమాలు కమర్షియల్‌గా బాగానే పే చేశాయి. వాటిలో ‘రఫ్’, ‘చుట్టాలబ్బాయి’ బాగా వసూలు చేశాయి. ‘శమంతకమణి’ సినిమాతో మళ్లీ ఓ ఎక్స్పెరిమెంట్ చేశాను. అది చాలా మంచి పేరొచ్చింది. ► ‘బుర్రకథ’ సినిమా ద్వారా ఇప్పుడు చాలా పెద్ద పేరొస్తుంది, ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం కలిగింది. ప్రతి మనిషిలోనూ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి లూసర్, రెండోది ఫైటర్. లూసర్ కిందపడగానే ఓడిపోయాను అని వెళ్లిపోతాడు. కానీ, నేను లూసర్‌ని కాదు ఫైటర్ని. కిందపడ్డా లేచి పరిగెత్తాలి, రేసులో నిలవాలి అనే ఫైటర్‌ను నేను. ► ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమా కంప్లీట్ అయ్యింది కానీ, కొంచెం సీజీ బ్యాలెన్స్ ఉంది. మరో రెండు నెలల్లో రిలీజ్ చేస్తాం. ఇవికాక ‘జోడీ’ అనే కంప్లీట్ ఫ్యామిలీ క్యూట్ లవ్‌స్టోరీ చేస్తున్నాను. అందులో ఒక్క ఫైట్ కూడా ఉండదు. తమిళ్, తెలుగులో ఓ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ చేస్తున్నా. ఇవికాక సాయిరాజ్ అనే నూతన దర్శకునితో చేయబోతున్న చిత్రం షూటింగ్ ఆగస్ట్‌లో మొదలవుతుంది. లక్ష్యం నెరవేరింది ‘‘హాస్యానందం’ పత్రికలో సబ్ ఎడిటర్‌గా చేశా. ఆ తర్వాత రచయితగా, ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి ఎదిగా. ఒక సెల్లో రెండు సిమ్‌లు ఉన్నప్పుడు ఒక మనిషిలో రెండు మైండ్లు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘బుర్రకథ’’ అని ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో వచ్చాను. ‘బుర్రకథ’ సినిమా ఓపెనింగ్ రోజు నా లక్ష్యం నెరవేరిందని చేతికి ‘డైరెక్టర్’ అని పచ్చబొట్టు వేయించుకున్నా. చిన్న నిర్మాతలను దర్శకుడు కాపాడుకోవాలి. మార్కెట్‌ని బట్టి బడ్జెట్ పెడితేనే నిర్మాతలకు లాభం ఉంటుంది. 50 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేస్తానని నిర్మాతకు మాటిచ్చా.. 46 రోజుల్లోనే పూర్తి చేశా. ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో నేనే రెండు పాటలు కూడా రాశా. రామాయణం, మహాభారతం, పరిసరాల స్ఫూర్తితో కథలు రాసుకుంటా. హాలీవుడ్లో రచయితకి మంచి పారితోషికం ఉంటుంది. టాలీవుడ్లో డైరెక్టర్‌కి ఉంటుంది. నా రెండో సినిమాగా ‘బుర్రకథ’నే తమిళ్, హిందీలో రీమేక్ చేసే చాన్స్ ఉంది. మూడో సినిమాగా మోహన్‌బాబుగారి ఫ్యామిలీకి సరిపడే కథ రెడీచేశా. ఆయన చాన్స్ ఇస్తే చేస్తా’’ అన్నారు. -
‘బుర్రకథ’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బుర్రకథ. ఈ సినిమాతో ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈసినిమా వాయిదా పడటంతో జూలై 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సెన్సార్ సర్టిఫికేషన్‌లో ఇబ్బందులు ఎదురవ్వటంతో శుక్రవారం విడుదల కావాల్సిన బుర్రకథ వాయిదా పడింది. శనివారం రిలీజ్ చేసేందుకు ప్రయత్నించినా కుదరకపోవటంతో వారం ఆలస్యంగా జూలై 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. -
‘బుర్రకథ’ విడుదల వాయిదా
ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బుర్రకథ. ఈసినిమాతో ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ శుక్రవారం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ సర్టిఫికేషన్‌లో ఇబ్బందులు ఎదురవ్వటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఆఖరి నిమిషంలో టెన్షన్ ఉండకూడదన్న ఉద్దేశంతో సినిమాను ఒక రోజు ఆలస్యంగా శనివారం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే శుక్రవారానికి కూడా సెన్సార్ విషయంలో క్లారిటీ వచ్చే అవకావం లేకపోవటంతో ప్రస్తుతానికి సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో ఆది సాయికుమార్ తో పాటు.. దర్శకుడు డైమండ్ రత్నబాబు తొలి సినిమా కావటంతో ఈ ఇద్దరి కెరీర్లకు ఈ సినిమా కీలకంగా మారింది. -
నాలో ఆ ఇద్దరూ ఉన్నారు
‘‘స్క్రిప్ట్‌లో దమ్ముంటేనే లిప్‌లాక్ సీన్స్‌లో నటిస్తా. అయితే అలాంటి సీన్లు చేసేవారిని నేను తప్పు పట్టడం లేదు. నా సినిమాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ చూడాలనుకుంటా’’ అన్నారు ఆది సాయికుమార్. రచయిత ‘డైమండ్’ రత్నబాబు దర్శకునిగా పరిచయం అవుతున్న సినిమా ‘బుర్రకథ’. ఇందులో ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరో హీరోయిన్లు. శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► చాలెంజింగ్ పాత్రలు చేసినప్పుడే మనలోని బెస్ట్ బయటకు వస్తుంది. ఈ సినిమాలో రెండు బుర్రలు ఉన్న అభిరామ్ క్యారెక్టర్ చేశాను. నాకు సవాల్‌గా అనిపించింది. రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ సరిగా చూపించానా? లేదా? అనే విషయంలో ఆడియన్స్ ఎలా డిసైడ్ చేస్తారో అని భయంగా ఉంది. ► ఒక మనిషిలో రెండు బుర్రలు ఉన్నట్లు నేనొక ఆర్టికల్ చదివాను. ఈ కాన్ఫ్లిక్ట్ సబ్జెక్ట్‌ని సింపుల్‌గా, ఎంటర్టైనింగ్ వేలో చూపించారు రత్నబాబు. అభి, రామ్ క్యారెక్టర్ల విషయంలో ఆడియన్స్‌కు మొదటి 15 మినిట్స్‌లోనే క్లారిటీ వస్తుంది. అభిది జోవియల్ క్యారెక్టర్. రామ్ లోకజ్ఞానం తెలిసినవాడు. నాలో అభి–రామ్ ఇద్దరూ ఉన్నారు. అభి–రామ్ క్యారెక్టర్స్ మధ్య రాజేంద్రప్రసాద్‌గారు నలిగిపోవడం ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. మా సినిమాతో పాటు మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ సోలో రిలీజ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. ► ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పేరు, డబ్బు... ఒక సినిమాకు ఈ మూడు అంశాలు వస్తే ఆ చిత్రం హిట్‌గా భావిస్తాను. ‘ప్రేమకావాలి, లవ్లీ’ సినిమాల తర్వాత ఆ రేంజ్ హిట్‌ని అందుకోలేకపోయాను. ఇందుకోసం ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరచుకుంటూ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ► నేను అంగీకరించని సినిమాలు కొన్ని సూపర్‌హిట్ సాధించాయి. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. నేను వదులుకున్న సినిమా హిట్ సాధించిందన్న బాధ నాకు లేదు. ఎందుకంటే మన జడ్జ్మెంట్ అన్ని వేళలా కరెక్ట్‌గా ఉండదు. ఈ విషయంలో ‘నీకు టేస్ట్ లేదు’ అని మా సిస్టర్ నన్ను ఆటపట్టిస్తుంది. ► మా నాన్నగారికి (సాయికుమార్) కన్నడలో నటుడిగా మంచి పేరు ఉంది కదా అని నేను అక్కడ సినిమాలు చేయలేను. ముందుగా తెలుగులో మంచి హిట్ సాధించి, ఆ తర్వాత కన్నడగురించి ఆలోచిస్తాను. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మా పాప నా షూటింగ్‌లకు వస్తోంది. ► నా కెరీర్‌లోని గ్యాప్‌ను నేను ప్లాన్ చేయలేదు. ప్రస్తుతానికి విలన్ పాత్రలు చేయాలనే ఆలోచన లేదు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాను. ‘ఆపరేషన్ గోల్డ్‌షిఫ్’లో అర్జున్ పండిట్ అనే పాత్ర చేశాను. ‘జోడి’ ఆల్మోస్ట్ పూర్తయింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. -
నా శత్రువు నాతోనే ఉన్నాడు
‘రామాయణంలో రాముడి శత్రువు రావణాసురుడు.. కృష్ణుని శత్రువు కంసుడు... నా శత్రువు నాతోనే ఉన్నాడు’ అంటూ ఆది సాయికుమార్ డైలాగులతో ప్రారంభమయ్యే ‘బుర్రకథ’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఆది సాయికుమార్ హీరోగా, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరోయిన్లుగా నటించారు. రచయిత ‘డైమండ్’ రత్నబాబు ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని హీరో వెంకటేష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉంది. మంచి స్టోరీ. ఆది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రత్నంబాబు తెరకెక్కించిన ఈ అందమైన కథని ప్రతి ఒక్కరూ చూడాలి’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్ చూసి వింటేజ్ క్రియేషన్స్ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల హక్కులు కొన్నారు. సినిమాపై చాలా నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు శ్రీకాంత్ దీపాల. డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘హీరో నమ్మకంతోనే ఒక డైరెక్టర్ వస్తాడు. ప్రతిభ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, వారందరినీ ప్రోత్సహించడానికి నిర్మాతలు చాలా అవసరం. రచయితగా ఉన్న నాకు దర్శకుడిగా ప్రోత్సాహం దొరికింది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం చాలా బాగుండటంతో పాటు ఎంటర్టైనింగ్గా ఉంటుంది’’ అని తెలిపారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ – ‘‘నాని, సందీప్ కిషన్, సాయి తేజ్‌లతో సహా మిగతా హీరోలందరూ మా సినిమా గురుంచి పాజిటివ్ ట్వీట్స్ చేసినందుకు థ్యాంక్స్. నాకు హిట్ పడి చాలా కాలం అయింది.. ఈ సినిమాతో మళ్లీ హిట్ సాధిస్తాననే నమ్మకం ఉంది’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘బుర్రకథ’ నా 4వ సినిమా. మంచి హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అన్నారు కిరణ్‌రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్. -
రెండు మెదళ్ల కథ
దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె. దీపాల నిర్మిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. మాటల రచయిత డైమండ్ రత్నబాబు మొదటిసారి దర్శకత్వం వహించారు. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్యే ‘బుర్రకథ’ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో పాటు ఫ్యాన్సీ రేటుతో సినిమాకు బిజినెస్ ఆఫర్ కూడా వచ్చింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ హక్కులను వింటేజ్ క్రియేషన్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్. -
రెండు బుర్రల కథ
ఒక్క మెదడుతోనే ఎన్నో విషయాలు ఆలోచించగలుగుతున్నాం. అదే రెండు మెదళ్లు ఉంటే? ఇదే కాన్సెప్ట్‌తో ‘బుర్ర కథ’ చిత్రం తెరకెక్కింది. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారారు. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్. శ్రీకాంత్ దీపాల నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను గురువారం రిలీజ్ చేశారు. ‘‘రెండు షేడ్స్‌లో ఆది సాయికుమార్ పాత్ర ఉండబోతోంది. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: సి.రాంప్రసాద్ -
నా పాత్రను తగ్గించేశారు
‘మణికర్ణిక’ చిత్రం మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటనను ప్రేక్షకులు అభినందిస్తున్నా, ఆమె ప్రవర్తనను మాత్రం తోటి టెక్నీషియన్స్ విమర్శిస్తున్నారు. దర్శకత్వం విషయంలో క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నా పాత్రను నిర్దాక్షిణ్యంగా తగ్గించేశారని అందులో నటించిన హీరోయిన్ మిస్తీ చక్రవర్తి ఆరోపించారు. ‘‘మణికర్ణిక’ సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని, మంచి సన్నివేశాలున్నాయని క్రిష్‌గారు నాతో చెప్పారు. అలానే అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరించారు కూడా. కానీ, అవన్నీ సినిమాలో కనిపించలేదు. సినిమా పూర్తయ్యాక మళ్లీ కొన్ని సన్నివేశాలు షూట్ చేయడానికి కంగనా నన్ను డేట్స్ అడిగారు. అప్పుడు తీసిన సన్నివేశాలను మొదట షూట్ చేసినవాటి స్థానంలో చేర్చారు. ఒకవేళ కంగనానే దర్శకురాలని ముందే తెలిసుంటే ఈ సినిమా చేసుండేదాన్ని కాదు’’ అని పేర్కొన్నారు మిస్తీ. -
కైకాలఃదీర్ఘాయుష్మాన్ భవ
సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ చాలా విరామం తర్వాత ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘దీర్ఘ ఆయుష్మాన్ భవ’. కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా ఎం.పూర్ణానంద్ దర్శకత్వంలో జి.ప్రతిమ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ ప్రేమకథా చిత్రమిది. సినిమా ఆద్యంతం ఫ్రెష్ లుక్‌తో ఉంటుంది. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘నా గత చిత్రాల కంటే వైవిధ్యంగా ఉండే సినిమా ఇది. పూర్ణానంద్గారు ఓ గమ్మత్తెన ప్రేమకథతో తీస్తున్నారు. ‘దీర్ఘ ఆయుష్మాన్ భవ’ ఈ కథకు కరెక్ట్ టైటిల్’’ అన్నారు కార్తీక్ రాజు. ‘‘నేటి తరం ప్రేమకథల్లో ఇదొక విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతోంది. నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు మిస్తీ చక్రవర్తి. నోయల్, ఆమని, పృథ్వీరాజ్, కాశి విశ్వనా«థ్, ‘సత్యం’ రాజేష్, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్, కెమెరా: మల్హర్‌భట్ జోషి. -
కోలీవుడ్ అంటేనే ఇష్టం
తమిళసినిమా: తనకు తమిళ చిత్రపరిశ్రమ అంటేనే చాలా ఇష్టం అని ప్రముఖ నటి జయప్రద పేర్కొన్నారు. నినైత్తాలే ఇనిక్కుమ్ చిత్రంలో ఇటు కమలహాసన్, అటు రజనీకాంత్‌తో కలిసి నటించి మెప్పించిన నటి జయప్రదను కోలీవుడ్ ఎప్పటికీ మరచిపోదు. అయితే ఒక్క తమిళంలోనే కాకుండా, దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి అగ్రనటిగా రాణించిన జయప్రద ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి నటనకు దూరం అయ్యారు. ఆ తరువాత అడపాదడపా తెలుగు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో కనిపించినా, కోలీవుడ్‌కు మాత్రం చాలా కాలం తరువాత యాగం అనే చిత్రం ద్వారా రీఎంట్రీ అవుతున్నారు. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగింది. ఐదేళ్ల తరువాత మళ్లీ కోలీవుడ్‌కు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద మాట్లాడుతూ ఐదేళ్ల తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ అవడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి కథా చిత్రం అయితే బాగుంటుందనిపించిదన్నారు. అలాంటి సమయంలో యాగం చిత్ర దర్శకుడు నరసింహ తనను కలిసి ఈ చిత్రంలో నటించాల్సిందిగా కోరారన్నారు. తను రెండేళ్లకు పైగా ఎంతో హోమ్ వర్క్ చేసి ఈ కథను తయారు చేశారని తెలిపారు. తాను పలు భాషల్లో నటించినా తమిళ చిత్ర పరిశ్రమ అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. తమిళంలో యాగం పేరుతోనూ, తెలుగులో శరభ పేరుతోనూ రూపొందుతోందని చెప్పారు. ఇది మానవ శక్తి, దైవశక్తి, దుష్టశక్తి మధ్య జరిగే కథా చిత్రం అని వెల్లడించారు. ఇందులో కొడుకును కాపాడుకోవడానికి తపన పడే తల్లిగా తాను నటించానని, ఇది అభియనయానికి చాలా అవకాశం ఉన్న పాత్ర అని తెలిపారు. ఇక మంచి చిత్రంలో తానూ ఇక భాగం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని నటి జయప్రద పేర్కొన్నారు. ఏఎస్కే ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎన్.నరసిమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు శంకర్ వద్ద పలు చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. ఆకాశ్‌కుమార్, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జయప్రద, నెపోలియన్, నాజర్, పోన్వన్నన్, ఎంఎస్.భాస్కర్, తనికెళ్లభరణి ముఖ్య పాత్రలను పోషించారు. కోటి సంగీతాన్ని అందించారు. చిత్రాన్ని అక్టోబర్ ప్రథమార్థంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.