
ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బుర్రకథ. ఈ సినిమాతో ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈసినిమా వాయిదా పడటంతో జూలై 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.
సెన్సార్ సర్టిఫికేషన్‌లో ఇబ్బందులు ఎదురవ్వటంతో శుక్రవారం విడుదల కావాల్సిన బుర్రకథ వాయిదా పడింది. శనివారం రిలీజ్ చేసేందుకు ప్రయత్నించినా కుదరకపోవటంతో వారం ఆలస్యంగా జూలై 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment