Burra Katha
-
పిల్లలు చెప్పిన బుర్రకథ..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ‘ఇతిహాసమ్: తెలంగాణ వారసత్వ సంపద ప్రతిధ్వని’ థీమ్‌తో సుచిత్ర అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. సుచిత్ర అకాడమీ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ‘సుచిత్ర ఇన్నోవేషన్ సెంటర్’ను మంగళవారం ప్రారంభించారు.ఇందులో భాగంగా బ్రహ్మం గారి బుర్ర కథ ప్రదర్శన, తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేక ప్రజా తిరుగుబాట్లను ప్రతిబింబించే ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రష్యాలో భారత దేశ మాజీ అంబాసిడర్ అయిన బలా వెంకటేశ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. అకాడమీ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణం రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు తెలంగాణలోని సుసంపన్న సంపదను ప్రదర్శనల ద్వారా ప్రాణం పోశారని అన్నారు. (చదవండి: తల్లీ.. నీకు సెల్యూట్!) -
ఉన్నత చదువులు చదువుతూనే..ఒగ్గు కథలు చెబుతున్న యువత!
అవును.. వాళ్లు కథలు చెబుతున్నారు. ఊ కొట్టే కథలు కావు. పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన కథలు. పల్లెల్లో ఆధ్యాత్మిక భావాలు నింపే ఒగ్గుకథలు. దశాబ్దం క్రితం కులవృత్తి అంటే చిన్నచూపు చూడడంతో జానపదుల కళలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలోనే నేటి యువత ఇటు చదువుతోపాటు అటు కులవృత్తిని ఉపాధిరంగంగా ఎంచుకుంటుంది. బీటెక్, బీఈడీ, డిగ్రీలు, పీజీలు చదువుతూనే ఒగ్గుకథలు, మల్లన్నపట్నాల కథలు చెబుతున్నారు. కులవృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఒకప్పుడు మల్లన్నపట్నాలు అంటేనే కథకులు పెద్ద వయసు వారు వచ్చేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. పాతికేళ్లు కూడా నిండని యువత మల్లన్నపట్నాల బాధ్యతలు తమ బుజాలపై వేసుకుంటున్నారు. కథలు చెబుతూ పల్లెప్రజల మన్ననలు అందుకుంటున్నారు. మూడు నెలలు కథలు చెబుతూ.. తాతలు.. తండ్రుల నుంచి వచ్చిన కులవృత్తిని ఉపాధిరంగంగా ఎంచుకున్న నేటి యువత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే కథలు చెబుతున్నారు. ఈ మూడునెలల్లో ప్రతీ ఆదివారం మల్లన్నపట్నాల పూజలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఒకరి ఇంట్లో మల్లన్నపట్నాల పూజలకు ముగ్గురు యువకులు వెళ్లి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. మల్లన్న పట్నాలలో ఆడ వేషధారణలో కథలు చెబుతున్న యువ కళాకారుడు కులవృత్తిపై మమకారంతో.. కులవృత్తిపై మమకారంతో ఇటీవల యువత మల్లన్నపట్నాలు, భీరప్ప కథలు చెప్పేందుకు ముందుకొస్తున్నారు. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో దాదాపు 50 మంది ఒగ్గుకథ కళాకారులు ఉన్నారు. ఇందులో 20 మంది వరకు పాతికేళ్లు కూడా నిండని యువతే. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మూడు నెలల్లో ప్రతీ ఆదివారం, సోమవారం మల్లన్న పట్నాల పూజలకు వెళ్తుంటారు. కులవృత్తిని గౌరవిస్తూనే ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. బోయినపల్లి మండలానికి చెందిన కళాకారులు వేములవాడ, బావుపేట, కందికట్కూర్, వాసంపల్లి, అయ్యోరుపల్లి గ్రామల మధ్యలో విస్తరించి ఉన్న ప్రాంతంలో మల్లన్నపట్నాల పూజలు చేస్తుంటారు. వివిధ దేవుళ్లు, జానపదల కథలు చెబుతుంటారు. ఇవి చదవండి: దశకుంచెల చిత్రకారుడు! ఏకకాలంలో రెండు చేతులతో.. -
వినుడువినుడు 'విజయ'గాథ
విద్యలనగరం కళలకు కాణాచి. కళాకారులకు పుట్టినిల్లు. సమాజంలోని రుగ్మతలను ప్రపంచానికి చాటిచెప్పేది.. సమకాలీన అంశాలను తమ ప్రదర్శనలతో ప్రజల మదిలో ముద్రించేది కళాకారులే. హాస్యభరితమైన ప్రదర్శనలతో ఓ వైపు ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు సమాజాన్ని చైతన్యవంతం చేసే కళ వారి సొంతం. వేలాది ప్రదర్శనలతో జిల్లాకు పేరుతెచ్చిన కళాకారులు కరోనా మహమ్మారి వ్యాప్తితో మూడేళ్లుగా ప్రదర్శనలకు దూరమయ్యారు. విజయనగరం జిల్లాకు వన్నెతెచ్చిన బుర్రకథ కళా ప్రదర్శనలపై ప్రత్యేక కథనం విజయనగరం టౌన్: బుర్రకథ కళకు కేరాఫ్ విజయనగరం. ఇప్పటికీ ఆ గుర్తింపు ఉంది. వినుడువినుడు మా విజయగాథ అంటూ బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం, సారంగధర, సీతారామ కల్యాణం వంటి ఎన్నో అద్భుతమైన పురాణ కథలు, ఇతిహాసాలు, యుద్ధవీరుల గొప్పతనాన్ని హాస్యభరితంగా వివరించిన బుర్రకథ కళాకారులకు పుట్టినిల్లు మన విద్యలనగరం. సామాజిక రుగ్మతలపై ప్రజలను జాగృతం చేస్తూనే.. కథల్లోని నీతిని బోధించి ప్రజల మన్ననలు అందుకునేవారు. కుటుంబం మొత్తం కళల్లో ఆరితేరేందుకే ఇష్టపడేవారు. ఫలానా వంశం నుంచి వచ్చిన కళాకారుడని గొప్పలు చెప్పేవారు. ఆ కోవలోనే కుమ్మరి మాస్టారు బుర్రకథ అంటే తెలియని వారుండరు. రాఘవకుమార్, రొంగలి సత్యం వంటి వారెందరో జిల్లాలో కళలను ప్రోత్సహించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచిన కళల్లో బుర్రకథదీ ప్రత్యేక స్థానం. నాజర్ బుర్రకథకు ఆద్యుడిగా పేరుగాంచారు. గ్రామాల్లో ఏ పండగ అయినా ఆ రోజు బుర్రకథ, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు తప్పనిసరిగా ఉండేవి. కళాకారులు వేషం కట్టి స్టేజ్ ఎక్కి కథ చెబితే.. ప్రేక్షకుల చప్పట్లు, హర్షధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేది. కళపై మక్కువతో... విజయనగరం మట్టిపై జన్మించిన వారందరికీ కళపైన మక్కువ ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా ఐదువేల మందికి పైగా కళాకారులు ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చి జిల్లాకు పేరుతెస్తున్నారు. పైడితల్లి అమ్మవారి పండగలో తొలేళ్ల ఉత్సవం రోజు కుమ్మరిమాస్టారి బుర్రకథ ఉండాల్సిందే. ఆయన చెప్పే హాస్య రసభరితమైన ప్రదర్శనను ప్రజలు ఆద్యంతం ఆస్వాదించాల్సిందే. ఆయన కథకోసమే ప్రజలు తొలేళ్లరోజు నాటికే జిల్లాకు తరలివచ్చేవారంటే ఆయన చెప్పే కథకు ఉన్న విశిష్టత అంతటి గొప్పది. అలాగే, బొబ్బిలి యుద్ధంలో కథకుడిగా రాఘవకుమార్, బాలనాగమ్మ బుర్రకథలో కథకుడు రొంగలి సత్యంలు చెప్పే కథలు ప్రజల్లో చైతన్యం నింపేవి. జిల్లాకు చెందిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి అందరికీ సుపరిచితురాలే. ఆమె అసలుపేరు రెడ్డి విజయలక్ష్మి. బుర్రకథ ప్రదర్శనలో ఆమెకు ఆమేసాటి. జానపద గీతాలను ఆలపిస్తూ తన నృత్యంతో వాటికి ఆమె వన్నెతెచ్చారు. జయమ్మ, జిన్నాం లక్ష్మణరావు వంటి ఎంతోమంది కళాకారులు బుర్రకథ కళకు తమ ప్రదర్శనలతో జీవంపోశారు. నాడు బిజీ.. నేడు ఖాళీ.. కళను నమ్ముకుని ఎంతోమంది కళాకారులు జీవనం సాగిస్తున్నారు. మూడేళ్ల కిందటి వరకు నెలకు 20 ప్రదర్శనలు ఇచ్చేవారు. కోవిడ్ ప్రభావంతో ఇప్పుడు నెలకు కనీసం రెండు, మూడు ప్రదర్శనలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కళను బతికిద్దామన్న ఆకాంక్షకు కోవిడ్ అడ్డుతగులుతోందంటూ ఆవేదన చెందుతున్నారు. ఆ రోజులు మళ్లీ రావాలని... మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. నేను గత 20 ఏళ్లుగా విజయనగరంలోనే ఉంటున్నాను. బుర్రకథ దళంలో సభ్యురాలిగా ప్రదర్శనలిచ్చేదానిని. కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండేదికాదు. కరోనా మా కళాకారుల జీవితాలను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది. నాటి మంచి రోజులు మళ్లీ రావాలని ఆశిస్తున్నాం. – ఎం.రాజేశ్వరి, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు కోవిడ్‌తో ఉపాధి కోల్పోయాం గతంలో నెలరోజులకు 25కి పైగా ప్రొగ్రామ్‌లు చేసిన రోజులున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఒక్కప్రొగ్రాం కూడా ఇవ్వలేని పరిస్థితి. మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాం. ఇళ్లకే పరిమితమయ్యాం. జనంలో కళలకు ఆదరణ తగ్గిపోతోంది. – గరివిడి లక్ష్మి, బుర్రకథ కళాకారిణి, గరివిడి నాట్యమండలితో ఆదరణ గతంలో జిల్లాతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు వివిధ ప్రొగ్రామ్‌లు కావాలని నాట్యమండలిని ఆశ్రయించేవారు. మూడేళ్లుగా కోవిడ్ మహమ్మారి కళాకారుల జీవితాలతో ఆడుకుంటోంది. ఉన్నతాధికారులు స్పందించి కళాకారులను ఆదుకోవాలి. కళా ప్రదర్శనలకు అవకాశం ఇవ్వాలి. – నెల్లూరు సంగీత్ కుమార్, ఆర్టిస్టు, నాట్యకళామండలి ప్రతినిధి, విజయనగరం -
‘బుర్రకథ’ మూవీ రివ్యూ
-
‘బుర్రకథ’ మూవీ రివ్యూ
టైటిల్ : బుర్రకథ జానర్ : కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు : ఆది సాయి కుమార్, రాజేంద్రప్రసాద్, మిస్త్రీ చక్రవర్తి తదితరులు సంగీతం : సాయికార్తీక్ దర్శకత్వం : డైమండ్ రత్నబాబు నిర్మాతలు: కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ దీపాల, కిషోర్ ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న హీరో ఆది సాయికుమార్. అయితే చాలా కాలంపాటు సరైన సక్సెస్‌లేక వెనుకబడ్డ ఆది.. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఈసారి ‘బుర్రకథ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈసారి ఆది ఆశించిన విజయం లభించిందా? సరైన సక్సెస్‌లేక కొన్నేళ్లుగా తడబడుతున్న ఆయన కెరీర్ గాడిలో పడిందా? లేదా అన్నది ఓసారి చూద్దాం. కథ అభిరామ్(ఆది సాయికుమార్) పుట్టుకతోనే రెండు మెదళ్లు ఉండటంతో రెండు రకాలగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దీంతో అభిరామ్ కాస్త అభి, రామ్‌గా భిన్న వ్యక్తిత్వాలతో లైఫ్ గడిపేస్తూ ఉంటారు. ఏవైనా పెద్ద శబ్దాలను విన్నప్పుడు అభి, రామ్‌గా.. రామ్ అభిగా మారిపోతూ ఉంటారు. ఒక్కరిగానే పుట్టినా.. ఇద్దరిలా పెంచుతారు ఈశ్వర్ప్రసాద్ (రాజేంద్రప్రసాద్). వ్యతిరేక ధృవాలుగా ఉన్న అభి, రామ్ ఎప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారో అని ఈశ్వర్ ప్రసాద్ ఎదురుచూస్తు ఉంటాడు. రెండు మెదళ్లైనా.. వారిద్దరిది ఒకే మనసు అని అభి, రామ్ తెలుసుకుంటారని ఆశిస్తూ ఉంటాడు? అయితే అభిరామ్ జీవితంలోకి హ్యాపీ (మిస్త్రీ చక్రవర్తి), గగన్ విహారి(అభిమన్యు సింగ్) రాకతో ఎలాంటి చిక్కులు వచ్చాయి? చివరకు అభి, రామ్ కలిసిపోయి అభిరామ్ అయ్యారా? అభిరామ్ తండ్రి ఈశ్వర్ ప్రసాద్ కోరిక నెరవేరిందా అన్నదే మిగతా కథ. నటీనటులు అభి, రామ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లో ఆది సాయి కుమార్ ప్రేక్షకులను మెప్పిస్తాడు. మొదటి చిత్రం నుంచి ఆది తన స్టెప్పులతో, ఫైట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా ఆది డ్యాన్స్, యాక్షన్స్‌తో ఆకట్టుకుంటాడు. అభిగా అల్లరిచిల్లరగా తిరిగే పాత్రకు, రామ్ లాంటి డీసెంట్ క్యారెక్టర్‌కు తన నటనతో వేరియేషన్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ అలవోకగా నటించేశాడు. హాస్యాన్ని పండించడమే కాదు, ఎమోషన్స్ సీన్స్‌లోనూ తన అనుభవాన్ని చూపించాడు. హీరోయిన్గా మిస్త్రీ చక్రవర్తి పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా.. లుక్స్ పరంగా ఓకే అనిపించింది. మరో హీరోయిన్ అయిన నైరాషా కనిపించిన రెండు మూడు సీన్స్‌లో ఫర్వాలేదనిపించింది. మిగతా పాత్రల్లో కమెడియన్ పృథ్వీ, గాయత్రి గుప్తా, జబర్ధస్త్ మహేష్, విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ తమపరిధి మేరకు నటించారు. విశ్లేషణ రచయితలు దర్శకులుగా మారి సినిమాలను తెరకెక్కించడం చూస్తూనే ఉన్నాం. అయితే అందులో కొందరు సక్సెస్ అవ్వగా మరికొందరు వెనకబడ్డారు. అయితే డైలాగ్ రైటర్‌గా మంచి పేరున్న డైమండ్ రత్నబాబు.. ఈ చిత్రంలో కూడా మంచి పంచ్ డైలాగ్‌లను రాశాడు. కంటెంట్ కంటే కామెడీ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టిన రత్నబాబు.. సినిమాను ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా మలచడంతో సక్సెస్ అయ్యాడు. ఇదే పాయింట్‌తో ఓ ప్రయోగం చేసే అవకాశం ఉన్నా.. కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించిడంతో ఏమంత కొత్తగా ఉండదు. పైగా స్క్రీన్ ప్లే కూడా అంత ప్రభావవంతంగా అనిపించదు. ప్రతీ సన్నివేశం అతికించినట్లు అనిపించడంతో.. చూసే ప్రేక్షకుడికి ఫ్లో మిస్ అయినట్లు అనిపిస్తుంది. రత్నబాబు రచయితగా సక్సెస్ అయినా.. దర్శకుడిగా మాత్రం కాస్త తడబడ్డాడు. ఈ చిత్రాన్ని కమర్షియల్ హంగులతో, కామెడీ ఎంటర్టైనర్గా మలచడంతో ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. కథలో ఏం జరగబోతోంది అన్నది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతూ ఉంటుంది. సంగీత దర్శకుడిగా సాయి కార్తీక్ ఓకే అనిపించాడు. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగానే ఎలివేట్ చేశాడు. కెమెరామెన్ ప్రతి సన్నివేశాన్ని తెరపై అందంగా చూపించాడు. ఎడిటింగ్ విభాగం ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. అందరూ ప్రయోగాల బాటపడుతున్న వేళ.. మళ్లీ అదే మూసధోరణిలో తీసిన ఈ చిత్రం ఏమేరకు విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. ప్లస్పాయింట్స్ నటీనటులు సంగీతం కామెడీ మైనస్ పాయింట్స్ కథనం కొత్తదనం లోపించడం బండ కళ్యాణ్, సాక్షి వెబ్‌డెస్క్. -
నేను లూజర్‌ని కాదు.. ఫైటర్ని
‘‘కంటెంట్ ఉన్న సినిమాలను ఎవ్వరూ ఆపలేరు. మార్నింగ్ షోకే బాగుందని టాక్ వస్తే ఆ సినిమా హిట్టే. ‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమానే తీసుకోండి. మార్నింగ్ షో తర్వాత అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా బాగున్న సినిమాలన్నీ ఆడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఆది సాయికుమార్. డైమండ్ రత్నబాబుని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశాలు నాయకా, నాయికలుగా శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్‌రెడ్డి నిర్మించిన ‘బుర్రకథ’ నేడు విడుదలదవుతోంది. ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి ‘బుర్రకథ’లోది చాలెంజింగ్ రోల్. ఒక మనిషికి రెండు బుర్ర లుంటే ఏ విధంగా నడుచుకుంటాడు? అనేది కథ. ఇలాంటి పట్టున్న క్యారెక్టర్స్ చేస్తేనే మనలో ఉన్న నటుడికి సరైన టెస్ట్. అందుకే చాలెంజ్ అన్నాను. రెండు బుర్రలున్న మనిషి కథ. రెండు క్యారెక్టర్లు చాలా కష్టపడి చేశాడు ఆది అనుకోకూడదు. చాలా ఈజీగా ఈజ్‌గా చేశాడే అనుకోవాలి. ఆ పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది. ► జనరల్‌గా నా సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటే నా పాత్రలు ఉంటాయి. ఉదాహరణకు నా గత చిత్రాలు ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’లను అబ్జర్వ్ చేస్తే కావాలని నేను కామెడీ చేయను. కథలోనే ఉంటుంది. ఈ సినిమాలో రత్నబాబు ఆ కామెడీ పాళ్లు కొంచెం పెంచారు. కొన్ని కొన్ని సీన్స్ ఎలా పండుతాయో, థియేటర్లో ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో చూడాలని వెయిట్ చేస్తున్నాను. ► నేను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ పాయింట్ ఉంటుందని చెప్పగలను. ఉదాహరణకు నా మూడోసినిమా ‘సుకుమారుడు’. అందులో కొంచెం గ్రే షేడ్‌తో ఉండే పాత్ర నాది. అందరూ ఆ సినిమా చేసేటప్పుడు లవర్‌బాయ్ పాత్రలు చేసుకోవచ్చు కదా అన్నారు. ‘ఒకే రకమైన పాత్రలు ఎందుకు?’ అన్నాను. నాలోనూ నటుడున్నాడు, కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. సినిమా ఫెయిల్ అయ్యింది. అందరూ నువ్వు బాగానే నటించావు అన్నారు. అదే సినిమా హిట్ అయ్యుంటే అందరూ నా చాయిస్ కరెక్ట్ అనేవారు. కానీ సినిమా ఫెయిల్ అవటంతో మరో ప్రయోగం చేసే అవకాశం లేకుండా పోయింది. అందరూ లవర్‌బాయ్‌గా చేయమంటే ‘ప్యార్ మే పడిపోయానే’ సినిమా చేశాను. అలాగే ‘గాలిపటం’ మంచి సబ్జెక్ట్. మధ్యలో కొన్ని కమర్షియల్ సినిమాలు చేశాను. ఆ సినిమాలు కమర్షియల్‌గా బాగానే పే చేశాయి. వాటిలో ‘రఫ్’, ‘చుట్టాలబ్బాయి’ బాగా వసూలు చేశాయి. ‘శమంతకమణి’ సినిమాతో మళ్లీ ఓ ఎక్స్పెరిమెంట్ చేశాను. అది చాలా మంచి పేరొచ్చింది. ► ‘బుర్రకథ’ సినిమా ద్వారా ఇప్పుడు చాలా పెద్ద పేరొస్తుంది, ప్రజలు నన్ను ఆదరిస్తారనే నమ్మకం కలిగింది. ప్రతి మనిషిలోనూ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి లూసర్, రెండోది ఫైటర్. లూసర్ కిందపడగానే ఓడిపోయాను అని వెళ్లిపోతాడు. కానీ, నేను లూసర్‌ని కాదు ఫైటర్ని. కిందపడ్డా లేచి పరిగెత్తాలి, రేసులో నిలవాలి అనే ఫైటర్‌ను నేను. ► ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమా కంప్లీట్ అయ్యింది కానీ, కొంచెం సీజీ బ్యాలెన్స్ ఉంది. మరో రెండు నెలల్లో రిలీజ్ చేస్తాం. ఇవికాక ‘జోడీ’ అనే కంప్లీట్ ఫ్యామిలీ క్యూట్ లవ్‌స్టోరీ చేస్తున్నాను. అందులో ఒక్క ఫైట్ కూడా ఉండదు. తమిళ్, తెలుగులో ఓ ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ చేస్తున్నా. ఇవికాక సాయిరాజ్ అనే నూతన దర్శకునితో చేయబోతున్న చిత్రం షూటింగ్ ఆగస్ట్‌లో మొదలవుతుంది. లక్ష్యం నెరవేరింది ‘‘హాస్యానందం’ పత్రికలో సబ్ ఎడిటర్‌గా చేశా. ఆ తర్వాత రచయితగా, ఇప్పుడు డైరెక్టర్ స్థాయికి ఎదిగా. ఒక సెల్లో రెండు సిమ్‌లు ఉన్నప్పుడు ఒక మనిషిలో రెండు మైండ్లు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘బుర్రకథ’’ అని ‘డైమండ్’ రత్నబాబు అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో వచ్చాను. ‘బుర్రకథ’ సినిమా ఓపెనింగ్ రోజు నా లక్ష్యం నెరవేరిందని చేతికి ‘డైరెక్టర్’ అని పచ్చబొట్టు వేయించుకున్నా. చిన్న నిర్మాతలను దర్శకుడు కాపాడుకోవాలి. మార్కెట్‌ని బట్టి బడ్జెట్ పెడితేనే నిర్మాతలకు లాభం ఉంటుంది. 50 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేస్తానని నిర్మాతకు మాటిచ్చా.. 46 రోజుల్లోనే పూర్తి చేశా. ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో నేనే రెండు పాటలు కూడా రాశా. రామాయణం, మహాభారతం, పరిసరాల స్ఫూర్తితో కథలు రాసుకుంటా. హాలీవుడ్లో రచయితకి మంచి పారితోషికం ఉంటుంది. టాలీవుడ్లో డైరెక్టర్‌కి ఉంటుంది. నా రెండో సినిమాగా ‘బుర్రకథ’నే తమిళ్, హిందీలో రీమేక్ చేసే చాన్స్ ఉంది. మూడో సినిమాగా మోహన్‌బాబుగారి ఫ్యామిలీకి సరిపడే కథ రెడీచేశా. ఆయన చాన్స్ ఇస్తే చేస్తా’’ అన్నారు. -
‘బుర్రకథ’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘బుర్రకథ’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బుర్రకథ. ఈ సినిమాతో ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈసినిమా వాయిదా పడటంతో జూలై 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సెన్సార్ సర్టిఫికేషన్‌లో ఇబ్బందులు ఎదురవ్వటంతో శుక్రవారం విడుదల కావాల్సిన బుర్రకథ వాయిదా పడింది. శనివారం రిలీజ్ చేసేందుకు ప్రయత్నించినా కుదరకపోవటంతో వారం ఆలస్యంగా జూలై 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. -
‘బుర్రకథ’ విడుదల వాయిదా
ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షాలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా బుర్రకథ. ఈసినిమాతో ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ శుక్రవారం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ సర్టిఫికేషన్‌లో ఇబ్బందులు ఎదురవ్వటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఆఖరి నిమిషంలో టెన్షన్ ఉండకూడదన్న ఉద్దేశంతో సినిమాను ఒక రోజు ఆలస్యంగా శనివారం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే శుక్రవారానికి కూడా సెన్సార్ విషయంలో క్లారిటీ వచ్చే అవకావం లేకపోవటంతో ప్రస్తుతానికి సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో ఆది సాయికుమార్ తో పాటు.. దర్శకుడు డైమండ్ రత్నబాబు తొలి సినిమా కావటంతో ఈ ఇద్దరి కెరీర్లకు ఈ సినిమా కీలకంగా మారింది. -
నాలో ఆ ఇద్దరూ ఉన్నారు
‘‘స్క్రిప్ట్‌లో దమ్ముంటేనే లిప్‌లాక్ సీన్స్‌లో నటిస్తా. అయితే అలాంటి సీన్లు చేసేవారిని నేను తప్పు పట్టడం లేదు. నా సినిమాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ చూడాలనుకుంటా’’ అన్నారు ఆది సాయికుమార్. రచయిత ‘డైమండ్’ రత్నబాబు దర్శకునిగా పరిచయం అవుతున్న సినిమా ‘బుర్రకథ’. ఇందులో ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరో హీరోయిన్లు. శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు. ► చాలెంజింగ్ పాత్రలు చేసినప్పుడే మనలోని బెస్ట్ బయటకు వస్తుంది. ఈ సినిమాలో రెండు బుర్రలు ఉన్న అభిరామ్ క్యారెక్టర్ చేశాను. నాకు సవాల్‌గా అనిపించింది. రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ సరిగా చూపించానా? లేదా? అనే విషయంలో ఆడియన్స్ ఎలా డిసైడ్ చేస్తారో అని భయంగా ఉంది. ► ఒక మనిషిలో రెండు బుర్రలు ఉన్నట్లు నేనొక ఆర్టికల్ చదివాను. ఈ కాన్ఫ్లిక్ట్ సబ్జెక్ట్‌ని సింపుల్‌గా, ఎంటర్టైనింగ్ వేలో చూపించారు రత్నబాబు. అభి, రామ్ క్యారెక్టర్ల విషయంలో ఆడియన్స్‌కు మొదటి 15 మినిట్స్‌లోనే క్లారిటీ వస్తుంది. అభిది జోవియల్ క్యారెక్టర్. రామ్ లోకజ్ఞానం తెలిసినవాడు. నాలో అభి–రామ్ ఇద్దరూ ఉన్నారు. అభి–రామ్ క్యారెక్టర్స్ మధ్య రాజేంద్రప్రసాద్‌గారు నలిగిపోవడం ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. మా సినిమాతో పాటు మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ సోలో రిలీజ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. ► ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పేరు, డబ్బు... ఒక సినిమాకు ఈ మూడు అంశాలు వస్తే ఆ చిత్రం హిట్‌గా భావిస్తాను. ‘ప్రేమకావాలి, లవ్లీ’ సినిమాల తర్వాత ఆ రేంజ్ హిట్‌ని అందుకోలేకపోయాను. ఇందుకోసం ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరచుకుంటూ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ► నేను అంగీకరించని సినిమాలు కొన్ని సూపర్‌హిట్ సాధించాయి. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. నేను వదులుకున్న సినిమా హిట్ సాధించిందన్న బాధ నాకు లేదు. ఎందుకంటే మన జడ్జ్మెంట్ అన్ని వేళలా కరెక్ట్‌గా ఉండదు. ఈ విషయంలో ‘నీకు టేస్ట్ లేదు’ అని మా సిస్టర్ నన్ను ఆటపట్టిస్తుంది. ► మా నాన్నగారికి (సాయికుమార్) కన్నడలో నటుడిగా మంచి పేరు ఉంది కదా అని నేను అక్కడ సినిమాలు చేయలేను. ముందుగా తెలుగులో మంచి హిట్ సాధించి, ఆ తర్వాత కన్నడగురించి ఆలోచిస్తాను. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మా పాప నా షూటింగ్‌లకు వస్తోంది. ► నా కెరీర్‌లోని గ్యాప్‌ను నేను ప్లాన్ చేయలేదు. ప్రస్తుతానికి విలన్ పాత్రలు చేయాలనే ఆలోచన లేదు. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాను. ‘ఆపరేషన్ గోల్డ్‌షిఫ్’లో అర్జున్ పండిట్ అనే పాత్ర చేశాను. ‘జోడి’ ఆల్మోస్ట్ పూర్తయింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. -
నా శత్రువు నాతోనే ఉన్నాడు
‘రామాయణంలో రాముడి శత్రువు రావణాసురుడు.. కృష్ణుని శత్రువు కంసుడు... నా శత్రువు నాతోనే ఉన్నాడు’ అంటూ ఆది సాయికుమార్ డైలాగులతో ప్రారంభమయ్యే ‘బుర్రకథ’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఆది సాయికుమార్ హీరోగా, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరోయిన్లుగా నటించారు. రచయిత ‘డైమండ్’ రత్నబాబు ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని హీరో వెంకటేష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉంది. మంచి స్టోరీ. ఆది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రత్నంబాబు తెరకెక్కించిన ఈ అందమైన కథని ప్రతి ఒక్కరూ చూడాలి’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్ చూసి వింటేజ్ క్రియేషన్స్ వారు ప్రపంచవ్యాప్తంగా విడుదల హక్కులు కొన్నారు. సినిమాపై చాలా నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు శ్రీకాంత్ దీపాల. డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘హీరో నమ్మకంతోనే ఒక డైరెక్టర్ వస్తాడు. ప్రతిభ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, వారందరినీ ప్రోత్సహించడానికి నిర్మాతలు చాలా అవసరం. రచయితగా ఉన్న నాకు దర్శకుడిగా ప్రోత్సాహం దొరికింది. ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం చాలా బాగుండటంతో పాటు ఎంటర్టైనింగ్గా ఉంటుంది’’ అని తెలిపారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ – ‘‘నాని, సందీప్ కిషన్, సాయి తేజ్‌లతో సహా మిగతా హీరోలందరూ మా సినిమా గురుంచి పాజిటివ్ ట్వీట్స్ చేసినందుకు థ్యాంక్స్. నాకు హిట్ పడి చాలా కాలం అయింది.. ఈ సినిమాతో మళ్లీ హిట్ సాధిస్తాననే నమ్మకం ఉంది’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘బుర్రకథ’ నా 4వ సినిమా. మంచి హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అన్నారు కిరణ్‌రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్. -
‘బుర్రకథ’ ట్రైలర్ విడుదల
-
ఆకట్టుకుంటోన్న ‘బుర్రకథ’ ట్రైలర్
ప్రేమ కావాలి, లవ్లీ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న హీరో ఆది సాయికుమార్. కానీ మళ్లీ ఆరేంజ్ సక్సెస్‌ను కొట్టలేక రేసులో వెనుకబడ్డాడు. తాజాగా ఓ డిఫరెంట్ కథతో తెరకెక్కిన బుర్రకథ చిత్రంతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలే ఏర్పరిచాయి. కాసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒకే మనిషిలో రెండు బుర్రలు, రెండూ వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉండటం, వాటి వల్ల క్రియేట్ అయ్యే ఫన్, వచ్చే కష్టాలు ఇలా అన్నింటిని టచ్ చేస్తూ కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఎండింగ్లో కమెడియన్ పృథ్వీ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవలె సాహో టీజర్‌ను కాపీ కొడుతూ పృథ్వీ చేసిన కామెడీ హైలెట్‌గా నిలిచింది. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె. దీపాల నిర్మిస్తున్న చిత్రంలో మిస్తీ చక్రవర్తి, నైరాషాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాటల రచయిత డైమండ్ రత్నబాబు మొదటిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రెండు మెదళ్ల కథ
దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె. దీపాల నిర్మిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. మాటల రచయిత డైమండ్ రత్నబాబు మొదటిసారి దర్శకత్వం వహించారు. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్యే ‘బుర్రకథ’ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో పాటు ఫ్యాన్సీ రేటుతో సినిమాకు బిజినెస్ ఆఫర్ కూడా వచ్చింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ హక్కులను వింటేజ్ క్రియేషన్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్. -
వర్మ తిరుపతికెళ్లినప్పుడే ఊహించాను
‘నాన్నగారూ.. నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను..’ అనే హీరో ఆది చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ‘బుర్రకథ’ సినిమా టీజర్ వినోదాత్మకంగా ఉంది. ‘బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నా నాన్నగారూ..’’ అని ఆది చెప్పే డైలాగ్‌కి తండ్రి రాజేంద్రప్రసాద్ అవాక్కవుతాడు. ‘నీ కొడుకు రెండు బ్రెయిన్లతో పుట్టాడు’ అంటూ డాక్టర్ పోసాని కృష్ణమురళి చెప్పగానే.. ‘రామ్‌గోపాల్ వర ్మ తిరుపతికి వెళ్లినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాను’ అంటూ రాజేంద్రప్రసాద్ నిట్టూరుస్తాడు. ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ‘పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం, ఆడో రకం’ సినిమాలతో రచయితగా పెద్ద విజయాల్ని అందుకున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. బీరమ్ సుధాకర్‌రెడ్డి సమర్పణలో దీపాల ఆర్ట్స్ పతాకంపై శ్రీకాంత్ దీపాల, కిషోర్ నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్, టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తొలుత పరిచయం అయిన వ్యక్తి రత్నబాబు. ఓ డైరెక్టర్‌కి దర్శకత్వశాఖతో పాటు సంభాషణలు రాయడంలో పరిజ్ఞానం ఉండాలని ఆయన వద్దే నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఏ దర్శకుడికైనా తొలి సినిమా ముఖ్యం. నేను, శివ నిర్వాణ తొలి సినిమా అడ్డంకిని విజయవంతంగా దాటివచ్చాం. ఇప్పుడు డైమండ్ రత్నబాబు వంతు. ‘బుర్రకథ’తో తను హిట్టు దర్శకుల జాబితాలతో నిలవాలి’’ అన్నారు దర్శకుడు అజయ్ భూపతి. ‘‘మరుధూరి రాజా తర్వాత నాకు బాగా ఇష్టమైన సంభాషణల రచయిత రత్నబాబు. దర్శకుడిగా అతడికి ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టాలి. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా ఆదితో చేయాల్సింది. కానీ, కుదరలేదు’’ అన్నారు డైరెక్టర్ ఏ.ఎస్. రవికుమార్ చౌదరి. ‘‘రెండు బ్రెయిన్లు ఉన్న ఓ యువకుడి కథ ఇది. ఆ పాయింట్లో నుంచే వినోదం పుడుతుంది. రామ్, అభి పాత్రలు విభిన్నంగా ఉంటాయి. తెనాలి రామలింగడి తరహా పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘జూన్ మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్. ‘‘డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ ఉంటుంది’’ అని ఆది తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయికార్తీక్, గాయత్రి గుప్తా, మణిచందన్, తదితరులు పాల్గొన్నారు. -
‘బుర్రకథ’ టీజర్ విడుదల
-
ఆసక్తికరంగా ‘బుర్రకథ’ టీజర్
ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న ఆది సాయి కుమార్.. అటుపై సక్సెస్ అందుకోలేకపోయారు. చాలా కాలం నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆది.. ప్రస్తుతం ఓ మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న బుర్రకథ చిత్రం టీజర్‌ను నేడు విడుదల చేసింది చిత్రబృందం. ఓ మనిషికి రెండు బుర్రలు అనే కొత్త కథతో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టేలా కనబడుతున్నాడీ హీరో. టీజర్‌తోనే ఈ మూవీ కాన్సెప్ట్‌ను క్లియర్‌గా చెప్పేసింది యూనిట్. ఆద్యంతం వినోదాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళీ, పృథ్వీ కీలకపాత్రలో నటించగా.. మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందించగా.. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. -
మే 24న ‘బుర్రకథ’
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘బుర్ర కథ’. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ షేడ్స్‌తో సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఆది ఆకట్టుకుంటున్నాడు. రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనరే బుర్ర కథ. కథానుగుణంగానే ఫస్ట్ లుక్‌ను రెండు షేడ్స్‌లో ఉండేలా డిజైన్ చేసి విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మే 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. -
రెండు బుర్రల కథ
ఒక్క మెదడుతోనే ఎన్నో విషయాలు ఆలోచించగలుగుతున్నాం. అదే రెండు మెదళ్లు ఉంటే? ఇదే కాన్సెప్ట్‌తో ‘బుర్ర కథ’ చిత్రం తెరకెక్కింది. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారారు. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్. శ్రీకాంత్ దీపాల నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను గురువారం రిలీజ్ చేశారు. ‘‘రెండు షేడ్స్‌లో ఆది సాయికుమార్ పాత్ర ఉండబోతోంది. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: సి.రాంప్రసాద్ -
ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే!
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘బుర్ర కథ’. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. డిఫరెంట్ షేడ్స్‌తో సరికొత్త హెయిర్ స్టైల్‌తో ఆది ఆకట్టుకుంటున్నాడు. రచయిత డైమండ్ రత్నబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె.శ్రీకాంత్ దీపాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక మనిషికి రెండు మెదళ్లు ఉంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనరే బుర్ర కథ. కథానుగుణంగానే ఫస్ట్ లుక్‌ను రెండు షేడ్స్‌లో ఉండేలా డిజైన్ చేసి విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు. -
బుర్ర కథ చూడండహో
‘పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం ఆడోరకం, ఇంట్లో దెయ్యం నాకేం భయం’ వంటి చిత్రాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘డైమండ్’ రత్నబాబు మెగా ఫోన్ పట్టారు. ఆది సాయికుమార్ హీరోగా ఆయన డైరెక్షన్లో ‘బుర్రకథ’ అనే సినిమా తెరకెక్కనుంది. దీపాల ఆర్ట్స్ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రచయిత, పాటల రచయిత, దర్శకుడు శివశక్తి దత్తా కెమెరా స్విచ్చాన్ చేయగా రచయిత పరుచూరి గోపాల కృష్ణ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ‘డైమండ్’ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ఓపెనింగ్‌కి వచ్చి డైరెక్టర్‌గా తొలి చిత్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు టాప్ టెక్నీషియన్స్‌ని ఇచ్చి సపోర్ట్ చేసినందుకు నిర్మాతకి, నాపై నమ్మకంతో ఈ సినిమా చేస్తున్న ఆదిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘బుర్రకథ’ సినిమా చేయడం ఎంతో థ్రిల్‌గా ఉంది. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు ఆది సాయికుమార్. ‘‘ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. వారంలో హీరోయిన్స్, ఇతర నటీనటులను ఓకే చేయనున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్ దీపాల. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: రామ్ ప్రసాద్. -
ఆది హీరోగా ‘బుర్రకథ’
ఆది సాయికుమార్ కెరీర్ స్టార్టింగ్‌లో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి హిట్లు వచ్చినా.. మళ్లీ అలాంటి విజయాలు రాలేదు. మధ్యలో రూట్ మార్చి మల్టిస్టారర్ సినిమాల్లో నటించిన కలిసి రాలేదు. ఆది హీరోగా గతేడాది వచ్చిన ‘నెక్స్ట్ నువ్వే’ సినిమా ఫర్వాలేదనిపించింది. ఆది తన మార్కెట్‌ను నిలబెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఆదికి సరైన హిట్ కావాలి. మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారి ఆది హీరోగా చేస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించనున్నారు. దీపాల ఆర్ట్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. -
ఆకట్టుకున్న బుర్రకథ
పెర్కిట్: ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ గ్రామంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న బుర్రకథ అలరిస్తోంది. బోధన్‌కు చెందిన కళాకారులు ప్రభాకర్, లింగం, లక్ష్మణ్‌లు వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రను బుర్రకథ ద్వారా తెలియజేస్తున్నారు. జానపద కళాకారుల సంఘ కోశాధికారి జిందం నరహరి, విశ్వబ్రాహ్మణ కులస్తులు వడ్ల శ్రీనివాస్, కృష్ణంరాజు, సాగర్, ప్రసాద్, విఠల్, వీడీసీ సభ్యులు గడ్డం గంగారెడ్డి, వార్డు సభ్యులు రాజేశ్‌లు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి అలజడి
సంతకవిటి : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి అలజడి నెలకొంది. బొద్దూరు గ్రామస్తులు ఎస్ఐ తాతారావు దురుసు ప్రవర్తనను నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే...బీట్ చెకింగ్ నిమిత్తం సంతకవిటి ఎస్ఐ తాతారావు తన వాహనంలో రాజాం వైపు మంగళవారం రాత్రి బయలుదేరారు. రాత్రి ఒంటి గంట సమయంలో బొద్దూరు గ్రామంలోని ఓ వీధిలో వినాయక నిమజ్జనోత్సవాల్లో భాగంగా రాజాంకు చెందిన కళాకారులు బుర్రకథను ప్రదర్శిస్తున్నారు. ఇందులో విజయనగరానికి చెందిన డ్యాన్సర్ ప్రదర్శన ఇస్తుండగా గుర్తించిన ఎస్ఐ ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆమె పరారీ కావడంతో బుర్రకథ కళాకారులను సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేశారు. దురుసుగా ప్రవర్తించారు... ఇంతలో బొద్దూరు గ్రామానికి చెందిన పలువురు మహిళలతో కలసి సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. బుర్రకథ అనేది జానపద కళ అని, జానపద రీతిలో ప్రదర్శన జరుగుతుండగా, ఎస్ఐ ఆకస్మికంగా వచ్చి తమపై దాడి చేయడంతో పాటు మాపై దురుసుగా ప్రవర్తించారంటూ పలువురు మహిళలు, యువకులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. జానపద గేయాలుకు డ్యాన్స్ చేసేందుకు మాత్రమే ఒక డ్యాన్సర్ వచ్చిందని పేర్కొన్నారు. ఇవేమి పట్టించుకోకుండా తమపై లాఠీతో విరుచుకుపడ్డారని, మద్యం కూడా సేవించి ఉన్నారని గ్రామస్తులు ఆరోపించారు. సీఐ రంగప్రవేశం.. స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో రాజాం రూరల్ సీఐ యు.శేఖర్‌బాబు సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్ఐ వద్ద వివరాలు సేకరించడంతో పాటు బొద్దూరు గ్రామస్తులు వద్ద కూడా వివరాలు సేకరించారు. బుర్రకథ రూపంలో డ్యాన్స్ ప్రదర్శన ఉండరాదని గ్రామస్తులకు తెలిపారు. వీటిపై కూడా నిషేధం ఉందన్నారు. మరో వైపు గ్రామానికి చెందిన మహిళలు, యువకులు వద్ద కూడా ఫిర్యాదు స్వీకరించారు. మొత్తం వివరాలపై ఆరా తీసి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బొద్దూరు గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యులు వి. బాబూరావునాయుడు, సర్పంచ్ ప్రతినిధి మహేశ్‌లకు సర్ది చెప్పారు. వివాదానికి తాత్కాలికంగా తెరదించి బొద్దూరు గ్రామస్తులును వెనక్కి పంపించేశారు. దాడి చేశామనే... జిల్లా అధికారులు నుంచి వినాయక నిమజ్జనోత్సవాల్లో ఎటువంటి అశ్లీల ప్రదర్శనలు చేయరాదనే నిబంధనలు ఉన్నాయని ఎస్ఐ ఎస్. తాతారావు విలేకరులకు తెలిపారు. బీట్æచెకింగ్ నిమిత్తం వెళ్ళిన తనకు బొద్దూరులో సినిమా పాటలు వినిపించాయని, ప్రదర్శన స్థలం వద్దకు వెళ్లగా విజయనగరానికి చెందిన మíß ళ డ్యాన్స్ చేస్తుందని, ఆమెను పట్టుకొబేయే ప్రయత్నంలో తప్పించుకుందన్నారు. -
అలరించిన బుర్రకథా గానం
రాజమహేంద్రవరం కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందు ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని పుష్కరాల రేవు, రాజరాజనరేంద్రుని విగ్రహం వద్ద మంగళవారం ప్రదర్శించిన శ్రీనివాస కల్యాణం బుర్రకథ అలరించింది. ప్రముఖ బుర్రకథ కళాకారులు గొర్రెల రామం బృందం ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించారు. కథకుడు గొర్రెల కృష్ణ సతీసుమతి కథను కూడా రసవత్తరంగా వివరించారు. గొర్రెల రామం, గొర్రెల శ్రీనివాస్ వంతులుగా ప్రదర్శనను రక్తి కట్టించారు. కాగా వర్షాకాలమని తెలిసీ, ప్రేక్షకులకు నడిరోడ్డుపై ‘నిలబడి’ ప్రదర్శనను చూసే మహత్తర ‘అవకాశం’కల్పించడంలో నగరపాలకసంస్థ ఉద్దేశం ఏమిటో పెరుమాళ్లకే ఎరుక. కేవలం ముగ్గురు, నలుగురు ప్రేక్షకులు వేదికపైనే ఓపక్కగా కూర్చుని ప్రదర్శనను తిలకించారు. టీటీడీ సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు నిర్వహిస్తున్నారు.కళాకారులకు ప్రత్యేకంగా వేదిక నిర్మించినా, ప్రేక్షకులు నడిరోడ్డుపై నిలబడి ప్రదర్శనను చూడవలసిందే. సాంస్కృతిక శాఖ కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆనం కళా కేంద్రంలో జరుగుతున్న నేపధ్యంలో, టీటీడీ కార్యక్రమాలను కూడా అక్కడే నిర్వహిస్తే, కళాభిమానులు మరికొందరు ఈ కార్యక్రమాలను వీక్షించే అవకాశం ఉంటుంది.