ఆకట్టుకుంటోన్న ‘బుర్రకథ’ ట్రైలర్‌ | Aadi Sai Kumar Burrakatha Movie Trailer Out | Sakshi

ఆకట్టుకుంటోన్న ‘బుర్రకథ’ ట్రైలర్‌

Jun 24 2019 12:11 PM | Updated on Jun 24 2019 5:03 PM

Aadi Sai Kumar Burrakatha Movie Trailer Out - Sakshi

ప్రేమ కావాలి, లవ్‌లీ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న హీరో ఆది సాయికుమార్‌. కానీ మళ్లీ ఆరేంజ్‌ సక్సెస్‌ను కొట్టలేక రేసులో వెనుకబడ్డాడు. తాజాగా ఓ డిఫరెంట్‌ కథతో తెరకెక్కిన బుర్రకథ చిత్రంతో హిట్‌ కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై మంచి అంచనాలే ఏర్పరిచాయి. కాసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఒకే మనిషిలో రెండు బుర్రలు, రెండూ వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉండటం, వాటి వల్ల క్రియేట్‌ అయ్యే ఫన్‌, వచ్చే కష్టాలు ఇలా అన్నింటిని టచ్‌ చేస్తూ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మలిచినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ ఎండింగ్‌లో కమెడియన్‌ పృథ్వీ డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఇటీవలె సాహో టీజర్‌ను కాపీ కొడుతూ పృథ్వీ చేసిన కామెడీ హైలెట్‌గా నిలిచింది. దీపాల ఆర్ట్స్‌ బ్యానర్‌పై హెచ్‌.కె. దీపాల నిర్మిస్తున్న చిత్రంలో మిస్తీ చక్రవర్తి, నైరాషాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాటల రచయిత డైమండ్‌ రత్నబాబు మొదటిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement