రెండు మెదళ్ల కథ | Burra Katha Worldwide Theatrical Rights Bought By Vintage Creations | Sakshi
Sakshi News home page

రెండు మెదళ్ల కథ

May 28 2019 12:14 AM | Updated on May 28 2019 12:14 AM

Burra Katha Worldwide Theatrical Rights Bought By Vintage Creations - Sakshi

ఆది సాయికుమార్‌, మిస్తీ చక్రవర్తి

దీపాల ఆర్ట్స్‌ బ్యానర్‌పై హెచ్‌.కె. దీపాల నిర్మిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. మాటల రచయిత డైమండ్‌ రత్నబాబు మొదటిసారి దర్శకత్వం వహించారు. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం గోవాలో షూటింగ్‌ జరుగుతోంది. ఈ మధ్యే ‘బుర్రకథ’ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో పాటు ఫ్యాన్సీ రేటుతో సినిమాకు బిజినెస్‌ ఆఫర్‌ కూడా వచ్చింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌ థియేట్రికల్‌ హక్కులను వింటేజ్‌ క్రియేషన్స్‌ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొంది. ఒకవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement