Theatrical Rights
-
భారీ ధరకు పలుకుతున్న నిఖిల్ ‘కార్తీకేయ 2’ థియేట్రికల్ రైట్స్
మూడేళ్లు గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది మంచి కమ్‌బ్యాక్‌తో వస్తున్నాడు. నిఖిల్ నటించిన చివరి చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ మూవీ తర్వాత అతడి నుంచి మరే సినిమా రాలేదు. ఈ మూవీ అనంతరం దాదాపు 3 ఏళ్లు బ్రేక్ తీసుకున్న నిఖిల్ వరుస సినిమాలకు సైన్ చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. అందులో ‘కార్తికేయ-2’ ఒకటి. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రూ.6 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కిచన ఈ చిత్రం రూ. 20 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తీకేయ 2 రాబోతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చర్చనీయాంశమైంది. జూలై 22న థియేటర్లోకి రానున్న ఈ మూవీకి థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి రూ.14కోట్ల నుంచి రూ. 20 కొట్లకు పైగానే ఢీల్ కుదిరినట్లు సమాచారం. ఓ చిన్న హీరో సినిమాకు ఈ స్థాయిలో ఢీల్ కుదరమంటే సాధారణ విషయం కాదు. అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే నెల తెలుగు, హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. -
‘ఆర్ఆర్ఆర్ ’హవా.. రికార్డు రేటుకి తమిళ్ రైట్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడం, స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం.. ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్‌ని భారీగా జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం చేస్తూ బుధవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. ఆర్ఆర్ఆర్ మూవీ తమిళనాడు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడెక్షన్స్ ట్విటర్ ద్వారా తెలియజేసింది. ‘బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ తమిళనాడు థియేట్రికల్ హక్కులను దక్కించుకుంచుకున్నామని ప్రకటించడం ఎంతో గర్వంగా ఉంది’అంటూ లైకా ప్రొడక్షన్స్ ట్విట్ చేసింది. అయితే ఈ థియేట్రికల్స్ రైట్స్‌ను పొందడం కోసం లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.45 కోట్ల భారీ ధరకు తమిళనాడు థియేట్రికల్స్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇంత మొత్తంలో చెల్లించడం పెద్ద ఆశ్యర్యకరమైన విషయమేమి కాదు. , రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2’ తమిళనాడులో సుమారు రూ.78 కోట్ల షేర్ వసూలు చేసింది. అందుకే లైకా ప్రొడక్షన్స్ రూ. 45 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్పై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి రూ.45 కోట్లు వసూలు కావడం పెద్ద కష్టమేమీకాదు. We are delighted and proud to announce📢 The Tamil Nadu theatrical rights of THE BIGGEST PAN INDIA FILM #RRRMovie is acquired by us...🔥🌊@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @thondankani @RRRMovie @DVVMovies #RRR pic.twitter.com/ASZsLLVdNT — Lyca Productions (@LycaProductions) February 17, 2021 -
ప్రెషర్ కుక్కర్ రెడీ
సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. సుజోయ్, సుశీల్ దర్శకత్వం వహించారు. సునీల్, సుజోయ్, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ అధినేత, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా దక్కించుకున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాన్సెప్ట్ నచ్చడంతో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మా సినిమా టీజర్‌ను కట్ చేశారు. ఈ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు’ వంటి హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ తాజాగా ‘జార్జ్‌రెడ్డి’ సినిమా హక్కులను కూడా సొంతం చేసుకున్నారు’’ అన్నారు. రాహుల్ రామకృష్ణ, రజయ్ రోవాన్, తనికెళ్ల, సీవీఎల్ నరసింహారావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెల్, అనిత్ మడాడి, సంగీతం: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్ రామేశ్వర్. -
రెండు మెదళ్ల కథ
దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె. దీపాల నిర్మిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాషా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. మాటల రచయిత డైమండ్ రత్నబాబు మొదటిసారి దర్శకత్వం వహించారు. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్యే ‘బుర్రకథ’ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో పాటు ఫ్యాన్సీ రేటుతో సినిమాకు బిజినెస్ ఆఫర్ కూడా వచ్చింది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్ థియేట్రికల్ హక్కులను వింటేజ్ క్రియేషన్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్. -
20 కోట్లు తగ్గించారు!
విడుదలకు ముందే హిందీలో సెంచరీ చేసేయాలని రజనీకాంత్ ‘2.0’ నిర్మాతలు (లైకా ప్రొడక్షన్స్ సంస్థ) చాలా ఆశపడ్డారు! కానీ, డక్‌వర్త్ లూయిస్ సిస్టమ్ ప్రకారం మీ సినిమాకు సెంచరీ కష్టమంటూ నిర్మాతల ఆశలపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నీళ్లు చల్లారట. దాంతో సెంచరీకు 20 తక్కువతోనే సరి పెట్టుకోవల్సి వచ్చిందట! అసలు మేటర్ ఏంటంటే... రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న టెక్నో థ్రిల్లర్ ‘2.0’. ‘రోబో’కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 100 కోట్లకు రూపాయి తక్కువ అయితే ఇచ్చేది లేదంటూ నిర్మాతలు కూర్చున్నారట! ‘రోబో’ హిందీ వెర్షన్ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? రూ.18 నుంచి 20 కోట్ల మధ్య. అలాంటప్పుడు సీక్వెల్‌కు 100 కోట్లు ఎలా ఇస్తారనే డౌట్ రావొచ్చు. ఇందులో హిందీ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నారు కదా. పైగా, ‘బాహుబలి’తో హిందీలో డబ్బింగ్ సినిమాల మార్కెట్ పెరిగిందనే విషయాన్ని గుర్తు చేశారట! రేటు విషయమై నిర్మాణ సంస్థకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పలుమార్లు డిస్కషన్స్ జరిగాయి. చివరకు, ‘2.0’ హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ డీల్ 80 కోట్లకు కుదిరిందట! ఇప్పటికి 80తో సరిపెట్టుకున్నా... విడుదల తర్వాత ‘2.0’ సెంచరీ చేసే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జనవరి 25న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో అమీ జాక్సన్ కథానాయిక. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.