మూడేళ్లు గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది మంచి కమ్‌బ్యాక్‌తో వస్తున్నాడు. నిఖిల్ నటించిన చివరి చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ మూవీ తర్వాత అతడి నుంచి మరే సినిమా రాలేదు. ఈ మూవీ అనంతరం దాదాపు 3 ఏళ్లు బ్రేక్ తీసుకున్న నిఖిల్ వరుస సినిమాలకు సైన్ చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. అందులో ‘కార్తికేయ-2’ ఒకటి. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.
రూ.6 కోట్లతో బడ్జెట్‌తో తెరకెక్కిచన ఈ చిత్రం రూ. 20 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తీకేయ 2 రాబోతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చర్చనీయాంశమైంది.
జూలై 22న థియేటర్లోకి రానున్న ఈ మూవీకి థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి రూ.14కోట్ల నుంచి రూ. 20 కొట్లకు పైగానే ఢీల్ కుదిరినట్లు సమాచారం. ఓ చిన్న హీరో సినిమాకు ఈ స్థాయిలో ఢీల్ కుదరమంటే సాధారణ విషయం కాదు. అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే నెల తెలుగు, హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment