
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ‘ఇతిహాసమ్: తెలంగాణ వారసత్వ సంపద ప్రతిధ్వని’ థీమ్‌తో సుచిత్ర అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. సుచిత్ర అకాడమీ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ‘సుచిత్ర ఇన్నోవేషన్ సెంటర్’ను మంగళవారం ప్రారంభించారు.
ఇందులో భాగంగా బ్రహ్మం గారి బుర్ర కథ ప్రదర్శన, తెలంగాణ సంస్కృతిలోని ప్రత్యేక ప్రజా తిరుగుబాట్లను ప్రతిబింబించే ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రష్యాలో భారత దేశ మాజీ అంబాసిడర్ అయిన బలా వెంకటేశ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. అకాడమీ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణం రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు తెలంగాణలోని సుసంపన్న సంపదను ప్రదర్శనల ద్వారా ప్రాణం పోశారని అన్నారు.
(చదవండి: తల్లీ.. నీకు సెల్యూట్!)