బంజారాహిల్స్: ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహించే బాలల నేత్ర సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అవగాహనా వాక్‌ను నిర్వహించారు. ‘బాల్య శుక్లాలు–పిల్లల చూపుపై వాటి ప్రభావం–త్వరిత గుర్తింపు–చికిత్స ప్రాధాన్యత’ థీమ్‌తో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కల్లం అంజిరెడ్డి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వాక్‌ను సినీ సంగీత దర్శకుడు తమన్ ఎస్, నటుడు విశ్వ కార్తికేయలు ప్రారంభించారు.
దాదాపు 300 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఫ్లకార్డులు చేతబూని బాల్యశుక్లాలపై అవగాహన క్పలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ఈ వాక్‌లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పిల్లల కంటి సమస్యలను త్వరితగతిన గుర్తించగలిగితే వారి సమస్యలను దూరం చేయవచ్చని, ఆ దిశగా తల్లిదండ్రులు అవగాహన పొందాలని కోరారు. ఎల్వీ ప్రసాద్ చైల్డ్ సైట్ ఇన్‌స్టిట్యూట్ అధిపతి డాక్టర్ రమేష్ కెకున్నయ్య మాట్లాడుతూ రోగ నిర్ధారణను త్వరితగతిన గుర్తించి చికిత్స అందించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయన్నారు. బాల్య కంటి శుక్లం చికిత్స చేయకుండా వదిలేస్తే, చివరకు పునరుద్ధరించలేని విధంగా హాని చేయవచ్చన్నారు. ఈ నెల 14 వరకూ ఎల్వీప్రసాద్ ఆస్పత్రి ఆవరణలో చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్, వక్తృత్వ, క్లే మౌల్డింగ్, బ్రెయిలీ చదవడం, పోటరీ సెషన్లు నిర్వహించి బాలల దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment