lv prasad eye institute
-
Children Eye Care Week బాల్య శుక్లాలపై నిర్లక్ష్యం వద్దు..
బంజారాహిల్స్: ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహించే బాలల నేత్ర సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అవగాహనా వాక్‌ను నిర్వహించారు. ‘బాల్య శుక్లాలు–పిల్లల చూపుపై వాటి ప్రభావం–త్వరిత గుర్తింపు–చికిత్స ప్రాధాన్యత’ థీమ్‌తో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కల్లం అంజిరెడ్డి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వాక్‌ను సినీ సంగీత దర్శకుడు తమన్ ఎస్, నటుడు విశ్వ కార్తికేయలు ప్రారంభించారు. దాదాపు 300 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఫ్లకార్డులు చేతబూని బాల్యశుక్లాలపై అవగాహన క్పలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ఈ వాక్‌లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పిల్లల కంటి సమస్యలను త్వరితగతిన గుర్తించగలిగితే వారి సమస్యలను దూరం చేయవచ్చని, ఆ దిశగా తల్లిదండ్రులు అవగాహన పొందాలని కోరారు. ఎల్వీ ప్రసాద్ చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్ అధిపతి డాక్టర్ రమేష్ కెకున్నయ్య మాట్లాడుతూ రోగ నిర్ధారణను త్వరితగతిన గుర్తించి చికిత్స అందించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయన్నారు. బాల్య కంటి శుక్లం చికిత్స చేయకుండా వదిలేస్తే, చివరకు పునరుద్ధరించలేని విధంగా హాని చేయవచ్చన్నారు. ఈ నెల 14 వరకూ ఎల్వీప్రసాద్ ఆస్పత్రి ఆవరణలో చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్, వక్తృత్వ, క్లే మౌల్డింగ్, బ్రెయిలీ చదవడం, పోటరీ సెషన్లు నిర్వహించి బాలల దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
అంధకారమేనా?
హన్మకొండ చౌరస్తా (వరంగల్): కంటి వెలుగు.. వారి జీవితాల్లో చీకట్లను నింపింది. హన్మకొండలోని జయ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన ఘటనలో బాధితులకు కంటి చూపు కష్టమే అన్న అనుమానాలు నిజమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం ద్వారా సెప్టెంబర్ 26న హన్మకొండలోని జయ ఆస్పత్రిలో జరిగిన ఆపరేషన్లు వికటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 మందికి కంటి శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు.. అందులో 11మందికి సెప్టెంబర్ 28న రీఆపరేషన్ చేశారు. అయినప్పటికీ చూపు సరిగా లేదని ఆందోళనకు దిగడంతో 18 మంది బాధితులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తరలించా రు. మూడు రోజులపాటు ఆస్పత్రిలో ఉంచుకున్న ఎల్వీ ప్రసాద్ వైద్యులు 8మందికి చికిత్స నిలిపివేసి సోమవారం డిశ్చార్జి చేశారు. మూడు రోజుల తర్వాత మరోసారి ఆస్పత్రికి రావాలని వైద్యులు చెప్పగా.. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, హన్మకొండలోని జయ ఆస్పపత్రిలోనే చికిత్స పొందాలని సిబ్బంది చెప్పినట్లు బాధితులు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. అస్పష్టమైన సమాధానంతో ఆందోళన చెందుతూనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎనిమిది మంది బాధితులు ఇంటి ముఖం పట్టారు. కంటిలో ఇన్ఫెక్షన్ అలానే ఉందని, చూపు స్పష్టంగా కనపడడం లేదని, కళ్లు మసగ్గానే కనపడుతున్నాయని బాధితులు వాపోయారు. వైద్యులు మాత్రం పది రోజుల్లో అంతా సర్దుకుంటుంద ని.. కంటి చూపు మెరుగుపడుతుందని చెప్పి పం పినట్లు తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిశ్చార్జి అయిన బాధితులు బోలే సరోజన, పులిగిల్ల, పరకాల, కె.సరోజన, మచిలీబజార్, హన్మకొండ, గోరంట్ల సుజాత, పాపయ్యపేటచమన్, వరంగల్. ముడిగె రాజయ్య, వేశాలపల్లి, భూపాలపల్లి, బుచ్చమ్మ గోపరాజు,ఎల్లాపూర్, హసన్‌పర్తి. అజ్మీర మేఘ్య, బాంజీపేట, నర్సంపేట. జి.భగవాన్, ధర్మరావుపేట, ఖానాపూర్. మంద సత్తమ్మ, న్యూశాయంపేట, హన్మకొండ. -
నేత్రదానికి ప్రతి ఒక్కరు ముందుకురావాలి
-
దృష్టిలోపం ఉన్నవారికి కంప్యూటర్ విద్య
విశాఖపట్నం : హనుమంతవాక సమీపంలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో దృష్టి లోపం ఉన్నవారి కోసం గురువారం ప్రత్యేక కంప్యూటర్ శిక్షణను ఆస్పత్రి చైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్, ఎంప్లాయి గివింగ్ క్యాంపస్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. దృష్టి లోపంగల విద్యార్థులు విద్య, ఉద్యోగ అవకాశాల కోసం కంప్యూటర్ శిక్షణ పొందేందుకు ఈ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. మూడు నెలల ఈ శిక్షణలో అసిస్టివ్ టెక్నాలజీ, స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్‌లో భాగమైన జాస్, మాజిక్, విండోస్ ఐస్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌లో భాగమైన వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్, టాలీ, స్టావేర్ లాంగ్వేజెస్, సి, సి ప్లస్ ప్లస్, జావా, హెచ్‌టీఎంఎల్, ఎస్‌క్యూఎల్ తదితర అంశాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తారని వివరించారు. పూర్తిగా అంధత్వం ఉన్న 32 మందికి, పాక్షిక అంధత్వ కలిగిన 96 మందికి శిక్షణ ఇస్తారన్నారు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ మోహన్‌కుమార్, మైక్రోసాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డెరైక్టర్ అనిల్ భన్సాలీ, ఎల్వీపీ కంటి వైద్యుడు డాక్టర్ అవినాష్ పతంగే పాల్గొన్నారు. -
రూ.300 కోట్లు వెచ్చించనున్న ఎల్వీపీఈఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేత్ర వైద్య రంగ సంస్థ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్(ఎల్వీపీఈఐ) వచ్చే మూడేళ్లలో రూ.300 కోట్లను శిక్షణ కేంద్రాల సామర్థ్యం పెంపుకు వ్యయం చేస్తోంది. ప్రస్తుతం సం స్థకు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, భువనేశ్వర్తోసహా మరో 11 చోట్ల శిక్షణ కేంద్రాలున్నాయి. ఆప్టోమెట్రీ, ఆఫ్తల్మాలజీ, నర్సింగ్ తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తోంది. సంస్థకు ఏక కాలంలో 400 మందికి శిక్షణ ఇచ్చే వీలుంది. మూడేళ్లలో ఈ సంఖ్యను రెండింతలకు చేరుస్తామని సంస్థ వ్యవస్థాపకులు గుల్లపల్లి ఎన్ రావు తెలిపారు. ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 18-20 వేల మంది నేత్రవైద్యులున్నారని, అయితే టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది కొరత ఉందని చెప్పారు. రోగులకు తక్కువ వ్యయానికే అత్యాధునిక వైద్యం అందించేందుకు పరిశోధనలనుపెద్ద ఎత్తున కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇండియా ఇంక్లూజివ్ ఇన్నోవేషన్ ఫండ్‌ను రూ.6 వేల కోట్లకు పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ చైర్మన్ రఘునాథ్ మషేల్కర్ వెల్లడించారు. సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని తక్కువ ధరకు అందించడంపైనే అన్ని కంపెనీలు దృష్టిసారిస్తున్నాయని అన్నారు.